డ్రగ్స్‌ ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ ప్రమాదకరం

Mar 5 2026 7:45 AM | Updated on Mar 5 2026 7:45 AM

డ్రగ్స్‌ ప్రమాదకరం ఘనంగా తెప్పోత్సవం

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్‌తో ఆరోగ్యానికే కాక భవిష్యత్తుకూ ప్రమాదకరమని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో బుధవారం డ్రగ్స్‌ వద్ద బ్రో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథి రవికృష్ణ మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యతన్నారు. పొగాకు, మద్యం, గంజాయి, హెరాయిన్‌, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటు అయితే బయటపడటం కష్టమని హెచ్చరించారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు, ఈగల్‌ సీఐ రవీంద్ర, ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ వీరాంజనేయులు, పలువురు అధ్యాపకులు, సుమారు 500 మంది మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం జరిగింది. అనంతరం వసంతోత్సవం, పూర్ణహుతి, చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారిని పల్లకిలో తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఏడు గంటలకు వేణు గోపాలస్వామి తెప్పోత్సవం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement