ముగిసిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల

Mar 9 2026 7:46 AM | Updated on Mar 9 2026 7:46 AM

ముగిసిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల మహోత్సవం ఆదివారం భక్తుల బోనాలతో ఘనంగా ముగిసింది. భక్తులు స్థానిక మునేరులో స్నానాలు చేసి పాలు, పొంగళ్లతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. చివరి రోజు ఆలయం తరఫున ఉత్సవ కమిటీసభ్యులు చుంచు రమేష్‌బాబు దంపతులు, సిబ్బంది బోనం సమర్పించారు. భక్తులు కిక్కిరిసి ఉండటంతో క్యూలైన్‌లో కొంత ఇబ్బంది పడ్డారు. ఐదు రోజుల పాటు సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి పర్యవేక్షణలో గ్రామంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. తిరునాళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రానికి భక్తులు తిరుగు ప్రయాణంతో బస్సులు వద్ద గుమికూడారు. ఉమ్మడి జిల్లా బాడీ బిల్డింగ్‌ పోటీలు రేషన్‌ మాఫియా డాన్‌పై పీడీ యాక్ట్‌ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్‌, ఫిజిక్‌ స్పోర్ట్స్‌ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్‌, తాళ్లూరి అశోక్‌ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్‌ జిమ్‌లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. మనోహర్‌, అశోక్‌ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్‌ ఆఫ్‌ ది చాంపియన్‌ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్‌ రాజు, ఈదా రాజేష్‌, అల్లూరిరెడ్డి, ఎస్‌కే ఖాదర్‌ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్‌ మాఫియాకు డాన్‌లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తూ ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్‌ వద్ద నుంచి రేషన్‌ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్‌కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్‌ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్‌ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు.

కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్‌ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్‌ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement