భక్తి నీరాజనం
న్యూస్‌రీల్
భక్త జన సంద్రంగా మారిన కొండ 15 లక్షల మంది యాత్రికుల రాక ఘనంగా ముగిసిన గుణదల ఉత్సవాలు
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విశ్వమాతకు
కృష్ణానదిలో చేప పిల్లలు విడుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 537.60 అడుగులకు చేరింది. ఇది 183.3636 టీఎంసీలకు సమానం.
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని చిన జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు.
గన్నవరం: స్థానిక రైతు బజార్‌లో ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ఓ టీడీపీ నేత సాగిస్తున్న అవినీతి, అక్రమాల డొంక కదిలింది. రైతుబజారులో కూరగాయల సరఫరా పేరుతో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమ వసూళ్లపై ‘బజారులో దళారీ భోజ్యం!’ శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో గన్నవరం రైతుబజార్‌కు కూరగాయలు రవాణా చేస్తున్న టీడీపీ నేతను ఆగమేఘాల మీద తప్పించారు. సదరు టీడీపీ నేత ధరల దోపిడీ వ్యవహారంపై రైతుబజార్ స్టాళ్ల నిర్వాహకులను పిలిపించి సర్దుబాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక రైతుబజార్‌లో ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి సరఫరా చేసే కాంట్రాక్టును స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు మేరకు గన్నవరానికి చెందిన టీడీపీ నేత మోర్ల నాగబాబు దక్కించుకున్నారు. అయితే రైతుల వద్ద కొనుగోలు చేసే ధరలకంటే ఎక్కువగా నాగబాబు వసూలు చేయడం, నాసిరకం సరుకును సరఫరా చేయడంతో స్టాళ్ల నిర్వాహకులు అడ్డం తిరిగారు. అతని వద్ద కూరగాయలు తీసుకునేందుకు పలువురు నిరాకరించారు. నాగబాబు దోపిడీ వ్యవహారం బయటపడటంతో అధికార పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నరసింహారావు బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. రైతుబజారులో కూరగాయల సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని తప్పించినట్లు తెలిపారు.
శాఖా పరమైన విచారణ
రైతుబజార్‌లో అవినీతి జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై శాఖా పరమైన విచారణ చేయా లని జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులకు సూచించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. రైతుబజార్‌లో ఇకపై అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.
భక్తులతో పోటెత్తిన
గుణదల పుణ్యక్షేత్రం
గుణదల(విజయవాడ తూర్పు): ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మూడు రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు బుధవారం ముగిశాయి. లోక మాతను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలు, కొండదారులన్నీ యాత్రికులతో నిండిపోయాయి. భక్తులు మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొని తరించారు.
లక్షలాదిగా భక్తుల రాక
గుణదల ఉత్సవాలకు మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది యాత్రికులు వచ్చారని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పాటు నగర వాసులు సైతం కుల మతాలకు అతీతంగా తిరునాళ్లలో పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉత్స వాల ముగింపు ప్రార్థనలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఉత్సవ నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. మరియమాత దయతో నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తదితరులు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.
సర్వమానవులు శాంతి, సమాధానాలతో జీవించాలంటే క్రీస్తు మార్గమే శరణ్యమని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. సమాజంలో అసమానతలు తొలగిన నాడు దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. సర్వ మానవాళి కోసం తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశా యని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు అందరిపై మరియతల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. అనంతరం అమెరికాకు చెందిన బిషప్ షమీంద్ర జయవర్ధన, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు తదితర గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించి, భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు.
7
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం


