లాటరీ పద్ధతిలో 21 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ నూతన మద్యం పాలసీ (2025–28) ప్రకారం జిల్లాలో 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ తీశారు. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలనలో లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. వీటిలో 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించామన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు కొండపల్లి, తిరువూరు మునిసిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎకై ్సజ్ అధికారుల ఆధ్వర్యాన లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి.శ్రీనివాసరావు వివరించారు. కార్య క్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్వీ రామశివ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


