పట్టుదలతో సాధించిన ఆ నందం | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో సాధించిన ఆ నందం

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

పట్టు

పట్టుదలతో సాధించిన ఆ నందం

పట్టుదలతో సాధించిన ఆ నందం చల్లపల్లి: చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు సాలిపేటకు చెందిన నందం మోహనరావు, వెంకటేశ్వరమ్మలకు ముగ్గురు సంతానం. నాగరాజు రెండవ వాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో 2010లో హైదరాబాదు వెళ్లిన నాగరాజుకు బైక్‌ ప్రమాదంలో కంటికి దెబ్బ తగిలింది. మూడు సార్లు ఆపరేషన్‌ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మొదట కుడి కన్ను కొన్ని రోజులకే మరోకన్ను ఇలా రెండు కళ్లు పూర్తిగా చూపు కోల్పోయాయి. అయినప్పటికీ నాగరాజు చదువుపై తనకున్న మక్కువను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగుల వసతి గృహంలో ఆశ్రయం తీసుకుని అక్కడే ఉంటూ ఎస్‌ఎస్‌సి(75శాతం), ఇంటర్‌ (86శాతం)తో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్‌ లో ప్రతిభా అవార్డుతో పాటు, గోల్డ్‌ మెడల్‌, నగదు బహుమతులు అందుకున్నాడు. సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో బి.ఎ. 80 శాతం మార్కులతో పట్టభద్రుడయ్యాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా 75 శాతం మార్కులతో ఎం.ఎ. హిస్టరీ పూర్తిచేశాడు. 2022 నుంచి మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ గ్రూప్‌–2కు ప్రిపేర్‌ అవటం ప్రారంభించాడు విజన్‌ త్రూ ఇయర్‌(వి.టి.ఈ) పరికరం ద్వారా స్నేహితులతో పాఠాలు రికార్డు చేయించుకుని వినేవాడు. 2023లో స్రైబ్‌(సహాయకుడు) సహాయంతో పరీక్ష రాశాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఏపీపీఎస్‌సీ హెడ్‌్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌(హెచ్‌వోడి)లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. విధి అడ్డంకులు సృష్టించినా బెదరక పట్టుదలతో తన లోపాన్ని సైతం అధిగమించి ముందుకు సాగుతున్న నందం నాగరాజుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అంధత్వాన్ని అధిగమించి ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు అతని దీక్ష ముందు చిన్నబోయిన వైకల్యం గ్రూప్‌–2లో ఉద్యోగం సాధించిన అంధ యువకుడు నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తున్న నందం నాగరాజు

గజిటెడ్‌ హోదా ఉద్యోగం సాధించాలని కోరిక

ఎప్పటికై నా గజిటెడ్‌ హోదా గల ఉద్యోగం సాధించాలని కోరిక. ఒంగోలులోని దివ్యాంగుల వసతి గృహంలో వారికి ఎంతో రుణపడి ఉంటా. విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్‌, ఒంగోలుకు చెందిన గాలి నారాయణరావు, లక్ష్మీ దంపతులు నాకు పాఠాలు అన్ని రికార్డు చేసి ఇచ్చేవారు. వారి సహాయాన్ని మరువలేను. పరీక్షలకు హాజరయ్యే సమయంలో స్రైబ్‌(సహాయకులు)తో భాషాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం సహాయంచేయాలి.

–నందం నాగరాజు, గ్రూప్‌–2 విజేత

అసలే నిరుపేద కుటుంబం. దానికి తోడు విధి ప్రమాదం రూపంలో వచ్చి కంటి చూపును తీసుకుపోయింది. కరెంటు షాక్‌ తగిలి తండ్రి మరణించాడు. వంట పని చేసే తల్లే కుటుంబం మొత్తానికి జీవనాధారం. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క అంధత్వం ఇన్ని సమస్యలు చుట్టుముట్టి వెంటాడుతున్నా... ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టు విడువలేదు. తన లక్ష్యాన్ని చేజార్చుకోలేదు. తన చెవులనే నయనాలుగా మార్చుకుని కఠోర శ్రమ చేశాడు. చివరకు ఎలాగైతేనేం గ్రూప్‌–2లో ఉద్యోగానికి ఎంపికై అనుకున్నది సాధించాడు. ఇదీ...చల్లపల్లి మండలం

లక్ష్మీపురానికి చెందిన నందం నాగరాజు విజయగాథ.

పట్టుదలతో సాధించిన ఆ నందం 1
1/1

పట్టుదలతో సాధించిన ఆ నందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement