సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ ఆవిష్కరణ

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ ఆవిష్కరణ

సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ ఆవిష్కరణ

సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ ఆవిష్కరణ

భవానీపురం(విజయవాడపశ్చిమ): పద్మజ సుజుకి ఆధ్వర్యంలో సుజుకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–యాక్సిస్‌’ను విజయవాడలోని రింగ్‌రోడ్‌లో గల పద్మజ సుజుకి షోరూమ్‌లో గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పద్మజ సుజుకి రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌ కర్ణ శివరామకృష్ణ, రీజనల్‌ సర్వీస్‌ మేనేజర్‌ ఎస్‌.సునీల్‌ ముఖ్యఅతిథులుగా హాజరై స్కూటర్‌ను ఆవిష్కరించారు. వరుణ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వినోద్‌ కుమార్‌, పద్మజ సుజుకి సీఈఓ అనూరాధ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాధాన్యతను వివరించారు. సుజుకి ఈ–యాక్సిస్‌ ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్‌, మెరుగైన బ్యాటరీ పనితీరు, వినియోగదారులకు అనుకూలమైన ఫీచర్లతో మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించనుందని తెలిపారు. సుజుకి ఈ–యాక్సిస్‌ స్కూటీ వైట్‌, బ్లూ, గ్రీన్‌, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాహనాన్ని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 ఏళ్లలో తిరిగి విక్రయించేవారికి బైబ్యాక్‌ ఆఫర్‌లో 60 శాతం వరకు చెల్లిస్తామన్నారు. పద్మజ సుజుకి ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు, విశ్వసనీయ ఆఫ్టర్‌–సేల్స్‌ సపోర్ట్‌ అందించేందుకు కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పద్మజ సుజుకి మేనేజ్‌మెంట్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement