లేబర్ కోడ్‌లు రద్దు కోరుతూ 12న సమ్మె
లేబర్ కోడ్‌లు రద్దు కోరుతూ 12న సమ్మె సొసైటీ నియమావళిపై
పాడి రైతుకు అవగాహన
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సొసైటీ నియమావళి(బైలా)పై ప్రతి పాడి రైతు అవగాహన కలిగి ఉండాలని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని సమావేశ మందిరంలో గురువారం గన్నవరం క్లస్టర్ పరిధిలోని సంఘ అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశంలో సొసైటీ నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన చైర్మన్ చలసాని ఆంజనేయులు సంఘ అధ్యక్షులకు సంఘ నిర్వహణ, వారి అధికారాలు, బాధ్యతలపై పలు సూచనలు ఇచ్చారు. రెజీ వెట్ కేర్ యాప్ ద్వారా పశువుల ఆరోగ్యంపై పూర్తి స్థాయి నిఘా, సరైన సమయంలో చూడి కట్టే విధానం, పశు ఆరోగ్య పరిరక్షణ కోసం కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరించారు. శాసీ్త్రయ పశుపోషణ చేపట్టడం ద్వారా నిర్వహణ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అధిక పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధిక పాల ఉత్పత్తితో పాడి పరిశ్రమ మరింత లాభసాటిగా మారుతుందన్నారు. ఇందు కోసం మేలు జాతి పశుగ్రాసాల గురించి వివరించి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. సమావేశంలో సమితి ఎండీ కొల్లి ఈశ్వరబాబు, గన్నవరం క్లస్టర్ సమితి బోర్డు డైరెక్టర్లు, ట్రస్ట్ డైరెక్టర్లు, ఫీడ్ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు.
14, 15 తేదీల్లో హెడ్‌మాస్టర్స్ అకౌంట్ టెస్ట్ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: హెడ్‌మాస్టర్స్ అకౌంట్ టెస్ట్ 2026 పరీక్షలు ఈ నెల 14,15 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యువి. సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పేపర్–1 (పుస్తకాలు లేకుండా), ఫిబ్రవరి 15న అదే సమయాల్లో పేపర్–2 (పుస్తకాలతో) పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు గమనించి సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని డీఈఓ కోరారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, దేశ స్వావలంబనకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఇన్సూరెన్సు ఉద్యోగుల జోనల్ సహాయ కార్యదర్శి జి.కిషోర్‌కుమార్ అధ్యక్షతన గురువారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీమా ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య మాట్లాడుతూ దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.వేతనాలను యాజమాన్య దయా దాక్షిణ్యాలకు వదిలివేసేలా కోడ్ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం చేశారన్నారు. తమ సమస్యల పరిష్కారానికి, సంఘం పెట్టుకోవడానికి, ఆందోళన నిర్వహించడానికి అవకాశం లేకుండా చేశారన్నారు. ఈ లేబర్ కోడ్‌లు కార్మికులకు ఉరి తాళ్లని, వాటిని రద్దు చేయటమే పరిష్కారమని చెప్పారు. బెఫి రాష్ట్ర కార్యదర్శి ఆర్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. సదస్సులో మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.వి.కృష్ణయ్య, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ బాలాజీ, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.రాజు, ఆర్‌టీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు.