బాబు, పవన్‌ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా | Varudu Kalyani, RK Roja Visit Jogi Ramesh House Slams Chandrababu, Pawan | Sakshi
Sakshi News home page

బాబు, పవన్‌ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా

Feb 6 2026 9:57 AM | Updated on Feb 6 2026 10:52 AM

 Varudu Kalyani, RK Roja Visit Jogi Ramesh House Slams Chandrababu, Pawan

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఏపీలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు.   

‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్‌ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్‌ నీచంగా మాట్లాడారు.  వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ,  అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్‌ చేశారు. జగన్‌ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్‌ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.

ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement