breaking news
Varudu Kalyani
-
ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?
-
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని!