
విశాఖ: కల్తీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని ఆమె పేర్కొన్నారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీ) విశాఖలో ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ కుంభకోణం లో ఉన్న పెద్దలు అందరూ బయటికి రావాలి. టిడిపికి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు వెనకాడుతున్నారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.
కల్తీ మద్యానికి సూత్రధారులు పాత్ర దారులు టిడిపి నేతలు. నాణ్యమైన విద్య వైద్య ఆంధ్రప్రదేశ్‌గా వైఎస్ జగన్ మార్చితే.. కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పాలిస్తున్నారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టిడిపి నేతలు మార్చుకున్నారు. ఊరూరా కల్తీ మద్యానికి టిడిపి నేతలు పాల్పడుతున్నారు. నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారింది. కల్తీ మద్యానికి ఎంతోమంది బలయ్యారు.. నకిలీ మద్యం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై లేదు. ప్రతి మూడు బాటిల్‌లో ఒకటి కల్తీ మద్యమే’ అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
