కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి: 8కి చేరిన మృతుల సంఖ్య | Adulterated Milk Case Rajahmahendravaram, Death Toll Rises To 8 And 13 On Ventilators | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి: 8కి చేరిన మృతుల సంఖ్య

Mar 3 2026 5:09 PM | Updated on Mar 3 2026 5:46 PM

Adulterated Milk Case Rajahmahendravaram: Toll Rises to 8

రాజమహేంద్రవరం:  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది.  అయితే అధికారికంగా ఏడుగురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్‌లో చికిత్స పొందుతూ జి సూర్యారావు(80) మృతిచెందారు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్‌ వాసి.  కల్తీ పాల బాధితుడు జి సూర్యారావు. మరో 13 మంది ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. 

కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్‌ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోంది. 

కిమ్స్‌ బొల్లినేని, రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్‌ ఆస్పత్రుల్లో 13 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.  వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement