‘ ఆ అంశంపై శాసన మండలిలో చర్చ జరగాల్సిందే’ | YSRCP MLC Arunkumar Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘ ఆ అంశంపై శాసన మండలిలో చర్చ జరగాల్సిందే’

Mar 3 2026 3:29 PM | Updated on Mar 3 2026 3:38 PM

YSRCP MLC Arunkumar Takes On AP Govt

తాడేపల్లి : లడ్డూ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చ జరగాల్సిందేని వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకూ ఆరుసార్లు వాయిదా తీర్మానం ఇచ్చామని, అయినాసరే ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతోందని ఆయన ప్రశ్నించారు. 

ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన,.. కూటమి ప్రభుత్వ సభ్యులు శాసన సభలో ఒకరూలు, మండలిలో ఇంకో రూలు పాటిస్తున్నారని మండిపడ్డారు.  

‘శాసన మండలిలో మా‌పార్టీని తట్టుకోలేక అధికారపక్షం పారిపోతోంది. చివరికి ఛైర్మన్‌ని కూడా డిక్టేట్ చేస్తున్నారు. లడ్డూపై విచారణ జరిపిన సీబిఐ మీద కూడా చంద్రబాబుకు నమ్మకం‌ కలగటం లేదు. కల్తీ నెయ్యికి సూత్రధారి, పాత్రధారి హెరిటేజ్, దాని అనుబంధ సంస్థ ఇందాపూర్‌దే. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు చర్చకు రావటం లేదు?’ అని నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement