నంద్యాల జిల్లా: మండల పరిధిలోని కౌలూరు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పెట్రోల్ బంకులో ఆరు రోజులుగా ఉన్న కారు స్థానికంగా కలకలం రేపుతోంది. గత నెల 25వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తెలంగాణ రిజిస్ట్రేషన్ ( టీఎస్ 11 ఈఎఫ్ 0956) కలిగిన హ్యుందాయ్ కారును బంకు ఆవరణలో పార్క్ చేసి వెళ్లారు.
వారం గడుస్తున్నా కారును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. వాహన వివరాల ఆధారంగా యజమాని ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


