breaking news
Adulterated milk
-
మృత్యువుతో పోరాడి.. ఓడిన మూడేళ్ల జయకృష్ణ
సాక్షి,తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన జయకృష్ణ గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడాడు. ఈ క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జయ కృష్ణ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడి మరణంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు. దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
కల్తీ పాల ఘటనను ‘కూల్’ చేశారు!
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ పాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్), విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎఫ్ఎస్ఎల్) నుంచి శనివారం ఐదుగురి మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ తుది అభిప్రాయం వెల్లడైనట్టు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. కూలెంట్ నుంచి లీకైన విషపూరిత ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిలై మృతి చెందినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనినిబట్టి చూస్తే.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథలీన్ గ్లైకాల్ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికలను ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకుగాను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగా విషపూరితమైన ఈజీ–ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఈ ఐదుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు. -
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మహిళ మరణించింది. లాలాచెరువుకు చెందిన వెంకటలక్ష్మి (69) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే, అనధికారికంగా ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్టు సమాచారం.ఇక, రాజమండ్రి కల్తీ పాల బాధితులు వరుసగా నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యం పాలై ఇంకా 11 మంది నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురికి వైద్యులు..వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. -
కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు
సాక్షి, రాజమండ్రి: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి: 8కి చేరిన మృతుల సంఖ్య
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అయితే అధికారికంగా ఏడుగురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్‌లో చికిత్స పొందుతూ జి సూర్యారావు(80) మృతిచెందారు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ వాసి. కల్తీ పాల బాధితుడు జి సూర్యారావు. మరో 13 మంది ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 13 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. -
విషమిస్తున్న కల్తీ పాల బాధితుల ఆరోగ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చి్రల్డన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 15 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. అత్యవసర చికిత్స పొందుతున్న వారిని పరీక్షించి, ఇప్పటివరకూ అందించిన చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంది. బాధితులకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స కంటే మెరుగైన చికిత్స అందించడానికి ఏమీ లేదని బృందం చేతులెత్తేసింది. హైదరాబాద్ కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ సుభాష్ కౌల్ (న్యూరాలజీ), డాక్టర్ వెంకట కృçష్ణ చైతన్య కొడూరి (న్యూరాలజిస్ట్), అపోలో ఆస్పత్రి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతికుమార్, ఏఐజీ ఆస్పత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ ఆదర్శ్ సింగంశెట్టి ఈ బృందంలో ఉన్నారు. -
బాధితుల నరకయాతన.. సర్కారు కాలయాపన
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాల బాధితులు నరకయాతన అనుభవిస్తుండగా.. చంద్రబాబు సర్కారు కాలయాపనతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పాల వ్యాపారి గణేష్ తల్లి కల్తీకి కూలెంట్ కారణం కాదని వాదిస్తున్నారు. అందులోని పాలను తాము కూడా తాగామని, వాటితోనే మజ్జిగ చేసి ఓ ఆలయానికి సైతం పంపించినట్టు చెబుతున్నారు. అవే పాలు తాగిన తమకు ఏమీ కాలేదని, రాజమహేంద్రవరంలో అస్వస్థతకు గురయ్యారంటే.. దీనివెనుక ఏదో కుట్ర దాగుందని ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి కల్తీ పాలకు కారణమేమిటనేది నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే కొన్ని ప్రచార మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు కాగా.. కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉన్నాయనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలకు కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీలో ఫ్రీజర్ (కూలెంట్) కారణమని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కూలెంట్ పాడై అందులోని ఇథలీన్ గ్లైకాల్ పాలల్లో కలవడంతో కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు భావిస్తున్నామని అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ డెయిరీలో తనిఖీలు చేపట్టిన ఫోరెన్సిక్ బృందం పాల సేకరణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాలు, వెనిగర్, కొన్ని ఖాళీ సీసాలు, పౌడర్ సేకరించారు. కూలెంట్‌ను నిశితంగా తనిఖీ చేశారు. అయితే, కల్తీ పాల బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉండటం, వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం కూలెంట్ లీకేజీపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫోరెన్సిక్ సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేసిన కూలెంట్‌ను మరోసారి పరిశీలించేందుకు మంగళగిరి తీసుకెళ్లారు. అక్కడి ఫోరెన్సిక్ లేబొరేటరీలో మరోసారి పరీక్షించనున్నట్టు తెలిసింది. అనంతరం ఓ నిర్ధారణకు రానున్నట్టు సమాచారం. తర్వాత అయినా స్పష్టమైన ప్రకటన చేస్తారా.. ల్యాబ్ రిపోర్టుల మాదిరిగా ఈ అంశంలోనూ వాయిదాల పద్ధతి అవలంభిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషమంగానే బాధితుల ఆరోగ్యం కల్తీ పాలు తాగి కిడ్నీ సమస్యలతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం రోజురోజుకూ విషమంగా మారుతోంది. కల్తీ పాలకు 21 మంది ప్రభావితం కాగా.. ఇప్పటికే ఆరుగురు మరణించారు. 15 మంది వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఆరుగురికి డయాలసిస్ చేస్తుండగా.. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇంకా అందని ల్యాబ్ రిపోర్టులుబాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల ల్యాబ్ రిపోర్టులు శుక్రవారం నాటికి కూడా రాలేదు. తొలుత పుణే నుంచి రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా.. తాజాగా తిరుపతి పంపించినట్టు చెబుతున్నారు. రెండు రోజులవుతున్నా ఇంకా రాకపోవడంపై బాధితుల్లో ఆందోళన నెలకొంది. కల్తీపాలు తాగి చనిపోయిన వారి పోస్టుమార్టం నివేదికలు సైతం అందలేదు. పోస్టుమార్టం శాంపిల్స్‌ను విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాలయాపన చేసి కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దేవుడా.. ఏంటీ దుస్థితి!
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా.. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో 8 మంది, రెయిన్బో ఆస్పత్రిలో ముగ్గురు, డెల్టా ఆస్పత్రిలో ఇద్దరు, రవిచంద్ర ఆస్పత్రిలో ఒకరు, రవి చైతన్య ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యాధికారులు తెలిపారు. 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ అందిస్తున్నారని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రెయిన్బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 నెలల చిన్నారికి సైతం డయాలసిస్ చేస్తున్నారు. కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ కల్తీ పాల బాధితులను గుర్తించేందుకు వైద్యాధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని కలెక్టర్ కీర్తి సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. 14 సరై్వలైన్స్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. నివేదికలు ఎప్పుడొస్తాయో కల్తీ పాల బాధితుల్లో 12 మంది నుంచి రక్తం, ముగ్గురి నుంచి మూత్ర నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం తిరుపతి ఐఐటీకి పంపారు. ఆ నివేదికలు గురువారం సాయంత్రానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ రాకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక ఇంజెక్షన్ల వినియోగం ఎప్పుడో? ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ సూచనల మేరకు ముంబై నుంచి 50 ప్రత్యేక ఇంజెక్షన్లు తెప్పించారు. వాటిని వినియోగించాలంటే రక్తం, పాల నివేదికలు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. వీటిని పంపించి ఐదు రోజులు దాటుతున్నా నేటికీ రాలేదు. మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇంజెక్షన్లను వినియోగించాలంటే ల్యాబ్ రిపోర్టులు తప్పనిసరి. పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలిసి ఆస్పత్రి పాలైన బాధితులకు మాత్రమే ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో క్రియాటినిన్, యూరియా అవశేషాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వాటిని డయాలసిస్ చేస్తున్న వారికి వినియోగిస్తామని వైద్యులు వెల్లడించడమే తప్ప.. నేటికీ వాడిన దాఖలాలు లేవు. గణేష్ కస్టడీ కోరుతూ పిటిషన్ పాల వ్యాపారి గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గణేష్ ను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే 2 రోజులపాటు పోలీసుల వద్ద ఉన్న గణేష్ ను ఏం విచారించారో అంతుచిక్కని రహస్యంగా ఉంది. విచారణలో కల్తీపాల నిజాలు రాబట్టారా?, నిజాలు నిగ్గుతేలి ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్యలు గణేష్ ను కాపాడేందుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. -
ల్యాబ్ రిపోర్టు లేకుండానే యాంటీడోట్?
-
ఎన్నాళ్లుగా.. ఈ పాపాలు?
రాజమహేంద్రవరం రూరల్/కడియం: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అని ప్రజాకవి వేమన ఏనాడో ప్రశ్నించాడు. అయితే పాలను విషపూరితం చేస్తారని ఆయన కూడా ఊహించలేదు. లేదంటే ‘కడివెడైననేమి గరళ పాలు’ అనే వాడేమో! రాజమహేంద్రవరంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు, 15 మంది ఆస్పత్రిపాలు కావడానికి పాలే కారణమని తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అసలు మనం ప్రతి రోజూ తాగుతున్నవి పాలేనా! అన్న అనుమానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలను పట్టి పీడిస్తోందీ. ఎన్నాళ్లుగా లేక ఎన్నేళ్లుగా ఈ కల్తీపాలను మనం వినియోగిస్తున్నాం? మన ఆరోగ్యాలపై ఇప్పటికే వాటి ప్రభావం మొదలైందా? సంపాదనే ధ్యేయంగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి పాలను విషపూరితం చేస్తూ ఎన్నాళ్ల నుంచి వ్యాపారులు ఈ పాపాలను కొనసాగిస్తున్నారు? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కల్తీ ప్యాకెట్ పాల కారణంగా క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామన్న అభిప్రాయంతో.. ఎంతోమంది స్వచ్ఛమైన పాలకోసం ఆరా తీస్తుంటారు. తమ సమీపంలో పాల అమ్మకందారుల నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రస్తుతం కల్తీ పాలు మరణాలకు కారణమయ్యాయంటే.. అసలు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితిలోకి ప్రజలు వెళ్లిపోయారు. కల్తీ కా నామ్ పాడి! కల్తీ జరిగేదాన్నే పాడి అంటారు! అని జనం సరిపెట్టుకోవాలేమో! ఎందుకంటే జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి జరగడం లేదన్నది వాస్తవం. డిమాండ్, సప్లయిల మధ్య ఉంటున్న భారీ వ్యత్యాసాన్ని కల్తీ పాల ద్వారానే పూడుస్తున్నారన్నది పచ్చినిజం! వివిధ సంస్థల ద్వారా సరఫరా అయ్యే పాల ప్యాకెట్లను పక్కన పెడితే అనాపాల సరఫరాదారులు ఎంతమంది ఉంటారు? వారు ఎన్ని పాలు అమ్ము తున్నారు? వారు ఎక్కడ నుంచి ఆ పాలను సేకరిస్తున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటకెక్కిన మిల్క్ యాక్ట్ వినియోగదారులు, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిల్క్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ యాక్టు ద్వారా పాల సరఫరాదారులను గుర్తించడం, పాల స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించారు. స్వచ్ఛమైన పాలు వినియోగదారులకు చేరే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేశారు. పాల సరఫరాదారులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే అమూల్ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చారు.మిల్క్ యాక్ట్ ద్వారా మహిళాసంఘాల బలోపేతానికి కృషి చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యాక్టును అమలును పట్టించుకోలేదు. దీంతో ప్రజలు వినియోగించే పాలు ఎన్ని? వాటిని సరఫరా చేసేవారు ఎంతమంది? వీటి నాణ్యత ఏపాటిది? తదితర అంశాలన్నీ గాల్లో లెక్కలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. బ్రాండెడ్ డెయిరీలు కొంత నయం పాలను సేకరించే సమయంలో బ్రాండెడ్ డెయిరీలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటి సొంత ల్యాబ్‌లలో పరీక్షలు చేసి మాత్రమే పాలను సేకరిస్తాయి. దీంతో అక్కడికి చేరే పాలల్లో కల్తీ జరిగేది తక్కువేనంటున్నారు. అంటే ప్రజలకు మాత్రం కల్తీ పాలనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లుగా భావించాల్సి వస్తోంది. భారీ స్థాయిలో మోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గేదెలు 1,85,000, ఆవులు 74వేలు ఉన్నట్టుగా పశు సంవర్ధకశాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం 2,59,000కు గాను పాలిచ్చే పశువులు 50 శాతం మాత్రమే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 1,29,500 పశువుల నుంచి రోజుకు 4.61 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జనాభా సుమారు 22 లక్షలు. సరాసరిన ప్రతి ఒక్కరూ రోజుకు సుమారు 300 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తారని అంచనా వేస్తే.. జిల్లా ప్రజల అవసరాలకే 6.60 లక్షల లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. కానీ ఉత్పత్తి అవుతున్న పాలు 4.61 లక్షల లీటర్లు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే రెండు లక్షల లీటర్ల పాలు కల్తీ చేసే ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కలు ప్రజల రోజూ వినియోగించే పాలకు సంబంధించినవి. ఇవి కాకుండా ప్రయివేటు డెయిరీలు సేకరించేవి, ఇతరత్రా అవసరాలకు సరఫరా అయ్యే పాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కల్తీ మరింత భారీగా పెరుగుతుందంటున్నారు. సాధారణ కల్తీ ఇలా.. పాల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వ్యాపారులు కల్తీకి తెగబడుతున్నారు. పాలకు రంగు, చిక్కదనం, నురుగును రప్పించేందుకు యూరియా, మైదా, డిటర్జెంట్లను వినియోగిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇవి కాకుండా పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కూడా పలు రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా వెన్న తీసేసిన పాలకు కూడా జిడ్డును రప్పించేందుకు కూడా పలు పదార్థాలను వాడుతున్నారంటున్నారు. ప్రస్తుతం ఈ కల్తీ గుట్టును తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉంది. -
వీడని కల్తీ పాల ఆందోళన
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కల్తీపాల కలకలం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు మృత్యువాత పడతారో అన్న ఆందోళన నెలకొంది. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. శనివారం నుంచి ముగ్గురికి డయాలసిస్ చేస్తుండగా బుధవారం నాటికి ఆ సంఖ్య 6కు పెరిగింది. వెంటిలేటర్, డయాలసిస్ సేవలు పొందుతున్న వారు ముగ్గురు ఉండగా.. బుధవారం ఆ సంఖ్య 8కి చేరింది. మరొకరు వెంటిలేటర్ మీద ఉన్నారు. దయనీయ స్థితిలో ముగ్గురు చిన్నారులు రాజమహేంద్రవరంలోని కిమ్స్ ఆస్పత్రిలో 8 మంది బాధితులకు.. రెయిన్బో ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో 5 నెలల పసికందు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బొడ్డు నుంచి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. అచేతనావస్థలో ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఎప్పటికి లేచి తిరుగుతారు కన్నా..’ అంటూ ఆందోళన చెందుతున్నారు. రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్ గ్లైకాల్ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు. అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి ల్యాబ్‌కు రక్త నమూనాలు ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు. భయం గుప్పిట్లో బాధితులు కల్తీ పాల ఘటన జరిగి ఇప్పటికే 10 రోజులు అవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. విషమంగా ఉన్న 8 మంది ఆరోగ్యంపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారే కాకుండా గణేష్ వద్ద పాలు వినియోగించిన వారినీ భయం వెంటాడుతోంది. తమపై కల్తీ పాలు దుష్ప్రభావం చూపిస్తాయా అన్న ఆందోళనతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. నేతల కూలెంట్ లీకేజీ ప్రచారం ల్యాబ్ రిపోర్టులు ఇంకా బహిర్గతం కాలేదు. అయినా.. కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒకే పాట అందుకున్నారు. వరలక్ష్మి డెయిరీలో ‘కూలెంట్ లీకేజీ’ జరిగి పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలిసిందంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అధికారుల దర్యాప్తులోనూ ఇదే వెల్లడైనట్టు ఎంపీ పురందేశ్వరి సహా ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందకముందే ఇలాంటి ప్రచారం విస్తృతం చేయడం వెనుక ఏదో ఆంతర్యం దాగుందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొరపాటుగా కల్తీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని చెప్పేందుకే కూలెంట్ వాదన తెరపైకి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతో కూలెంట్ లీకేజీ ప్రచారం చేస్తున్నారన్న అనుమానాన్ని వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే అధికారులు బాధితుల రక్తంలో యూరియా, క్రియాటినిన్ అవశేషాలు ఉన్నాయని చెప్పారు. వైద్యుల నివేదికల్లోనూ ఇదే స్పష్టమైనట్టు వెల్లడించారు. తాజాగా ఇథలీన్ గ్లైకాల్ కలిసిందంటూ ప్రచారం చేస్తున్నారు. -
ఇవి పాలకుల పా‘పాలు’
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడే ఉండే తిరుమ లేశుని లడ్డూ ప్రసాదంపై ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలకు దిగారో గానీ... అప్పటి నుంచి రాష్ట్రంలో జరగని అనర్థాలంటూ లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు వగైరాలతో ముఖ్యమంత్రి మొదలుకొని అందరి కందరూ బిజీగా ఉంటే రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు చుట్టుపట్ల కల్తీ పాల బారినపడి ఆరుగురు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత ఆదివారం దీని తీవ్రత వెల్లడైనా, అంతక్రితం వారం నుంచి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా స్థానిక అధికారులైనా మేల్కొన్నారేమోగానీ... అమరావతిలో కొలువుదీరిన యంత్రాంగం నిద్ర లేవడానికి మరికొన్ని రోజులు పట్టింది. తీరిగ్గా ఇప్పుడు రాష్ట్రవ్యాప్త తనిఖీలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో శాసనసభలో పచ్చి అబద్ధాలు వల్లెవేయటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని, ఎవరు ఏ అసత్యాలతో రక్తి కట్టించాలో తేల్చుకుని, స్క్రిప్టులు బట్టీ పట్టడంలో కూటమి నేతలు తంటాలు పడుతుంటే, అడిగిందల్లా అందించటంలో యంత్రాంగమంతా తరించింది. ఇక కల్తీ పాలపై, కలుషిత నీటిపై పట్టించుకొనే నాథుడేడి? చివరకు కుప్పంకేంద్రంగా సాగే కల్తీ పాల దందాను కూడా కర్ణాటక పోలీసులు వచ్చి బట్టబయలు చేయాల్సి వచ్చింది.పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలెలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్‌లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణ మొదలుకొని సాగుతున్న వరస పరిణామాలు గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అటుతర్వాత ఏప్రిల్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. నిరుడు నవంబర్‌లో కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటిరాగలది 2015 పుష్కరాల్లో రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమ యంలో బాబు కుటుంబసమేతంగా అక్కడ ఉండటమే కాదు... తన షూటింగ్ కోసం భక్తుల్ని గంటల తరబడి ఆపటం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎంతో ఆరోగ్యంతో నిక్షేపంలా ఉండే సామాన్య పౌరులు ఒక్కసారిగా అస్వస్థులు కావటం, వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేసే పరిస్థితి తలెత్తటం ఎంత విషాద కరం! అన్నిటికన్నా ఘోరమేమంటే... రాజమండ్రికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ అవసరమైంది. ఆ లేత ప్రాణం దీన్నితట్టుకోలేక కన్నుమూసింది. డయాలసిస్ సాగుతున్న పిల్లల్లో మూడేళ్లలోపు వారు కూడా ఉన్నారంటే ఉదంతం తీవ్రతేమిటో తెలుస్తుంది. పాలలో కలిపిన ఇథిలీన్ గ్లైకాల్ అనే పదార్థం వల్లే బాధితుల రక్తంలో ప్రమాదకర స్థాయిలో యూరియా, క్రియాటిన్లు ఉన్నాయని చెబు తున్నారు. రక్తంలో గరిష్ఠంగా 24 మిల్లీగ్రాములు ఉండాల్సిన యూరియా దాదాపు 140 మిల్లీ గ్రాములు... గరిష్ఠంగా 1.3 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీరమ్ క్రియాటిన్ ఏకంగా 9 మిల్లీ గ్రాములు ఉందంటే యంత్రాంగం కళ్లు ఎంతగా మూసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇదింకా సద్దుమణగక ముందే గత అయిదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి భారీ సంఖ్యలో ప్రజలు డయేరియా వాతబడ్డారు. నగరంలోని సగం ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కావటమే ఇందుకు కారణమంటున్నారు. 2024 జూలైలోనే అక్కడి బీసీ హాస్టల్లో ఇలాంటి కారణంతోనే పలువురు విద్యార్థులకు డయేరియా సోకింది. అప్పుడు కాస్తయినా శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు ఇది పునరావృత మయ్యేది కాదు. కల్తీ మాటలతో అధికారంలోకొచ్చి, ఆ బాణీనే కొనసాగిస్తున్న పాలకుల అసమర్థత అన్నిటినీ కల్తీమయం చేస్తోంది. ఇప్పటికైనా పాలించటం మొదలెడతారో లేదో బాబు అండ్ కో తేల్చుకోవాలి. -
కుప్పంలో కల్తీ పాలు.. పట్టుకున్న కర్ణాటక పోలీసులు
-
ఆరుకి చేరిన కల్తీ పాల మరణాల సంఖ్య
-
ఆగని కల్తీ పాల మరణాలు
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/మహారాణిపేట (విశాఖ): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలకూట విష ప్రభావం రోజు రోజుకూ మరింతగా పెరుగుతోంది. తాజాగా స్వరూప్ నగర్‌కు చెందిన చిన్నారి డి.మనోహర్ (6) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అ బాలుడిని మూత్రపిండాల సమస్యతో తొలుత రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం విశాఖకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మనోహర్ కిడ్నీ ఫెయిలైందని వెల్లడించారు. డయాలసిస్ చేశారు. కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆ బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్ మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం అక్కడి మార్చురీలోనే ఉంచారు. ఆస్పత్రిలో చేరిన మరో బాధితురాలు ఇప్పటికే కల్తీ పాలు తాగి 19 మంది అస్వస్థతకు గురవగా.. మంగళవారం మరో కేసు నమోదైంది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన రెడ్డి అనంతలక్ష్మి (55) మూత్రపిండాల వ్యాధితో డెల్టా ఆస్పత్రిలో చేరారు. ఆమెను తొలుత కిమ్స్ ఆస్పత్రిలో చేర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ ఆస్పత్రిలో ఇప్పటికే ఇదే కేసు బాధితులు ఎక్కువ మంది ఉండటంతో డెల్టా ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ చేస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఆరుగురు ఇప్పటికే మృతి చెందగా.. మిగిలిన 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రెయిన్బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి. హెల్త్ బులెటిన్ విడుదల కల్తీ పాల ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది. లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు వృద్ధులు అనూరియా, వాంతులు, పొత్తికడుపు నొప్పి, తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉండటంతో విషపూరిత ప్రభావం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది. నెఫ్రాలజిస్టులతో కూడిన 14 ఫీల్డ్ సర్వేలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్క్రీనింగ్ చేశాయి. 110 కుటుంబాల్లో 293 మందిని గుర్తించి 315 రక్త నమూనాలు సేకరించారు. వాటిలో 313 సాధారణంగా ఉండగా ఇద్దరిలో యూరియా, క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు వెల్లడైంది. సెంట్రల్ జైలుకు పాల వ్యాపారి తరలింపు కల్తీ పాల వ్యాపారి అడ్డాల గణేష్ అరెస్టుపై హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసుల అదుపులో ఉన్న అతడికి కడుపు నొప్పి రావడంతో మంగళవారం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు కోలుకోవడంతో కోర్టులో హాజరుపర్చగా.. మార్చి 10 వరకూ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వీడని కల్తీ గుట్టు కల్తీ పాల గుట్టు ఇంకా వీడలేదు. కల్తీపై స్పష్టత రావాలంటే రక్తం, పాల నమూనాల నివేదికలు రావాల్సి ఉంది. ఇవి మంగళవారం వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించినా.. మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు వస్తేగాని.. మరణాలు ఎలా సంభవించాయి.. పాలు పూర్తిస్థాయిలో కల్తీ జరిగాయా.. లేక వేరే ఏమైనా కలుషితం జరిగాయా అనే విషయం స్పష్టమవుతుంది. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అత్యుత్సాహంతో కూలెంట్ లీకేజీ సంభవించి ‘ఇథలీన్ గ్లైకాల్’ కలవడంతో పాల కల్తీ జరిగి ఈ మరణాలు సంభవించాయనే వాదన వినిపిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందకుండానే దీనిపై ఎలా నిర్ధారిస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పాల వ్యాపారి అడ్డాల గణేష్ డెయిరీ వద్ద పాల కల్తీకి ఉపయోగించే అనుమానిత పౌడర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ పౌడర్ ఏమిటనేదానిపై ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉంది. అప్పుడే కల్తీ గుట్టు వీడుతుంది. మెలమైన్ కూడా కలిసే అవకాశం పాలల్లో ఇథలీన్ గ్లైకాల్‌తోపాటు యూరియా, మెలమైన్ కలిసే అవకాశం ఉందని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవిరాజు, విశాఖపట్నం కేజీహెచ్‌కు చెందిన డాక్టర్ గుళ్లపల్లి ప్రసాద్, డాక్టర్ సుధాకర్ వెంచురి, పి.శశాంక పాకలపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్తీ పాల కేసులను వీరే సమన్వయం చేస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ల్యాబ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, ఫలితాలు 2 నుంచి 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 63 సార్లు డయాలసిస్ చేసినా.. రాజమహేంద్రవరంలోని స్వరూప్ నగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు డి.మనోహర్‌కు కేజీహెచ్‌లో ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆ బాలుడు మంగళవారం ప్రాణం వదిలాడు. ఈ నెల 18న అతడిని కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతడికి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోడాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వైద్యులు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు గుర్తించి, అప్పుడే వైద్యం ప్రారంభించారు. చివరకు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అసలు ఊహించలేదు కల్తీ పాలు తాగటం వల్లే మా అబ్బాయి చనిపోయాడు. మూడేళ్లుగా గణేష్ వద్దే పాలు తీసుకుంటున్నాం. ఇంట్లో మా బాబు ఒక్కడే పాలు తాగుతున్నాడు. మహా శివరాత్రి నుంచి మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజు నుంచే యూరిన్ ఆగిపోయింది. రాజమండ్రి ఆస్పత్రి నుంచి కాకినాడ పంపారు. అక్కడి నుంచి 18న వైజాగ్ తీసుకొచ్చాం. మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడని తెలిపారు. మనోహర్‌ను నమ్ముకునే బతుకుతున్నాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – అర్చన, బాలుడి తల్లి, రాజమహేంద్రవరం రెండింటి వల్ల కిడ్నీ పాడవుతుంది పాలు కల్తీ ఎలా జరిగాయనేది ల్యాబ్ రిపోర్టులు వస్తేనే కానీ చెప్పలేం. ఫ్రిజ్ నుంచి ఇథలీన్ గ్లైకాల్ లీకై పాలలో కలిసినా కిడ్నీ సమస్యలు వస్తాయి. అలా కాకుండా పాలలో యూరియా వంటి రసాయనాలు కలిపినా కిడ్నీ ఫెయిలయ్యే అవకాశం ఉంటుంది. గణేష్ వద్ద పాలు తీసుకున్న వారంతా కిడ్నీ పనితీరును నిర్ధారించే క్రియాటినిన్ పరీక్షలు తప్పక చేయించుకోండి. తేడా వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్సలు పొందండి. – డాక్టర్ శశాంక్, నెఫ్రాలజిస్ట్, రాజమహేంద్రవరంబాధ్యులపై చర్యలేవీ? మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జనం చచి్చపోతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తూ కూర్చుందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రజలు చనిపోవడానికి ప్రభుత్వ అవినీతి, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ‘ఓ వ్యక్తిపై చర్య తీసుకుని చేతులు దులుపుకుంటారా.. బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కొన్ని నెలలుగానో, అంతకు ముందు నుంచో కల్తీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు. జనం చచి్చపోతుంటే పట్టించుకోకుండా, ప్రశి్నంచే వారిపై మాత్రం కక్ష సాధింపు చర్యలపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇదేంటని ఎవరినైనా అడిగితే పెదబాబు, చినబాబులకు ముడుపులు ఇస్తున్నామని చెబుతున్నారని చెప్పారు.‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏవో తప్పులు జరిగినట్లు సభలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం సరికాదు. తన తండ్రిని ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నా, ఆ బాధను దిగమింగుకుని వైఎస్సార్ పరిపాలన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో ప్రధాని పర్యటనలను పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రధాని పర్యటనలను చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే కదా.. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా సత్యదూరమైన మాటలను సభలో మాట్లాడుతున్నారు. సోము వీర్రాజుకు వయసొచ్చిందే గానీ దానికి తగ్గట్టు మాట్లాడటం లేదు. మేం ఏం అడిగినా ప్రభుత్వం బాధ్యతగా సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశాం. సభలో ఏ అంశంపై అయినా చర్చించడానికి ఎంత సమయం అయినా ఎన్ని గంటలైనా మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. -
ఈ ప్రభుత్వమే కల్తీ
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కల్తీ సర్వసాధారణంగా మారిందని, ఈ ప్రభుత్వమే కల్తీదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పాలు, నీళ్లు, ఆహారం, మద్యం.. ఇలా అన్నింటా కల్తీ విలయ తాండవం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారన్నారు. 20 నెలల పాలనలో మొత్తం 36 కల్తీ ఘటనలు జరిగితే.. 900 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని, 40 మంది చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సంపాదనపై దృష్టిపెట్టిన చంద్రబాబు పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, ఫలితంగానే కల్తీలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. మాజీ మంత్రులు విడదల రజిని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఏమన్నారంటే.. 20 నెలల్లో 36 ఘటనలు ‘కల్తీ పాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. 2024 జూలైలో తొలిసారి శ్రీకాకుళం కేజీబీవీ హాస్టల్లో డయేరియా ప్రబలినప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. 20 నెలల్లో 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేదలే బలైపోతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సింథటిక్ మిల్క్ తయారీ యూనిట్ వెలుగులోకి వచ్చినా కనీసం పట్టించుకోలేదు. కల్తీ పాల ఘటనను డైవర్ట్ చేసి, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కూలెంట్ లీకేజీ అయిందంటూ కథనాలు అల్లుతోంది. రక్తం, పాల నివేదికలు రాక ముందే ఇలా ఎలా ప్రకటిస్తారు? మీరేమైనా సీసీ కెమెరాలో చూశారా? రాష్ట్రంలో 200 లక్షల లీటర్ల పాలు అనధికారంగా సరఫరా అవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ, ఆ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చింది. అందుకే పాలు, తిండి, నీరు, ఆఖరికి కల్తీ మద్యం.. ఇలా ప్రతిదాన్నీ కల్తీ చేస్తూ దోపిడీ చేసేవారి ఆగడాలు ఎక్కువైపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా డయేరియాతో 900 మంది ఆస్పత్రుల్లో చేరారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైన బాధితులు రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యం నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల ఫీజులతో దోపిడీ చేస్తున్నాయి. రితిక్ అనే బాలుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రిలో రూ.8.50 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి కల్తీ పాల దారుణాలు వెలుగు చూసినా స్పందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. బాధితులకు ఏకంగా డయాలసిస్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఘోరంగా ఉందని అర్థమవుతోంది. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం ఇది. ఏమవుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు చనిపోయారు. ఎంతోమంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందించాలి. ఇప్పటికే ఆస్పత్రులు తీసుకున్న ఫీజులు వెనక్కివ్వాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
బాబు సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణపాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజనికల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.రెయిన్బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారుబాధితులకు అండగా ఉంటాం: తానేటి వనితఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి. -
‘పాల’కులదే కల్తీ పాపం
రాజమహేంద్రవరం రూరల్: కల్తీ పాల పాపం చంద్రబాబు సర్కారుదేనని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కల్తీపాల వల్ల అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా పరామర్శించారు. అలాగే కల్తీపాల వల్ల మరణించిన కుటుంబాలను వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వారు విలేకరులతో మాట్లాడారు.కల్తీ పాల వల్ల దాదాపు వారం రోజులుగా ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు సర్కారుకు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై, భద్రతపై లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని వారి పనిని వారిని చేసుకోనిస్తే ఇలా ప్రజల ప్రాణాలు పోవని రాజా పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఏ ఒక్క అధికారి ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధితుల ఆస్పత్రుల బిల్లులకే రూ.లక్షలు ఖర్చవుతున్నాయని, రెండేళ్లలోపు చిన్నారి రితిక చికిత్సకు ఇప్పటివరకు రూ.8.50 లక్షలు ఖర్చయిందని రాజా ఆవేదన చెందారు. మృతదేహాల పోస్టుమార్టం, అంత్యక్రియలకు ప్రభుత్వం హడావుడి చేయడం అనుమానాలకు తావిస్తోందని రాజా మండిపడ్డారు.బాధితులకు తమ పార్టీ నాయకుల ద్వారా సాయం అందజేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతగానితనం వల్లనే పాల కల్తీ ఘటన జరిగిందన్నారు. వారం పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులు చేరుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నెలల పిల్లలూ కల్తీ పాల బారిన పడ్డారని, వారికీ డయాలసిస్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లే దని మండిపడ్డారు. తక్షణం సర్కారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
రసాయనాలే శా‘పాలు’
సాక్షి, అమరావతి: అధిక మోతాదులో యూరియా, ఇథిలీన్ గ్లైకాల్ వంటి రసాయనాలు కలిసిన కల్తీ పాలే ప్రజల ప్రాణాల మీదకు తెచ్చినట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో మృతులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గమనించిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఇథిలీన్ గ్లైకాల్ ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. పాలు చిక్కగా ఉన్నాయని భ్రమింపజేయడానికి యూరియాను, కల్తీ చేసిన పాలు త్వరగా పాడవ్వకుండా ఉండటానికి, ఒకరకమైన తీపిదనాన్ని ఇవ్వడానికి ఇథిలీన్ గ్లైకాల్ కలుపుతుంటారు. ఈ రెండూ మోతాదుకు మించి కలపడం వల్లే ప్రస్తుతం రాజమహేంద్రవరం బాధితుల కిడ్నీలు షట్డౌన్కు దారితీసిందని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజుకు రెండు సార్లు డయాలసిస్ రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండగ ముగిసిన మరుసటి రోజు నుంచి కల్తీ పాల వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. క్రమంగా సమస్యలు తీవ్ర రూపం దాల్చి కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మూత్రం ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని ‘అనూరియా’(హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి) సంభవించింది. రక్తంలో యూరియా, క్రియాటిన్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. సాధారణంగా రక్తంలో యూరియా వయోజనుల్లో 8–24 మిల్లీగ్రాములు, వృద్ధుల్లో 8–26 మిల్లీగ్రాములు, సీరమ్ క్రియాటిన్ 0.7–1.3 మిల్లీగ్రాములు ఉండాలి. అయితే రాజమండ్రి బాధితుల రక్తంలో యూరియా 130–140 మిల్లీగ్రాములు, క్రియాటిన్ 9 మిల్లీగ్రాములు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్ ఘటనల్లో బాధితులకు రోజుకు ఒకసారి డయాలసిస్ చేస్తే సరిపోతుందని, అయితే రాజమండ్రిలో కొందరు బాధితులకు రోజులో రెండోసారి కూడా డయాలసిస్ చేసినట్టు స్పష్టం చేశారు.సర్కారు పర్యవేక్షణ శూన్యంరాజమండ్రి ఘటనతో రాష్ట్రంలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగుతోందని స్పష్టమవుతోంది. ఇంత భారీ స్థాయిలో కేటుగాళ్లు రెచి్చపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకు 500–50 వేల లీటర్ల పాలను సేకరించే/ప్రాసెస్ చేసే, ఏడాదికి రూ.20 కోట్లలోపు టర్నోవర్ ఉండే డెయిరీలు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఘటనలో పాల సరఫరా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే డెయిరీల్లో పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏ మాత్రం లేదని తేటతెల్లమవుతోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేసిందని స్పష్టమవుతోంది. -
మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం
దేవుడి ప్రసాదంలో కల్తీ అంటూ డెయిరీలను భయపెట్టి సొంత డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న పాల కల్తీపై లేకపోయింది. పాల కల్తీ బయటపడి వారం రోజులవుతున్నా.. వరుసగా ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్ఘాంతపరుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుసుకోవడానికి రాజమహేంద్రవరం పాల కల్తీ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల దుర్ఘటన మరణ మృదంగం మోగిస్తోంది. లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలో చోటుచేసుకుంటున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి రమణి (58) మరణించారు. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా.. అధికారులు మాత్రం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 17 మంది బాధితులు ఒక్కసారిగా మూత్రం ఆగిపోవడం (అనూరియా), వాంతులు, విరేచనాలు కావడం, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మంది కిమ్స్, రెయిన్బో, రవి చైతన్య, సన్‌స్టార్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్‌లో ఏడుగురు చికిత్స పొందుతుండగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెయిన్బోలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఐదు నెలల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అభం శుభం తెలియని పసివాడికి చికిత్స అందిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదిత్య ఆస్పత్రిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రవి చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరికొందరు జయ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా.. వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం కల్తీ పాల బాధితులు 19 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మంది మృతి చెందగా.. మరో 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం మొత్తం బాధితులు 17 మందేనని స్పష్టం చేశారు. వీరిలో నలుగురు మృతి చెందారని చెబుతున్నారు. కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజులు పాలల్లో కల్తీని నిర్ధారించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాల వ్యాపారి గణేష్ నుంచి పాలు పోయించుకుంటున్న 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఈ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను వైజ్ఞానిక, పశు సంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపించారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సైతం పంపించామన్నారు. వెలుగులోకి కీలక విషయాలు కల్తీ పాల కలవరానికి కారణమని భావిస్తున్న పాల వ్యాపారి గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు తెలిసింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలోని 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్ అనే వ్యాపారి ప్రతిరోజూ పాలు పోస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి కావడంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో రోజూ పాలుపోసే వారితో కలిపి మొత్తం 126 కుటుంబాలకు గణేష్ ఆ రోజు పాలు పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. 16వ తేదీన పోసిన పాలు కొంచెం చేదుగా ఉన్నాయని వినియోగదారులు గణేష్ దృష్టికి తీసుకెళ్లగా.. మరునాటి నుంచి అలా జరగదని అతడు చెప్పడంతో మిన్నకుండిపోయారు. తిరిగి సాధారణంగా ఎప్పుడూ ఉండే రుచే ఉండటంతో వినియోగదారులు పట్టించుకోలేదు. ఆ రోజు గణేష్ నరసాపురం గ్రామ పరిసరాల్లో పాలను సేకరించినట్లు సమాచారం. దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాలు ఎక్కడెక్కడ, ఎవరెవరి నుంచి సేకరించాడనే విషయమై ఆరా తీస్తున్నారు. అనధికార డెయిరీ సీజ్ పాల వ్యాపారి గణేష్ నరసాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని పోలీసులు సీజ్ చేశారు. పాలు సేకరించే పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. వెనిగర్, పాలు, కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు. పాలు, నీళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పశువుల రక్త నమూనాలు సైతం సేకరించారు. కారణాలు బయటకొచ్చిన వెంటనే గణేష్‌తో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కాలనీల్లో వైద్య బృందాలు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. పాలు వినియోగించిన వారి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అధికారులు 18 బృందాలుగా విడిపోయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కల్తీ పాల బాధితులను, బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్లో పర్యటించి ఏం జరిగిందనే విషయంపై బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆరా తీశారు.మా ఇంట్లో ముగ్గురి పరిస్థితి విషమం మా ఇంట్లో నా తల్లి, తండ్రితో పాటు నా కుటుంబ సభ్యులు నలుగురికి కిడ్నీ విఫలమైంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శివరాత్రి నాడు మా పాల వ్యాపారి అందించిన పాలు తీసుకున్న తర్వాత ఈ అనర్థం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత అంటే.. ఈ నెల 22న అందరికీ మూత్రం ఆగిపోయింది. కుటుంబంలో అందరికీ ఒకే సమస్య రావడంతో ఆందోళనకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. – మధు, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంశరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి మా మనవరాలు నాలుగు రోజుల క్రితం పాలు తాగిన వెంటనే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆ పాల వ్యాపారికి మేం ఈ విషయం చెప్పాం. పాలు చేదుగా ఉన్నాయని తెలిపాం. కొత్తగా గేదె ఈనిందని, అందుకే పాల రుచిలో తేడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అతను పాలు పోసిన ఇళ్లలో కిడ్నీ బాధితులు బయటపడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నాం. మా మనవరాలిని ఆస్పత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. – షేక్ సిరాజుద్దీన్, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంమిగతా వారిలోనూ సమస్యలు రావొచ్చు ఈ నెల 14న రాత్రి మూత్ర సమస్యతో నా వద్దకు కొందరు వచ్చారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచినీటి సరఫరాపై అనుమానం కలిగింది. మంచినీటి సరఫరా బాగానే ఉందని మున్సిపల్ అధికారులు స్పష్టంచేయడంతో రోగులు తీసుకున్న ఆహారంపై ఆరా తీయగా పాలు తాగిన తర్వాత ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. ముందుగా బలహీనంగా ఉండే వృద్ధులు, చిన్నారులపై కల్తీ పాలు ప్రభావం చూపించాయి. మిగతా వారిలో కూడా భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అందుకే ఆ పాలు తాగిన వారందరూ కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శశాంక్, కిడ్నీ వ్యాధుల నిపుణుడు, రాజమహేంద్రవరంఅందని ప్రభుత్వ వైద్యంబాధితులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూత్ర విసర్జన స్తంభించడం, కిడ్నీ సమస్యలు, వాంతులు, విరేచనాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు మూడేళ్ల చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లగా తమవద్ద వైద్య సదుపాయాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు లబోదిబోమంటూ తిరిగి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే విధంగా మరో చిన్నారి రితిక్ చికిత్స కోసం ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.8.50 లక్షలకు పైగా ఖర్చయింది. మిగిలిన బాధితులకు సైతం వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. -
పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయి: సీఎం చంద్రబాబు
విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కారణంగా పలువురు మృతిచెందిన అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు. ఈ ఘటన కారణంగా నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. -
కల్తీ పాల మరణాలపై YS జగన్ రియాక్షన్
-
ఇప్పటి వరకూ ఐదుగురు మృతి.. కల్తీ పాలపై సంచలన నిజాలు బయట పెట్టిన పోలీసులు
-
కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం
-
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి
-
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు. ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.ల్యాబ్‌కు నమూనాలుకల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
యూరియాతో పాల తయారీ
-
పది శాతం పాలు, 90 శాతం కల్తీ
-
తెల్లనివన్నీ పాలు కాదు!
తెల్లనివన్నీ పాలు కాదు.. పాలు అనుకుని మనం తాగుతున్నవన్నీ అచ్చమైన పాలు కానే కాదు.. కుళాయి నీళ్ల నుంచి యూరియా, ఇతర రసాయనాల దాకా ఏవేవో కలిపిన కల్తీ పాలు.. నకిలీ పాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి.. పాడి పశువుల పెంపకం తగ్గిపోయి.. పాల ఉత్పత్తి పడిపోతోంది. నగరంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడుతోంది. దీనితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కి.. కల్తీ, నకిలీ పాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరమని అంచనా. ఇందులో 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నాయి. డెయిరీ రైతులు, డబ్బావాలాలు, ఇతర వ్యాపారులు నేరుగా మరో ఆరు లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో రెండు, మూడు లక్షల లీటర్ల మేర కల్తీ చేసినవో, కృత్రిమంగా తయారు చేసినవో ఉంటున్నాయని అంచనా. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, ముచ్చింతల్, పసుమాములలోని పలు ప్రైవేటు డెయిరీల నుంచి నమూనాలు సేకరించి.. పరిశీలించగా అక్రమాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాలు లేకపోవడంతో ఆయా డెయిరీల యజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. బీర్ దాణా » పాలకు డిమాండ్ నేపథ్యంలో కొందరు డెయిరీల నిర్వాహకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అడ్డగోలు మార్గం పడుతున్నారు. అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన ‘బీర్ దాణా’ తాగిస్తున్నారు. దీనికితోడు పాలలో పాలపొడి, కుళాయి నీళ్లు, రసాయనాలు కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఆ పాలు నాసిరకంగా, రుచి లేకుండా ఉంటున్నాయి. పెరుగు తోడుకోకపోవడం, తోడుకున్న పెరుగు కూడా సాయంత్రానికే దుర్వాసన వెదజల్లుతుండటం వంటివి జరుగుతున్నాయి. ఇదీ పాడి లెక్క » ఒకప్పుడు సిటీలో వాడే పాలలో చాలా వరకు శివారు జిల్లాల్లోని వ్యక్తిగత డెయిరీల నుంచే సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో 27,068 గోజాతి, 59,895 గేదె జాతి పశువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,88,182 గోజాతి, 1,22,587 గేదె జాతి పశువులు ఉన్నాయి.వీటిలో 1,25,246 ఆవులు, గేదెలు మాత్రమే పాలు ఇస్తున్నట్టు గుర్తించారు. వాటి నుంచి రోజుకు సగటున 5,56,055 లీటర్ల పాల దిగుబడి వస్తుండగా.. అందులో 43,688 లీటర్లు రైతులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. 97,998 లీటర్లు ప్రభుత్వ డెయిరీలకు విక్రయిస్తున్నారు. మరో 1,80,382 లీటర్ల పాలను స్వయంగా ఔట్లెట్లు తెరిచి విక్రయిస్తున్నారు.ఇంటింటా తిరిగి పాలు పోసే డబ్బావాలాలు మరో 1,27,965 లీటర్ల మేర అమ్ముతున్నారు. ప్రైవేటు డెయిరీలు 1,60,556 లీటర్లు విక్రయిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నగరానికి పాలు దిగుమతి అవుతున్నాయి.కృత్రిమంగా పాలు తయారు చేస్తూ.. »ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లికి చెందిన ఓ పాడి రైతు ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కృత్రిమంగా తయారు చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 120 లీటర్ల కృత్రిమ పాలు, పది పాల పౌడర్ ప్యాకెట్లను స్వా«దీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు.» పాశమైలారానికి చెందిన ఓ వ్యాపారి.. స్థానికంగా మూతపడ్డ ఓ పరిశ్రమను అద్దెకు తీసుకుని, గుట్టుగా కల్తీ పాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ డెయిరీ లేబుళ్లతో కల్తీ పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పాల స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..» స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడితే అందులో నీళ్లు కలిశాయని అర్థం.» లాక్టోమీటర్ సాయంతో పాలలోని కొవ్వు, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతం ఉన్నాయో గుర్తించవచ్చు.» పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి.. మూతపై నీటిలా ఏర్పడితే సరే. అలాకాకుండా స్పటికాల్లా ఏర్పడితే యూరియా కలిసి ఉండే చాన్స్ ఎక్కువ. » స్వచ్ఛమైన పాలను నున్నటి తలంపై వేస్తే.. అది పారినంత మేర తెల్లటి చార ఏర్పడుతుంది. అలా చార ఏర్పడకుంటే.. నీళ్లు ఎక్కువగా కలిసినట్టే.»వేడి చేసినప్పుడు పాలపై పసుపు రంగులో మీగడ ఏర్పడటం, పెరుగు సరిగా తోడుకోకపోవడం జరిగితే.. అందులో వనస్పతి కలిసి ఉన్నట్టే.»పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతుంటారు. అలాంటి పాలను మరిగించి, తోడు వేస్తే పెరుగు సరిగా ఏర్పడదు. అంతా నీళ్లలా కనిపిస్తుంది.పాలలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు.. » పాడి పశువుల సంఖ్య తగ్గి, పాలలో కల్తీ పెరిగింది. నీళ్లు కలిపితే పెద్దగా నష్టం లేదు. కానీ పాలు చిక్కగా కనిపించేందుకు కార్న్‌ఫ్లోర్.. వెన్నశాతం కోసం యూరియా, వనస్పతి వంటివి కలుపుతున్నారు. పాలు విరిగిపోకుండా ఉండేందుకు డిటర్జెంట్స్, తినే సోడా, అమ్మోనియం సల్ఫేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, రుచి మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు. అలాంటి పాలు తాగడం ప్రమాదకరం. అయోడిన్ సొల్యూషన్‌తో పాలను పరీక్షించడం ద్వారా పిండి పదార్థాలు కలిపారా? రెడ్ లిట్మస్ పేపర్ ద్వారా యూరియా కలిపారా గుర్తించొచ్చు. – ఎన్.రాజు, రసాయన శాస్త్రవేత్త ఆ పాలు తాగితే అనారోగ్యమే.. » కొందరు పాల విక్రేతలు, చిన్న డెయిరీల నిర్వాహకులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. ప్యాకెట్ పాలను నమ్మకుండా.. బయట కొనేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గం పడుతున్నారు. అపరిశుభ్ర పరిస్థితులతో.. వాటిలో ఈ–కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా మరిగించకుండా తాగితే రోగాల బారినపడటం ఖాయం. రసాయనాలు కలిపిన పాలు వాడితే అనారోగ్యమే. – డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి, సీనియర్ సర్జన్ (రిటైర్డ్) సబ్ స్టాండర్డ్ కేసులే.. » ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే పాలు, ప్యాకెట్ పాల నాణ్యతా ప్రమాణాలను తరచూ పరిశీలిస్తున్నాం. చాలా వరకు సబ్ స్టాండర్డ్ (వెన్నశాతం, నాణ్యతలో తేడాలు)గా గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో ఏమీ దొరకలేదు. ఇక కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. – ఉదయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా -
పాల కల్తీకి చెక్
సాక్షి, అమరావతి: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం రాష్ట్రంలో సహకార పాలడెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పాలల్లో ఉండే కొవ్వు, ఘనపదార్థాలు, నీళ్ల శాతమే కాదు.. ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి కల్తీ పదార్థాలనైనా పసిగట్టే అవకాశం రానుంది. రోజుకు 4.22కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి.. రాష్ట్రంలో 27లక్షల రైతుకుటుంబాల వద్ద 46లక్షల ఆవులు, 62లక్షల గేదెలున్నాయి. వాటి ద్వారా రోజుకు 4.22 కోట్ల లీటర్ల పాలఉత్పత్తి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.34 కోట్ల లీటర్ల పాల వినియోగమవుతుండగా, 2.88 కోట్ల లీటర్లు మార్కెట్‌కు వస్తున్నాయి. దాంట్లో 21.7 లక్షల లీటర్ల పాలను సహకార పాల డెయిరీలు సేకరిస్తుండగా, 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నాయి. 2.19 కోట్ల లీటర్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్‌కు వస్తున్నాయి. పాలల్లో ప్రధానంగా కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్) 4.7 శాతం, మాంసకృత్తులు(ప్రొటీన్స్) 3.3 శాతం, నీరు 88 శాతం ఉంటాయి. ఆవు పాలల్లో 69 కిలో కేలరీలు, గేదె పాలల్లో 100 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ప్రధానంగా గేదె పాలల్లో కొవ్వు 5.5శాతం, ఎస్ఎన్ఎఫ్ (ఘనపదార్థాలు) 8.7 శాతం, ఆవు పాలల్లో కొవ్వు 3.2 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.3 శాతం ఉంటే మంచి పోషక విలువలున్న పాలుగా పరిగణిస్తారు. కల్తీ లేని పాల సరఫరాయే లక్ష్యం ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. పాలల్లో ప్రధానంగా అమ్మోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్, మాల్టోస్, మెలమైన్, ఉప్పు, సోడియం కార్బోనేట్, సోడియం సిట్రేట్, సార్బిటాల్, స్టార్చ్, సుక్రోజ్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, ఫార్మాల్డిహైడ్ వంటి కల్తీ పదార్థాలను వాడుతుంటారు. ప్రస్తుతం పాలకేంద్రాల్లో ఉండే మిషనరీ ద్వారా పాలల్లో కొవ్వు, ఘనపదార్థాలు, నీటి శాతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీల బలోపేతం ప్రభుత్వ డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీలను బలోపేతం చేయడం ద్వారా కల్తీ పాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాలడెయిరీల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ.84లక్షల అంచనా వ్యయంతో పోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ (ఎఫ్టీఐఆర్) టెక్నాలజీ కలిగిన మిల్క్ ఎనలైజర్స్ (మిల్క్ స్కానర్స్)ను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.5.44 కోట్లు ఖర్చు చేసింది. వీటిద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఘన పదార్థాలు, ఎస్ఎన్ఎఫ్ వంటి వాటితో పాటు 24 పారామీటర్స్‌లో కల్తీ పదార్థాలుగా గుర్తించిన వాటి శాతాన్ని కూడా పసిగడుతుంది.కాగా, పాలసేకరణ, రవాణాలో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు వీలుగా పశుసంవర్ధక శాఖాధికారులకు అధికారాలిచ్చారు. ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాల శాంపిల్స్‌ను సేకరించి మిల్క్ ఎనలైజర్స్ ద్వారా కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. -
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
పాలకేంద్రం ముసుగులో కల్తీపాలు
ప్రకాశం, గుడ్లూరు: పాల కేంద్రం ముసుగులో కల్తీపాలు తయారు చేసి అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న యువకుడిని ఎస్ఐ సంపత్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్‌మీరా గురువారం వలపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి కల్తీ పాల పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో కలకలం రేపుతున్న ఈ సంఘటన రావూరులో వెలుగు చూసింది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిరియం ప్రభాకర్ పాలకేంద్రం నడుపుతున్నాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ఆరు నెలలు నుంచి ఇంట్లో కల్తీపాలు తయారు చేయడం ప్రారంభించాడు. కల్తీ పాలు తయారీకి అవసరమైన పాలపొడి, నూనె ప్యాకెట్లు, యూరియా, ఉప్పు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పశుపోషకుల వద్ద 30 లీటర్లు మంచి పాలు కొనుగోలు చేసి వాటికి తగిన మోతాదులో పాలపొడి, ఉప్పు, యూరియా, నూనె, నీళ్లు కలిపి 100 లీటర్లు చేస్తాడు. ఆ కల్తీపాలు కావలిలోని స్వీట్ దుకాణాలు, టీ షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇలా రోజుకు 200 లీటర్ల కల్తీపాలు తయారు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. కల్తీపాలు తయారీ సమచారం అందుకున్న ఎస్ఐ సంపత్‌కుమార్.. విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్‌మీరాకు చేరవేశారు. అనంతరం ఇద్దరూ తమ సిబ్బందితో కలిసి రావూరులో ప్రభాకర్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన 200 లీటర్ల కల్తీపాలు, 11 బస్తాల పాలపొడి, 250 ప్యాకెట్ల ప్రీఢం సన్‌ప్లవర్ ఆయిల్, యూరియా బస్తాలు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ నాగూర్‌మీరా మాట్లాడుతూ కల్తీపాలను ప్రమాదకర కెమికల్స్‌ను ఉపయోగించి తయారు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కల్తీ పాలు ఉపయోగిస్తే కా>్యన్సర్‌తో పాటు ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కల్తీపాలు గృహాలకు కాకుండా స్వీట్, టి. దుకాణాలకు మాత్రమే సరఫరా చేయడంతో వారు పెద్దగా తనిఖీలు చేయరని భావించి ప్రభాకర్ ఈ మార్గాన్ని ప్రభాకర్ ఎన్నుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు రైటర్ డానియేలు, పోలీస్ సిబ్బంది ఖాదర్‌బాషా, కృష్ణ, శ్రీనివాసులు ఉన్నారు. -
కల్తీ పాల వ్యవహారంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: కల్తీ పాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికతో సాక్షి పత్రికలో గత ఏడాది డిసెంబర్ 12న ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) పరిగణనలోకి తీసుకుంది. సాక్షి కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన పాఠకుడు కె.నర్సింహారావు లేఖ రూపంలో కల్తీ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ వ్యాజ్యంలో పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఎండీ, ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 30న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గ్రేటర్ హైదరాబాద్‌లో సాక్షి బృందం పర్యటించి పలు కంపెనీల పాల ప్యాకెట్ల శాంపిల్స్‌ను సేకరించింది. వాటిని నాచారంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించింది. ఈ పాలు హానికరమని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను పాలల్లో కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది. ‘ఇలాంటి పాలను వినియోగిస్తే టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్.. వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది’అని సాక్షి కథనంలో వచ్చిన అంశాలను పిటిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు
- దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాలకేంద్రంపై సోమవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 లీటర్ల పాలు, 3 పాల ప్యాకెట్లు, ఖాళీ పాల ప్యాకెట్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీపాల దందా గుట్టురట్టు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ కంపెనీల పాలను కల్తీ చేసి... రీ-ప్యాకింగ్‌తో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నిర్వహిస్తున్న నిందితుడి నుంచి ప్యాకింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన డి.అమృతలాల్ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నేరేడ్మెట్లోని సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఐదేళ్లుగా హెరిటేజ్ పాల కంపెనీకి డిస్ట్రిబూటర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను కొని టీస్టాల్స్, హోటల్స్‌తో పాటు కొన్ని ఇళ్లల్లోనూ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే పాలను నీళ్లతో కల్తీ చేసి, మళ్లీ రీ-ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టాడు. కల్తీ తంతు ఇదీ... అమృత్లాల్ టీ స్టాల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తుంటాడు. రోజూ తెల్లవారుజామున మూడున్నరకల్లా హెరిటేజ్ కంపెనీ నుంచి ఇతడికి 300 నుంచి 400 లీటర్ల పాల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లను అనుమానం రాకుండా కత్తిరించి, పాలను టబ్‌లో పోస్తాడు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 100 లీటర్లకు పైగా నీళ్లు కలుపుతాడు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేకపోతే... ఒక్కోసారి కలుషిత నీటినే వాడేసేవాడు. ఆ పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలో నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ చేస్తాడు. ఆ ప్యాకెట్లను హోటళ్లు, టీ స్టాళ్లు, ఇళ్లకు బట్వాడా చేయిస్తున్నాడు. సేకరించిన ఖాళీ పాల ప్యాకెట్లలో కొన్ని పాతవి ఉంటే వాటిపై ఉన్న తయారీ తేదీని థిన్నర్ సాయంతో తుడిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం దాడి చేసి అమృత్లాల్ను పట్టుకున్నారు. దాడి సమయంలో 237 పాల ప్యాకెట్లతో పాటు రెండు ప్యాకింగ్ మిషన్లు, మూడు థిన్నర్ బాటిళ్లు, వివిధ కంపెనీలకు చెందిన 100 ఖాళీ పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహాలో గతంలోనూ నగర శివార్లలో యూరియా, మంచినూనె కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠానూ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్యాకెట్ల సైజ్ కాస్త చిన్నగా ఉంటుందని, ప్యాకెట్లలో ఖాళీస్థలం తక్కువగా ఉంటుందని, ప్యాకె ట్లపై తయారీ తేదీ చెరిపేసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాకెట్లను అనుమానించాలని, వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు విని యోగదారులకు సూచిస్తున్నారు. -
కల్తీపాల తయారీ ముఠా గుట్టురట్టు
ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. కల్తీ పాలను తయారు చేస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న పంచదార, మంచినూనె, సర్పు పొడి, ఉప్పు, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
కఠిన శిక్షలతోనే కల్తీకి కట్టడి
న్యూఢిల్లీ: ఆహార కల్తీదారులకు కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప కల్తీ బెడదను అరికట్టలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడటంతో నగరంలో కల్తీ పాల విక్రయం మరోమారు చర్చనీయాంశమైంది. చిన్నపిల్లలు కూడా ఆహారంగా తీసుకునే పాలవంటి వాటిని కల్తీ చేసేవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం సమంజసమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆహార భద్రత-ప్రమాణాల చట్టానికి తగిన సవరణలను చేయాలని సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ నాణ్యమైన పాల సరఫరా, పాల ఉత్పత్తులు పౌరులకు లభించగలవా అన్న ప్రశ్న తలెత్తుతోంది.‘‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో అనేక లొసుగులున్నాయి. నిజానికి ఈ చట్టం ఇప్పటికీ కల్తీదారులకు అనుకూలంగా ఉంది. ఇందులోని లొసుగుల ఆధారంగా నేరం చేసిన వారు సులభంగా బయటపడుతున్నారు’’ అని ఆహార కల్తీ నిరోధక విభాగం డైరక్టరేట్ తరఫున వాదించిన మాజీ ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి మాట్లాడుతూ ‘‘పాలు లేదా మరే ఇతర ఆహార పదార్థంలోనూ కల్తీ జరిగిందని నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ల్యాబరేటరీల్లో రూపొందే తుది నివేదికలను మార్చడం చాలా సులభం. వ్యాపారులు లేదా నిందితులు లంచాల ద్వారా నివేదికలను తేలికగా మార్చుకొనే అవకాశం ఉంది. ఒక వేళ అక్కడ తప్పని పరిస్థితిలో ఏ అధికారైనా అనుకూల నివేదిక ఇవ్వడానికి అంగీకరించని పక్షంలో కోర్టుల్లో కొద్దిపాటి జరిమానాలు చెల్లించి దర్జాగా బయటపడగలుగుతారు’’ అని వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాతీయ రాజధానిలో పాల కల్తీని గురించి మాట్లాడుతూ ‘‘జాతీయ రాజధాని పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడి తన అవసరాలను తీర్చుకుంటుంది. రోజువారీ అవసరాలకే కాకుండా నిత్యం జరిగే భారీ వేడుకలకు భారీ మొత్తంలో పాలు అవసరమౌతాయి. ఇంత భారీ డిమాండ్‌ను తీర్చడం ఎలా? అందుకే నగరంలో పాల వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పాలను కల్తీ చేసి ఈ భారీ డిమాండ్‌ను పూరిస్తున్నారు’’ అని వివరించారు. గ్వాలగద్దీ (పాల ఉత్పత్తిదారుల సంఘం) జాతీయ అధ్యక్షుడు మోహన్ సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ ‘‘పాల కల్తీకి పాల్పడేది ఉత్పత్తిదారులు కాదు. స్థానిక పాల పంపిణీదారులు, చిల్లర వ్యాపారులే దీనికి ఎక్కువ బాధ్యులు. జాతీయ రాజధానితో పాటు ప్రాదేశిక ప్రాంత నగరాలు నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్‌లలో తొంబై శాతం పాలు, పెరుగు, జున్ను కల్తీవే అన్నది నిజం’’ అని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తుల వ్యాపార కేంద్రాలైన ఆజాద్‌పూర్ మండీ, తిలక్మార్కెట్లను గురించి మాట్లాడుతూ ‘‘మండీలో వ్యాపారిని పన్నీర్ అడగండి. వెంటనే నంబర్ 1 కావాలా? దో నంబర్ చలేగా? అని ప్రశ్నిస్తాడు. తిలక్మార్కెట్లోనూ ఇదే వరుస. ఇక్కడ పాలను తెల్లటి పాలరాతి పొడితో కల్తీ చేస్తారు. స్థానిక బ్రాండుల పాల ఉత్పత్తుల్లో కల్తీ ఎక్కువ’’ అని వివరించారు. ఇక క ల్తీ ఇంత విచ్చలవిడిగా జరగడానికి ఆహార కల్తీ నిరోధక విభాగం ఫుడ్ ఇన్స్పెక్టర్లే ప్రధాన కారణం అని ఆయన ఆరోపించారు. ‘‘యావజ్జీవ కారాగార శిక్షలను గురించి సానుకూలంగా స్పందించే ముందు ప్రభుత్వం ముందుగా ఈ ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ప్రజల ప్రాణాలను బలి ఇవ్వడానికి సిద్ధమయి వారి బ్యాంక్ ఖాతాలను భర్తీ చేసుకుంటున్నారు’’ అని మోహన్‌సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. నగరంలో పాల కల్తీని గురించి ఢిల్లీ మిల్క్ స్కీమ్ జనరల్ మేనేజర్ డాక్టర్ బీఎల్ బేణివాల్ మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో కల్తీ పాలు అనేది పెద్ద సమస్యకాదు. ప్రజలు కచ్చితంగా నాణ్యమైన పాలను ఎంపిక చేసుకుంటున్నారు’’ అని సెలవిచ్చారు. ఢిల్లీ మిల్క్ స్కీమ్ పూర్తిగా పొరుగు రాష్ట్రాల స్టేట్ డెయిరీ ఫెడరేషన్ల మీద ఆధారపడి నడుస్తోంది. కో-ఆపరేటివ్ సొసైటీలు సరఫరాను పెంచుతున్నాయి. అయితే ఇది ఢిల్లీ పాల వినియోగంలో కేవలం ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ‘‘కొన్ని సొసైటీలు సరఫరా చేసిన పాలు నాణ్యతాప్రమాణాలకు సరితూగక పోవడంతో తిరస్కరించాము. అవన్నీ కల్తీ జరిగినట్లు కాదు. పోషకాలు తక్కువ స్థాయిలో ఉన్నవాటిని కూడా నాన్ కన్ఫార్మింగ్ శాంపుల్‌గా ప్రకటిస్తాము. కొన్నిసార్లు ఇవి తాజా పాలు కాకపోవచ్చు. మరికొన్నిసార్లు వీటిలో తగిన స్థాయిలో పోషకాలు ఉండకపోవచ్చు. అయితే ఏదిఏమైనా కల్తీవ్యాపారులు చట్టానికి తూట్లు పొడవడంలో సమర్థులు’’ అని తెలిపారు.


