సాక్షి,తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన జయకృష్ణ గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడాడు. ఈ క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జయ కృష్ణ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడి మరణంలో న్యాయం చేయాలని కోరుతున్నారు.


