న్యూస్‌రీల్
తూతూమంత్రంగా పనులు
అసంపూర్తిగా వదిలేశారు
నిలకడ లేని కోకో ధర
కోకో రైతుకు కడగండ్లు తప్పడం లేదు. ఏడాది పొడవునా పంట పండించే అవకాశం ఉండటం, ధర స్థిరంగా లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. IIలో u
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
గత అక్టోబరు చివరిలో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన మోంథా కథ తెలిసిందే. ఆచంట మండలంలో 2.3 సెం.మీ అత్యధిక వర్షం కురవగా పాలకోడేరులో 4.8 మి.మీ అత్యల్ప వర్షం కురిసింది. డ్రెయిన్లు పూడికతో నిండి ఉండటంతో తుఫానుకు ముందు, తర్వాతి రోజుల్లో కురిసిన వర్షాలు తొలకరి పంటను ముంచేశాయి. రోజులు తరబడి పొలాల్లోని ముంపునీరు లాగక జిల్లాలోని 20,174 మంది రైతులు 22 వేల ఎకరాల్లోని పంటను నష్టపోయారు. ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి రైతులకు ఇంకా పంట నష్టపరిహారం అందలేదు.
జిల్లా డ్రెయిన్ల పూడికతీత 2025–26 సంవత్సరంలో తూతూమంత్రంగా చేయడంతో రైతులు ముంపు నీరు లాగక తీవ్రంగా నష్టపోయారు. నీటి సంఘాల మాటున కూటమి నేతలు ఈ పనులు దక్కించుకుని అరకొరగా మమ అనిపించారు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆ పనులకు బిల్లులు పెట్టుకునే పనిలో ఉన్నారు. పూడిక సరిగా తీయక వర్షాలకు పంటకు నష్టం వాటిల్లిందని, అధికారులు క్షేత్ర స్థాయిలో డ్రెయిన్ల నిర్వహణపై వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు సబ్ డివిజన్లలో బొండాడ, గునుపూడి సౌత్, గొంతేరు, భగ్గేశ్వరం, మొగల్తూరు కాజా, రుద్రయ్య కోడు తదితర 294 కిలోమీటర్లు పొడవున 13 మేజర్ డ్రెయిన్లు ఉన్నాయి. 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం డ్రెయిన్లు, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. 2025–26లో వీటి నిర్వహణకు రూ.11.28 కోట్ల విలువైన 265 పనులు మంజూరయ్యాయి. పూడికతీత, షట్టర్ల మరమ్మతులకు సంబంధిచి 61 పనులు కాగా మిగిలినవి గుర్రపుడెక్క, కిక్కిస తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు ఏడాదిపాటు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటిసంఘాల మాటున నామినేషనన్ పద్ధతిపై కూటమికి చెందిన వారు పనులు చేజిక్కించుకున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఆయా పనులు చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారు. ఆ ప్రభావం తొలకరి పంటపై పడింది. డ్రెయిన్ల నిర్వహణ అంతంతమాత్రమేనని రైతులు అంటున్నారు. అక్కడక్కడ మందులు పిచికారి చేసి, తూతూమంత్రంగా తూడు తొలగించి తంతు నడిపించారని చెబుతున్నారు. డ్రైయిన్లలో పూడిక సరిగా తీయక తొలకరి చివరిలో కురిసిన వర్షాలకు పంటకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపునీటి ప్రవాహానికి ఆటంకం కలుగకుండా డ్రెయిన్ల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
2025–26లో డ్రెయిన్లలో పూడికతీత, తూడు తొలగింపునకు రూ. 11.28 కోట్లు
నీటి సంఘాల మాటున కూటమి నేతలకు పనులు
తూతూమంత్రంగా డ్రెయిన్ల నిర్వహణ
ముంపు నీరు లాగక ఖరీఫ్‌లో 23 వేల ఎకరాల్లో పంట నష్టం
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి వద్ద గొంతేరు డ్రెయిన్ పాత కాలువలో సుమారు రూ. 2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో పూడికతీత పనులు చేపట్టారు. కొత్తకాలువ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు కిలోమీటరు మేర 72 మీటర్లు వెడల్పు, 1.7 మీటర్లు లోతున పాత కాలువను అభివృద్ధి చేయాలి. ఈ మేరకు కొద్ది నెలల క్రితం పూడికతీత, డ్రెడ్జింగ్ పనులు చేశారు. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కాలువ కుడి, ఎడమ గట్ల సమీపంలో కొంతమేర డ్రెడ్జింగ్, మధ్యలో దిబ్బలు సరిచేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో మరలా సామగ్రి తెచ్చి పనులు చేస్తున్నారన్నారు. పాత కాలువ, కొత్త కాలువకు మధ్య 20 మంది వరకు రైతులు పట్టా భూముల్లో చెరువులు సాగు చేసుకుంటున్నారని, కాలువలో డ్రెడ్జింగ్ చేయగా వచ్చిన మట్టితో చెరువులు పూడుస్తామని చెప్పి అసంపూర్తిగా వదిలేశారంటున్నారు. కాగా పనులు పూర్తయ్యాయని, విజయవాడ నుంచి వచ్చిన పరిశీలన బృందం సంతృప్తి వ్యక్తంచేశారని, బిల్లులు చెల్లించేందుకు సిద్ధం చేస్తున్నట్టు డ్రైనేజీ అధికారులు చెబుతున్నారు.
డ్రెయిన్లలో పూడికతీత పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. వేసవిలో గుర్రపుడెక్క తొలగింపు కోసం మందులు పిచికారి చేసి చేతులు దులుపుకుంటున్నారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి నెట్టేస్తున్నారు. ఏటా చినకాపవరం డ్రెయిన్ ముంపుతో వందల ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లుతోంది. – మల్లారెడ్డి శేషమోహనరావు,
భారతీయ కిసాన్ సంఘ్ గౌరవ సలహాదారు
పాత కాలువకు అవతల 50 సెంట్ల పట్టా చెరువును సాగు చేసుకుంటున్నాను. కాలువలో వచ్చిన మట్టిని చెరువులోకి తోడతామన్నారు. సగం మాత్రమే చెరువు పూడ్చి మిగిలింది వదిలివేయడంతో అటు సాగుకు ఇటు మొక్కలు వేసుకోవడానికి పనికిరాకుండా ఉంది.
– కె. వెంకటేశ్వర్లు, రైతు, ముత్యాలపల్లి


