breaking news
West Godavari District Latest News
-
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాఽథ్ సాక్షి, భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సిద్ధం కా వాలని రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ప్రతి స్థానంలో అభ్యర్థులు పోటీ లో ఉండాలని సూచించారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త మంతెన యోగీంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం స్థానిక కోట్ల ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యా ణి, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, ఏలూరు, చింతలపూడి కోఆర్డినేటర్లు వడ్డి రఘురాంనాయుడు, చినమిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరావు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు తదితరులు హాజరయ్యారు. కుట్రలను తిప్పికొడదాం ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతారని వాటన్నింటిని సమర్థవంతంగా అడ్డుకోవాలన్నారు. ఎవరికి భయపడాల్సిన పనిలేదని శ్రేణులకు జగన్, పార్టీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జగన్ చేపట్టనున్న పాదయాత్ర కూటమికి అంతిమయాత్ర అవుతుందన్నారు. ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని స్కీమ్ ఆంధ్రప్రదేశ్‌గా చేస్తే చంద్రబాబు స్కామ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం ఖాయమన్నారు. కూటమిది దుర్మార్గపు పాలన జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, అధికార కూ టమికి ధనబలం, పోలీస్బలం, మద్యం బలం అ న్నీ ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజాబలం ఉందని, జగన్ పథకాలతో లబ్ధి పొందిన వారంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారన్నారు. కార్యకర్తలే బలం : మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని భారీ సంఖ్యలో తరలివచ్చిన క్యాడర్ నిదర్శనమన్నారు. గతంలో ఇన్చార్జిగా పనిచేసిన నేత ఇటీవల పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట వెళ్లలేదన్నారు. గుణపాఠం తప్పదు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కూటమి నిర్లక్ష్యంతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ కవురు మాట్లాడుతూ సూపర్‌సిక్స్ అని చెప్పి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్ రఘురాంనాయుడు మా ట్లాడుతూ ఉండిలో క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉన్నారని, యోగీంద్రబాబు సారథ్యంలో వైఎస్సార్సీపీ ఘన విజయం ఖాయమన్నారు. క్యాడర్‌కు గుర్తింపు : వైఎస్సార్సీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని నియోజకవర్గ కో–ఆర్డినేటర్ యోగీంద్రబాబు అన్నారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం పట్ల జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. క్యాడర్ సహకారంతో టీడీపీ కంచుకోటను కూలుస్తామన్నారు. పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం యోగీంద్రబాబు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ని యమితులయ్యాక మొదటిసారిగా ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశం సూపర్ సక్సెస్ కావడం కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సమావేశానికి తరలివచ్చారు. పార్టీ అ నుబంధ విభాగాల రాష్ట్ర నేతలు పాతపాటి శ్రీనివాస రాజు, పెండ్ర వీరన్న, యాండ్ర వీరాాస్వామి, కోడే యుగంధర్, పేరిచర్ల విజయనరసింహరాజు, మేడిద జాన్సన్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జామి హైమావతి, అంబటి సురేష్, గొర్రుముచ్చు సుందర్‌కుమార్, ఎస్సీ సెల్ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ పాల్గొన్నారు. ఉండిలో సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు, మాట్లాడుతున్న రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్. చిత్రంలో ఎమ్మెల్సీలు కళ్యాణి, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, సమన్వయకర్తలు రఘురాం, వెంకటరాయుడు, యోగీంద్రబాబు విస్తృతస్థాయి సమావేశం వేదికగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు సంధించారు. ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు తన సొంత కానిస్టేన్సీలో ఉండరు కాని ఎప్పుడు కాంట్రవర్సీల్లో ఉంటారన్నారు. రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తుంటారని, ఎమ్మెల్యేలు ఎవరైనా పేదలకు ఇళ్లు కట్టిస్తే ఈయన మాత్రం పేదల ఇళ్లు కూలగొడుతుంటారన్నారు. అమర్నాథ్ మా ట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ఎంపీ సీటు రా కపోవడంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీటు తె చ్చుకుని ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేసి డిప్యూటీ స్పీ కర్ అయ్యారన్నారు. ఎక్కడో ఉంటూ రాజకీ యాలు చేసే నాయకుల్ని తరమికొట్టాలన్నారు. -
యజమాని ఇంట్లో చోరీ
డ్రైవర్ అరెస్ట్ ఫిలింనగర్ : పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన డ్రైవర్‌ను ఫిలింనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన గామిడి శ్రీనివాసరావు (55) ఫిలింనగర్ రోడ్ నం. 7లో నివసించే రామచంద్ర వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు, యజమాని ఇంట్లోని ఖరీదైన, పురాతన ఇత్తడి పాత్రలను క్రమంగా దొంగిలించడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన యజమాని ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. తణుకు అర్బన్/తాడికొండ: చిట్టీల పేరుతో ఖాతాదారులను మోసం చేసి పరారైన తణుకుకు చెందిన చిట్స్ అండ్ ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావును విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 63 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గతేడాది ఆగస్టులో తణుకు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి శ్రీనివాసరావు కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితులకు డబ్బులు తిరిగి చెల్లిస్తానని సంకేతాలు పంపుతూనే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. బాధితుల ఆందోళన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తణుకు ప్రాంతానికి చెందిన బాధితులు హైకోర్టు వద్దకు చేరుకుని నిరసన తెలపగా, కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో విజయవాడలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తణుకుకు తరలించారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తణుకు పట్టణ సీఐ జేవీ రమణ తెలిపారు. -
‘చంద్ర’ నాటకానికి చెంపపెట్టు
ఏలూరు టౌన్: సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు కుట్రపూరిత రాజకీయానికి చెంపపెట్టుగా భావించాలనీ వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు, మరోసారి మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందనీ.. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమని రుజువైందన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబుకు రాజ్యాంగ నిబంధనలు తెలియవా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు చేసిన ‘చంద్ర’ నాటకాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారని, అప్పుడైనా వారికి బీసీ రిజర్వేషన్లపై వినతిపత్రం ఇచ్చారా? వారికి నచ్చజెప్పి షెడ్యూల్ 9లో చేర్చేలా కృషి చేస్తే బీసీ సంఘాలు హర్షించేవన్నారు. అయితే కోర్టు తీర్పు పేరుతో బీసీలను మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. -
దక్షిణ భారత బ్యాడ్మింటన్ పోటీలకు మోహన్సాయి
భీమవరం : దక్షిణ భారత స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం డీఎన్నార్ కళాశాల విద్యార్థి బి. మోహన్సాయి ఎంపికై నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ బీవీఎస్ వర్మ తెలిపారు. శుక్రవారం మోహన్సాయిని కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్టీయూకే అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలలో మోహన్సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె. ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: రాష్ట్ర అంతర్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 అండర్–14 విభాగం జావెలిన్ త్రోలో తణుకు మాంటిస్సోరీ స్కూలు విద్యార్థిని ఐ.అశ్రిత రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు తెలిపారు. ఈ నెల 3న ఆదోనిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన అశ్రిత, ఈ నెల 23, 24 తేదీల్లో చెన్నైలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. -
‘పశ్చిమ’లో పులి కలకలం
● ఉదయం జిల్లా దాటి, రాత్రి సమయానికి మళ్లీ జిల్లాకు వచ్చిన వైనం ● పులి సంచారంతో ఉలిక్కిపడిన గూడెం గ్రామాలు తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో పులి సంచార ఆనవాళ్లు కనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం వేకువజామున పొలాలకు వెళ్లిన రైతులు, ఆరుళ్ల వంతెన ఎదురుగా రోడ్డు దాటి వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లిన పులి పాదముద్రలను గమనించి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. రిటైర్డ్ అటవీశాఖాధికారి చలపతిరాజు సహాయంతో పోలీసులు భీమవరం డీఎఫ్‌ఓకు ఫోటోలు పంపి అవి పులి ఆనవాళ్లేనని నిర్ధారించారు. వెంటనే డ్రోన్ టీమ్‌ను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లవద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధి కారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఎర్రకాలువ పరీవాహక ప్రాంతం మీదుగా ప్రయాణం? అటవీ ప్రాంతం కాని ఇక్కడికి పులి ఎలా వచ్చిందనే విషయంపై విస్తృత చర్చ సాగుతుంది. ఎర్రకాల్వ పరీవాహక ప్రాంతం మీదుగా తాడేపల్లిగూడెం మండలం, అక్కడి నుంచి వేరే జిల్లాకు వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం మీదుగా నల్లజర్ల మండలం అనంతపల్లి, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం మండలం మాధవరంలోని కంసాలిపాలెం వంతెన వరకు, కంసాలిపాలెం దాటిన తర్వాత మారంపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వే వంతెన కిందుగా ఆరుళ్ల వంటి ప్రాంతానికి చేరుకునే వీలుంటుందని ఈ ప్రాంతం గురించి తెలిసిన అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే కాల్దరి రోడ్డుపై పులి దాటుతున్నట్టు ఫొటో ఒకటి వచ్చింది. అది ఏఐనా, వాస్తవమే అని నిర్ధారించుకోవాల్సి ఉంది. భీమవరం డీఎఫ్ఓ చెప్పిన వివరాల ప్రకారం పులికి అమర్చిన జీపీఎస్ ద్వారా ప్రస్తుతం పులి కాల్దరికి మూడు కిలోమీటర్ల సమీపంలోని పసలపూడి వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నట్టు తెలిపారు. అయితే రాత్రి సమయానికి నందమూరు పరిసర ప్రాంతాల్లోని పొలాలకు చేరుకుందని వివరించారు. పులిని బంధించేందుకు పూణే నుంచి నిపుణులు శనివారం చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు. -
మధ్యవర్తిత్వంలో మెలకువలు తెలుసుకోవాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ట్రైనీ మీడియేటర్లు మధ్యవర్తిత్వంలో మరిన్ని మెలకువలు తెలుసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి సూచించారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ట్రైనీ మీడియేటర్లకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రిఫరల్ న్యాయమూర్తులకు, అనంతరం 102 ట్రైనీ మీడియేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 3.0 మధ్యవర్తిత్వ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మీడియేటర్లకు మరింత నైపుణ్యం పెంపొందించడం ద్వారా కేసుల పరిష్కారం మరింత సులభతరం అవుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్స్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, ఎంసీపీసీ, చైన్నెకు చెందిన మాస్టర్ ట్రైనర్ సుదర్శన్ సుందర్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనే సీతారాం పాల్గొన్నారు. -
చైర్మన్ పీఠముడి
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో రిజర్వేషన్ల పోరు తారాస్థాయికి చేరింది. నోటిఫికేషన్ రానున్న క్రమంలో ప్రజాప్రతినిధులు పంచాయితీలను ముమ్మరంగా సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 ఏళ్ల తర్వాత నాలుగు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్నింటినీ జనరల్ చేయాలని తెలుగుదేశం నేతలు పట్టుపడుతుంటే.. మరోవైపు తమ స్థానాల సంగతి తేల్చాలి అంటూ జనసేన నేతలు హడావుడి చేస్తున్నారు. మరోవైపు సామాజిక వర్గాల వారీగా ఆశావహులను ముందుకు నెట్టి రాజకీయం ప్రారంభించారు. ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాకు తెరదీసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది.శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2026సాధారణంగా రిజర్వేషన్ ప్రక్రియ, డివిజన్లు, వార్డుల పెంపును ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రోస్టర్ ప్రకారం ఖరారు చేస్తారు. అయితే ఇవేమీ కాకుండా ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారనే అభియోగాలు లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీ మవరం మున్సిపాల్టీలకు 2014 తర్వాత ఎన్నిక లు జరగలేదు. 2019తో పాలకవర్గం ముగియ గా కోర్టు కేసులు, విలీన గ్రామాల వ్యవహారాలు ఇలా పలు కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. తాజాగా అన్ని మున్సిపాల్టీల్లో వా ర్డుల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా రో స్టర్ నిబంధనలు పాటిస్తూ రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీలు, చింతలపూడి నగర పంచాయతీ, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ము న్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధిక స్థానాలను అటు జ నసేన, ఇటు టీడీపీ నేతలు జనరల్ చేయాలని ప్ర జాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ప్ర త్యక్ష ఎన్నికలు కావడంతో జనరల్ చేస్తే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థే సింహభాగం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తద్వారా తమపై ఆర్థిక భారం తగ్గుతుందనే యోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకరిద్దరు మాత్రం జనరల్‌కు కేటాయిస్తే భవిష్యత్‌లో తమ ప్రాబల్యం తగ్గడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయలేమని, బీసీ–మహిళ, ఎస్సీ–జనరల్ చేస్తే తక్కువ ఖర్చులో ఎన్నికలు ముగించవచ్చునే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రోస్టర్ నిబంధనల అమలుపై అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతలకు షాక్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల డ్రామాకు తెరలేపిన కూటమి ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో షాక్ తగిలింది. హడావుడిగా 34 శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ జారీ చేసిన జీఓను హైకోర్టులో కొట్టేయగానే సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలను ఆకట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా అత్యధిక స్థానాలు మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు బీసీలకు ఇవ్వాలనే బలమైన డిమాండ్ మొదలైన క్రమంలో పార్టీ ముఖ్యులు దానికి భిన్నంగా జనరల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీలతో పాటు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఓట్లు దండుకుని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇకపై బీసీలెవరూ చంద్రబాబు మాయమాటలు నమ్మరు. – కొండేటి శివకుమార్, వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ‘రిజర్వేషన్’ పోరు జనరల్ స్థానాల కోసం నేతల పట్టు బీసీలకు ఇవ్వాలంటున్న మరో వర్గం కూటమిలో కలకలం రోస్టర్ నిబంధనల అమలుపై అనుమానాలు -
మహిళలకు రక్షణ కరువు
ఉండి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉండిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేధింపులపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. టీడీపీ మంత్రి టీజీ భరత్ భూవివాదానికి సంబంధించి ఆమెను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వద్దకు పంపించారన్నారు. సమస్య పరిష్కరించకపోగా తీవ్ర వేధింపులకు గురిచేయడంతో ఆమె డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతుండటం సిగ్గుచే టని ముఖ్యమంత్రి, హోంమంత్రి తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. మంత్రి సిఫార్సుతో వెళ్లిన మహిళకే రక్షణ లేకుంటే సామన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి మహిళల రక్షణ కోసం చాలా కబుర్లు చెబుతున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేపై ఎ లాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరైనా మహిళను వేధిస్తే వారికదే చివరిరోజు అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చెబుతున్నారు కదా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకి చివరి రోజు చేయగలరా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఏమైందని ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సుమోటోగా కేసు తీసుకుని ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు కళ్యాణి -
ప్రతి స్థానంలోనూ అభ్యర్థిని నిలబెడతాం
వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్ తణుకు అర్బన్: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, క్యాడర్ అంతా సిద్ధంగా ఉందని రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్ అన్నారు. ప్రతి సీటులోనూ గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం 2000–2001లో మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేశారని, మరలా ఇప్పుడే వెళుతున్నారన్నారు. బీసీ ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్ అంటూ నాటకం ఆడారని, సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేస్తారని తెలిసి కూడా కోర్టుకు వెళ్లినట్టుగా చూపించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితుల్లో బీసీలపై మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతోపాటు స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక ఎన్నికలు కీలకమేనని అందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగానే ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఇ బ్బందులు ఉన్నా స్థానిక ఎన్నికలకు వెళ్లి 95 శాతం విజయం సాధించామని గుర్తుచేశారు. కారుమూరి అరెస్టు అక్రమం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్కుమార్లను అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపారని అమర్నాథ్ మండిపడ్డారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు బనాయించడం చంద్రబాబు అండ్ కోకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కారుమూరి జైలులో ఉన్నా తణుకు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ బలంగా ఉండటం శుభపరిణామమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు నాగు, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్‌సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపికృష్ణ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆలయ రాజగోపురాలు, ఆళ్వార్ల మండపాలు, అనివెట్టి మండపాలతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలంకరణ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, గుడి సెంటర్లో స్వామివారి 40 అడుగుల భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇలా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ఉదయం స్వామివారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలను చేస్తారు. 22న అంకురార్పణ, ధ్వజారోహణం, 24న ఎదుర్కోలు ఉత్సవం, 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 21 నుంచి 28 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
గీత కార్మికులు బుద్ధి చెబుతారు
భీమవరం : గీత కార్మికులను మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహామూర్తి హెచ్చరించారు. శుక్రవారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బతుకు పోరాట గర్జన పేరిట భీమవరం పట్టణంలో మోకులు, కల్లు కుండలతో భారీ ప్రదర్శన నిర్వహించి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గీత వృత్తిని కాపాడాలని, బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట రోడ్డుపై కల్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు షాపుల వల్ల గీత కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కర్ణాటక తరహాలోనే హోటళ్లు, బార్లలో కల్లు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు గుర్తింపు కార్డులు, పింఛన్ మంజూరు చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి బి.సుబ్బారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బొక్కా చంటి, కడలి పాండు, మామిడిశెట్టి నాగభూషణం, బొంతు శ్రీనివాస్, దాసరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ రికార్డుల రగడ
జంగారెడ్డిగూడెం(చింతలపూడి) : పంచాయతీ రికార్డుల నిర్వహణ, అభివృద్ధి నిధుల వ్యయంపై తలెత్తిన వివాదం దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. దేవులపల్లి పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, పొరుగునే ఉన్న పుట్లగట్లగూడెం పంచాయతీ కార్యాలయానికి గ్రామస్థులు తాళం వేయడం సంచలనంగా మారింది. ప్రస్తుత పుట్లగట్లగూడెం కార్యదర్శి బాపూజీ, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు దేవులపల్లి పంచాయతీకి ఇన్చార్జ్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు సీసీ రోడ్లు, మూడు డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో రూ. 12 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని, సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీని ప్రభావంతో తమ పంచాయతీ (పుట్లగట్లగూడెం) రికార్డులు కూడా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. కార్యదర్శి గదికి తాళం శుక్రవారం ఉదయం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు దాదాపు 100 మందికి పైగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని రికార్డులు, ఎం–బుక్స్ చూపించాలని కార్యదర్శిని డిమాండ్ చేశారు. కార్యదర్శి కొన్ని రికార్డులు చూపించి, అత్యవసర పనిపై బయటకు వెళ్లడంతో రికార్డులు మార్చేస్తారనే అనుమానంతో గ్రామస్తులు ఆయన గదికి బయట నుంచి తాళం వేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే రికార్డులను పరిశీలించాలని పట్టుబట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కార్యదర్శి బాపూజీ ఖండించారు. దేవులపల్లిలో అప్పటి సర్పంచ్ సమక్షంలో, తీర్మానం ప్రకారమే పనులు ప్రతిపాదించామన్నారు. పనుల బిల్లులు ఇంకా సమర్పించలేదని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా విడుదల కానప్పుడు నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయమై డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజుని వివరణ కోరగా అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు వస్తే సమగ్ర విచారణ జరిపి, నిధులు దుర్వినియోగమైనట్లు తేలితే రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ‘పశ్చిమ’ విద్యార్థులు
భీమవరం: సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జిల్లా విద్యార్థులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తమీమ్ అన్సారియా అభినందించారు. చినకాకానిలో రెండు రోజులపాటు జరిగిన సేవా సంకల్ప అభియాన్–డ్రాయింగ్, వక్తృత్వ పోటీలకు జిల్లాస్థాయిలో విజేతలైన 13 మంది పాల్గొన్నారు. విద్యార్థులు టి.సాయిప్రియ, ఎ.సలో మి, ఎ.మంగశ్రీ దుర్గ, ఎ.పూర్ణ శ్రీమంగ, వి.సుస్మిత, ఎ.ఉమామహేశ్వరి, వి.గీతిక, ఎం. జ శ్వంత్ సత్య, ఎన్.షర్మిల, పి.రమాదేవి, వి.దశ పూర్ణిమ, జి.మమత, ఎన్.మహిమరాజు పాల్గొనగా ఎస్కార్ట్ టీచరుగా రేపాక వెంకన్న బాబు వ్యవహరించారు. వీరికి శుక్రవారం తమీమ్ అన్సారియా సర్టిఫికెట్లు అందించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులను తనిఖీ చేసేందుకు సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ శుక్రవారం తాడేపల్లిగూడెం విచ్చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయ న్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లిగూడెంలో వందే భారత్, పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ స్టేషన్‌కు మొ దటి ప్రాధాన్యమివ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సందీప్ మాథుర్ మా ట్లాడుతూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపి చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.ప్రశాంతకుమార్, రైల్వే మాస్టార్ ఎస్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆర్థిక వృద్ధి అవకాశాలను గుర్తించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జేసీ కేఆర్ కల్పశ్రీ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రంగాల అభివృద్ధిపై చర్చించారు. ప్రైస్ వాటర్ హౌస్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానికంగా ఉన్న వనరులు, సంప్రదాయ రంగాలు, పారిశ్రామిక అవకాశాలు, వ్యవసాయం, ఆక్వా రంగం, పర్యాటక ప్రాంతాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా జిల్లాలో ఆర్థికవృద్ధిని పెంపొందించే ప్రణాళిక, కీలక అభివృద్ధి కేంద్రాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన అవకాశాలపై కార్యశాలలో వివరించారు. జిల్లాలో వరి సాగు, బియ్యం మిల్లింగ్, నిల్వ సదుపాయాలు, ఆక్వా సాగు, రొయ్యల ప్రాసెసింగ్, చేనేత, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కార్యశాలలో వివరించారు. భీమవరం–ఆకివీడు ఆక్వా, వరి ప్రాంతం, తణుకు పారిశ్రామిక ప్రాంతం తదితరాల అభివృద్ధికి అవసరమైన అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
కొత్త ఉత్పత్తులతో అధిక లాభాలు
కాళ్ల: రొయ్యల సాగులో నిపుణులైన అధికారుల సూచనల మేరకు మార్కెట్లో లభించే నాణ్యమైన ఉత్పత్తులను వాడటం వల్ల రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఇన్నోవేర్ బయోఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఐఎస్ రాజు తెలిపారు. తమ కంపెనీ నుంచి ఇప్పటికే 35 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, కాళ్ల మండలం పెద అమిరంలో జరుగుతున్న ఆక్వా ఎక్స్పో ఇండియా ఎగ్జిబిషన్లో కొత్తగా మరో రెండు ఉత్పత్తులను విడుదల చేసినట్లు చెప్పారు. శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సూర్యమిత్ర గ్రూప్ సంస్థల అధినేత యిర్రింకి సూర్యారావు విచ్చేసి వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆక్వా ఎక్స్ చైర్మన్ దంతులూరి వేణు రాజు వారికి స్వాగతం పలికి సత్కరించారు. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనల ద్వారా స్వదేశీ, విదేశీ కంపెనీల ఉత్పత్తులు రైతులకు పరిచయమై ఎంతో మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. -
బియ్యం.. భయ్యం
భీమవరం(ప్రకాశం చౌక్): బియ్యం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కొన్నిరకాలు దాదాపు 40 శాతానికి పైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్వింటాకు రూ.1,400 నుంచి రూ.2 వేల వరకు ధర పెరిగాయి. ఈ లెక్కన కిలోకు రూ.14 నుంచి రూ.20 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యం సమృద్ధిగా పండుతున్నా.. అత్యధిక మంది తినే సన్న రకాలు కాకపోవడంతో ఇక్కడి పండించిన ధాన్యం ఉత్పత్తి ధరలను ప్రభావం చేయలేకపోతోంది. ‘పప్పు’లు ఉడకడం లేదు! బియ్యం బాటలోనే పప్పులు ధరలు పెరుగుతున్నాయి. ఇవి కూడా కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. కిలో కందిపప్పు రూ.120 నుంచి రూ.130కు, మినపప్పు రూ.105 నుంచి రూ.120, పెసరపప్పు రూ.100 నుంచి రూ.120, శనగపప్పు రూ.75 నుంచి రూ.100కు పెరిగింది. కుటుంబ ఖర్చు తడిసిమోపెడు బియ్యం, పప్పులు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడికి కుటుంబ ఖర్చు నెలకు రూ.2 వేల వరకు పెరిగింది. అలాగే ఫంక్షన్లు, శుభ కార్యక్రమాలు, అన్నసమారాధనల నిర్వహణకు ధరల పెరుగుదల భారంగా మారింది. కూటమి ప్రభు త్వం ధరల ని యంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, రేషన్ షాపులు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా త క్కువ ధరలకు బియ్యం, పప్పులు వంటి నిత్యావస ర సరుకులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.రకం కిలోలు నెల క్రితం ప్రస్తుతం స్వర్ణ 100 3,800 5,100 స్వర్ణ 26 1,000 1,400 సోనామసూరి 26 1,450 2,100 ఇతర రకాలు 26 1,100 1,400 బెధరగొడుతోంది ధరలకు రెక్కలు రోజురోజుకూ పెరుగుతున్న వైనం నెల రోజుల్లో 40 శాతానికి పైగా పెరుగుదల -
ఆక్వా సాగులో అనర్థాలను గుర్తించాలి
సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు, అధికారులు కై కలూరు: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రైతులకు జరిగే అనర్థాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్, గోవా సీనియర్ సైంటిస్టు డాక్టర్ త్రివేష్ సురేష్ మయేకర్ సూచించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) సౌజన్యంతో సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్–సీసీఏఆర్‌ఐ), ద ఎనర్జీ అండ్ రిసో ర్సస్ ఇనిస్టిట్ (టెరి) గోవా ఆధ్వర్యంలో ‘చిన్న తరహా చేపల రైతుల కోసం వాతావరణం–స్మార్ట్ ఆక్వాకల్చర్‌పై సమర్థన నిర్మాణం’ అనే అంశంపై కై కలూరు ఫిషరీస్ కార్యాలయంలో గురువారం సదస్సు నిర్వహించారు. కై కలూరు ఫిషరీస్ ఏడీ ఎం.రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైంటిస్ట్ డాక్టర్ త్రివేష్ సురేష్ మయేకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.09 లక్షల హెక్టార్లలో వనామీ రొయ్యల సాగు జరుగుతోందన్నారు. 2024–25లో 10.54 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. ఆక్వా రైతులు మారుతున్న ఏఐ టెక్నాలజీ వినియోగించాలన్నారు. వెంకటరామన్నగూడెం, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం, ఫిషరీస్ సైంటిస్టులు దేవీ వరప్రసాదరెడ్డి, అప్పన శ్రీనివాస్ రొయ్యల రైతులు ఎక్కువ స్టాక్ వేయడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. కలుషిత నీరును ఇతర రైతులు తోడుకోవద్దని చెప్పారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజ శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఆక్వా సాగు పరిస్థితిని వివరించారు. ఏఐసీ సిబ్బంది సత్య బీమా విధానాన్ని చెప్పారు ఫిషరీష్ డెవలప్మెంట్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, సీహెచ్ గణపతి, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
చాలా ఇబ్బంది పడుతున్నాం
బియ్యం, పప్పుల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కుటుంబ జీవనం కష్టంగా మారింది. అన్నింటి ధరలు పెరిగిపోతే పేదలు బతికేదెలా. రేషన్ షాపుల్లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను పూర్తిస్థాయిలో అందించాలి. –కె.కృష్టవేణి కొండేపూడి నిత్యావసర సరుకుల ధరలు ఇంతలా పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బియ్యం ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – వి.శ్రీనివాస్, వీరవాసరం -
ఏలూరు జీజీహెచ్‌ని సంస్కరించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏ లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ని సంస్కరించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స మీక్ష సమావేశం జిల్లా ఇన్చా ర్జి మంత్రి నాదెండ్ల మనో హర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎ మ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయ జిల్లాల నుంచి వందల మంది రోగులు ఏలూరు వచ్చి ఇక్కడ వైద్య సౌకర్యాలు లేక విజయవాడ, గుంటూరుకు తరలిస్తున్నారని, ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లడానికి వీల్ చైర్ గెంటే సిబ్బంది కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద, డెలివరీ కేసులు చూసేందుకు సీనియర్ సర్జన్లు, సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై నిత్యావసర సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ గత నెలలో చెప్పారని, ఇప్పటికీ అమలు కాలే దన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా మైనింగ్, అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పగా.. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి మనోహర్ హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన స్కూల్ భవనాలు, అంగన్వాడీ భవనాలు 80 శాతం పూర్తయినా, వాటి నిర్మాణాలు జరగకపోవడతో విద్యార్థులు, పిల్లలు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో అక్రమ పశు రవాణా జరుగుతున్నా ఎటువంటి చర్యలు లేవని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జీలుగుమిల్లిలోని కారం పొడి ఫ్యాక్టరీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదని, అంగన్వాడీలకు ఇచ్చిన ఇండక్షన్ స్టవ్స్ 300 వరకు పనిచేయకపోవడంతో పిల్లలకు సమయానికి ఆహా రం పెట్టలేకపోతున్నారని, కొత్త స్టవ్‌ను మరమ్మతు లు చేయించాలని కోరారు. మంత్రి మనోహర్ అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించి చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి సాగును చేరువ చేసేలా.. ప్రకృతి సాగు ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరు వ చేసేలా మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో పరిస్థితుల ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ -
పుర పోరుకు కసరత్తు
ఏడేళ్ల ప్రత్యేక పాలన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి. హైకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కసరత్తు మొదలైంది. విలీన ప్రతిపాదిత గ్రామాలతో వార్డుల పునర్విభజనపూర్తయ్యింది. వీటిపై ఈనెల 14లోపు సూచనలు, సలహాలు తెలియజేయాలని పట్టణ ప్రజలను పురపాలక సంఘాలు కోరాయి. స్పెషల్ టెట్‌కు ప్రత్యేక ఏర్పాట్లు శురకవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2026సాక్షి, భీమవరం: జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలకు చివరిగా 2014లో ఎన్నికలు జరగ్గా 2019తో పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. తర్వాత ఎన్నికల నిర్వహణకు విలీన కేసులు అవరోధంగా మారా యి. నాటి నుంచి నాలుగు మున్సిపాల్టీలు ప్రత్యేక పాలనలోనే కొనసాగుతున్నాయి. నరసాపురం ము న్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీలో సమస్య లేకపోవడంతో 2021లో ఎన్నికలు జరగడం, ఇటీవల పాలకవర్గాల పదవీ కాలం పూర్తికాగా, మరలా ఎన్నికలకు అవసరమైన కసరత్తు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్నాయి. విలీన కేసులు నడుస్తున్న మున్సిపాల్టీల్లో ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఇటీవల హైకోర్టు కేసులను కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. కసరత్తు ప్రారంభం : నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం విలీన ప్రతిపాదిత గ్రామాలతో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాల్టీల్లో వార్డుల పునర్విభజనపై వార్డుల హద్దుల వివరాలతో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. దీనిపై ఈనెల 14లోపు సూచనలు, సలహాలు తెలియజేయాలని పట్టణ ప్రజలను కోరారు. పాలకొల్లులోను వార్డుల డ్రాఫ్టు విడుదలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఇప్పటికే తొలి విడతలోని నరసాపురం, ఆకివీడులలో వార్డుల పునర్విభజన లోపభూయిష్టంగా జరిగిందన్న విమర్శలున్నాయి. నరసాపురంలోని 31 వార్డులను 36కు, ఆకివీడులో 20 నుంచి 28 వార్డులకు పెంచారు. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని వార్డుల సరిహద్దులు, ఓటర్ల సంఖ్యను సర్దుబాటు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పునర్విభజన లోపాలను సరిచేయాలని రెండు పట్టణాల నుంచి ఉన్నతస్థాయికి వినతులు అందాయి. రెండవ విడతలోని నాలుగు మున్సిపాల్టీల్లో పరిస్థితి ఏమిటన్నది ప్రజాభిప్రాయంలో తెలియనుంది. కాగా పునర్విభజనపై ఏకాభిప్రాయం సాధించే దిశగా అఖిలపక్ష సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిర్ణీత గడువు ముగిశాక వార్డుల తుది జాబితాను విడుదల చేస్తారు. భీమవరం: ప్రస్తుతం 39 వార్డులు ఉండగా.. తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాలతో కలిపి 52 వార్డులకు పెంచారు. తణుకు: ప్రస్తుతం 34 వార్డులు ఉండగా.. వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం గ్రామాలతో కలిపి 44 వార్డులకు పెరిగాయి. పాలకొల్లు: ప్రస్తుతం 31 వార్డులు ఉండగా.. దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం గ్రామాలతో కలిపి 44 వార్డులకు పెంచారు. తాడేపల్లిగూడెం: ప్రస్తుతం 32 వార్డులు ఉండగా.. పడాల, కుంచనపల్లి, ఎల్.అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలతో కలిపి 48 వార్డులకు పెంచారు. ఈనెల 11 నుంచి పరీక్షలు జిల్లాలో 1,588 మంది టీచర్లు హాజరు పట్టణం.. మారిన స్వరూపం భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో వార్డుల పునర్విభజన విలీన గ్రామాలతో కొత్త వార్డులు 14 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు త్వరలో ఓటర్ల విభజనకు కసరత్తు విలీన కేసులతో ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఆయా పట్టణాలు హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సామాజికవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లను విభజన చేయాల్సి ఉంది. విలీన గ్రామాలతో భీమవరం మున్సిపాల్టీలో 1.62 లక్షల మంది ఓటర్లు ఉండగా తణుకులో 75 వేలు, పాలకొల్లులో 76,063, తాడేపల్లిగూడెంలో 1.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు విభజన అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. చాలావరకు ఈ నాలుగు మున్సిపాల్టీల్లో రెండో విడతలోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరుగనుండటంతో స్థానింగా సందడి మొదలైంది. వార్డులపై స్పష్టత రాగా రిజర్వేషన్లపై ఆశావహులు ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏ వార్డులో ఏ సామాజికవర్గం ఓటర్లు ప్రాబల్యం ఎక్కువగా ఉంది?, తమ విజయావకాశాలపై బేరీజులు వేసుకుంటున్నారు. అనుకూల వార్డులో ముందుగానే కర్చీఫ్ వేసుకునే పనిలో ఉన్నారు. -
మద్యం షాపుల కేటాయింపు
భీమవరం: జిల్లాలో కొత్తగా టెండర్లు పిలిచిన 8 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి కేటాయించారు. గురువారం కలెక్టరేట్లో ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ పరిధిలోని 25 మద్యం షాపులకు టెండర్లు పిలవగా 8 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చి న సంగతి తెలసిందే. వీటికి 64 దరఖాస్తులు రాగా లాటరీ నిర్వహించారు. షాపులు వారీగా భీమవరం మున్సిపాలిటీలో కొరాడ శ్రీనివాస్, భీమవరం రూరల్ మండలంలో మేడిది గీత, కాళ్ల మండలంలో తొంట నాగ వెంకట రవికుమార్, నరసాపురం రూరల్ మండలంలోని మూడు షాపులను పైడికొండల వెంకట గోపాలకృష్ణ, రావి మాణిక్యాలరావు, చల్లా భాస్కర వీరేంద్రరావు, పెనుగొండ మండలంలో నెక్కంటి సాగర్ కృష్ణ, పెనుమంట్ర మండలంలో కుక్కల లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ బి.సుబ్బారావు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: జాతీయ పురుషుల పారా త్రోబాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మండలంలోని దగ్గులూరుకు చెందిన కలిదిండి శివరామకృష్ణరాజు ఎంపకయ్యారు. వచ్చేనెల 19 నుంచి శ్రీలంకలో జరిగే 2వ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆయన పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తాను అనుకున్న రంగాల్లో విజయం సాధించాలంటే శ్రమించాలని అన్నా రు. క్రీడారంగంలో విజయాలు సాధించిన వారికి ప్రభుత్వ, ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్య తను పూర్తిస్థాయిలో నెరవేర్చి దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తానన్నారు. పెదవేగి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆదేశాల మేరకు గురువారం భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కుటుంబ వివాదాల వల్ల కుటుంబ వ్యవస్థ, పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుందని, వివాదాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కేసులను మధ్య వర్తిత్వం కార్యాలయానికి రిఫర్ చేయించుకుని పరిష్కారానికి సహకరించాలని సూచించారు, అవసరమైన న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సీహెచ్ సూర్యచక్రవేణి, వన్‌స్టాప్ సెంటర్ లీగల్ అడ్వయిజర్ తేజస్వి, గ్రామ కార్యదర్శి భూపతిరాజు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉద్యోగుల క్లెయిమ్‌లను వైద్యపరంగా పరిశీలించి, ధ్రువీకరించేందుకు జిల్లా వైద్య మండలిని ఏర్పాటు చేసినట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, పోలవరం జిల్లాలకు చెందిన పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులకు ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కేటాయించామన్నారు. ఈనెల 16 వరకు ఏలూరు జీజీహెచ్‌లో వైద్య మండలి అందుబాటులో ఉంటుందన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేజీబీవీ నియామకాలకు సంబంధించి మెరిట్ లిస్టులను జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఎక్స్–అఫీషియో ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జిల్లా కార్యాలయ వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 12న సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష, ఏలూరు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గడువు దాటితే పరిశీంచబోమన్నారు. -
వసతులు కల్పించాలి
మా కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేవు. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మా గోడు పట్టించుకున్న వారే లేరు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బొడ్డు ప్రేమ, జగనన్న కాలనీ, అత్తిలి మా కాలనీలో రోడ్లు లేక బురదలోంచి రాకపోకలు సాగిస్తున్నాం. మురుగునీరు వెళ్లే దారిలేక దోమలు బెడద ఎక్కువైంది. పాములు, విషకీటకాల సంచారంతో భయపడుతున్నాం. – కందుకూరి కృప, జగనన్న కాలనీ, ఉండి వర్షాకాలం వస్తే నానాయాతన పడుతున్నాం. ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నాం. కొత్త లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. – వాకల పుష్పావతి, జగనన్న కాలనీ, మెట్ట ఉప్పరగూడెం గత ప్రభుత్వంలో మా కాలనీ లో ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటుచేశారు. కూటమి ప్రభుత్వంలో రెండింటిని తీసుకెళ్లిపోయారు. మా కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం. – నరసింహరావు, జగనన్న కాలనీ, మార్టేరు -
ఆర్చరీలో మెరిసిన ‘పశ్చిమ’
భీమవరం: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్ కాంపౌండ్ మెన్, సీనియర్ కాంపౌండ్ ఉమెన్ విభాగాల్లో పతకాలు సాధించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, వెస్ట్ గోదావరి ఆర్చరీ అసోసియేషన్, భీమవరం ఆర్చరీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా యువశక్తి ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల్లో రాణించాలన్నారు. ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు జయరాజు, వెస్ట్‌బెర్రీ స్కూల్ చైర్మన్ మహేష్‌వర్మ, ఎస్ఆర్కేఆర్ ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, డైరెక్టర్ ఎం.జగపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● సీనియర్ రికర్వ్ మెన్: ఆర్.సాయి మౌర్య (నెల్లూరు), పి.రాజేష్ (నెల్లూరు), డి.ధనుష్ (విజయనగరం) ● సీనియర్ కాంపౌండ్ ఉమెన్: కామినేని రిషికీర్తన (కృష్ణా), వేగేశ్న స్ఫూర్తి (పశ్చిమగోదావరి), అల్లూరి కనిష్క (పశ్చిమగోదావరి) ● సీనియర్ కాంపౌండ్ మెన్: కర్రా బుద్దేశ్వరరావు (తూర్పుగోదావరి), పి.చరణ్ (కృష్ణా), మాగాపు సుహాస్ (పశ్చిమగోదావరి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సీనియర్ కాంపౌండ్ ఉమెన్ విభాగంలో , సీనియర్ కాంపౌండ్ మెన్ విభాగంలో విజేతలురెండు విభాగాల్లో పతకాలు -
కూటమి నిర్లక్ష్యం.. కాలనీలు దుర్భరం
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరువయ్యాయి. రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోక రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పల్లె పండుగ 3.0 అంటూ హడావుడి చేస్తున్న పాలకులు ఈ కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాలనీల్లోని దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. 1,152 ఎకరాలు సేకరణ, మెరక పనుల కోసం దాదాపు రూ.630 కోట్లు వెచ్చించారు. ఇళ్ల నిర్మా ణానికి అనువుగా అప్పట్లో కాలనీల్లో గ్రావెల్ రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం కల్పించారు. భవిష్యత్తులో కాలనీల్లో జనాభాను బట్టి గేటెడ్ తరహాలో పార్కులు, లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, క మ్యూనిటీ హాళ్లు తదితర వాటి నిర్మాణంతో పాటు భూగర్భ విద్యుదీకరణ పనులకు అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం మారడటంతో అన్నీ మరుగునపడిపోయాయి. చంద్రబాబు సర్కారులో కనీస వసతులు కరువై పేదల జీవనం దుర్భరంగా మారింది. గత ప్రభుత్వంలో కాలనీల్లో ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లను పలుచోట్ల తొలగించి వేరే ప్రాంతాలకు తరలించడం గమనార్హం. ఈ చిత్రంలో పశువులు మేస్తూ కనిపిస్తోంది పొలం అనుకుంటే పొరబాటే. జిల్లాలో పెద్ద కాలనీగా పేరొందిన ఆకివీడు మండలం తాళ్లకోడు జగనన్న కాలనీలోని రోడ్డు ఇది. గత ప్రభుత్వంలో 73.50 ఎకరాల్లో 3,273 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 50 శాతం మేర ఇళ్లు నిర్మాణం జరగ్గా మూడు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. కాలనీలో రెండు ప్రధాన, 40 వరకు అంతర్గత రోడ్లు ఉండగా సర్కారు నిర్లక్ష్యంతో సగానికి పైగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొద్దిపాటి చినుకులకే చిత్తడిగా మారి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయిన్లు లేక ఇళ్లలోని వాడకం నీరు రోడ్లపైకి చేరుతోంది. ఆ కాలనీలు.. సమస్యల లోగిళ్లు జగనన్న కాలనీలపై కూటమి చిన్నచూపు రెండేళ్లుగా నిలిచిన అభివృద్ధి పనులు కనీస వసతుల కరువు జిల్లాలో 1,157 ఎకరాల్లో 630 జగనన్న లేఅవుట్లు ట్రాన్స్ఫార్మర్లను తరలించుకుపోయిన వైనం 47,362 పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ -
ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఏకగ్రీవం
భీమవరం : భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షునిగా డీవీవీఎస్ వర్మ, అధ్యక్షునిగా చెల్లబోయిన రంగారావు, ప్రధాన కార్యదర్శిగా మందలపర్తి హరీష్, కోశాధికారిగా కిలారి మల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా కోనాల భీమారావు, నెక్కంటి సుబ్బారావు, అల్లం నారాయణ, సహాయ కార్యదర్శులుగా దేవ పెద్దిరాజు, తాటికొండ వాసు, పి.ఆదినారాయణ తదితరులతో పాటు మరో 45 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని మహాసభల్లో తీర్మానించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల సాధనే లక్ష్యంగా పోరాటాలు నిర్వహించాలని, ప్రతినెలా కనీస వేతనం రూ.36 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని తీర్మానాలు ఆమోదించారు. భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్లమ్మవారి దేవస్థానంలో బుధవారం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు. గత 40 రోజులకు గాను రూ.33,27,757 నగదుతో పాటు, 35.200 గ్రాముల బంగారం, 144 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్. గంగా శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు. టి.నరసాపురం : పురుగు మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రంపాలెం గ్రామానికి చెందిన కట్టూరి శివరామకృష్ణ (28)కి వివాహమైన అనంతరం పక్షవాతం రావడంతో భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతడు, ఒంటరితనం భరించలేక బుధవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివరామకృష్ణ తల్లి వెంకాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓడూరు గ్రామానికి చెందిన జె సువర్ణరత్నం (19), జి అనిల్ కుమార్ (17) మోటార్ సైకిల్‌పై మార్టేరు వైపు వెళుతుండగా వెలగలేరు హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి పక్కనే ఉన్న కంకర గుట్ట పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వారు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమచారం మేరకు వచ్చిన 108 వాహనంలో క్షతగాత్రులకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శ్రీదేవి, పైలెట్ జగదీష్ ప్రాథమిక చికిత్స అందించి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందలపర్తి హరీష్, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, అధ్యక్షుడు -
హైవేపై ‘నంబర్’ నిఘా
ద్వారకాతిరుమల : హైవేపై వాహనం వేగంగా దూసుకెళ్లినా.. నంబర్ మాత్రం కెమెరా కంటికి చిక్కాల్సిందే! రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడి వాహనాల్లో పరారయ్యే వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఏలూరు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యల్లో భాగంగా ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–16పై రెండు ప్రాంతాల్లో అత్యాధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్షన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎం.నాగులపల్లి, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో సుమారు రూ.2 లక్షల విలువైన కెమెరాలను స్థానిక శ్రీనిధి ఫీడ్స్ కంపెనీ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. కెమెరాల ఏర్పాటు పనులు పూర్తవడంతో వాటి పనితీరును బుధవారం వారు పరిశీలించారు. నంబర్ ప్లేట్.. కదలికల రికార్డు హైవేపై నిరంతరం రాకపోకలు సాగించే వాహనాల నంబర్ ప్లేట్లను ఈ కెమెరాలు స్కాన్ చేసి నమోదు చేయగలవు. దీంతో అనుమానాస్పద లేదా నేరాల్లో వినియోగించిన వాహనం ఏ మార్గంలో వెళ్లిందన్న దానిపై పోలీసులకు కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత వాహనం ఆగకుండా వెళ్లిపోయినా.. కెమెరా ఫుటేజీ, నంబర్ ఆధారంగా దాని కదలికలను వెనక్కి అనుసరించడం దర్యాప్తులో ఉపయోగపడుతుంది. రాంగ్‌రూట్ డ్రైవింగ్, అతివేగం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు ఆధునిక ఎలక్ట్రానిక్ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ పరికరాలను వినియోగించాలని కేంద్ర నిబంధనల్లోనూ పేర్కొన్నారు. వాటిలో ఈ ఏఎన్పీఆర్ కెమేరాలు ఒకటి. హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి. అతివేగం, రాంగ్‌రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టడంలో ఏఎన్పీఆర్ కెమెరాలు ఉపయోగపడతాయి. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. – డి.శ్రావణ్‌కుమార్, ఏలూరు డీఎస్పీ ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద హైవేపై ఏర్పాటు చేసిన ఏఎన్పీఆర్ కెమెరాలు, కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వాహనం నంబర్ ఆధారంగా అనుమానితుల కదలికలను గుర్తించడం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతోంది. ఏపీ ఆర్టీజీకి చెందిన సీసీటీవీ 360 వ్యవస్థను ఉపయోగించి ఇటీవల తాడేపల్లిగూడెంలో హత్య–దోపిడీ కేసులో అనుమానితుల కదలికలను గుర్తించి కేసు ఛేదించగా, ఏలూరు జిల్లా పోలవరం పరిధిలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని కూడా నిఘా వ్యవస్థ ద్వారా ట్రేస్ చేశారు. ద్వారకాతిరుమల–భీమడోలు మార్గంలో ఏర్పాటుచేసిన ఈ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భవిష్యత్తులో నేర దర్యాప్తుల్లోనూ ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైవే మార్గాన్ని ఉపయోగించే దొంగలు, నేరస్తుల వాహనాల కదలికలను గుర్తించడంలో పోలీసులకు అదనపు సాంకేతిక ఆధారంగా దోహదపడనున్నాయి. ఎన్‌హెచ్–16పై రెండు చోట్ల ఏఎన్పీఆర్ కెమెరాలు రూ. 2 లక్షలతో ఏర్పాటు.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా ప్రమాదాల నివారణతో పాటు నేరాల ఛేదనకూ సాంకేతిక అస్త్రం -
ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్స్ రైతులకు ఉపయోగం
భీమవరం: ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరికరాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని, ఈ తరుణంలో ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం పట్టణ సమీపంలోని పెదఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆక్వా ఎక్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఆక్వా రంగంలో రైతులకే కాకుండా యువతకు కూడా అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఎక్స్ ఫౌండర్ దంతులూరి వేణు మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ ఆక్వా ఎక్స్‌పోలో రైతులకు ఎంతో ఉపయోగపడే అనేక రకాల ఆధునిక పరికరాలతో పాటు మేత (ఫీడ్) తదితర ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ ప్రదర్శనను సందర్శించి, సరికొత్త పరికరాలను తమ సాగుకు అన్వయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
వైఎస్సార్ సీపీలో గూడెం నేతలకు రాష్ట్ర పదవులు
తాడేపల్లిగూడెం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో నియోజకవర్గ నాయకులకు పలు కీలక పదవులు దక్కాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులకు ఈ పదవులలో సముచిత స్థానం లభించింది. పదవులు ఇలా.. పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యునిగా పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ కమిటీ మాజీ అధ్యక్షుడు గుండుబోగుల నాగేశ్వరరావు (నాగు) నియమితులు కాగా, మరో సీనియర్ నాయకుడు గుండుమోగుల బలుసులరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లమిల్లి విజయానందరెడ్డి, కార్యదర్శిగా కర్రి ఎస్ఆర్ఎస్ రెడ్డి నియమితులయ్యారు. బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కలిశెట్టి తాతారావు, సంయుక్త కార్యదర్శిగా వీరమల్లు సుబ్రహ్మణ్యం దక్కించుకోగా, ఎఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులుగా కండెల్లి రాజేష్, లంకా రాజశేఖర్ నియమితులయ్యారు. ఇతరుల విభాగాల విషయానికి వస్తే.. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా ఇందుకూరి శ్రీనివాసరాజు, పంచాయతీ రాజ్ వింగ్ కార్యదర్శిగా మాకరాజు సతీష్, సంయుక్త కార్యదర్శిగా కోనేటి దానయ్య, అలాగే పబ్లిసిటీ వింగ్ సంయుక్త కార్యదర్శిగా వెలనాటి వీరవెంకటసత్యనారాయణ (సత్తిబాబు) లను పార్టీ నియమించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇలా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నాయకులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రాధాన్యత దక్కడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సావిత్రిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తమ నియామకాలకు సహకరించిన నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురామ్‌కు నూతన పదవులు దక్కిన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట నాయకులకు పదవులు వైఎస్సార్ సీపీలో ఆచంట నియోజకవర్గ నాయకులకు పార్టీ పదవులు వరించాయి. స్టేట్ బీసీ సెల్ కార్యదర్శిగా పూతినీడి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా కుక్కల సూర్యనారాయణ, ఎస్సీ సెల్ కార్యదర్శిగా సుంకర సీతారాం, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శిగా కర్రి గౌరీసుభాషిణి నియమితులయ్యారు. -
రేచర్లలో రైతుల రాస్తారోకో
రిలయన్స్ యూసీజీ ప్రాజెక్టు విరమించుకోవాలని డిమాండ్ చింతలపూడి: రిలయన్స్ గో బ్యాక్ అంటూ భూగర్భ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి (యూసీజీ) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రేచర్లలోని గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు రేచర్ల వద్ద ఉన్న బొగ్గు బోర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు, అక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రిలయన్స్ యూసీజీ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. రిలయన్స్ కంపెనీకి ప్రజా సంపదను కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, ప్రజల జీవితాలను నాశనం చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలు దెబ్బతిని, రైతులు, వ్యవసాయ ఆధారిత ప్రజలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యూసీజీ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్వీఎస్. నారాయణ, రైతు సంఘం నాయకులు పి.పాండురంగారావు, రైతులు కంచర్ల శ్రీనివాసరావు, కొనకళ్ళ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కోసం పోరాటం
● హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన బాట ● మూడు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు భీమవరం(ప్రకాశం చౌక్) : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన తమ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఉన్నత అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు బుధవారం వైద్య సేవలూ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ న్యాయపోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కరువు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యవసర ధరలు, కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులకు తగిన వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కనీస ఎక్స్‌గ్రేసియా కూడా చెల్లించడం లేదని, దీంతో ఆ కుటుంబాల బతుకులు దారుణంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా సేవ చేస్తున్నా రెగ్యులరైజ్ చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ప్రధాన డిమాండ్లు ● కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని అర్హులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి. ● 2018 నుంచి అమలవుతున్న వేతన తగ్గింపు విధానాన్ని సమీక్షించాలి. ● భవిష్యత్తులో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలి. ● విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ● పరస్పర అవగాహనతో స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి. ● శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే పెయిడ్ సిక్ లీవ్‌లు, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు అందజేయాలి. -
గెనోడేర్మా యాజమాన్య పద్ధతులతో రైతులకు మేలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ రైతులకు వేరుకుళ్లు తెగులుపై కీలక సూచనలు చేశారు. ఇటీవల తోటలలో గుర్తించిన ఈ తెగులును నివారించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని హెచ్చరించారు. జిల్లాలో దాదాపు 1,60,000 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా, ఇటీవల 15 సంవత్సరాల పైబడిన తోటలలో శ్రీగెనోడెర్మాశ్రీ తెగులును పరిశీలించినట్లు తెలిపారు. ఇది నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రమని, ఆయిల్‌పామ్ చెట్లలో కాండం మొదలు కుళ్లిపోవడానికి ఇది కారణమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆయిల్‌పామ్ చెట్లకు ఈ తెగులు సోకడాన్ని గమనించామని, దీనివల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు తోటల దిగుబడి తగ్గి, ఉత్పాదకత క్షీణించి పంట జీవిత కాలం ముప్పులో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్య పద్ధతులు ఇలా.. ● తెగులు సోకిన మొక్కను తొలి దశలోనే గుర్తించడం ద్వారా ప్రభావితమైన చెట్టును సులభంగా కాపాడుకోవచ్చు. ● ముందస్తు నివారణ చర్యగా నేలలో ట్రైకోడెర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్‌ను 100 కేజీల ఎఫ్‌వైఎం / వేపపిండి / వెర్మికంపోస్ట్లో ఒక కేజీ / లీటరు చొప్పున కలిపి మొక్కకు దగ్గరలో వేసుకోవడం ద్వారా తెగులును నివారించుకోవచ్చు. ● మొక్కలు నాటుకునే సమయంలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్ పొడి కానీ ద్రావణం కానీ గుంటకి కేజీ చొప్పున వేయాలి. ● నేల, పత్ర విశ్లేషణ ఆధారంగా పోషకాలను, ట్రైకోడెర్మాను వేప పిండితో కలిపి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా వేసుకోవాలి. ● నిర్ణీత వ్యవధిలో వ్యాధులపై పరిశీలన తప్పనిసరి. 1 మీటర్ లోతు, 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న గుంతను తవ్వడం ద్వారా గెనోడెర్మా సోకిన చెట్టును వేరుచేయాలి. తద్వారా వ్యాధి సోకిన వేర్లు ఆరోగ్యకరమైన వేర్లతో సంబంధం లేకుండా ఉంటాయి. ● వ్యాధి లక్షణాలను చూపించే చెట్ల నుంచి ఆరోగ్యవంతమైన చెట్లను వేరుచేయాలి. తోటలలో పచ్చి పశువుల పేడను వేయరాదు. ● పడిపోయిన చెట్లను మళ్ళీ నాటడం, తొలగించిన చెట్లు, కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలు వ్యాధి కలుగజేసే శిలీంధ్రం పెరుగుదలకు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్నిస్తాయి. కాబట్టి చనిపోయిన, పడిపోయిన చెట్ల కాండం, వేర్లను ముక్కలుగా చేసి కాల్చివేయాలి. ● నీటి పారుదల, మల్చింగ్‌తో నేలలో సరిపడా తేమను నిర్వహించుకోవాలి. చెట్ల మొదలులో, భూమిలో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. -
వడ్డీ వ్యాపారి హత్యకేసులో నిందితుల అరెస్ట్
నరసాపురం రూరల్: మొగల్తూరులో సంచలనం సృష్టించిన వడ్డీ వ్యాపారి గ్రంధి బాబి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ సుధాకర్ మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వడ్డీ వ్యాపారి బాబి వద్దకు తాకట్టు కోసం వచ్చిన మామిడిశెట్టి కల్యాణ్ కుమార్.. బాబీ ఒంటరిగా ఉండటంతో హత్య చేస్తే లక్షల రూపాయలు వస్తాయని పథకం వేశాడు. ఇందులో భాగంగా తన స్నేహితులు మోక లక్ష్మీ వరప్రసాద్, చింతలపూడి సతీష్, దొంగ సాయి గణేష్‌తో కలిసి ఈ ఏడాది జూన్ 16న బాబీని హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తొలుత ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ, మృతుడి కుమారుడు పవన్ వ్యక్తం చేసిన అనుమానాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరో కేసు విచారణలో భాగంగా ఈ హత్యోదంతం వెలుగులోకి రావడంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారినుంచి 8 కేజీల వెండి, రూ. 20 వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే తాకట్టు పెట్టిన 450 గ్రాముల బంగారాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి త్వరలోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఏలూరు టౌన్: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కఠిన చర్యలు చేపట్టినట్లు ఏలూరు వన్‌టౌన్ సీఐ కే. రామకృష్ణ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేట ప్రాంతానికి చెందిన భవిరి జగదీష్‌ను పీఐటీ–ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి, నిర్బంధ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. జగదీష్‌పై గతంలో ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. అతని నేర కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతుండటం, ఇది ప్రజారోగ్యానికి, సమాజానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో.. అతడిపై నిర్బంధ నిరోధక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఏలూరు డీఎస్పీ డీ. శ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు, జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. -
డ్రెయిన్‌లోకి దూసుకెళ్లిన కారు
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు తెల్లవారుజామున తన ఆసుపత్రికి అత్యవసర (అర్జెంట్) కేసు నిమిత్తం వెళ్లి, తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భీమవరం మండలం చినఅమిరం గ్రామం వద్ద ఆమె నడుపుతున్న కారు అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. భీమవరం: పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసిన కారు కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రామరావు మంగళవారం తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన కటికతల జార్జ్ ఈ నెల 3న భీమవరం వచ్చి, వర్మ ఆసుపత్రి వద్ద తన కారును పార్కింగ్ చేసి వేరే పనిపై బయటకు వెళ్లారు. తిరిగి 4వ తేదీన వచ్చి చూసేసరికి కారు కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు వెల్లడించారు. నూజివీడు: మండలంలోని తక్కులూరులోని క్వారీలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం క్వారీని సందర్శించారు. ఆ సమయంలో క్వారీలో ఉన్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఎంతమేరకు అక్రమ మైనింగ్ చేశారనే విషయాలను నిర్ధారించుకొని తదుపరి ట్రాక్టర్లకు జరిమానా విధిస్తారని తహసీల్దార్ షంషుద్ధీన్ పేర్కొన్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని పీజీఆర్ఎస్లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం (చింతలపూడి): జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని మంగళవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించడంతో పాటు, భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసనలు, నూతన వాహనాలకు పూజలను ఆలయ అర్చకుల ద్వారా జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో దేవస్థానానికి రూ.2,57,468 ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. సుమారు 2,834 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు వెల్లడించారు. ఉంగుటూరు: జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద చిన్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నాచుగుంట వద్దకు వచ్చేసరికి, వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను చూసి డ్రైవర్ కంగారు పడ్డాడు. దీంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువ గట్టు వైపు తిరగబడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
టాప్ టూలో.. చినవెంకన్న!
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై కంప్యూటర్ సహాయంతో ఫోన్ ద్వారా నిర్వహించిన అభిప్రాయ సేకరణ(సీఏటీఐ) సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం మరోసారి మెరుగైన స్థానాన్ని సాధించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన సర్వేలో 71.9 శాతం పాజిటివ్ స్కోర్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. 72.4 శాతంతో విజయవాడ మొదటి స్థానంలో ఉండగా.. 68.1 శాతంతో సింహాచలం మూడో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ఈనెల 5న విడుదల చేసిన ‘పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్’ నివేదికలో వెల్లడించింది. నాలుగు అంశాలపై అభిప్రాయ సేకరణ భక్తులకు దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రతి నెలా సీఏటీఐ విధానంలో ఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి–నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ అనే నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. గత నెల 4వ తేదీ నుంచి ఈ నెల 4 వరకు నమోదైన స్పందనల ఆధారంగా తాజా ర్యాంకులను వెల్లడించారు. 50,800 మందికి ఫోన్.. 582 స్పందనలు దేవాలయ సౌకర్యాలపై నిర్వహించిన సీఏటీఐ సర్వేలో మొత్తం 50,800 ఫోన్ నంబర్లను సంప్రదించారు. వీరిలో 398 మంది పాజిటివ్‌గా, 184 మంది నెగెటివ్‌గా స్పందించారు. మొత్తంగా 582 మంది స్పందించగా.. స్పందన రేటు 1.15 శాతంగా నమోదైంది. ఈ అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సంతృప్తి స్థాయిని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి 72.3 శాతం సంతృప్తి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిర్వహించిన ఈ సర్వేలో ఓవరాల్‌గా దర్శన సంతృప్తి 72.3 శాతంగా నమోదైంది. ప్రసాదం రుచి, నాణ్యతకు 74.2 శాతం, పరిశుభ్రతకు 63.3 శాతం, తాగునీటి సౌకర్యాలకు 63.2 శాతం పాజిటివ్ స్పందనలు లభించాయి. మొత్తంగా దేవాలయ సౌకర్యాలపై పాజిటివ్ స్కోర్ 68.2 శాతంగా నమోదైంది. స్వల్పంగా తగ్గినా.. రెండో స్థానమే సెప్టెంబర్‌లో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం 72.1 శాతం సంతృప్తి రేటింగ్‌తో ఉండగా.. అక్టోబర్‌లో 71.9 శాతానికి చేరింది. అంటే 0.2 శాతం పాయింట్ల స్వల్ప తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. సింహాచలంలో పెరుగుదల.. కాణిపాకంలో తగ్గుదల అక్టోబర్ ర్యాంకింగ్స్‌లో విజయవాడ 72.4 శాతంతో మొదటి, ద్వారకాతిరుమల 71.9 శాతంతో రెండు, సింహాచలం 68.1 శాతంతో మూడు, అన్నవరం 66.6 శాతంతో నాలుగో స్థానాల్లో నిలిచాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం చెరో 65.8 శాతంతో ఐదో స్థానాన్ని పంచుకోగా.. కాణిపాకం 65.7 శాతంతో ఆరో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే సింహాచలం 66.3 నుంచి 68.1 శాతానికి పెరగగా.. శ్రీశైలం 65.5 నుంచి 65.8కి, అన్నవరం 66.5 నుంచి 66.6 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. మరోవైపు విజయవాడ 74.3 నుంచి 72.4 శాతానికి తగ్గగా.. శ్రీకాళహస్తి, కాణిపాకంలోనూ తగ్గుదల నమోదైంది. సీఏటీఐ సర్వేలో ద్వారకాతిరుమలకు రెండో ర్యాంకు అక్టోబర్‌లో 71.9 శాతం పాజిటివ్ స్కోర్ 72.4 శాతంతో తొలి స్థానంలో విజయవాడ దర్శనం, తాగునీరు, ప్రసాదం, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలు -
రేషన్ బియ్యం పట్టివేత
దెందులూరు: కూచిపూడిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్సై నాగరాజు, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ పట్టుకున్నట్లు పోతునూరు వీఆర్ఓ రామచంద్రరావు తెలిపారు. కూచిపూడి గ్రామానికి చెందిన దుర్గారావు వ్యాన్‌లో డ్రైవర్ నవీన్‌బాబు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు, దెందులూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ఆవాహనాన్ని పట్టుకున్నారు. ఈ దాడిలో రూ.2 లక్షల విలువైన 50 కేజీల బస్తాలు 100 అక్రమ పీడీఎస్ బియ్యంతో పాటు, రూ.8 లక్షల విలువైన వ్యాన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమ పీడీఎస్ బియ్యం రవాణాపై విజిలెన్స్ పోలీసులు ఒక కేసు, దెందులూరు పోలీస్ స్టేషన్ ఎస్సై మరొక కేసు నమోదు చేశారని వీఆర్ఓ రామచంద్రరావు వివరించారు. తహసీల్దార్ బి. సుమతి ఆదేశాల మేరకు సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని కొవ్వలి షాప్ నంబర్–14కు తరలించి భద్రపరిచినట్లు పేర్కొన్నారు. -
పారిజాతగిరిలో రెండో రోజు పవిత్రోత్సవాలు
జంగారెడ్డిగూడెం(చింతలపూడి): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం విశ్వక్సేన పూజతో ప్రారంభమైన వైదిక కార్యక్రమాలు శ్రీ వైఖానస ఆగమయుక్తంగా, శాస్త్రోక్తంగా సాగాయి. పానంగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, పంచగవ్యప్రాశన, పంచగవ్య ప్రోక్షణ, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు పర్యాగ్నీకరణ, పవిత్ర అభిమంత్రణ, అగ్నిప్రతిష్ఠలతో పాటు యాగశాలలో విశేష హోమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త వీర రాఘవరావు శర్మ, అభివృద్ధి కమిటీ ప్రతినిధి పేరిచర్ల జగపతిరాజులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రోత్సవాల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మానికల రాంబాబు దగ్గరుండి పర్యవేక్షించారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు తోకలపల్లి విద్యార్థులు
గణపవరం(నిడమర్రు): నిడమర్రు మండలం తోకలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అరిగల గోపాలకృష్ణ తెలిపారు. జిల్లా స్థాయిలో అండర్–19 విభాగంలో నిర్వహించిన కబడ్డీ, రగ్బీ, బేస్‌బాల్ పోటీలలో విజేతలుగా నిలిచిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. కబడ్డీలో సింధుజ, హెప్సిబా, రగ్బీలో ప్రకాష్, గణసల లక్ష్మి సంధ్యారాణి, సైదు సత్యస్వరూప్, బేస్‌బాల్‌లో సైదు రమ్యశ్రీ ఆయా క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను హెచ్ఎం గోపాలకృష్ణ, ఎస్ఎంసీ ఛైర్మన్ సైదు ఏడుకొండల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
చిత్రలేఖన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గణపవరం (నిడమర్రు): సేవా సంకల్ప ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో నిడమర్రు మండలానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రథమ స్థానంలో కోటి చంద్రిక పెదనిండ్రకొలను జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కోటి చంద్రిక ఈ నెల 1న ఏలూరులో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకుంది. 25 కోట్ల మంది విద్యార్థుల డ్రీమ్ ఇండియా’ అనే అంశంపై ఆమె ఈ చిత్రలేఖనం రూపొందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థినికి శిక్షణ అందించిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజును, చంద్రికను హెచ్ఎంతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ ఎల్.బాలాజీ, ఎంఈవోలు తైలం అనూరాధ, యర్రంశెట్టి శేషగిరిరావు అభినందించారు. చొక్కాకుల దీవెనకు ద్వితీయ స్థానం నిడమర్రు మండలం పత్తేపురం జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని చొక్కాకుల దీవెన సీనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టాపు మల్లికార్జునరావు తెలిపారు. ఆమె కూడా 25 కోట్ల విద్యార్థుల డ్రీమ్ ప్రాజెక్ట్ అనే అంశంపై చిత్రలేఖనంలో ఈ ప్రతిభ కనబరిచారు. దీవెనను హెచ్ఎం మల్లికార్జునరావు, ఎస్ఎంసీ చైర్మన్ కడియం బేబీలక్ష్మీ ప్రసన్న, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పత్సమట్ల లక్ష్మీపతిరాజు, రుద్రరాజు కొండయ్యరాజు, పొత్తూరి నర్సింహరాజు తదితరులు అభినందించారు. -
పెచ్చుమీరుతున్న మోసాలు.. బాధితుల గగ్గోలు
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి చదువుకున్నవారు, చివరికి తెలివైన వారు సైతం పలు రకాల మోసాల బారిన పడుతున్నారు. చీటీలు, రియల్ ఎస్టేట్, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాలు, గల్ఫ్ మోసాలు, డ్వాక్రా సొమ్ముల స్వాహా వంటి దారుణాలతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. అధికారులు, పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. బాధితులు పోలీసు అధికారులను ఆశ్రయించినా సరైన న్యాయం జరగడం లేదంటూ చివరికి కలెక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు చీటింగ్ కేసులకు సంబంధించి 5 నుంచి 6 మంది బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. చీటీల వ్యాపారాల మోసాలు జిల్లాలో చీటీల వ్యాపారాల పేరుతో మోసాలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారవేత్తల వరకు నెలనెలా క్రమం తప్పకుండా చీటీలు కడుతున్నారు. అయితే, చివరకు వ్యాపారులు ప్రజల డబ్బు చెల్లించకుండా పరారవుతున్నారు. లక్షల్లో కాకుండా కోట్లాది రూపాయల చీటీ డబ్బుతో కొందరు జంప్ అవుతున్నారు. ఇటీవల తణుకులో ఓ ఫైనాన్స్ వ్యాపారి కోట్ల రూపాయల చీటీ సొమ్ముతో పరారు కాగా, తాజాగా భీమవరం మండలంలోనూ రూ.కోట్లలో చీటీ డబ్బు మోసం జరిగిందంటూ బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కొందరు వ్యాపారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసి, అప్పుల ఊబిలోకి నెట్టి చివరికి ఆత్మహత్యల వరకు తీసుకువెళ్తున్నారు. ఉద్యోగాలు, గల్ఫ్ మోసాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి కొందరు లక్షల రూపాయలు గుంజుతున్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ ఏజెంట్లు ముందుగా డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకుని మోసం చేస్తున్నారు. మరికొందరు అక్కడికి వెళ్లిన తర్వాత కష్టమైన పనుల్లో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్, మహిళల మోసాలు ప్లాట్ల కొనుగోలు: జిల్లాలో కొందరు రియల్టర్లు అక్రమ లేఅవుట్లు వేసి, దారులు లేకపోయినా ఉన్నాయని నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం బాధితులు ఇటీవల కలెక్టర్‌ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డ్వాక్రా మోసాలు: గతంలో కొందరు మహిళలు చీటీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడగా, ఇటీవల కొందరు డ్వాక్రా ఆర్పీలు, వీఏఓలు, గ్రూప్ లీడర్లు తోటి మహిళల బ్యాంకు రుణాల సొమ్మును స్వాహా చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఫేక్ రిజిస్ట్రేషన్లు: సబ్–ఇన్స్పెక్టర్లు లేదా రిజిస్ట్రార్ల అవినీతి కారణంగా కొడుకులు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఆస్తులు రాయించుకోవడం, హక్కుదారుల ప్రమేయం లేకుండా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ఏకై క రక్షణ. ఉద్యోగాలు, గల్ఫ్ ప్రయాణాల పట్ల యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రిజిస్టర్డ్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి. చీటీలు వేసే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. రియల్ ఎస్టేట్‌లో స్థలాలు కొనేప్పుడు అన్ని నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. డ్వాక్రా మహిళలు వాయిదాలు చెల్లించేటప్పుడు పొదుపు, లోను పుస్తకాలను సరిచూసుకోవాలి తప్ప ఇతరుల చేతికి నేరుగా నగదు ఇవ్వకూడదు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు -
సాయం పేరుతో స్వాహా
కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాల్సిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, దాన్ని కూడా తమ స్వాహా పర్వానికి అనుకూలమైన ఆదాయ వనరుగా మలుచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం విజయవాడలో సంభవించిన వరదల వేళ, సహాయక చర్యల పేరుతో స్వల్పంగా ఖర్చు చేసి.. కొండంత బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: 2024 సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్‌నగర్, దాని పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సమయంలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టమైన ఆదేశాలిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహార పంపిణీ చేపట్టాలని, సమీప మున్సిపాలిటీల నుంచి పారిశుధ్య కార్మికులను మాత్రమే పంపాలని సూచించారు. అయితే ప్రజాప్రతినిధుల మెప్పు కోసమంటూ ముందుకొచ్చిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు.. ఈ ఆదేశాలను పక్కనపెట్టి సహాయక చర్యల పేరుతో ఏకంగా రూ. 3 కోట్ల కంటే పైగా నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ. 2.75 కోట్ల నామినేషన్ బిల్లులు సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు ఆహార సరఫరా, పారిశుధ్య కార్మికుల కేటాయింపు పేరుతో తొలివిడతగా రూ. 55 లక్షల బిల్లులను అధికారులు సిద్ధం చేసి ఏలూరు జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వికి సమర్పించగా, ఆమె వాటిని మంజూరు చేశారు. అయితే అక్కడితో ఆగకుండా మళ్లీ భారీ మొత్తంలో బిల్లులు పట్టుకుని రావడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమోదించలేదు. కలెక్టర్ నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గని అధికారులు, మున్సిపల్ నిధుల నుంచే చెల్లించుకోవచ్చనే ధీమాతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన 294 నామినేషన్ పనులలో 12 బోగస్ బిల్లులను చేర్చారు. శ్రీ సాయి ఏజెన్సీ పేరుతో రూ. 2.75 కోట్లను చెల్లించి, ఆపై తమ వాటాలను పంచుకున్నట్లు సమాచారం. రూ.1,500 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న విజయవాడ నగరానికి, కేవలం రూ.200 కోట్ల బడ్జెట్ ఉన్న ఏలూరు కార్పొరేషన్ నుంచి ఈ స్థాయిలో సాయం చేయడం, దానికి భారీగా నామినేషన్ బిల్లులు సృష్టించడం గమనార్హం. దాతల సాయమూ గాయమే : ఒకవైపు ప్రభుత్వ నిధులను మళ్లిస్తూనే, మరోవైపు ఏలూరులోని స్థానిక దాతల నుంచి కూరగాయలు, పాలు, తాగునీరు, నిత్యావసరాలు, ఆహార పొట్లాలు సేకరించారు. ఇలా సుమారు రూ. 50 లక్షల విలువైన వస్తువులను విరాళాల రూపంలో సమీకరించినప్పటికీ, వాటిని ఎవరికి పంపిణీ చేశారో, ఎక్కడ వినియోగించారో వివరాలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి మెప్మా పరిధిలోని డ్వాక్రా మహిళల ద్వారా భోజనం సిద్ధం చేసి పంపిణీ చేశారు. ఎక్కడా ఆహార సరఫరాకు ప్రత్యేక కాంట్రాక్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఏజెన్సీ నుంచి కార్మికులను పంపినందుకు రూ.4.18 లక్షల బిల్లు, సెప్టెంబర్ 2న అల్పాహారం, రెండు పూటల భోజనానికి రూ.15.36 లక్షల బిల్లు, 3న రూ.29.77 లక్షలు, 4న రూ. 29.23, 5న 27.46 లక్షలు అదే రోజు కేవలం డిన్నర్‌కు రూ.18.60 లక్షలు, 6న రూ.35.44 లక్షలు, 7న రూ.35.44 లక్షలు, 8న రూ.35.44 లక్షలు, 9న రూ.35.44లక్షల విలువైన బిల్లులు శ్రీసాయి ఏజెన్సీకి చెల్లించారు. ఈ విధంగా కాంట్రాక్టర్‌కు జమ అయిన సొమ్ము నుంచి బడా నేతలు, ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే సుమారు ఎనిమిది మంది ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపై ఆ మొత్తాన్ని కీలక వ్యక్తులకు చేరవేసినట్లు తెలుస్తోంది. మానవతా దృక్పథంతో చేయాల్సిన సాయాన్ని కూడా అవినీతికి వేదికగా మార్చుకోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో మరో దోపిడీ పర్వం కృష్ణా వరదల సమయంలో రూ.2.50 కోట్లకుపైగా దోపిడీ రూ.55 లక్షల బిల్లులు తొలుత మంజూరు చేసిన కలెక్టర్ మళ్లీ నామినేషన్ ప్రాతిపదికన రూ.2.75 కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు -
ఒలింపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యం
భీమవరం: ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఏషియన్ గేమ్స్ ఆర్చరీ విజేతలు బొమ్మదేవర ధీరజ్, తిరుమూరి గణేష్ మణిరత్నం తెలిపారు. భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మంగళవారం విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. తమ సంస్థ క్రీడాకారులు దేశానికి పతకాలు తీసుకురావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాలతో దేశ కీర్తిని పెంచాలని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జయరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: ఇటీవల తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో కడియద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం పి. సుబ్బలక్ష్మి తెలిపారు. ఎంపికై న వారిలో ఎం. మణికంఠ, జి.సాయితేజ, కె. సాయి చంద్రశేఖర్, బి.నాగదుర్గ, బి.మానస వెంకట సాయి మాధవి ఉన్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, పీడీ కె.సుభద్రను హెచ్ఎం అభినందించారు. -
మావుళ్లమ్మ సేవలో ‘తెల్ల కాగితం’ చిత్ర యూనిట్
భీమవరం (ప్రకాశంచౌక్): కుటుంబ సమేతంగా చూడదగ్గ సందేశాత్మక చిత్రం తెల్ల కాగితం మంచి విజయం సాధించడం అభినందనీయమని శ్రీమావుళ్లమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బోండాడ నాగభూషణం అన్నారు. మంగళవారం ఈ చిత్ర హీరో రోషన్, హీరోయిన్ నక్షత్ర, దర్శకుడు రమేష్‌లతో కూడిన చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం ఆలయ కళా వేదికపై అరసవల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భీమవరానికి చెందిన రమేష్ దర్శకత్వం వహించి విజయం సాధించడం స్థానికులకు గర్వకారణమన్నారు. అనంతరం భీమవరంలోని పద్మాలయ థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకులతో కలిసి విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. -
సాంకేతిక ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి
తాడేపల్లిగూడెం: విద్యార్థులు ఏఐ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, భారతీయ డేటా ఆధారంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ నిట్ డిసిగ్నేటెడ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఏపీ నిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఏఐకోష్ విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏఐ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు గమనించాల న్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, డీన్ హిమబిందు, వి.సందీప్ పాల్గొన్నారు. -
విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు, ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి చిత్స అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృష్ణా జిల్లా జనార్ధనపురం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, జిల్లా స్థాయి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం అభిమ్ నిధులతో రూ.3.56 కోట్లతో 12 పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.9 కోట్లతో 32 పనులు, ఎన్హెచ్ఎం నిధులతో రూ.7.93 కోట్లతో 104 పనులు ౄ మొత్తం రూ.20.49 కోట్ల అంచనా వ్యయంతో 148 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.3.38 కోట్లతో 100 పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పెనుగొండ మండలం తమరాడ, యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామాలలో నూతన క్లినిక్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవిబాబు, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
ఉద్యానవర్సిటీకి నూతన పేటెంట్లు
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాల చివరి సంవత్సర విద్యార్థులు తేనెపట్టు మైనం (బీ వ్యాక్స్) ఆధారిత వినూత్న ఉత్పత్తులను రూపకల్పన చేసి, మొత్తం ఆరు పేటెంట్లతో నూతన మైలురాయిని అధిగమించారని వర్సిటీ ఉపకులపతి (వీసీ) డాక్టర్ కె.ధనుంజయరావు అభినందించారు. మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన బీ వ్యాక్స్ షూ పాలిష్, ఫర్నీచర్ పాలిష్, హెయిర్ కండిషనర్ ఉత్పత్తులకు సంబంధించిన మూడు కొత్త పేటెంట్లు అధికారికంగా ప్రచురితం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాలను మేళవించి నూతన వ్యాపార ఆలోచనలను వెలికితీయడంలో కోర్సు ఇన్చార్జి ఇమ్మాన్యుయేల్ పర్యవేక్షణ, ప్రయోగాత్మక అభ్యసన ప్రక్రియ ఎంతగానో తోడ్పడ్డాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, డీన్లు పాల్గొన్నారు. -
వృద్ధుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు
భీమవరం: వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు వృద్ధాశ్రమాలు, వయోవృద్ధుల కేంద్రాలు, సామాజిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వారి రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటి ద్వారా హక్కులు కాపాడుకోవచ్చని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని జేసీ సత్కరించారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫోరం గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, అధ్యక్షుడు నల్లం వెంకటకృష్ణనాగేశ్వరరావు, జిల్లా వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ప్రభాకరరావు, సూపరింటెండెంట్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికుల శ్రమయే మూలధనమైనప్పటికీ, వారి జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభల్లో ఆయన ప్రసంగించారు. శ్రమకు తగిన ప్రతిఫలం, ఉద్యోగ భద్రత, పని ప్రదేశాల్లో రక్షణ వంటి ప్రాథమిక హక్కుల కోసం కార్మికులు నేటికీ పోరాడాల్సి రావడం విచారకరమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థల ఏర్పాటు, లక్షలాది మందికి ఉపాధి లభించడంలో ఏఐటీయూసీ పోరాటాల పాత్ర కీలకమని గుర్తుచేశారు. నెక్కంటి సుబ్బారావు, కోనాల భీమారావు, మందుల లక్ష్మి, తాటికొండ వాసు, ఎస్. వెంకటసుబ్బయ్య, అల్లం సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏపీ జేఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం భీమవరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వీరవాసరం: క్యాన్సర్ అవగాహన, పరిశోధనల నిధుల సేకరణే ధ్యేయంగా జపాన్‌లో జరిగే ‘సి2సి4సి ఆసియా పసిఫిక్’ అంతర్జాతీయ సైకిల్ యాత్రకు వీరవాసరం మండలం నడపనవారిపాలేనికి చెందిన కొత్తపల్లి త్రిలోక్ ఎంపికయ్యారు. అక్టోబర్ 6 నుంచి 20 వరకు జరిగే ఈ యాత్రలో 6 దేశాల ప్రతినిధులు 1,800 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. త్రిలోక్ అక్టోబర్ 12 నుంచి 14 వరకు సైకిల్ యాత్ర చేపడతారు. ఈ యాత్ర ద్వారా భారత రైడర్ల బృందం సేకరించిన రూ. 12 లక్షల నిధులను ముంబై టాటా మెమోరియల్ ఆస్పత్రికి అందించనున్నారు. త్రిలోక్‌ను గ్రామస్తులు అభినందించారు. -
పరిహారం.. పరిహాసం
పెచ్చుమీరుతున్న మోసాలు జిల్లాలో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పీజీఆర్ఎస్లో చీటింగ్ కేసులకు సంబంధించి బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. 8లో uసాగులో విపత్తులు కర్షకులను కుదేలు చేస్తున్నాయి. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. పరిహారం విడుదలకు తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవల అర్ణబ్ తుఫానుతో జిల్లాలోని దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. గత ఖరీఫ్‌లో మొంథాతో రూ. 23 కోట్లు పంట నష్టం వాటిల్లి ఏడాదవుతున్నా ఇంకా పరిహారం అందించలేదు. బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2026సాక్షి, భీమవరం : జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. ముందుగా సాగు చేపట్టిన తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతంలో వరి పంట గింజ గట్టిపడుతుండగా, సాగు ఆలస్యమైన మిగిలిన ప్రాంతాల్లో పాలుపోసుకునే దశల్లో ఉంది. బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా వారం రోజుల క్రితం కురిసిన కుంభవృష్టితో జిల్లా లోని వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. తాడేపల్లిగూడెం రూరల్, అత్తిలి, యలమంచిలి, పాలకొల్లు, వీరవాసరం, ఆచంట తదితర 14 మండలాల్లోని 77 గ్రామాల పరిధిలో 2099 మంది రైతులకు చెందిన పంట నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అధికంగా తాడేపల్లిగూడెం రూరల్‌లో 1563 ఎకరాలు, అత్తిలిలో 701 ఎకరాల్లో పంట దెబ్బతింది. ముంపునుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అగచాట్లు పడాల్సి వచ్చింది. రోజులు తరబడి పంట నీటమునిగిన పొలాల్లో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదైనా అందని పరిహారం గత ఖరీఫ్ చివరి దశలో వచ్చిన మోంథా తుఫాను పంటకు తీవ్ర నష్టం కలిగించింది. రోజుల తరబడి పొలాల్లోని ముంపునీరు బయటకు లాగక పొట్టలు కుళ్లిపోయి ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజల శాతం పెరిగిపోయింది. 4,207 హెక్టార్లలోని పంట నీట మునగ్గా, 6,560 హెక్టార్లలోని పంట నేల వాలినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలో జిల్లాలోని 9,201 (సుమారు 23002 ఎకరాలు) హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. ప్రాథమిక అంచనా కంటే తుది నష్టం భారీగా తగ్గించేశారన్న విమర్శలున్నాయి. అత్యధికంగా నరసాపురంలో 2,722 మంది రైతులకు చెందిన 1,281 హెక్టార్లు, పెంటపాడులో 2,230 మంది రైతులకు చెందిన 1,078 హెక్టార్లలో నష్టం జరిగింది. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, వీరవాసరం మండలాల్లో 500 హెక్టార్లకు పైబడి, ఆకివీడులో 464 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. హెక్టారుకు రూ. 25 వేలు చొప్పున రూ. 23 కోట్లు సాయాన్ని ప్రభుత్వం రైతులకు అందించాల్సి ఉంది. నష్టం జరిగి ఏడాదికావస్తున్నా చంద్రబాబు సర్కారు ఇంకా పరిహారం అందించకపోవడం గమనార్హం. తెరపైకి నీటి తీరువా మరోవైపు గత ప్రభుత్వం పక్కన పెట్టేసిన నీటితీరువాను తెరపైకి తెచ్చింది. పాత బకాయిలు పేరిట రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో ఉంది. పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారమవుతోంది. ఎరువులు కొరత, సాగునీటి ఎద్దడి, కొనుగోళ్లలో దళారుల దోపిడీతో పంటకు గిట్టుబాటు ధర అందకపోవడం తదితర రూపాల్లో గత రెండేళ్లుగా రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.రైతుపై ప్రీమియం భారం పడకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు సర్కారు తొలి ఏడాది నుంచే ఎగనామం పెట్టింది. దీంతో రైతులే ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820లు బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ. 205ల) కాగా, 1.5 శాతం (రూ. 615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై సుమారు రూ.28 కోట్లు భారం పడుతున్నట్టు అంచనా. విపత్తులతో కర్షకులు కుదేలు వేల ఎకరాల్లో పంటను ముంచిన అర్ణ్ణబ్ మొంథాతో రూ. 23 కోట్లు పంట నష్టం ఏడాదైనా ఇంకా అందని పరిహారం వైఎస్సార్ సీపీ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారం జమ -
బొగ్గుమంటున్న పల్లెలు
పశుగ్రాసం పెంపకంలో.. రైతులు పశుగ్రాసం పెంపకంలో మెలకువలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నామన్నారు. 8లో uమంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2026చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గంలోని రేచర్ల పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమ పచ్చని పంట పొలాలను బొగ్గు గనుల ప్రయోగాలకు బలిపీఠం చేయొద్దంటూ రైతులు నిరసన బాట పట్టారు. అధికారుల ఏకపక్ష వైఖరి, కార్పొరేట్ సంస్థల గుట్టుచప్పుడు కాని వ్యవహారాలపై మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రసాభాసగా అవగాహన సదస్సు వెంకటాపురం గ్రామంలో ఈనెల 1న రెవెన్యూ అధికారులు, రిలయన్స్ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు తీవ్ర నిరసనల మధ్య రద్దయింది. చట్టబద్ధంగా గ్రామసభ నిర్వహించి తమ అభిప్రాయాలు సేకరించాలని రైతులు పట్టుబట్టగా, అధికారులు అందుకు విరుద్ధంగా ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు అధికారులను అడ్డుకున్నారు. ‘మా భూములపై నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది’, ‘యూసీజీ గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినా దాలు చేశారు. దీంతో చేసేది లేక నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, తహసీల్దార్ దొర, రిలయన్స్ ప్రతినిధులు వెనుదిరిగారు. పర్యావరణ ప్రభావంపై దాగుడుమూతలు గ్రామసభలో 80 శాతం మంది ప్రజల ఆమోదం ఉంటేనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని, లేకుంటే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇక గ్రామసభలతో నిమిత్తం ఉండదంటూ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఎందుకు బహిర్గతం చేయలేదని రైతులు నిలదీస్తున్నారు. భూసేకరణ పరిధి 8,500 ఎకరాలే అని సంస్థ చెబుతున్నా భూగర్భంలో బొగ్గును అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించడం వల్ల వెలువడే తీవ్ర వేడి, రసాయనాలు పరిసరాల్లోని వేలాది ఎకరాల సారవంతమైన నేలను నిస్సారంగా మారుస్తాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు విషతుల్యమై గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టు వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లిన దాఖలాలు ఉండటంతో ఇక్కడ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేట్ ఒత్తిళ్లు.. న్యాయపోరాటానికి సన్నద్ధం గత మే నెలలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఏకంగా రూ.37,500 కోట్ల సబ్సిడీకి ఆమోదం తెలపడంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో పాలకులు ఉన్నట్టు తెలుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర పాలకుల నుంచి రైతులకు మద్దతు కరువవడంతో పాలకులు తమ గోడు వినకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడమే శరణ్యమని రైతులు నిర్ణయించుకున్నారు. నేలతల్లిపై నిప్పుల కుంపటి రిలయన్స్ యూసీజీ ప్రాజెక్టుపై ఆగ్రహం గ్రామసభ లేకుండా ముందుకెళ్లేది లేదని తెగేసి చెప్పిన రైతులు న్యాయపోరాటానికి సిద్ధం చింతలపూడి బ్లాక్‌లో 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్ టన్నుల ఎ–12 రకం బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. రేచర్ల బ్లాక్‌లో 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్ టన్నుల ఎ–13 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తం రెండు బ్లాకుల్లో కలిపి ఏకంగా 3,130.61 మిలియన్ టన్ను ల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. వీటిని రిలయన్స్ సంస్థకు కేటాయించారు. -
పోలవరం జల విద్యుత్‌లో ముందడుగు
పోలవరం రూరల్: పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో ముందడుగు పడింది. ప్రాజెక్టు పరిధిలోని తొలి యూనిట్లో కీలకమైన స్టాటర్ ఏర్పా టు ప్రక్రియను ఏపీ జెన్కో, నిర్మాణ సంస్థ ఇంజ నీరింగ్ బృందాలు సోమవారం లాంఛనంగా ప్రా రంభించాయి. దీంతోపాటు రోటర్ బిగింపు పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్కో (హైడల్) విభాగం డైరెక్టర్ సుజయ్‌కుమార్, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ప్రసేన్‌జిత్ మజుందార్, ఏపీ జెన్కో సీఈలు రవీంద్రరెడ్డి, విశ్వేశ్వరరావు తదితరులు క్షేత్రస్థాయిలో పాల్గొని నిర్మాణ పురోగతిని, పరికరాల అమరిక నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లను నిర్మిస్తున్నారు. ప్రతి యూనిట్ ద్వారా 80 మెగావాట్ల చొప్పున మొత్తం 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది ప్రణాళిక. -
వృద్ధులే టార్గెట్
వృద్ధులే లక్ష్యంగా ఫేస్బుక్ వేదికగా ఎరవేసి, అదును చూసి హనీట్రాప్ చేసి దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో uమా తాతముత్తాతల కాలం నుంచి ఈ భూముల మీదే బతుకుతున్నాం. మా ఊళ్ల ను శ్మశానాలుగా మార్చే ఈ ప్రాజెక్టు మాకొద్దు. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఏం జరుగుతుందో ఒక్కరూ చెప్పట్లేదు. అడిగితే దాటవేస్తున్నారు. ప్రాణాలు పోయినా మా భూములను ఇచ్చేది లేదు. కోర్టులకై నా వెళ్లి మా నేలను కాపాడుకుంటాం. – యర్రంశెట్టి రామకృష్ణారావు, రైతు, సుబ్బారాయుడుగూడెం కంపెనీ వాళ్లు 8,500 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు. అయితే భూ గర్భంలో మంటలు పెట్టి గ్యాస్ తీస్తే ఆ పక్కనున్న వే లాది ఎకరాల భూములు, భూగర్భ జలాలు నాశనం కావా? చుట్టుపక్కల ఊళ్లన్నీ రోగాల బారిన పడవా? గ్రామసభ పెట్టి అభిప్రాయం తీసుకోకుండా ఎలా ముందుకు వెళతారు. – ఆది హరికృష్ణ, రైతు, శెట్టివారిగూడెం -
అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని పక్షంలో అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ పి.ప్రభాకరరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. అక్రమ లేవుట్లలో ఇక్కట్లు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారని, 18 అడు గుల రోడ్డు చూపించారని, అయితే రోడ్డుకు సంబంధించి స్థలం యజమాని తమకు దారి లేకుండా చేశారని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి : జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు సమస్యల పరిష్కరం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఉదోగ్య భద్రత కల్పించాలని, గ్రాస్ జీతం పునరుద్ధరించాలని, 2018 నుంచి అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలని కోరారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గళమెత్తిన ‘ఉపాధి’ ఉద్యోగులు వీబీజీ రామ్‌జీ (ఉపాధి హామీ) పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరం కావడం లేదన్నారు. పీఆర్సీ, ఉద్యోగ భద్రత, హెల్త్‌కార్డులు, పదోన్నతి, కారుణ్య నియామకం, సమాన పనికి సమాన వేతనం తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. డిప్యూటీ సీ ఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ సమస్యల పరి ష్కారానికి హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ నాగరాణి -
గ్యాస్ లీకై మంటల్లో గాయపడిన వృద్ధురాలు మృతి
భీమవరం అర్బన్: గ్యాస్ లీకై మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ ఏఎస్సై వైవీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన జల్లా మహలక్ష్మి (81) ఆదివారం తన పెద్దకూతురు ఇంటికి వెళ్లి 4 రోజులు ఉండి వచ్చి తన ఇంటి తలుపులు తీయగానే గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది. ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఏఎస్సై వైవీ సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నూజివీడు: మండలంలోని జంగంగూడెం పరిధిలో సోమవారం పిడుగు పడి పురిటిపాటి వెంకట రెడ్డి(70) అనే వృద్ధుడు మృతిచెందాడు. గేదెలు మేపుకునేందుకు జంగంగూడెంకు చెందిన వెంకటరెడ్డి పొలాల్లోకి గేదెలను తోలుకెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉరుములు, మెరుపులతో జల్లులు పడగా అక్కడ అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని వారు చూసి సమాచారాన్ని గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. పిడుగుపడి వృద్ధుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
భార్యపై భర్త దాడి
పాలకొల్లు సెంట్రల్: భార్యపై కక్ష పెంచుకుని బీరు సీసాతో కిరాతకంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీనగర్‌కు చెందిన డి. కుమారికి రమేష్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇద్దరూ గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం కుమారి తన చెల్లెలితో కలిసి మారుతి సెంటర్లోని సినిమా థియేటర్‌కు మధ్యాహ్నం 2 గంటల షోకి వెళ్లింది. సినిమా ముగించుకుని బయటకు వస్తుండగా, థియేటర్ గేటు వద్దే కాపు కాచిన రమేష్ ఆమె వద్దకు వచ్చాడు. ముందుగా తన వద్ద ఉన్న బీరు సీసాతో తన తలపైన కొట్టుకుని, ఆపై అదే సీసాతో ఆమె వీపు, మెడపై విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో భుజంపై తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నిన్ను పొడిచేశాను, ఇక వెళ్లిపోదాం రా అంటూ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు 108 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
8 నుంచి ఆక్వాఎక్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్
కాళ్ల: ఈ నెల 8, 9, 10 తేదీలలో భీమవరం సమీపంలోని పెదఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఆక్వాఎక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆక్వా ఎక్స్ ఫౌండర్, చైర్మన్ వేణు దంతులూరి తెలిపారు. పెదఅమిరంలోని డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో రఘురామకృష్ణంరాజుతో కలిసి సోమవారం బ్రోచర్ ఆవిష్కరించారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా విధానాలు ఆక్వా రంగంలో లభించే అవకాశాలపై ఈ ఎగ్జిబిషన్న్లో సమగ్రంగా వివరించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులతో పాటు యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రదర్శనలో క్రియాశీలకంగా పాల్గొని అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఆక్వా ఎక్స్ ఇండియా డైరెక్టర్ రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఉండి: స్థానిక బాలాజీరావుపేటలోని జన్మభూమి పార్క్ ఎదురుగా ఉన్న విశ్వభారతి ఎగ్స్ షాపులో పట్టపగలే దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి షాపు గల్లాపెట్టలో ఉన్న సుమారు రూ.17,000 నగదును ఎత్తుకెళ్లాడు. పక్కనే ఉన్న తౌడు కొట్టును శుభ్రం చేసుకుంటున్న షాపు యజమాని కే. విశ్వేశ్వరరావుకు మొబైల్ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ రావడంతో, ఆయన తన కుమారుడిని వెళ్లి చూడమన్నారు. అప్పుడు ఒక వ్యక్తి షాపులో నగదు దొంగిలిస్తున్నట్లు వారు గుర్తించారు. యజమాని, ఆయన కుమారుడు చుట్టుపక్కల గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో, సీసీటీవీ ఫుటేజ్‌తో సహా ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమడోలు: ఐసీఏఆర్ పీజీ ప్రవేశ పరీక్షల్లో భీమడోలుకు చెందిన పనస ఉదయలక్ష్మి జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 10వ ర్యాంకు సాధించింది. ప్లాంట్ బయోటెక్నాలజీ మేజర్ గ్రూపులో నిర్వహించిన పరీక్షల్లో సత్తాచాటి ఢిల్లీ అగ్రికల్చర్ వర్సిటీలో ఎంఎస్సీ(అగ్రికల్చర్) సీటు దక్కించుకుంది. బాపట్ల వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన ఆమె వ్యవసాయ శాస్త్రవేత్త కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆమె తండ్రి ప్రసాద్ పోలీస్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. -
క్షేత్రంలో వరుణ యాగానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం(శివాలయం)లో ఈ నెల 6 నుంచి 8 వరకు వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకం, వరుణ యాగం, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా ఈ పూజలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాలు ఇలా.. ● 6న ఉదయం 6.54 గంటలకు గణపతి పూజతో ప్రారంభించి వరుణ జపాలు నిర్వహిస్తారు. ● 7న ఉదయం 8 గంటలకు మండప పూజలు, వరుణ జపాలతో పాటు వారుణ సువాక, శత సువాక, రుద్ర పారాయణలు నిర్వహిస్తారు. ● 8న ఉదయం 8 గంటలకు మూలవిరాట్‌కు సహస్ర ఘటాభిషేకం, 11 గంటలకు వరుణ యాగం, హోమం, సాయంత్రం 4 గంటలకు మహా పూర్ణాహుతి, ఆశీర్వచనం. -
ఫార్మా కంపెనీపై విజిలెన్స్ దాడి
తాడేపల్లిగూడెం: పట్టణంలోని సీజీఆర్ ఫార్మా కంపెనీపై సోమవారం డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అధి కారులు దాడి చేశారు. కంపెనీ గోదాముల్లో సో దాలు చేశారు. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ పట్టణానికి చెందిన చలంచర్ల మురళీ కుటుంబానికి చెందిన సీజీఆర్ ఫార్మా కంపెనీపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో దాడులు చేశామన్నారు. మందుల అమ్మకాలు, రికార్డులు, నగదు లావాదేవీలు, గోదాముల్లో నిల్వలు తదితర అంశాలను తనిఖీ చేశామని, అనధికారికంగా మందుల విక్రయాలు జరిగినట్టు గుర్తించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.కోటికి పైగా జీఎస్టీ ఎగవేత జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. కంపెనీ రికార్డులు, హార్డ్ డిస్కులను స్వాధీ నం చేసుకున్నట్టు సమాచారం. రూ.100 మందును రూ.20కు విక్రయించినట్టు బిల్లులు ఉన్నాయని, ఇదే విషయాన్ని సంస్థ ప్రతిఽనిధి కూడా అంగీకరించారన్నారు. ఏ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నారు, వైద్యులకు ఏమేరకు నజరానాలు ఇస్తున్నామనే విషయాలు కూడా చెప్పారన్నారు. ఈ యజమాని కుటుంబం పేరిట మూడు కంపెనీలు ఉన్నాయని, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని అరుణ్‌బాబు తెలిపారు. మరో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగుతాయన్నారు. అక్రమాలు జరిగినట్టు నిర్ధారణయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
బాధితులపై అలసత్వం వద్దు
భీమవరం: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పలువురి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంపై స్టేషన్ అధికా రులతో మాట్లాడారు. మొత్తంగా 9 అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వే ధింపులు, ఆస్తి తగాదాలు, సైబర్ మోసాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలపై బాధి తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు ఎస్పీ భరోసా కల్పించారు. జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం: దేశ ప్రగతికి ఉపయోగపడే డ్రోన్ టెక్నాలజీ రూపకర్తలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అని ఎన్ఐటీ రూర్కెలా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పీఎస్ బాలాజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన డిజైన్ అండ్ ఏరో మెకానిక్స్ ఆఫ్ మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ ఫర్ సర్వేలెన్స్ విత్ సెన్సార్ ఫ్యూజన్ బూట్ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ ఏడాదిలో 34 వర్క్‌షాప్‌లు నిర్వహించామన్నారు. మరో ప్రాజెక్ట్ ఇంజనీర్ చికేశ్ రంజన్ మాట్లాడుతూ ఐదు రోజుల క్యాంపులో డ్రోన్ స్పేర్ పార్ట్స్ బిగించి ఫ్లై చేసేలా శిక్షణ ఇస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ డ్రోన్ టెక్నా లజీ వినియోగం వ్యవసాయంలో బాగా పెరి గిందని, భవిష్యత్‌లో మరింత పెరుగుతుందన్నారు. కో–ఆర్డినేటర్ ఆర్.వేణురెడ్డి, బూట్ క్యాంప్ కో–ఆర్డినేటర్ వి.మణికాంత్, ఇంద్రారెడ్డి, ఎంవీవీ కృష్ణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): తిరుమలలో ని త్యాన్నదానానికి కంతేటి జానకి జ్ఞాపకార్థం ఆ మె భర్త మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాాజు సోమవారం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర కార్యాలయంలో రూ.1,01,01,006 అందజేశారు. భీమవరం హౌసింగ్ బోర్డ్ వేంకటేశ్వస్వామి వారి ఆలయ అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, కృష్ణప్రియ సుబ్బరాజు పాల్గొన్నారు. వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ జట్లను ఎంపిక చేయనున్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ కళాశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు ఫెడరేషన్ కార్యదర్శులు జి.నర్మద, మహమ్మద్ కుద్దూస్ ప్రకటనలో తెలిపా రు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 9885158366లో సంప్రదించవచ్చు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఏలూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై.విశ్వమోహన్‌రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బీసీ, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని ఈనెల 20లోపు ఏ లూరులోని బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఆదాయం ఘనం.. అభివృద్ధి కనం
● చిట్టడవిల్లా ఏఎంసీల ప్రాంగణాలు ● శిథిలావస్థలో భవనాలు ● ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు ! ఆకివీడు: రైతులకు సేవలందించాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులు చిట్టడవులను తలపిస్తూ అధ్వానంగా మారాయి. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం ఏ మాత్రం జరగడం లేదు. ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి ఏఎంసీలు ఉన్నాయి. మార్కెట్ యార్డు కమిటీలకు పాలకవర్గాల్ని ఏర్పాటు చేసినా ఖజానాలో చిల్లిగవ్వ కూడా ఉంచకుండా ప్రభుత్వం దొలిచేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆకివీడు ఏఎంసీకి ఏటా రూ.6 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సుమారు రూ.40 కోట్లకు పైగా నిధులున్నాయి. అలాగే ఉండి ఏఎంసీకి రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఆయా మార్కెట్ యార్డుల్లో సిబ్బంది జీతా ల బిల్లులు తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల కావలేదు. ప్రభుత్వం ఇతర అవసరాలకు మార్కెట్ కమిటీల నిధులను తరలిస్తోందని రైతులు అంటున్నారు. యార్డుల్లో పనులు లేవు మార్కెట్ యార్డుల్లో పార మట్టి తీసేందుకు కూడా ఖజానాలో రూపాయి లేదు. దీంతో చినుకపడితే ప్రాంగణాలు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే ప్రాంగణాల్లో పచ్చగడ్డి, మొక్కలు పెరుగుతున్నాయి. క్రిమికీటకాలకు, విషసర్వాలకు నిలయంగా మారు తూ చిట్టడవులను తలపిస్తున్నాయి. షెడ్లు, భవనాలు శిథిలం ఏఎంసీల్లో భవనాల్లో శిథిలవుతున్నాయి. భవనాలపై నీరు నిలిచి శ్లాబులు పెచ్చులూడుతున్నాయి. రేకుల షెడ్లు తుప్పుపట్టి పోతున్నాయి. అలాగే కళ్లాలు నీరుగారిపోతున్నాయి. కొన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. పరిస్థితి ఇలా ఉన్నా నిధుల లేమితో ఎలాంటి పనులు చేయలేకపోతున్నారు. స్టోరేజ్‌లుగా మార్చాలి మార్కెట్ యార్డులను ఐస్ ప్లాంట్లు, రొయ్యలు స్టోరేజ్ గొడౌన్లు, ప్రొసెసింగ్ సెంటర్లు, ప్యాకింగ్ కేంద్రాలకు అనుకూలంగా మార్చాలని రైతులు కో రుతున్నారు. అలాగే ఓపెన్ గోడౌన్లలో సంత మా ర్కెట్‌ను ఏర్పాటుచేయాలని అంటున్నారు. వర్షం నీరు నిలిచి ఇలా.. -
ఆలోచనలను అంకుర సంస్థలుగా మార్చుకోవాలి
తాడేపల్లిగూడెం: సృజనాత్మక ఆలోచనలను విద్యార్థులు అంకుర సంస్థలుగా మలచుకోవాలని ఏపీ నిట్ డిజిగ్నేటెడ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వెంకటకృష్ణారావు కోరారు. ఏపీ నిట్‌లోని సంస్థాగత ఆవిష్కరణ మండలి (ఐఐసీ), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (రాజమహేంద్రవరం – ఆర్టీఐహెచ్) సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న స్పార్క్ ఫ్యూచర్ ఫౌండర్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం బృందావన్ భవన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారి ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా విద్యాసంస్థల్లో ఆవిష్కరణల వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ప్రొఫెసర్ జి. రవికిరణ్ శాస్త్రి మాట్లాడుతూ.. పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్ వి. సందీప్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్కృతిని పెంపొందించేందుకు ఐఐసీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఆర్టీఐహెచ్ రాజమండ్రి ఇన్నోవేషన్ హెడ్ డాక్టర్ చంద్రప్రకాశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రారంభ దశ ఆలోచనలను గుర్తించి, వాటిని మెరుగుపరిచి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ సమన్వయకర్త టి. కార్తికేయశర్మ, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ హిమబిందు, ఆచార్యులు శ్రీఫణికృష్ణ, టి. కిరణ్, తపస్, సుదర్శన్ దువా తదితరులు పాల్గొన్నారు. -
పశుగ్రాసం పెంపకంలో మెలకువలతో మేలు
చింతలపూడి : పశుగ్రాసం పెంపకంలో మెలకువలు పాటించాలి. రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణ ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో పశుపోషణలో పశుగ్రాసం కీలక పాత్ర పోషిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో పాడి పశువులను పెంచుకునే రైతులు పశుగ్రాసం పండించడంలో మెలకువలు తెలుసుకుంటే మేలు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు వై. సుబ్బారావు తెలియజేస్తున్నారు. ప్రస్తుత ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో పశువులకు పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లో పాడిని నమ్ముకున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పశుపోషణలో 70 శాతం ఖర్చు మేతకే అవుతుందని తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పశుగ్రాసం పండించుకుంటే.. వర్షాకాలంలో పశుగ్రాసం పండించుకుంటే వేసవిలో పశువుల పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన సూచిస్తున్నారు. పండ్ల తోటల్లోని మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, ఉలవ, పిల్లిపెసర, జనుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం ద్వారా పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. అంతేకాకుండా, దీనివల్ల భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూసారం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. జనుము ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని నేలల్లోనూ, అన్ని కాలాల్లోనూ కొద్దిపాటి నీటితో దీన్ని పండించుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ఫాస్ఫేట్తో కలిపి చల్లాలి. విత్తిన తర్వాత 40 నుంచి 50 రోజులకు ఇది కోతకు వస్తుంది. ఈ మేతను పూత దశలో కోసి ఎండుమేతగా వినియోగించుకుంటే పశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లిపెసర వరి సాగు చేసే అన్ని భూముల్లోనూ అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. సాధారణ భూముల్లో పచ్చిరొట్ట ఎరువుగా వాడినట్లయితే భూమికి మంచి బలం చేకూరుతుంది. శీతాకాలంలో రబీ పంటగానూ ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం వేర్లలో ఉండే నత్రజని బుడిపెలు భూమిని మరింత సారవంతం చేస్తాయి. వరి పంట కోయడానికి 3 నుంచి 4 రోజుల ముందు (భూమిలో తేమ ఉన్నప్పుడే) ఎకరానికి 10–15 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ఫాస్ఫేట్తో కలిపి చల్లుకోవాలి. 50 రోజుల్లో కోతకు వచ్చే ఈ పశుగ్రాసం ద్వారా ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. ఇతర రకాలు పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, జె–1006, విజయ కాంపోజిట్ రకాలు 85 రోజుల్లో ఒకేసారి కోతకు వస్తాయి. వీటిని పండ్ల తోటలు, పామాయిల్ తోటల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఇవి రైతులకు అధిక పశుగ్రాస దిగుబడులను అందిస్తాయి. ఇక పప్పుజాతి రకాలైన అలసందలు (బొబ్బర్లు) – రష్యన్ జైంట్, బుందేల్ లోబియ–1, 2, ఈసీ 4216–5287, కేబీసీ–2 మొదలైన రకాలు 55 నుంచి 60 రోజుల్లో ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందిస్తాయి. వై సుబ్బారావు,వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
రాజకీయ లబ్ధికే అటవీ భూముల ఆక్రమణ డ్రామా
● పేదలను రెచ్చగొడుతున్న టీడీపీ నేత ● పూర్వం ఆక్రమణలను సాకుగా చూపుతున్న వైనం ● చాట్రాయి మండలంలో కలకలం నూజివీడు: అటవీ భూములను ఆక్రమిస్తే అధికారులు అడ్డుకుంటారనే విషయం తెలిసినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలనే లక్ష్యంతో కొందరు టీడీపీ నాయకులు పేదలను రెచ్చగొట్టి అటవీ భూముల ఆక్రమణకు పురికొల్పుతున్నారు. ఇందులో భాగంగా చాట్రాయి మండలం పోలవరం పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకోవడానికి ఈ నెల 3న పేదలు ప్రయత్నించగా, అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, అడవిలో చెట్లు నరకడం చట్టరీత్యా నేరం. ఈ ప్రయత్నాలకు పాల్పడే వారిపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుంటారు. ఇవన్నీ తెలిసినా, తమ రాజకీయ మనుగడ కోసం టీడీపీ నాయకులు అమాయక పేదలను రెచ్చగొట్టి అటవీ భూముల్లోకి పంపడంపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది. పేదలను రెచ్చగొట్టి.. చాట్రాయి మండలం పోలవరం అటవీ బ్లాక్ ఆర్ఎస్ నంబరు 1 పరిధిలో దాదాపు 750 ఎకరాల అటవీ భూమి ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో, పేదలను రెచ్చగొట్టి అటవీ భూములను ఆక్రమించుకునేలా స్థానిక టీడీపీ నాయకుడే ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఒకవైపు పచ్చదనం తగ్గిపోయి ఎల్‌నినో ప్రభావంతో దుష్ఫలితాలను ఎదుర్కొంటున్న తరుణంలో, అడవిలోని చెట్లను నరికించి ఆక్రమించుకోవడానికి ఒక నాయకుడు ముందుండి నడిపించడం పట్ల అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, అడ్డుకున్న అధికారులపైనే లంచాలు తీసుకుంటూ అక్రమణలను ప్రోత్సహిస్తున్నారంటూ ’నిరాధార ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఆక్రమణలను సాకుగా చూపుతూ... పోలవరం అటవీ బ్లాక్‌లో కొంత మేర భూములను దాదాపు 20–25 ఏళ్ల క్రితం చుట్టుపక్కల ప్రాంతాల పేదలు భూపోరాటాల పేరుతో ఆక్రమించుకొని, అందులో మామిడి మొక్కలు పెంచి ఫలసాయం అనుభవిస్తున్నారు. వాటిని సాకుగా చూపుతూ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆక్రమణలకు దిగడం చూస్తుంటే, ఇది పూర్తిగా స్వార్థ రాజకీయాల కోసం, తమ పబ్బం గడుపుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది. అప్పట్లో ఆక్రమణలను ఎందుకు అడ్డుకోలేదు? అంటూ ప్రస్తుత అధికారులను నిలదీస్తూ వాగ్వివాదానికి దిగడమే కాకుండా, అధికారులు డబ్బులు తీసుకుని వారి జోలికి వెళ్లడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నందుకేనా...? పోలవరంనకు చెందిన ఆ టీడీపీ నాయకుడు గతంలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించగా అటవీ శాఖ అధికారులు వాటిని అడ్డుకున్నారు. దీనికి తోడు, మూడు రోజుల క్రితం అనధికారికంగా తమ్మిలేరు జలాశయం లాకులను ఎత్తించి తాను పెంచుతున్న చేపల చెరువును నీటితో నింపుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇరిగేషన్ ఏఈ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన లస్కర్‌ను పంపి మరుసటి రోజు లాకులను దించేశారు. ఏఈ దృష్టికి తీసుకెళ్లిన వారిలో కొందరు రెండు దశాబ్దాల క్రితమే అటవీ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని మామిడి తోటలు పెంచుకుంటున్నవారే కావడం గమనార్హం. వాటిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుడే పేదలను రెచ్చగొట్టి అడవి భూముల ఆక్రమణకు పంపడం ఏమిటని మండలంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఆక్రమణలకు ప్రస్తుత అధికారులు ఎలా బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
కరెంటుతో చెలగాటం.. ప్రాణాలకే ప్రమాదం
● వర్షాకాలంలో విద్యుత్ తీగలు, మోటార్లతో అప్రమత్తంగా ఉండాలి ● నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికే ముప్పు ● చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలకు అడ్డుకట్ట యలమంచిలి: అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు తమ పొలాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. పంటలకు నీరు పెట్టడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ తీగలు, మోటార్ల వద్దే ఎక్కువగా గడుపుతుంటారు. కొందరు రైతులు చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులను స్వయంగా చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పొలాల్లో కర్ర స్తంభాలు, వేలాడుతున్న తీగల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టార్టర్లతో జాగ్రత్తలు ఇలా.. స్టార్టర్ డబ్బాలను మోటార్ పక్కనే పొలంలో ఉంచి వాటికి కవర్లు కప్పుతుంటారు. ఇది ప్రమాదాలకు తావిస్తుంది. వర్షం కురిసినా, బోరు నీరు ఎగజిమ్మినా డబ్బాల్లోకి నీరు చేరుతుంది. అంతేకాకుండా విద్యుత్ తీగలు గజిబిజిగా ఉండి, తెగిపోయిన చోట మళ్లీ అతికిస్తుంటారు. అసలు ఏ తీగ ఏ ఫీజుదో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. నేరుగా స్టార్టర్కు విద్యుత్ సరఫరా అయ్యేలా సరైన ఫీజును అమర్చుకోవాలి. చాలా మంది రైతులు ఇప్పటికీ స్టార్టర్ల కోసం ఇనుప డబ్బాలనే ఉపయోగిస్తున్నారు. ఇనుప డబ్బాల్లో స్టార్టరు, ఫీజులు బిగించడం వల్ల ఎలుకలు డబ్బాలో చేరి తీగలు కొరుకుతుంటాయి. దీంతో తీగలు తెగి డబ్బాకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇది గమనించక రైతులు డబ్బాను పట్టుకోగానే షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ తీగలతో ప్రమాదం.. గాలివానకు ఒక్కోసారి పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడుతుంటాయి. ఆ సమయంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే, వ్యవసాయ పనులు ముగించుకుని మోటార్ వైర్లను ఇంటికి తీసుకువెళుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ వైర్లను ఎలుకలు కొరికే అవకాశం ఉంది. మరుసటి రోజు మోటర్‌కు ఆ వైర్లు తగిలించేటప్పుడు వాటిని సరిగ్గా పరిశీలించాలి. పాత వైర్ల కంటే కొత్త వైర్లను బిగించుకోవడం ఎప్పుడూ సురక్షితం. విద్యుత్ స్తంభాలు దూరంగా ఉన్న పొలాల్లో కొందరు కర్రల సహాయంతో తాత్కాలికంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇవి వర్షానికి, గాలికి కిందపడుతుంటాయి. వాటిని గమనించకుండా పొలాల్లోకి వెళితే కాళ్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, విద్యుత్ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా స్తంభాలను ఏర్పాటు చేయించుకోవాలి. పాటించాల్సిన జాగ్రత్తలు పొలాల్లో మోటార్లు పనిచేయకపోతే చేతితో నేరుగా పట్టుకోకూడదు. టెస్టర్ సహాయంతో మాత్రమే విద్యుత్ సరఫరాను పరీక్షించాలి. వర్షపు నీరు, తేమ తగలని చోట మోటార్లను అమర్చాలి. ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. విద్యుత్ మోటార్లలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే ముందుగా ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ఫీజులు పోతే విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతో వాటిని మరమ్మతు చేయించుకోవాలి. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. కరెంటు తీగలు తాకుతున్న చెట్లను ముట్టుకోవద్దు. పొలాల్లో స్టార్టర్లు మరమ్మతులకు గురైతే ఎలక్ట్రీషియన్‌తో మాత్రమే చేయించుకోవాలి. స్వయంగా ఫీజులు వేయడం వంటి పనులు చేయరాదు. పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుంటే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలి. విద్యుత్ ప్రమాదాలపై రైతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాలి. – వి. చండీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈ, యలమంచిలి -
వెలుగు శాఖలో ఏం జరుగుతోంది?
● డ్వాక్రా రుణాలపై ఆరోపణలు ● ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్ కుక్కునూరు: డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా నిలవాల్సిన వెలుగు శాఖలో రుణాల మంజూరు, నగదు లావాదేవీలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, వింజరం పంచాయతీ పరిధిలోని సుమారు 20 డ్వాక్రా సంఘాలకు శ్రీనిధి, ఉన్నతి రుణాలు మంజూరు కాకపోవడంపై మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఆశించి రుణాల మంజూరులో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనిధి రుణాలలోనూ ఆరోపణలు మరోవైపు, మర్రిపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాలకు సుమారు ఆరు నెలల క్రితం మంజూరైన శ్రీనిధి రుణాల విషయంలోనూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఒక్కో గ్రూపునకు రూ. లక్ష చొప్పున రుణం మంజూరై సభ్యుల ఖాతాల్లో నగదు జమ కాగా, అందులో నుంచి రూ. 50 వేల చొప్పున తిరిగి తీసుకున్నట్లు కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలా సుమారు పది మంది నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకున్నారని, విషయం బయటకు పొక్కడంతో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అసలు ఆయా సంఘాలకు ఎంత రుణం మంజూరైంది? సభ్యుల ఖాతాల్లో ఎంత మొత్తం జమైంది? జమ అయిన నగదులో నుంచి కొంత మొత్తాన్ని ఎందుకు తిరిగి తీసుకున్నారు? అనంతరం అదే మొత్తాన్ని తిరిగి ఖాతాల్లో ఎందుకు జమ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. రుణం మంజూరైన ప్రతిసారీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోందని పలువురు డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత? డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న రుణ పథకాలపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆరోపణల్లో వాస్తవమెంత? రుణాల మంజూరు, నగదు లావాదేవీల్లో నిబంధనలు పాటించారా? అనే అంశాలపై వెలుగు శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. -
‘విల్లు’వెత్తిన ఉత్సాహం
భీమవరంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఆర్చరీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా జరిగా యి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అ సోసియేషన్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. విజేతలు వచ్చేనెలలో సిక్కింలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరుకానున్నారు. ఆదివారం జరిగిన సీనియర్ ఇండియన్ రౌండ్ ఉమెన్ విభాగంలో చిత్తూరుకు చెందిన కె.సాయి సుజియ, కె.మోక్ష, కరణి లోహితరెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో వైఎస్సార్ కడపకు చెందిన చింతపల్లి గ్రీష్మ సాయిశ్రీ నిలిచింది. సీనియర్ రికర్వ్ ఉమెన్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కొండపావులూరి ఉత్కశ్రీ, కుండేరు చంద్రహాస్ని, తాడిబోయిన వైష్ణవి, ఆకుల రవళి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీ కృష్ణంరాజు, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ, ప్రౌడ్ ఫాదర్ సీనియర్ జడ్జి బి.శ్రావణ్‌కుమార్, ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు ఎల్.జయరాజు, కోచ్‌లు పాల్గొన్నారు. – భీమవరం -
అనగనగా.. నల్లతీగ
● సేకరణలో నాయక్‌పోడు గిరిజనులు ● ఇదే వీరికి జీవనాధారం ● చేపలు పట్టే మావుల తయారీకి వినియోగం బుట్టాయగూడెం : అటవీ ప్రాంతంలో చెట్లపైకి పాకే.. పొదల్లో ఉండే నల్లతీగను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు నాయక్‌పోడు గిరిజనులు. ఏటా ఈ సమయంలో వీరు నల్ల తీగను సేకరించి కట్టలుగా కట్టి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నల్లతీగ సేకరణ కష్టంతో కూడుకున్నది కావడంతో పాటు ప్రమాదకరం. జంతువులు, విషసర్పాలను తప్పించుకుని సేకరించాల్సి ఉంటుంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం కొవ్వాడ ప్రాజెక్టు ముంపు పునరావాస గ్రామం. ఇక్కడ సుమారు 50 కు టుంబాలకు చెందిన నాయక్‌పోడు గిరిజనులు జీవిస్తున్నారు. వీరిలో 30 కుటుంబాలు అడవిలో లభించే నల్లతీగ, చింతపండు, కుంకుళ్లు, వేప గింజలు వంటి ఉత్పత్తులను సేకరించి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నల్లతీగ సేకరణ కోసం సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకూ అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పొదల్లోను, చెట్లకు అల్లుకున్న తీగలను సేకరించి తలపై పెట్టుకుని ఇళ్లకు తీసుకువస్తుంటారు. తీగల సేకరణలో కొందరు కళ్లు పోగొట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి. రోజుకు రూ.500 ● రోజూ సేకరించిన నల్లతీగలను ఇంటి వద్దకు తీసుకువచ్చి కట్టలుగా చుట్టి కట్ట రూ.25 చొప్పున విక్రయిస్తారు. ఇలా రోజుకు సుమారు 25 కట్టలకు రూ.625 వస్తే వాటిలో రూ.125 ఖర్చులు పోను రూ.500 మిగులుతాయని మహిళలు చెబుతున్నారు. ఒక్కోసారి తీగ దొరక్కపోతే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుందని అంటున్నారు. ● నల్లతీగ చాలా గట్టిగా ఉంటుంది ● కొల్లేరు ప్రాంతంలో చేపలు పట్టేందుకు బుట్టల తయారీలో వినియోగిస్తారు. ● తీగలను రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టి, వెదురు పుల్లలను కలిపి మావులను తయారు చేస్తారు. ● ఈ మావులను 3 నెలల పాటు చేపలు పట్టేందుకు వినియోగిస్తారు. ● వ్యాపారులు గిరిజనుల వద్దకు వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ● ఆకివీడు సమీపంలోని దుంపగడపలో నల్లతీగ వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. -
ఎండ మంట.. భక్తులకు తంటా!
ద్వారకాతిరుమల: వర్షాలు కురిశాయి.. వాతావరణం చల్లబడింది.. ఇక ఎండ తీవ్రత తగ్గుతుందని భావించిన తరుణంలో భానుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కురిసిన వర్షాలతో కాస్త ఉపశమనం లభించినా.. ఆ తర్వాత వాతావరణం తిరిగి వేడెక్కింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. వేసవిని తలపించే ఎండలతో జనం అల్లాడుతున్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులకూ ఎండ సెగ తప్పలేదు. ఆదివారం ఉదయం నుంచే ఎండ ప్రభావం కనిపించగా.. మధ్యాహ్నానికి తీవ్రత మరింత పెరిగింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక నీడ కోసం పరుగులు తీశారు. ఆలయ పరిసరాల్లోని షెడ్లు, చెట్ల కింద సేదతీరారు. మరికొందరు తలపై వస్త్రాలు కప్పుకుని ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించారు. అమ్మో.. ఇవేం ఎండలు! అని తలలు పట్టుకున్నారు. ఇప్పటి నుంచే ఆందోళన! ఎండ వేడి, ఉక్కపోత కారణంగా క్షేత్రానికి వస్తున్న భక్తుల్లో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ సమయంలోనూ వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుత వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తుండటంతో.. రాబోయే శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనని భక్తులు, ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత బస్సు కోసం క్యూ కట్టిన భక్తులు ఇలా.. జంటగోపురాల ప్రాంతంలోని చెప్పుల స్టాండు షెడ్డు కింద సేదతీరుతున్న భక్తులు చినవెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులకు తప్పని ఎండ సెగ -
న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలి
పాలకొల్లు సెంట్రల్ : న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని పాలకొల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాముల చిట్టిబాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం నుంచి శుక్రవారం వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారన్నారు. పాలకొల్లులో సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి కోర్టు ఆవరణలో నిరసనలు కొనసాగు తాయన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి మెమొరాండం సమర్పిస్తామన్నారు. న్యాయవాదులంతా పాల్గొనాలని కోరారు. బార్ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాల రంగారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రామలింగేశ్వరరావు, ట్రెజరర్ కె.నాగదుర్గావతి, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి సందర్శన పాలకొల్లు కోర్టును జిల్లా జడ్జి వాసంతి సందర్శించారు. ఆమెను బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. న్యాయమూర్తులు వి.శ్రీనివాసరెడ్డి, వీఎస్ఎన్ లావణ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం : పట్టణంలో సెలవు రోజుల్లో స్క్రీనింగ్ స్కాలర్షిప్ టెస్ట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తూ పిల్లలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయా సంస్థల్లో పరీక్షలను వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణ కమిటీ అధ్యక్షుడు పి.సాయికృష్ణ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం 2007 ప్ర కారం ఏ విద్యాసంస్థలు అయినా పిల్లాడి అడ్మిషన్ కోసం ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించరాదన్నారు. అ యితే కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను స్క్రీనింగ్ టెస్టుల పేరుతో వారి వి ద్యాసంస్థలకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తే రానున్న కాలంలో చర్యలు కఠినంగా ఉంటా యని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ కమిటీ సభ్యులు జి.కౌశిక్, పి.త్రినాథ్, జి.షణ్ముఖ, జి.అభి పాల్గొన్నారు. నరసాపురం : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ తెలిపారు. ఆదివారం స్థానిక అల్లూరి కల్యాణ మండపంలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ పోటీచేయాలని నిర్ణయమని చెప్పారు. కాళీపట్నం జమిందారీ భూములు అర్హులైన పేదలకు పంచాలన్నారు. భూ స్వాముల చేతుల్లో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే సజావుగా చేయాలని, అర్హులైన పేద రైతులకు అన్యాయం జరగకూడదని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్, కార్యదర్శివర్గ సభ్యుడు కవురు కవురు పెద్దిరాజు, పొగాకు పూర్ణ పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు
కై కలూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో కూటమి కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు జాజుల సుబ్రహ్మణ్యం, నాయకులు నగుళ్ల రామాంజనేయులు, నాగరాజు(అయ్యప్ప) కై కలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. డీఎన్నార్ వారికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదినేపల్లి మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బోయిన రామరాజు, నాయకులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్లశాల వద్ద నైవేద్యాలు సమర్పించారు. నాగబంధాలు, గోకులంలో భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సహాయ కమిషనర్ ఆర్.గంగాఽశ్రీదేవి, చైర్మన్ బొంగు రవికుమార్, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షణ చేశారు. యలమంచిలి: బూరుగుపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి వస్తువులతో పాటు ద్విచక్ర వాహనాన్ని అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోటూరి రాజ్‌కుమార్ తెలిపారు. వివరాల ప్రకారం బోనం జగదీష్ తల్లి రుక్మిణీదేవి గతేడాది సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అదే ఇంటి పైభాగంలో అద్దెకు ఉంటున్న చేగొండి శేషావతారం ఈ నెల 3వ తేదీ ఉదయం కిందకు వచ్చి చూడగా, ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే జగదీష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో జగదీష్ వచ్చి పరిశీలించగా, ఇంట్లో ఉన్న కాసున్నర బంగారం, రెండు కిలోల వెండితో పాటు పార్క్ చేసి ఉన్న యూనికాన్ బైక్ చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. అత్తిలి: అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్న భర్త, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ చెప్పారు. వివరాల ప్రకారం అత్తిలి మట్టపర్తిగర్వుకు చెందిన బంగారు లక్ష్మీగాయత్రితో అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన సోమరాజుకు 2015లో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకుల కింద రూ.5 లక్షలు నగదు, 5 కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారన్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల మరో రూ.5 లక్షలు అదనపు కట్నం తీసుకురమ్మని భర్త సోమరాజు, మరో నలుగురు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని బాధితురాలు లక్ష్మీగాయత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తణుకు అర్బన్: హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సీహెచ్‌వీ సత్యనారాయణ తెలిపారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని శ్రీదేవి హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న కర్రి శ్రీనివాసరెడ్డి, గత నెల 30వ తేదీన హోటల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో పాటు బంధువుల ఇళ్లకు కూడా వెళ్లలేదని కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లిన సందర్భాలు ఉండడంతో, నాలుగు రోజులు వేచి చూసి ఆ తర్వాత ఈనెల 3వ తేదీన తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజులు గడుస్తున్నా శ్రీనివాసరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అదృశ్యం వెనుక ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇతర వేధింపులు కారణమా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద పెట్రోల్ బాంబులు !
కలిదిండి(కైకలూరు) : కలిదిండి మండలంలోని కోరుకొల్లులో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఇంటి ముందు గుర్తుతెలియ ని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటన ఈనెల 1న అర్ధరాత్రి 1.30 గంటలకు జరిగింది. సీసీ ఫుటేజ్‌ల్లో దాడి స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం పనిమనిషి చెట్లు కాలిపోవడాన్ని గుర్తించి యజమానికి చెప్పడంతో ఆయన పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తనను హతమార్చడానికి రెక్కీ నిర్వహించినట్టు భావిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలిదిండి ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ పుటేజ్‌ల ఆధారంగా విచారణ చేస్తున్నామని, మొత్తం ముగ్గురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నట్టు భా విస్తున్నామన్నారు. ఇది ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఘటనగా కనిపిస్తోందన్నారు. కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను గుర్తిస్తామని ఎస్సై చెప్పారు. -
పరిహారంలో పచ్చరాబందులు
బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో గిరిజనుల సాగులో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌లో సేకరించిన భూములు రెడ్డిగణపవరం పరిధిలోని భూములను పోలవరం నిర్వాసితుల కోసం అధికారులు గ్రామసభలు నిర్వహించడకుండా, ప్రజా తీర్మానాలు లేకుండా సేకరించారు. ఈ భూముల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంది. భూములిచ్చిన రైతుల నుంచి ఖాళీ చెక్కులను తీసుకున్నారు. ఈ విషయంపై సిట్‌తో విచారణ జరిపించాలి. –ఎం.మంగరాజు, సీపీఎం నాయకుడు, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం ఏజెన్సీలో 1/70 వచ్చిన భూములను 30 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ప్రస్తు తం గిరిజనులు ఉన్నా భూసేకరణ అధికారులు కొనుగోలు చేశారు. వీటిని కేటాయించడం వల్ల గిరిజనులకు, నిర్వాసితులకు మధ్య కొట్లాట జరిగే అవకాశం ఉంది. అధికారులు వివాదం లేని భూములను సేకరించాలి. – జి.పవన్‌కుమార్, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం భూసేకరణపై దళారుల కన్ను పడింది. భూములిచ్చిన రైతుల నుంచి కమీషన్లు మాట్లాడుకుని అధికారుల అండదండలతో ఆ సొమ్ములను పోగేసుకుంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – భూమరాజు సత్యనారాయణ రాజు, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన గిరిజనులను కూటమి నేతలు దోచుకుంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అందిన పరిహారంలో దండుకుంటున్నారు. తాజాగా పూర్తయిన పోలవరం ఆర్అండ్ఆర్ భూసేకరణకు సంబంధించి రైతుల ఖాతాల్లో జమైన రూ.1,500 కోట్లలో కొంత భాగం దళారుల పాలుకావడం తీవ్ర కలకలం రేపింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని గిరిజనేతరులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కట్టబెట్టారని ఆయనపై సీబీసీఐడీ విచారణ చేయాలని గిరిజనులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి,ఏలూరు : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 2,500 ఎకరాల భూమిని ప్రభుత్వం తాజా గా సేకరించి దీనిలో ఎకరాకు రూ.15 లక్షల చొ ప్పున పరిహారాన్ని ప్రకటించింది. దీనికి గానూ 1,000 ఎకరాలకు సంబంధించి రూ.1,500 కోట్లు సంబంధిత రైతుల ఖాతాల్లో జమైంది. పూర్తిగా భూసేకరణ చట్టాన్ని తూట్లు పొడిచేలా అధికారులు వ్యవహరించి అడ్డగోలుగా గ్రామాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకుని రైతుల పరిహారంలో సింహాభాగం స్వాహా చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు డివిజన్ పరిధిలో ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి ఈ సేకరణ పూర్తి చేశారు. దీనిని అధికారులతో పచ్చ పార్టీ, జనసేన పార్టీ నేతలు కుమ్మకై ్క దోపిడీ కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం భూసేకరణ నిర్వహించడానికి ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం పొంది, అనంతరం ఈ భూమికి ఎలాంటి సమస్యలు లేవని, పీసా చట్టం అమలు చేసే కమిటీ ద్వారా ఎన్ఓసీ తీసుకోవాలి. తదనంతరం పోల వరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో సంబంధిత మండలాల తహసీల్దార్లు రికార్డులు పరిశీలించి ఖరారు చేశాక భూసేకరణ పూర్తి చేసి ఆర్అండ్ఆర్ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.15 లక్షల చొప్పున నగదు జమ చేస్తారు. అయితే ఈ రెండు మండలాల్లో ఎలాంటి గ్రామసభలు గాని, పీసా చట్టం కమిటీ అనుమతి లేకుండా బలవంతపు సేకరణ నిర్వహించారు. దీనిని అధికారులు ఆదాయ వనరుగా మలుచుకున్నారు. అధికారిపై ఫిర్యాదు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.శ్రీనుకుమార్పై బుట్టాయగూడెం మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వికి ఫిర్యాదులు పంపారు. బుట్టాయగూడెం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన బుగ్గల నాగేంద్రబాబు 12.33 ఎకరాల భూమిని గిరిజనేతరుల పేరిట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారని, అలాగే కుమ్మరికుంటకి చెందిన మరో రైతు సరియం గోపాలకృష్ణ, కారం బుచ్చిరాజు, సరియం బుచ్చిరాజులు తమ భూములను ఎలాంటి సభలు నిర్వహించకుండా గిరిజనేతరుల పేర్లతో అక్రమాలకు పాల్పడి అధికారి ఆర్డర్ ఇచ్చారని సీబీసీఐడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. తమకు పట్టాలున్నా ఆర్అండ్ఆర్ భూసేకరణలో వేరే వారి పేర్లు ఉన్నాయంటున్న గిరిజనులు కూటమి కనుసన్నల్లో.. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌లో దళారుల దందా వివాదం ఉంటే ఎకరాకు రూ.5 లక్షలు లేకుంటే రూ.3 లక్షల వసూలు దళారీ దరఖాస్తులకే అధికారుల ఆమోద ముద్ర రెండు మండలాల్లో వెయ్యి ఎకరాలకు రూ.1,500 కోట్ల పరిహారం జమ గిరిజన భూములను గిరిజనేతరులకు కట్టబెట్టారని ఆరోపణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసిన గిరిజనులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌పై విచారణకు డిమాండ్ కూటమిలోని జనసేన, టీడీపీ నేతలు దళారుల అవతారం ఎత్తి బుట్టాయగూడెం మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి, కె.రాజమండ్రి, జీలుగుమిల్లి మండలంలో రౌతుగూడేనికి చెందిన గిరిజనుల భూములను టార్గెట్ చేశారు. భూముల్లో వివాదం ఉంటే రూ.5 లక్షలు, లేదంటే రూ.3 లక్షలు దళారీ రేట్లు నిర్ణయించి వారే పరిహారానికి సంబంధించి పత్రాలన్నీ ఫైల్‌గా తీసుకువెళ్లి అధికారులతో బేరం మాట్లాడుకుని రైతుల నుంచి ఖాళీ చెక్కులను తీసుకుని పరిహారం ఖాతాల్లో జమకాగానే చెక్కులు బ్యాంకులో క్లియర్ చేసుకుంటున్నారు. ఇలా ముగ్గురు దళారులు రూ.15 కోట్లకుపైనే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో జనసేన నేత కరాటం రాంబాబు పోలవరం పరిహారంలో అక్రమాలకు పాల్పడి గిరిజనుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. తాజాగా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దళారులు రైతుల నుంచి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ఎస్పీ, కలెక్టర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ అండ లేకుండా వసూళ్లు ఎలా సాగుతాయనేది చర్చ కొనసాగుతుంది. -
జై వనరూపిణీ.. జై విజయకారిణీ
బుట్టాయగూడెం: భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను తిరిగి ఆదివారం ప్రారంభించడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారు బందోబస్తు నిర్వహించారు. జాతీయ గో–కార్టింగ్ చాంపియన్‌గా భీమవరం అగనంపూడి (విశాఖ): జాతీయస్థాయి గో–కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో భీమవరానికి చెందిన ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల బృందం విజేతగా నిలిచింది. దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గత నెల 30 నుంచి ఆదివారం వరకు నిర్వహించిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకు చెందిన 9 బృందాలు పాల్గొన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, రెక్టార్ మధుసూదనరావు తెలిపారు. వాహనాల సాంకేతిక తనిఖీ, పనితీరు పరిశీలన, బ్రేక్ పరీక్షలు, డైనమిక్ రౌండ్లు, ఎండ్యూరెన్స్ రేసులు నిర్వహించారు. వేగం, వాహన నియంత్రణ, బ్రేకింగ్ సామర్థ్యం, సుస్థిర పనితీరు, అత్యంత వేగవంతమైన ల్యాప్ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. భీమవరానికి చెందిన ఎస్ఆర్కేఆర్ కళాశాల చాంపియన్‌గా, విశాఖకు చెందిన ఏఐటీఎస్ రన్నరప్‌గా నిలిచాయి. -
కూటమిలో కుంపటి
పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బాహాటంగానే రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం, ప్రోటోకాల్ వివాదాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ‘ఎమ్మెల్యే గారు.. మీరు, మీ నియోజకవర్గం ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదు. అన్నిట్లో మైనస్ ఉన్నారు’ అంటూ ఇటీవల ప్రజావేదిక సభలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నరసాపురం కూటమిలో నిప్పు రాజేశాయి. చంద్రబాబు కావాలనే తమ పార్టీ ఎమ్మెల్యేను జనంలో చులకన చేశారని జనసేన కేడర్ మండిపడింది. టీడీపీ, తన సామాజికవర్గం ఎమ్మెల్యేలపై ఎక్కడైనా ఈవిధంగా బహిరంగ రివ్వూ ఇచ్చారా? కనీసం మీ మీద గానీ, ప్రభుత్వంపై గాని రివ్యూ చేసుకున్నారా? మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారా? నిరుద్యోగభృతి ఇచ్చారా? రెండేళ్లయినా కొత్త పింఛన్లు, హౌసింగ్ లోన్లు లేవు. ప్రజల్లో తల ఎత్తుకోలేకున్నాం. పథకాలేవని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ బాహాటంగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నిధులు ఇవ్వకుండా నిందలేమిటి చంద్రబాబు? అంటూ ఎమ్మెల్యే నాయకర్ పేరిట ఒక కరపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది’సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ నాలుగు, జనసేన మూడు స్థానాల్లో గెలుపొందగా, నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల హవానే నడుస్తోందని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం, ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన, బీజేపీ కేడర్ నిరాశతో ఉంది. తాడేపల్లిగూడెంలో రాజీనామా సవాల్ తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మధ్య విభేదాలు ఇప్పటికే భగ్గుమన్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో బాబ్జి మాట్లాడుతూ వార్డుల్లో ఎక్కడకు వెళ్లినా రోడ్లు లేవంటున్నారని, దోమల సమస్య చెబుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించారు. ఎమ్మెల్యే పనిచేయడం లేదని ఎవరితోనైనా అనిపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. తాను వచ్చాక ఎన్ని కోట్లు రూపాయల వర్కులు జరిగింది? ఎన్ని రోడ్లు వేసింది? ఎన్ని డ్రెయిన్లు, ఎన్ని ఫిల్టర్ బెడ్లు కట్టింది? చరిత్ర చెబుతుందన్నారు. పదేపదే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఇష్టానుసారం చేస్తామంటే చూస్తు ఊరుకోన్నారు. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేన గెలిచే స్థానాలను ఎవరి కోసం త్యాగం చేసేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేశారు. వెంపలో స్వపక్ష నేతపై ప్రజా కూటమి ఒకప్పుడు సంక్రాంతి కోడిపందేలకు రాష్ట్రంలో పేరొందిన భీమవరం రూరల్ వెంప కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గ్రామం నుంచి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న టీడీపీ నేతకు వ్యతిరేకంగా జనసేన, బీజేపీతో పాటు టీడీపీలోని మరొక వర్గం ప్రజా కూటమిగా ఏర్పడుతున్నట్టు జనసేన నేత కలిదిండి బంగార్రాజు తదితరులు ప్రకటించారు. సదరు నేత వైఖరితో రెండేళ్లుగా వెంప అభివృద్ధిలో వెనకబడిందని, కోడి పందేలు, పేకాట, జూదాలతో గంజాయి వనంలా మారిందని మండిపడ్డారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పల్లిపాలెం ప్రజలు ఆందోళన చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేయించారని, గ్రామాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రూ. 43 లక్షలు మంజూరు చేస్తే పనులు జరుగకుండా అడ్డంకులు కల్పిస్తున్నారన్నారు. గ్రామానికి రోడ్డు మంజూరైతే జనావాసాల్లో కాకుండా ఎక్కడో దూరంగా నిర్మించారంటూ ప్రజా కూటమి నేతలు మండిపడ్డారు. ఆదివారం గ్రామంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక పోరుపై దృష్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ఇరు పార్టీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం మున్సిపాల్టీలలో జనసేన అభ్యర్థులనే చైర్మన్లుగా నిలబెట్టాలని ఆ పార్టీ భావిస్తుండగా, భీమవరం, తాడేపల్లిగూడెం పీఠాలపై పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇరు వర్గాలు ఇప్పటికే ఈ ప్రతిపాదనలను తమ అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యే పనితీరు బాగోలేదంటూ నరసాపురంలో నిప్పుపెట్టిన చంద్రబాబు నిధులు ఇవ్వకుండా నిందలేమిటంటూ జనసేన కౌంటర్ తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్చార్జి వెంపలో టీడీపీ నేతపై జనసేన ఫైర్ పాలకొల్లు, ఆచంటలో సైలెంట్ అయిపోయిన జనసేన కేడర్ కాకరేపుతున్న ‘లోకల్’ పాలిటిక్స్ -
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
భీమవరం : జిల్లాలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే ధ్యేయంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. శనివారం పట్టణంలోని వర్మ హాస్పిటల్స్‌లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజల రక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్, వర్మ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పీఆర్కే వర్మ, ఏఆర్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా డ్వాక్రా వీఓఏల జీతాలు పెంచడంతోపాటు పని భారాన్ని తగ్గించాలని వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగిడి గోవిందమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భీమవరం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సంఘ సమావేశంలో గోవిందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం రోజుకో కొత్త యాప్‌ను తీసుకొచ్చి వీవోఏలపై పని భారాన్ని పెంచుతోందే తప్ప, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీఓఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి. కళ్యాణి, కె. వెంకటలక్ష్మి, ఎం. స్వాతి, గూడవల్లి సుధ, డి. రమాదేవి తదిరులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జయరాజు, శ్యాప్ కోచ్ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాలకు సీనియర్ ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భీమవరం: సైన్స్ ప్రతిభ అన్వేషణ పరీక్ష (విద్యార్థి విజ్ఞాన్ మంథన్)లో పాల్గొనే విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు వివిఎం జిల్లా కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించి తమ పాఠశాలల నుంచి ప్రతి తరగతికి కనీసం ఒక విద్యార్థినైనా రిజిస్టర్ చేయించేలా ప్రోత్సహించాలని కోరారు. ఇతర వివరాల కోసం 98496 66417 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్పీ) బృందం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె. పృథ్వీరాజ్ కలిసి ఈ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ క్రాంతి కుమార్, సైకాలజిస్ట్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దెందులూరు: అండర్–19 వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు దెందులూరులోని గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాల విద్యార్థి దాసరి వెంకటేష్ బాబు ఎంపికయ్యాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్, పీడీ తూంపాటి బాబురావు ఈ వివరాలు వెల్లడించారు. శనివారం ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో స్నాచ్ విభాగంలో 30 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 40 కేజీలు... మొత్తం 70 కేజీల బరువు ఎత్తి వెంకటేష్ బాబు ఈ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఈ విద్యార్థి ఏలూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబును పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. పాలకొల్లు సెంట్రల్: ముంబైకి చెందిన మహేందర్ 68 ఏళ్ల వయస్సులో దేశంలోని 12 జ్యోతిర్లింగాలతో పాటు పంచారామక్షేత్రాలను కూడా సైకిల్‌పై దర్శించుకోవాలని యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్రలో భాగంగా శనివారం నరసాపురం వచ్చి క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ సైకిల్ యాత్రను మూడు నెలల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగా ఇంకా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. భీమవరంలోని సోమారామ (భీమేశ్వరస్వామి) దర్శనం తర్వాత శ్రీకాళహస్తి వెళ్లనున్నట్లు తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఇరగవరం: ఇనపర్రు గ్రామంలోని ముగ్గురమ్మల దేవాలయం సమీపంలో ఉన్న చిక్కాల కాలువ వద్ద గల్లంతైన కర్రి మోహన్‌రెడ్డి మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఉదయం సుమారు 05:30 గంటలకు మోహన్ రెడ్డి తన స్నేహితులు పాడాల శివరెడ్డి, సట్టి చైతన్యరెడ్డి, బెతిరెడ్డి సాయి తిర్పారెడ్డిలతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. సుమారు 7 గంటలకు మోహన్ రెడ్డి స్నేహితులు అతని తండ్రి వద్దకు వచ్చి, మోహన్ రెడ్డి ప్రకృతి అవసరాల నిమిత్తం కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడినట్లు తెలిపారు. వెంటనే గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. శ్రీవారి నిత్యాన్నదానానికి రూ.1.11 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రాజమండ్రికి చెందిన భక్తుడు సీహెచ్ నాగ వీరవెంకట సుబ్బారావు శనివారం రూ.1,11,200 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేయగా, దాతకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్‌ను అందజేశారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. -
పనులు నిల్.. బిల్లులు ఫుల్
● టూటౌన్‌లోని ఎన్టీఆర్ పార్కులో జిమ్ పరికరాల మరమ్మతుల పేరిట రూ.4.92 లక్షలు ● పోణంగి కంపోస్టు యార్డులో డోజర్ రిపేర్ పేరిట రూ. 4.80 లక్షలు ● శ్రీ సాయి ఏజెన్సీస్ నిర్వహించిన పనులకు రూ. 5.36 కోట్లు ● పి. రాకేష్ అనే కాంట్రాక్టర్ పేరుతో రూ. 2.67 కోట్లు ● ఆదిత్య ఇంజనీరింగ్ పేరుతో రూ. 1.50 కోట్లు చొప్పున బిల్లులు చెల్లించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ అక్రమాలకు, నిధుల మళ్లింపునకు వేదికగా మారింది. చేయని పనులకు బిల్లులు చేసుకోవడం, సంబంధం లేని శాఖల్లో పనులు చేసినట్లు చూపించడం, నామమాత్రపు పనులకు భారీగా నిధులు కాజేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 800 పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించి, రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కోట్లాది రూపాయలు కాగితాలపై ఖర్చవుతున్నా నగరంలో మాత్రం ఏమాత్రం అభివృద్ధి కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకులు, వారి బినామీ కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఈ పనుల పందారం సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతుండగా, తాజాగా ఏసీబీ కూడా దృష్టి సారించింది. బినామీలకే రూ.12 కోట్ల లబ్ధి జీవో నంబర్ 255 ప్రకారం రూ.5 లక్షల లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్ ప్రాతిపదికన కేటాయించాలి. రూ.5 లక్షలు దాటితే తప్పనిసరిగా టెండర్లు పిలవాలి. అలాగే నామినేషన్ పనులను గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక సంఘాలు లేదా సంక్షేమ సంఘాలకు అప్పగించాలి. అయితే అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 280 పనులకు గాను రూ. 12.58 కోట్లు, 2025–26 ఆర్థిక సంవత్సరం: 520 పనులకు గాను రూ. 18.21 కోట్లు ఇలా మొత్తం 800 పనులను నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టారు. నిజానికి వీటిలో కేవలం 200 లోపు పనులకు మాత్రమే నామినేషన్ అర్హత ఉంది. మిగిలిన పనులన్నింటికీ టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ, అధికారుల సహకారంతో నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ప్రక్రియలో బడా నాయకుల బినామీలు రూ.12 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రైవేటు వెంచర్లు, వస్తువులకు కార్పొరేషన్ నిధులు మాజీ మేయర్ భర్తకు చెందిన ఎస్ఎంఆర్ నగర్ ప్రైవేటు వెంచర్లో రూ. 4.25 కోట్లతో 62 పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించి పూర్తి చేయడం గమనార్హం. వాస్తవానికి డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్ యజమానే స్వంత ఖర్చులతో రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు అభివృద్ధి చేయాలి. కానీ కార్పొరేషన్ నిధులతో ఈ వెంచర్‌ను తీర్చిదిద్దారు. మెప్పు కోసం స్పెషల్ వర్క్స్ కార్పొరేషన్‌కు సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలోని పనులకు కూడా నిధులు మళ్లించారు. డీఎస్పీ కార్యాలయంలో రూ.5.80 లక్షలతో నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ ప్లాట్‌ఫామ్ కోసం రూ. 4.98 లక్షలు, గేటు, నెట్, ఫ్లోర్ మ్యాట్ మరమ్మతుల కోసం రూ. 3.29 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకున్నారు. ఏలూరు కార్పొరేషన్లో ‘నామినేషన్’ దోపిడీ ! రెండేళ్లలో రూ.30 కోట్లతో 800 పనులు బడాబాబు బినామీ కాంట్రాక్టర్లు ముగ్గురికే అధికంగా పనులు నిబంధనలకు తిలోదకాలు డీఎస్డీఓ, ఆర్అండ్బీ పనులకు కూడా నగరపాలక సంస్థలో బిల్లులు -
పోలవరం పనుల నాణ్యతపై సమీక్ష
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సంజీవ్ వోహ్రా శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, పనుల పురోగతిని నేరుగా పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణంలో ఎలాంటి ఏమరపాటుకూ ఆస్కారం ఇవ్వవద్దని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్–1, గ్యాప్–2 లలో దశలవారీగా రాయి, మట్టి, ఇసుకతో నింపుతున్నందున, నిత్యం రోడ్ రోలర్లతో గట్టిపరుస్తూ పటిష్టతను తనిఖీ చేయాలన్నారు. గ్యాప్ 1, 2, జి–హిల్ ప్రాంతాలను ఆయన కాలినడకన సందర్శించి పనుల నాణ్యతను పరిశీలించారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ప్రాజెక్టును నిర్దేశిత సమయానికి పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపీఏ ఉపసంచాలకుడు రవి, జలవనరుల శాఖ ఈఎన్సీ కె.నరసింహమూర్తి, ఎస్ఈ పి.రామచంద్రరావు, క్వాలిటీ సీఈ శేషుబాబు, ఈఈ డి. శ్రీనివాస్, ఎంఈఐఎల్ జీఎం ఎ.గంగాధర్, డీజీఎంలు మురళి పమ్మి, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
శరన్నవరాత్రులకు ముస్తాబు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయంగా, క్షేత్ర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ ద్వారాలు ముస్తాబు, ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలంకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఉత్సవాల రోజుల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో ఉత్సవ విశేషాలను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అలంకారాలు ఇవీ.. ఈనెల 11న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 12న శ్రీ గాయత్రీ దేవిగా, 13న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 14న శ్రీ మహాచండీ దేవిగా, 15న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 16న శ్రీ సరస్వతీ దేవిగా(మూలానక్షత్రం), 17న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 18న శ్రీ దుర్గాదేవిగా (దుర్గాష్టమి), 19న శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా, 20న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా(విజయదశమి) భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 21న దీక్షాదారుల ఇరుముడి సమర్పణ, చండీ హోమాన్ని నిర్వహిస్తామన్నారు. 22న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన జరుపుతామన్నారు. భక్తులు ఈ వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఈఓ కోరారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు రోజుకో అలంకారంలో క్షేత్రదేవత కుంకుళ్లమ్మ దర్శనం ఉత్సవ వివరాలను వెల్లడించిన ఆలయ ఈఓ -
ఫారెస్ట్ భూముల ఆక్రమణలకు యత్నం
చాట్రాయి: మండలంలోని పోలవరం ఫారెస్ట్ భూములలో శనివారం పేదలు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఆర్ఎస్ నంబర్ 1 పరిధిలో పోతనపల్లి, పోలవరం గ్రామాలకు చెందిన 300 మంది పేదలు ఆక్రమణలకు యత్నించగా, ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు, స్థానిక టీడీపీ నాయకుడు మరిడి చిట్టిబాబుకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ‘ఇటీవల ఆక్రమణలు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మేము ఆక్రమించుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?‘ అని ఆక్రమణదారులు అధికారులను నిలదీశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై డి.రామకృష్ణ, డీఆర్వో సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణదారులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఆక్రమణలకు అధికారులు లంచాలు తీసుకున్నారని ఈ సందర్భంగా పేదలు ఆరోపించారు. ఫారెస్ట్ భూములను ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్లు తవ్వి పంటలు పండించుకుంటున్న వారి వద్ద నుంచి ఫారెస్ట్ అధికారులు వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని వారు మండిపడ్డారు. పాత ఆక్రమణలను తొలగించకపోతే తాము కూడా అటవీ భూములను ఆక్రమించుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ ద్వారా డీఆర్వో సత్యనారాయణతో మాట్లాడారు. గతంలో జరిగిన ఆక్రమణలను 10 రోజుల్లోగా తొలగించాలని ఫారెస్ట్ అధికారులను ఆయన ఆదేశించారు. -
పోలవరం డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
పోలవరం రూరల్: పోలవరం డీఎస్పీగా యు.రవిచంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్–డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య సత్సంబంధాలను పెంపొందించడం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన డీఎస్పీ రవిచంద్రకు స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
నా పేరు గజలక్ష్మి.. నాకూ భయాలున్నాయ్!
నా పేరు గజలక్ష్మి.. నా వయసు 54 ఏళ్లు. ఎక్కడ, ఎప్పుడు పుట్టానో తెలియదు. ఊహ తెలిసే నాటికే కర్ణాటకలోని సర్కస్ కంపెనీలో ఉన్నాను. 2004 మార్చిలో దాత శరణాల మాలతీరాణి నన్ను చినవెంకన్నకు బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రమే నా ఇల్లు.. స్వామివారి సేవే నా జీవితం. ఇలా ద్వారకాతిరుమలతో 22 ఏళ్ల అనుబంధం ఏర్పడింది. హిందీతోపాటు తెలుగు కూడా కొంతవరకు అర్థం చేసుకోగలను. రోజూ వందలాది మంది భక్తులు నన్ను చూసి మురిసిపోతూ పలకరిస్తుంటారు. వారి ప్రేమాభిమానాలే నాకు ఆనందం. ఏనుగునని.. నాకు భయం ఉండదని అనుకుంటారు. కానీ నేను కప్పలకు కూడా భయపడతాను. గుర్రాలు, కుక్కలు ఇతర జంతువులను చూస్తే కంగారుపడతాను. అన్నింటికంటే ఖాకీ రంగు దుస్తులంటే అస్సలు పడదు. మావటులు మినహా ఎవరైనా అలాంటి దుస్తులతో వస్తే కోపం వస్తుంది. 18 ఏళ్ల క్రితం ఆలయం వద్ద ఓ చిన్నారి నా కాళ్ల మధ్యకు వచ్చినా.. ఎలాంటి హాని చేయకుండా కాలితో పక్కకు నెట్టాను. అప్పుడు భక్తులందరూ నన్ను అభినందించారు. ఇక నిమిషానికోసారి తొండం, తోకతో ఒంటిపై వస్త్రాన్ని సరిచేసుకుంటుంటాను. అది చూసి నాకు సిగ్గెక్కువని చాలా మంది అనుకుంటుంటారు. 2009లో 15 రోజులు, ఈ ఏడాది జూలైలో ఐదు రోజులపాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. వైద్యులు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. నా సంరక్షణకు ముగ్గురు మావటులు ఉన్నారు. వారు నా ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. నేను శాఖాహారిని. రోజుకి 500 కిలోల వరకు ఆహారం తీసుకుంటాను. గరిక, చెరకు, బెల్లం, క్యారెట్లు, దోసకాయలు, కొబ్బరి మట్టలు, రావి ఆకులు ఇష్టంగా తింటాను. క్రిమిసంహారక మందుల పిచికారీ కారణంగా పామాయిల్ ఆకులను అందించడం మానేశారు. నా ఆహారం కోసం దేవస్థానం నెలకు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేస్తోంది. రోజుకు 150 లీటర్లకు పైగా నీళ్లు తాగుతాను. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొండపై ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. అనంతరం మావటులు స్నానం చేయించి ఆహారం అందిస్తారు. ఆకలేసినా, కప్పలు, కీటకాల వల్ల భయపడినా కాలికి కట్టిన గొలుసును తొండంతో పట్టుకుని నేలకేసి కొడతాను. ఆ శబ్దంతో మావటులు అప్రమత్తమై నా అవసరాన్ని గుర్తిస్తారు. బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసం, ఇతర పర్వదినాల్లో గ్రామోత్సవాల్లో స్వామివారి సేవలో పాల్గొంటాను. మావటులు ఎప్పుడూ నా వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు. వారే నా సేవకులు.. బాడీగార్డులు కూడా! ఇదే నా చిన్న విన్నపం.. నేను భారీగా కనిపించినా నాది చిన్నపిల్లల మనస్తత్వం. అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన నేను.. ఇప్పుడు దైవసన్నిధిలో జీవిస్తున్నాను. మాలాంటి జంతువులను ప్రేమగా ఆదరిస్తూ.. మా అవసరాలు, భావాలను అర్థం చేసుకోండి. మమ్మల్ని కూడా మీలో ఒకరిగా చూడండి! – ద్వారకాతిరుమల చినవెంకన్న గజలక్ష్మి మనోగతం మనుషుల్లాగే జంతువులకూ జీవించే హక్కు ఉంది. వాటిని ప్రేమగా ఆదరించాలి.. వాటి మనుగడకు భరోసా కల్పించాలి. ఆట వస్తువులుగా కాకుండా జీవులుగా చూడాలి. వాటి ఆహారం, ఆరోగ్యం, భద్రతతోపాటు సహజ జీవన పరిస్థితులను కాపాడాలి. జంతు సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం గజలక్ష్మి తన మనసులోని మాటలను ఇలా పంచుకుంటోంది. -
పారిజాతగిరి శ్రీవారికి విశేష పూజలు
జంగారెడ్డిగూడెం(చింతలపూడి): స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు చేశారు. భక్తులు గోవింద నామస్మరణతో గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ మణికల రాంబాబు భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శనివారం ఆలయానికి రూ.1,39,900 ఆదాయం సమకూరిందని ఈఓ రాంబాబు వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు అర్చకులు నల్లూరు రవికుమార్ తెలిపారు. కుక్కునూరు: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై కర్రతో దాడి చేసిన ఘటనపై కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బర్లమడుగు గ్రామానికి చెందిన కాక రాజులు (65) వ్యవసాయ కూలీగా జీవిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా, కుమారుడు కాక బాబు రావు అలియాస్ బాబు (40) మద్యం మత్తులో వచ్చి తండ్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోని కట్టెతో దాడి చేయడంతో రాజులు ఎడమ చేతికి, తల ఎడమ వైపు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తణుకు అర్బన్: అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాతవూరు ఎన్టీఆర్ పార్కు వెనుక నివాసం ఉంటున్న జ్వాల సాయి సతీష్‌కుమార్ (20) హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తణుకు వచ్చిన అతడు శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని తణుకు పట్టణ సీఐ జేవీ రమణ, ఎస్సై సత్యనారాయణ సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఏలూరులో ఆపరేషన్ వజ్రపహార్
ఏలూరు టౌన్: HË*Æý‡$ ¯]lVýS-Æý‡…ÌZ° ÌS…MýSõ³r, MýS$Ð]l$Ã-Ç-Æó‡Ð]l# {´ë…™é-ÌS¯]l$ VýS…gêÆ‡$$ Æý‡íßæ™èl {ç³§ól-Ô>-Ë$V> ¡Ça-¨§ólª ÌS„ýSÅ…™ø r*so¯ŒS ´ùÎ-‹Ü-ு-க-ள-், DVýSÌŒæ sîæÐŒl$ ç܅Ķæ¬-MýS¢…V> Bç³-Æó‡-çÙ¯ŒS Ð]l{f-{ç³-à-ÆŠ‡ÌZ ¿êVýS…V> ÑçÜ–¢-™èl…V> M>Æð‡z¯ŒS A…yŠæ òܯЇa °Æý‡Ó-íßæ…-^鯇$$. Gïܵ MöÑ$à {糙鋳 ÕÐ]l-MìS-ÚùÆŠ‡ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ r*so¯ŒS ïÜI MóS. AÔZ-MŠSMýS$-Ð]l*ÆŠ‡ B«§ýlÓ-Æý‡Å…ÌZ ¿êÈV> ´ùÎ‹Ü ºÌS-V>ÌS¯]l$ Ððl*çßæ-Ç…_ {糆 C…sìæ± „ýS$׿~…V> ™èl°T ^ólÔ>Æý‡$. VýS…gêÆ‡$$, C™èlÆý‡ Ð]l*§ýl-MýS-{§ýl-ÐéÅÌS Æý‡Ðé×ê, Ѱ-Äñæ*-V>°² AÇ-MýS-sôæt…-§ýl$MýS$ yéVŠæ ÝëPÓyŠæ, {yø¯ŒSÌS çÜàĶæ$…™ø A¯]l$-Ð]l*¯é-çܵ§ýl {´ë…™é-ÌS¯]l$ °Õ-™èl…V> ç³Ç-Ö-Í…-^éÆý‡$. D ™èl°-TÌZÏ çÜOÆð‡¯]l ç³{™éË$ Ìôæ° 16 Ðéçßæ¯é-ÌS¯]l$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. 11 Ð]l$…¨ A¯]l$-Ð]l*°-™èl$-ÌSMýS$ VýS…gêÆ‡$$ yìlsñæ„ýS¯ŒS MìSsŒæÞ™ø ç³È-„ýSË$ °Æý‡Ó-íßæ…-^èlV> A…§ýl-ÇMîS ¯ðlVðSsìæÐŒæ Ð]l_a-¯]lr$Ï ïÜI AÔZ-MŠSMýS$-Ð]l*ÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$. ¯]lVýSÆý‡…ÌZ VýS…gêÆ‡$$, Ð]l$™èl$¢ ç³§é-Æ>¦-ÌS¯]l$ ç³NÇ¢V> AÇ-MýSsìæt, Ķæ¬Ð]l-™èl¯]l$ ÐésìæMìS §ýl*Æý‡…V> E…^ól…-§ýl$MóS D BMýS-íÜÃMýS ™èl°-TË$ ^ólç³-sìæt-¯]lr$Ï BĶæ$¯]l ÐðlÌSÏyìl…^éÆý‡$. D Bç³Æó‡-çÙ-¯ŒSÌZ GOòÜÞË$ ½ Ð]l$«§ýl$-Ððl…-MýS-r-Æ>gê, MóS Æ>Ð]l$-MýS–çÙ~, DVýSÌŒæ sîæÐŒl$ BÆŠ‡-G‹ÜI E§ýl-Ķæ$-¿ê-çÜP-ÆŠ‡™ø ´ër$ çÜ$Ð]l*Æý‡$ 50 Ð]l$…¨ ´ùÎ‹Ü íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. -
ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఐక్యంగా పోరాడితేనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు స్పష్టం చేశారు. స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అధ్యక్షతన శనివారం నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి బహుజనులు ఐక్యంగా ఉండాలని, భావితరాల భవిష్యత్తు కోసం పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి రాజకీయంగా ఎదగాలని, అంబేడ్కర్ రాజ్యాంగం అందించిన ఫలాలను అందుకోవాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత, బహుజనులకు రావాల్సిన నిధులను ఖర్చు చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో మహాత్మా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు సభా పరిచయం చేయగా.. నూకపెయ్యి సుధీర్, పల్లెం ప్రసాద్, బిషప్ కారుపాటి శాంతిసాగర్, రియాజ్ ఆలీఖాన్, మున్నుల జాన్ గురునాథ్, కాపుదాసి రవి తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తోలకాలు
కొయ్యలగూడెం: మండల పరిధిలోని యర్రంపేట, రాజవరం గ్రామాల మధ్య ఉన్న సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు జేసీబీలు, టిప్పర్లను వినియోగిస్తూ రేయింబవళ్లు మట్టిని తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలను నిరోధించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ప్రజలు వాపోతున్నారు. అలాగే పంట పొలాలకు నీరందించే కాలువ బోదెలపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో అవి దెబ్బతిని సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చెరువుల్లో సాగుతున్న అక్రమ మట్టి తరలింపును అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
●అమ్మతనానికి ప్రతిరూపం
ఆకలి తీర్చే అన్నదానం గొప్పదైతే, చేతుల్లేని ఆపన్నుడికి అమ్మలా అన్నం తినిపించిన ఈ ఉద్యోగిని మాతృహృదయం అంతకంటే మిన్న. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం శనివారం వచ్చిన తాడేపల్లిగూడెంకు చెందిన ఉంగరాల సత్యనారాయణకు రెండు చేతులూ లేవు. అన్నప్రసాద భవనంలో అందరిలా తిన్లేక ఆయన పడుతున్న వేదనను గమనించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని గాయత్రి తల్లడిల్లిపోయింది. వెంటనే అతడి చెంతకు చేరి, కన్నబిడ్డకు తినిపించినంత ఆప్యాయంగా స్వహస్తాలతో అన్నం తినిపించింది. ఆ క్షణంలో ఆమె చూపిన మాతృవాత్సల్యానికి సత్యనారాయణ కంటితడి పెట్టారు. ‘ ఆ స్వామివారే ఆమె రూపంలో వచ్చి నా ఆకలి తీర్చారు’ అని ఉద్వేగానికి లోనయ్యారు. దేవుడు గుడిలోని విగ్రహంలోనే కాదు.. తోటి మనిషి చూపే మానవత్వంలోనూ ఉంటాడని ఈ దృశ్యం నిరూపించింది. – ద్వారకాతిరుమల -
మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం
జంగారెడ్డిగూడెం(చింతలపూడి): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ఆలయ ముఖమండపంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.1,88,950 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆర్వీ చందన తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,693 మంది భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ముసునూరు: ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముసునూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలివి. ముసునూరు గ్రామానికి చెందిన కంచర్ల గంగాధరరావు(52) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన గంగాధర రావు కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. అనంతరం మేడపైన గదిలోకి వెళ్లాడు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు గమనించే సరికి చీరతో ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
జేసీ కల్పశ్రీ భీమవరం (ప్రకాశంచౌక్): పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జేసీ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక త్యాగ రాజ భవన్లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర 2026 లో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ కల్పశ్రీ హాజరై జిల్లాలో స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన స మాజాన్ని నిర్మించగలమని అన్నారు. ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీతలను అభినందించి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, అవార్డు గ్రహీతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
జగన్మాత రాక జగమంతా సంబరం
ద్వారకాతిరుమల: దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతిరూపమైన జగజ్జనని కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఘనంగా ముస్తాబవుతోంది. ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే ఈ వేడుకలు విజయదశమితో ముగియనున్నాయి. సింహవాహినిగా, మహిషాసురమర్దినిగా అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రామగ్రామాన ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటులో నిమగ్నమవ్వగా, విగ్రహాల తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఎం.నాగులపల్లి తదితర ప్రాంతాల్లో కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పాటు పర్యావరణహిత మట్టి విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక అలంకారాలు ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి, మహిషాసురమర్థని, నిడదవోలు కోటసత్తెమ్మ, మొగల్తూరు బండి ముత్యాలమ్మ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, పెదవేగి రాట్నాలమ్మ తల్లి ఆలయాలు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. సంప్రదాయ నవదుర్గ రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అలంకారాలతో పాటు కొన్ని క్షేత్రాల్లో బాలాత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితాత్రిపురసుందరి, మహాలక్ష్మి, సరస్వతి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి రూపాల్లో రోజుకో విశేష అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముమ్మరంగా విగ్రహాల రూపకల్పన ఉత్సవాలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి జాతీయ రహదారి వద్ద భీమడోలుకు చెందిన పేరవరపు నాగేశ్వరరావు కుటుంబం రెండు నెలల ముందే మట్టి విగ్రహాల తయారీని ప్రారంభించి ఆర్డర్లను సిద్ధం చేస్తోంది. మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు పరిమాణం, ఆకర్షణను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 60 వేల వరకు విక్రయిస్తుండగా, మట్టి విగ్రహాలు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. వైభవంగా ఆధ్యాత్మిక సంబరాలు జిల్లావ్యాప్తంగా కూడళ్లలో మండపాలు నిర్మించి కుంకుమార్చనలు, చండీ పారాయణాలు, భజనలు, కోలాటాలు, అన్నదానాలు నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే నిత్యావసరాలు, పూజా సామగ్రి, విద్యుత్ అలంకరణల ధరలు పెరగడం ఉత్సవ నిర్వహణ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. ఖర్చులు పెరిగినా సంప్రదాయ బద్ధంగా, వైభవంగా వేడుకలు జరిపేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. శరన్నవరాత్రులకు ఉమ్మడి పశ్చిమగోదావరి సిద్ధం ఈ నెల 11 నుంచి 20 వరకు దేవీ నవరాత్రులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ఊపందుకున్న విగ్రహాల తయారీ పెరిగిన వ్యయభారం.. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని వినతి పీఓపీ విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండటంతో మట్టి విగ్రహాలకు ఆదరణ తగ్గుతోంది. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలపై విద్యావంతులు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాల తయారీదారులను ఆదుకోవాలి. – పేరవరపు నాగేశ్వరరావు, విగ్రహాల తయారీదారుడు, ఎం.నాగులపల్లి -
గాంధీజీ మార్గం ఆచరణీయం
భీమవరం: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ జ యంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా బా పూజీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినమిల్లి వెంకటరాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోషేన్‌రాజు మా ట్లాడుతూ గాంధీ అనుసరించిన శాంతి, సత్యం అహింస మార్గాలు ఆదర్శనీయమన్నారు. గాంఽధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నాయకులు ఏఎస్ రాజు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, మేడిద జాన్సన్, పేరిచర్ల విజయనర్సింహరాజు, కామన నాగేశ్వరావు, తిరుమల విజయ్‌రామ్, కాండ్రేగుల నర్సింహారావు, గాది రాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, చిగు రుపాటి సందీప్, బోకూరి విజయరాజు, బడుగు అశోక్‌బాబు, మానుకొండ ప్రదీప్, కోడె యుగందర్, కాటం స్టాలిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు కూటమి వెన్నుపోటు
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న ధ్వజమెత్తారు. శుక్రవారం తణుకులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల స మయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా మళ్లీ నాటకాలాడుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు తీసుకొస్తాం అని చెబుతూ బీసీ సమాజాన్ని మరోసారి వంచించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు 50 ఏళ్లు నిండితే పెన్షన్, బీసీ రుణాల హామీలు ఇచ్చారని కానీ రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకు ఏంచేశారని నిలదీశారు. మాయమాటలతో బీసీలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబా బు ఉన్నారన్నారు. హైకోర్టు జడ్జిలుగా బీసీ వర్గానికి చెందిన జడ్జిలను కూడా రానివ్వలేదని, బీసీల తోకలు కట్చేస్తానని అన్నది మీరు కాదా అని చంద్రబాబును నిలదీశారు. బీసీలకు జగన్ పెద్దపీట 50 శాతానికిపైగా బీసీలకు అనేక పదవుల్లో అవకాశం కల్పించి పెద్దపీట వేసిన చరిత్ర మాజీ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని వీరన్న అన్నారు. బీసీ వర్గాలను గుండెల్లో పెట్టుకుని ఎన్నో పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. బీసీ నాయకులు చొడే గోపీకృష్ణ, సప్పా బలరామకృష్ణ, బిరుదుకోట చింతన్న, యా రబాటి రామకృష్ణ, చింత సూర్యనారాయణ, పైడి సాయిసూర్య తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.10 వేల జరిమానా
భీమవరం: తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు పోక్సో కోర్టు జడ్జి బి. లక్ష్మీనారాయణ రూ.10 వేల జరిమానా విధించినట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. కేసు వివరాలను శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వెల్లడించారు. భీమవరం బీసీ కాలనీకి చెందిన మహిళ 2025 మే 7న అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిపై టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో ఆ ఫిర్యాదు తప్పుడుదని రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో టూటౌన్ సీఐ పి. మురళీకృష్ణ, ఎస్ఐ రామారావు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లిలో హీల్ సీబీఎస్ఈ పాఠశాలకు విద్యారంగంలో చేసిన సేవలకు గాను జాతీయ స్థాయి అవార్డు లభించినట్లు సంస్థ సీఈఓ కూరపాటి అజయ్‌కుమార్ తెలిపారు. వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పించడంతో పాటు సీబీఎస్ఈ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో బ్రెయిన్ ఫెడ్ సంస్థ ఫౌండర్ కేవీ బ్రాహ్మం చేతుల మీదుగా హీల్ అకాడమిక్ డైరెక్టర్ యు.మణికుమారి, వైస్ ప్రిన్సిపాల్ ఎం. హరీష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హీల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సిబ్బందిని పాలకవర్గం అభినందించింది. భీమవరం: భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్టీఏ జిల్లా టెన్నిస్ జట్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నిర్వహించారు. అండర్–10, 12, 14, 16 విభాగాలతో పాటు పురుషులు, మహిళలు, 35+ ప్లస్ విభాగాల్లో సెలక్షన్స్ చేపట్టినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు (సుభాష్) తెలిపారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. గత 25 ఏళ్లుగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఎల్టీఏ సెక్రటరీ కుమార్, డీఎస్, డాక్టర్ రంగప్రసాదరాజు, కోచ్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు: మండలంలోని చినమిల్లిపాడు గ్రామంలో విద్యుత్ షాక్ గురై బలే వెంకట్రావు (48) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. తెలంగాణలో ఉపాధి పొందుతున్న వెంకట్రావు, స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఇటీవల వచ్చాడు. ఇంటి పనులు చేస్తుండగా సమీపంలోని డబ్బా ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన వెంకట్రావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
బుట్టాయగూడెం: దర్భగూడెంలో ఇటీవల జరిగిన పి. వెంకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను శుక్రవారం సీఐ బి. యాదగిరి మీడియాకు వెల్లడించారు. ఘటనపై చైతన్య ఇచ్చిన ఫిర్యాదుతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. గురువారం దర్భగూడెం సబ్‌స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బి. అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నాడని చెప్పారు. మృతుడు వెంకయ్యకు, ముద్దాయి తల్లికి ఉన్న సంబంధం విషయంలో గొడవలు జరగడంతో అజయ్ గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తేలింది. నిందితుడి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సైలు వి. క్రాంతికుమార్, చెన్నారావు, సిబ్బందిని సీఐ అభినందించారు. -
పంచాయతీ ఉద్యోగుల సంఘ ఎన్నిక
భీమవరం : ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ శుక్రవారం భీమవరంలో నిర్వహించారు. జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎం.ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.మహేష్, బి.గిరిప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బంగారు విజయ, సహాయ కార్యదర్శిగా మానుకొండ శివరావు, కోశాధికారిగా చింత రాజారెడ్డితోపాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, గిరిప్రసాద్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. -
మద్యం సిండికేట్ లీలలు
భీమవరం: జిల్లాలోని మద్యం విక్రయించే షా పులను తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు సిండికేట్స్ రచించిన వ్యూహం ఫలించినట్టుగా కన్పిస్తోంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వ్యాపారులకు కమీషన్ ఇవ్వడంలో మోసం చేయడంతో మద్యం షాపుల రెన్యువల్స్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి షాపులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో 25 షాపులను రెన్యువల్ చేయకుండా సిండికేట్ కట్టుదిట్టమైన పన్నాగం పన్నింది. మద్యం వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు, షాపుల్లో భాగస్వామ్యం పొందుతున్న కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించింది. 2024 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ నెలాఖరు వరకు రెండేళ్ల కాల పరిమితికి లాటరీ నిర్వహించింది. జిల్లాలో 193 షాపులు జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం,నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 193 షాపులకుగాను 175 అన్ రిజర్వ్డ్, 18 కల్లుగీత కార్మికులకు కేటాయించారు. షాపుల గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో ప్రభుత్వం పాత షాపులనే ఏడాది పాటు రెన్యువల్‌కు అవకాశం కల్పించింది. అయితే నష్టపోయామనే సాకుతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి షాపులను తగ్గిండచం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలోని 193 షాపులకుగాను 168 షాపులను మాత్రమే రెన్యువల్స్ అయ్యాయి. షాపులు ఇలా.. జిల్లాలో ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా భీమవరంలో 44, ఆకివీడులో 25, తణుకులో 38, తాడేపల్లిగూడెంలో 40, నరసాపురంలో 27, పాలకొల్లులో 21 షాపులు ఉన్నాయి. షాపులకు అనుబంధంగా విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేయడంతో పాటు సమయపాలన, నిబంధనలు పాటించకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బాటిల్ పై రూ.20 నుంచి రూ.100 వరకు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. అనుమానాలెన్నో.. 25 షాపులకు 8 షాపులకు మాత్రమే దరఖాస్తులు రావడంతో వీటికి టెండర్లు ఖరారు చేస్తారో లేదో అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు ఖరారు కాకుంటే ప్రభుత్వమే నేరుగా షాపులు నిర్వహిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడించినట్టు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. భీమవరం స్టేషన్ పరధిలో 9, ఆకివీడులో 6, తణుకులో 5, తాడేపల్లిగూడెంలో 2, నరసాపురంలో 3 షాపులకు రెన్యువల్స్ కాలేదు. దీంతో ఆయా షాపులకు గతనెల 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు దరఖాస్తులు గడువు ఇవ్వగా.. భీమవరం పరిధిలో రెండు, నరసాపురంలో మూడు, ఆకివీడు, పెనుగొండ, పెనుమంట్రలో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సిండికేట్ సభ్యులకు షాపులకు టెండర్లు వేయకుండా అడ్డుకుని తమ వ్యూహాం ఫలించేలా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వ్యూహం ఫలించేనా? జిల్లాలో 25 షాపులకు నో రెన్యువల్ మరలా నోటిఫికేషన్ జారీ 8 షాపులకే దరఖాస్తులు గడువు పెంచిన ఎకై ్సజ్ శాఖ -
‘హద్దులు’ దాటి ఇసుక అక్రమాలు
చింతలపూడి: రాష్ట్రం నుంచి తెలంగాణకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని చింతలపూడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చింతలపూడి మండల పరిధిలోని సీతానగరం గ్రామం వద్ద సీఐ క్రాంతికుమార్ పర్యవేక్షణలో ఎస్సై కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఓ లారీ పట్టుపడింది. లారీ డ్రైవర్ పాత బిల్లులను చూపిస్తూ అక్రమంగా సరిహద్దు దాటించేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నట్టు తేలింది. దీంతో సదరు లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సతీష్‌కుమార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సరిహద్దు గ్రామాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్సై చెప్పారు. -
ఊపిరితిత్తుల్లో కరక్కాయ..!
తొలగించిన వైద్యులు కాళ్ల: తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ ఊపిరితిత్తుల నుంచి కరక్కాయను లాప్రోస్కోపిక్ విధానం ద్వారా తొలగించినట్లు ఏలూరు మిత్ర హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ విక్రాంత్ చుండూరి, డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. దగ్గు నివారణకు సదరు మహిళ కరక్కాయ నోటిలో వేసుకోగా, పొలమారి అది ఊపిరితిత్తుల్లోకి చేరింది. దీంతో తీవ్ర శ్వాసకోశ ఇబ్బందితో ఆసుపత్రికి రాగా, వైద్యుల బృందం విజయవంతంగా లాప్రోస్కోపిక్ చికిత్స చేసి దానిని తొలగించింది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు. ద్వారకాతిరుమల: స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026లో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికై ంది. స్వచ్ఛ దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థల విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చేతుల మీదుగా దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఈ అవార్డును అందుకున్నారు. దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ గుర్తింపునిచ్చిందని ఈఓ తెలిపారు. ముదినేపల్లి రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సీపీఆర్ విధానాలపై శుక్రవారం ముదినేపల్లి వై–జంక్షన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సీపీఆర్ విధానంపై ప్రాక్టికల్ డెమో ద్వారా స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు అంబుల మనోజ్, కై కలూరు పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, వి. రవికుమార్, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కై కలూరు రూరల్ ఎస్సైలు పాల్గొన్నారు. పాలకోడేరు: గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే నిబంధనల అమలులో భాగంగా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం జరిపిన దాడుల్లో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాలకోడేరు గ్రామంలో దాడులు నిర్వహించి అతడి వద్ద నుంచి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్పెక్టర్ ఎ. బసంతి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గణపవరం(నిడమర్రు): నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో వీఆర్ఓపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నిడమర్రు ఎస్సై లంకా రాజేష్ తెలిపారు. క్రొవ్విడి గ్రామంలో రైస్‌కార్డు దరఖాస్తు వెరిఫికేషన్ విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారిపై ఒకవ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు దాడిచేసి వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
పెదవేగి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురుకుల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి చెస్, హాకీ, రగ్బీ విభాగాల్లో అండర్–17 బాలబాలికల క్రీడా పోటీలు ముగిశాయి. ఈ పోటీల ద్వారా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను ఎంపిక చేసినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. వీరు అక్టోబర్ 22 నుంచి 26 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
గణపవరం(నిడమర్రు): దేశంలోనే అతిపెద్దదైన పెదనిండ్రకొలను గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఏపీ గాంధీ స్మారకనిధి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు కోరారు. శుక్రవారం నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులోని గాంధీ భవనంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపాటి మూర్తిరాజు ఆశయం మేరకు ఈ భవనాన్ని అభివృద్ధి చేసి, గాంధీజీ జీవిత స్మృతులను భావితరాలకు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం గాంధీజీ జీవిత చరిత్రపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాగిరాజు జానకిరామరాజు, వేగేశ్న సుబ్బరాజు, ఆర్విఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్యూఆర్స్కాన్.. డీలర్ల పరేషాన్
పాలకోడేరు : రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు బస్తాలకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బియ్యం దిగుమతి అయ్యేటప్పుడు ఒకసారి, పంపిణీ సమయంలో రెండోసారి ఈ క్యూఆర్ కోడ్‌ను డీలర్లు స్కాన్ చేస్తారని తెలిపారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్ కేవలం పైన ఉండే గన్నీ (గోనె) సంచులకు మాత్రమే తప్ప, లోపల ఉన్న బియ్యానికి కాదు. అక్రమ రవాణాలో పట్టుబడే బియ్యం ఈ ట్యాగ్లు ఉన్న సంచుల్లో ఉండటం లేదు. ఒకవేళ ఆ సంచులతో పట్టుబడితే, అవి ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయో సులభంగా గుర్తించవచ్చు. అయితే వేలా ది బస్తాల బియ్యం ఎలాంటి ట్యాగ్లు లేని ప్లాస్టిక్ సంచుల్లోనే సరిహద్దులు దాటుతోందనేది బహిరంగ రహస్యం. బియ్యం నాణ్యత నచ్చకపోయినా, లేదా అవసరం లేకపోయినా.. కార్డుదారులు స్వ యంగా ఇళ్లకు వచ్చే దళారులకే వాటిని అమ్ముకుంటున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది. సరైన పరికరాలు సమకూర్చకుండా, రెండుసార్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రేషన్ డీలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. సుమారు 30 వేల మంది డీలర్లు రాష్ట్రంలో సుమారు 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు. షాపు ఇంటి అద్దె, సహాయకుని జీతం పోను నెలకు ఐదారు వేల రూపాయలు కూడా వీరికి మిగిలని పరిస్థితి. చివరికి ఈ–పాస్ యంత్రాల్లో వాడే పేపర్ రోల్స్‌ను కూడా సరఫరా చే యలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. కనీస వేతన చ ట్టం ప్రకారమైనా తమకు తగిన ఆదాయం డీలర్లు కోరుతున్నారు. బియ్యం సరఫరాలో జాప్యం క్యూఆర్ కోడ్ అమలులో సర్వర్ సమస్యతో బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో గత 26 నుంచి ప్రారంభం కావాల్సిన వృద్ధులకు రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ఈనెల 2వ తేదీ దాటినా 50 శాతం కూడా రేషన్ షాపులకు బియ్యం సరఫరా కాలేదు. ఏది ఏమైనా క్యూఆర్ స్కానింగ్ తప్పక చేయాల్సిందేనని పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు అంటున్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో సంస్కరణలు, ఆధునిక సాంకేతికతను స్వాగతిస్తున్నాం. అయితే ఆది పనిభారం పెంచేదిగా ఉండకూడదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సరళీకృతం కావాలి. రేషన్ డీలర్ల కుటుంబాల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. – సోము సాయికృష్ణ, పాలకోడేరు మండల రేషన్ల డీలర్ల సంఘ కార్యదర్శి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాఫియాను గుర్తించకుండా డీలర్లను బాధ్యులు చేయడం సరి కాదు. పలువురు చిరువ్యాపారులు లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి బియ్యాన్ని కొంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో మాకు ఇబ్బందులే. – గాజులపాటి గంగాధర్, ఏలూరు జిల్లా రేషన్ల డీలర్ల సంఘ అధ్యక్షుడు రేషన్ పంపిణీలో ఇక్కట్లు 3వ తేదీ వచ్చినా వృద్ధులకు అందని సరుకుల 50 శాతం కూడా షాపులకు చేరని బియ్యం -
5 నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల పరిధిలో విధులను బహిష్కరించి, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు కోనే సీతారామరావు తెలిపారు. ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. రక్షణ చట్టం సాధించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే, న్యాయవాదుల మృతికి సంతాప సూచకంగా నిర్వహించే సభను మధ్యాహ్నం 3.30 గంటలకు బదులుగా ఉదయం 10.30 గంటలకే కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో నరసాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఎన్. జ్ఞాననంద్, కే. అప్పిరెడ్డి, ఈ. గోపాలకృష్ణ, కై కారపు సత్యనారాయణ, జీఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం : అంతర్ జిల్లా నేరస్తుడిని తాడేపల్లిగూడెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఉభయ గోదావరితో పాటు బాపట్ల, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాలో 37 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పెదకాకాని పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాడేపల్లిగూడెంలో కారు చోరీ కేసులు అడ్డంగా బుక్కయ్యాడు. డీఎస్పీ బి.నరసింహారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్యతేజ ఈనెల 27న రాత్రి పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్లో ప్రవేశించి కా రును, నగదు, సీసీ టీవీ డీవీఆర్‌ను అపహరించా డు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బోఽణం ఆదిప్రసాద్ బృందం దర్యాప్తు చేపట్టి ఉంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై పెద్దాపురం, ఒంగోలులో చేసిన షట్టర్ పగులగొట్టి చేసిన చోరీలు బయటకు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో నమోదైన కేసుకు సంబంధించి కారు, పెద్దాపురంలో కేసుకు సంబంధించి రూ.1,63,581, ఒంగోలులో కేసుకు సంబంధించి రూ.36 వేల నగదు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కారు విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఆదిప్రసాద్, కానిస్టేబుళ్లు ఎ.దుర్గాప్రసాద్, ఆర్.మోహన్, ఎంకే రామ్‌కుమార్, బి.చైతన్యలను అభినందించారు. ఎస్సై బాదం శ్రీనివాసు, నాగరాజు పాల్గొన్నారు. -
కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు
ఇరగవరం: మండలంలోని ఇనపర్రు గ్రామానికి చెందిన కర్రి మోహన్ రెడ్డి (15) అనే బాలుడు చిక్కాల కాలువలో పడి గల్లంతయ్యాడు. తణుకు తిరుమల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మోహన్ రెడ్డి, శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురమ్మల దేవాలయం సమీపంలోని చిక్కాల కాలువ వద్ద చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోయాడు. స్నేహితులు అందించిన సమాచారంతో తండ్రి దామోదర్ రెడ్డి, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో గాంధీ జయంతి నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, డీఈఓ అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకను నిర్వహించారు. అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడూతూ గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. లాల్ బహదూర్‌శాస్త్రి నిరాడంబర జీవితం ఆయనిచ్చిన జై జవాన్.. జై కిసాన్ నినాదం దేశభక్తికి ప్రతీకని కొనియాడారు.జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, సీఐ కె.వరప్రసాద్, ఈ.ఇందుమతి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం డీఎస్పీగా బి.నరసింహారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి డీఎస్పీ యు.రవిచంద్ర దిశ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. నరసింహారావు గుంటూరు జిల్లాలో ఎస్సైగా, సీఐగా, ట్రాఫిక్‌లో, డీసీఆర్బీ క్రైమ్‌లో ఇలా పలు ప్రాంతాల్లో పనిచేశారు. గూడెం సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, నేర నియంత్రణ, గంజాయి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతానని ఆయన అన్నారు. సబ్ డివిజన్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాలకోడేరు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పాలకోడేరు పీఎంసీ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఎస్కే ధరణి ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యం వహిస్తాడని కోచ్ వనుం వెంకటేష్ తెలిపారు. ధరణి స్వగ్రామం మోగల్లు. గ్రామస్తులు అతడిని అభినందించారు. ద్వారకాతిరుమల: చిన వెంకన్న కొండపై ఓ కాంట్రాక్టర్‌కు అనధికారికంగా రెండు రోజులపాటు ఉచితంగా కాటేజీని కేటాయించిన వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో దేవస్థానం అధికారులు స్పందించారు. కాటేజీ అద్దె రూ.6,574ను సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా శుక్రవారం ఉదయం దేవస్థానం ఖజానాకు జమ చేయించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్ ఎట్టకేలకు నగదు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చెందిన సెవెన్న్హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ శ్రీనివాస నిలయం గెస్ట్‌హౌస్‌లో ఉచితంగా బస చేసిన విషయం తెలిసిందే. -
‘మమ్మల్ని మున్సిపాలిటీలో కలపొద్దు’
తాడేపల్లిగూడెం : తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని, మున్సిపాలిటీలో కలపవద్దని తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామస్తులు శు క్రవారం రాత్రి రోడ్డెక్కారు. విలీన గ్రామాలను ము న్సిపాలిటీలో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా ఆందోళన చే పట్టారు. గత 12 ఏళ్లుగా గ్రామానికి పాలకవర్గం లేక ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదన్నారు. కనీసం డ్రైన్లు శుభ్రం చేయడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే అంతా కూలీలుగా పనిచేసే ఉపాధి హామీ పని కూడా అందకుండా పోతుందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు చొరవ తీసుకొని తమ గోడును ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. -
బాధిత మహిళకు న్యాయం చేయాలి
నరసాపురం రూరల్: అత్తవారింటి ముందు పది రోజులుగా దీక్ష చేస్తున్న కొమరాడ దేవి దివ్యను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ శుక్రవారం పరామర్శించారు. ఎల్బీచర్లకు చెందిన దుర్గాప్రసాద్‌తో ఏడేళ్ల క్రితం దేవి దివ్యకు వివాహమైంది. భర్త వేధింపులకు గురిచేస్తుండటంతో కోర్టును ఆశ్రయించగా, భార్యతో కలిసి కాపురం చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ భర్త ఆమెను చేర్చుకోకపోవడంతో బాధిత మహిళ అత్తవారింటి ముందే దీక్షకు దిగింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. బాధితురాలికి మద్దతుగా నిలవాల్సిన పోలీసులు ఆమెను అవమానించడం తగదన్నారు. అధికారులు వెంటనే స్పందించి భర్త దుర్గాప్రసాద్‌ను తీసుకువచ్చి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జల్లి రామ్మోహనరావు, పొగాకు నారాయణరావు పాల్గొన్నారు. -
బీసీలకు బాబు బురిడీ
చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి, కోర్టుల్లో కొట్టేస్తారని పూర్తి అవగాహన ఉండి కూడా రిజర్వేషన్ కల్పించినట్లు స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం స్టంట్ షో చేశారు. కట్‌చేస్తే.. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టివేయడంతో చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడకు చెక్ పడింది.శురకవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆరువారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో రిజర్వేషన్ల పేరి ట గంపగుత్తగా బీసీ ఓట్లను దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో సామాజిక న్యాయం సాధికారతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పదవులు కేటాయించారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా స్థానిక మొదలు మంత్రి పదవుల వరకు బీసీలకే సింహభాగం కేటాయించారు. హైకోర్టులో చుక్కెదురు బీసీ రిజర్వేషన్ జీఓను హైకోర్టు గురువారం కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని, గ్రామీణ ప్రాంతంలో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం కల్పించేలా జారీ చేసినరోపై అభ్యంతరాలు రావడం, హైకోర్టులో కేసు దాఖలు కావడంతో రాజ్యాంగ పరిధికి లోబడి రిజర్వేషన్ కల్పించలేదని, అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఇచ్చిన జీఓలను హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో మరోసారి బీసీ రిజర్వేషన్లను ఎన్నికల అస్త్రంగా మలిచి లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు సర్కారు ప్రయత్నాలపై సర్వత్రా మండిపడుతున్నారు. బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్ అంటూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్.. సామాజిక న్యాయమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యమిచ్చారు. ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణను సామాజిక కోణంలోనే అవకాశం కల్పించారు. వడ్డీ కులస్తులకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని పాదయాత్రలో మాట ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీ చేశారు. ఏలూరు జిల్లాపరిషత్‌ను కూడా ప్రత్యేకంగా బీసీలకు కేటాయించారు. తొలుత కవురు శ్రీనివాస్‌ను జెడ్పీ చైర్మన్‌గా పనిచేసి అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో బీసీ మహిళ గంటా పద్మశ్రీకి చైర్పర్సన్ అవకాశం కల్పించారు. పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే గణపవరం: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ సోదరులకు మరోసారి వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామా బీసీలంతా గ్రహించారన్నారు. ఇప్పటికే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి వారిని నిలువునా మోసం చేసిన వెన్నుపోటు పార్టీ మరోసారి రిజర్వేషన్ల పేరుతో వంచించిందన్నారు. 34 శాతం రిజర్వేషన్లు చెల్లవని తెలిసే చంద్రబాబు ఈ అంశాన్ని స్థానిక ఎన్నికల ముందు తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టసవరణకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు నిజంగా అండగా నిలిచింది వైఎస్సార్సీపీ మాత్రమే అని స్పష్టం చేశారు. బాబు మార్కు వెన్నుపోటు రిజర్వేషన్ల పేరిట వంచన ఫలించని స్థానిక ఎన్నికల స్టంట్ షో రిజర్వేషన్ కొట్టేస్తారని తెలిసే జీఓ పేరిట మభ్యపెట్టే హడావుడి భగ్గుమంటున్న బీసీ సంఘాలు వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యం మంత్రి పదవులు మొదలు నామినేటెడ్ సీట్ల వరకూ సింహభాగం ఉమ్మడి పశ్చిమలో సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీ వర్గాలకే పెద్ద పీట బీసీలకు 34 శాతం రిజర్వేషన్లుగత వైఎస్సార్సీపీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పదవుల కేటాయింపులో బీసీలకు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యంపై జిల్లాలో చర్చ సాగుతుంది. మండల స్థాయి నేతలకు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లుగా, కొందరికి చైర్మన్లుగా పదవులు కట్టబెట్టారు. ఉమ్మడి పశ్చిమలో చూస్తే తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవి కట్టపెట్టారు. అలాగే జెడ్పీటీసీగా ఉన్న కవురు శ్రీనివాస్‌ను జెడ్పీ చైర్మన్‌గా, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త, ఆ తరువాత శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు ఐదుకి పైగా జిల్లాకు చెందిన బీసీలకే దక్కాయి.బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు, పాలకొల్లు నుంచి గూడాల గోపి, నరసాపురం పార్లమెంట్ నుంచి గూడూరి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ నుంచి కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. మున్సిపాల్టీల్లోనూ బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏలూరు నగర మేయర్ స్థానం జనరల్ కేటగిరీ అయినా బీసీ మహిళ షేక్ నూర్జహాన్‌కు అవకాశం కల్పించారు. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్‌గా బత్తిన నాగలక్ష్మి, నరసాపురం మున్సిపల్ చైర్మన్ గా బర్రి వెంకటరమణ, ఆకివీడు నగర పంచాయతీ మొదటి మున్సిపల్ చైర్మన్‌గా జామి హైమావతిలకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పెద్ద సంఖ్యలో పదవులు దక్కాయి. జనరల్ కేటగిరీలో కూడా పలుచోట్ల బీసీలకు అవకాశాలను కల్పించారు. గత 50 ఏళ్ల చరిత్రలో జిల్లాలో బీసీలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఏ రాజకీయ పార్టీ కల్పించలేదు. -
విభిన్న ఆలోచనలతో ఆవిష్కరణలు
తాడేపల్లిగూడెం: విద్యార్థుల విభిన్న ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు పుట్టుకువస్తాయని ఏపీ నిట్ డీన్ ప్లానింగ్ డెవలప్మెంట్ డాక్టర్ సందీప్ అన్నారు. గురువారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇంటర్ విద్యార్థులు ఏపీ నిట్‌కు వచ్చారు. వారితో సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాల్లోని విషయాలను చదవడంతో పాటు వాటిని ఆచరణలో పరిశీలించినప్పుడే పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రశ్నించే తత్త్వం, పరిశోధనా దృక్పథాన్ని చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలన్నారు. విద్యార్థినులు తమలోని ఆసక్తి, ప్రతిభను సాంకేతిక పరిజ్ఞానంతో మేళవిస్తే దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. అనంతరం సందీప్‌ను సత్కరించారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం
పెదవేగి: నిరంతర సాధన, ప్రతిభ, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యపడతాయని పెదవేగిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు అన్నారు. గురువారం కళాశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి 70వ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్లో వివిధ విభాగాలకు చెందిన మేనేజర్లు, 20 మంది అఫీషియల్స్ (నిర్ణేతలు) పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ పోటీలు కొనసాగుతాయని అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కందికొండ జయరాజు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21 నుంచి 25 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లుగా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ శాఖ నుంచి సముద్రకని, ఏసోబు, శివకృష్ణ తదితరులు హాజరయ్యారు. -
వడ్లమానులో స్కూల్ బస్సు బీభత్సం
● బైక్‌ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన బస్సు ● ఓ యువకుడికి తీవ్ర గాయాలు, ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమాను శివారులో గురువారం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నూజివీడుకు చెందిన బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ (బిస్) బస్సు తోటపల్లి, చిన్నాగిరిపల్లి, ఆగిరిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 35 మంది విద్యార్థులను ఎక్కించుకుని నూజివీడులోని పాఠశాలకు బయలుదేరింది. వడ్లమాను గ్రామం దాటిన తర్వాత, ఆ బస్సుతో పాటు మరో రెండు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు ఒకరికొకరు అతివేగంగా ఓవర్‌టెక్ చేసుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూకి బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్‌పై నూజివీడులోని వికాస్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్తున్న ముసునూరుకు చెందిన చిమట సతీష్ (19) తీవ్రంగా గాయపడగా, అతని మిత్రుడు మూడి వెంకటేశ్వరరావు (19)కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను నూజివీడు ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు అదుపుతప్పి బోల్తా పడిన బస్సులో ఉన్న విద్యార్థులందరూ అందులోనే ఇరుక్కుపోయి భయంతో హాహాకారాలు చేశారు. అదే సమయంలో వేరే కళాశాల బస్సులో వెళ్తున్న విద్యార్థులు అక్కడ ఆగి, బోల్తా పడిన బస్సులోని పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని తల్లిదండ్రులు ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించి ఇళ్లకు చేర్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కేవీవీఎన్‌వీ. ప్రసాద్ పరిశీలించారు. అలాగే నూజివీడు సీఐ ఐవీ నాగేంద్రకుమార్, ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని బోల్తా పడిన బస్సును బయటకు తీయించారు. అదృష్టవశాత్తు పిల్లలందరూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే కారణం నూజివీడుకు చెందిన పలు విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు పాఠశాల యాజమాన్యాలు నిర్ధేశించిన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఒకరిని మించి మరొకరు అతివేగంగా, ఓవర్‌టెక్ చేస్తూ బస్సులు నడుపుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బిస్ బస్సు మరో కళాశాల బస్సును ఓవర్‌టెక్ చేస్తున్న తరుణంలోనే ఎదురుగా వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల వాహనాన్ని ఢీకొట్టిందని వారు పేర్కొన్నారు. బస్సులో నుంచి విద్యార్థులను బయటికి తీస్తున్న యువకులు ప్రమాదంలో భయాందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లి -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
ఉండి: మధ్యంతర భృతిని 30 శాతం ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని హైస్కూళ్లు, కళాశాలలను సందర్శించారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించిదని, అయినా మధ్యంతర భృతి ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్ బకాయిల చెల్లింపునకు రోడ్డు మ్యాప్ విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు కోసం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేస్తూ ఉత్తర్వులను విడుదల చేయాల్సి ఉందన్నారు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సత్యం, కె.సురేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. భీమవరం: సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ అర్హులకు ప్రయోనం అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జలజీవన్ మిషన్, పల్లె పండుగ పనుల ప్రగతిని సమీక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వివరించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 2.19 లక్షల మందికి పింఛన్లు భీమవరం 8వ వార్డు కంకరదొడ్డి చినరంగనిపాలెం వద్ద పేదల సేవలో 2.0 గ్రామ సభలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.19 లక్షల మందికి రూ.95 కోట్ల మేర పింఛన్లు అందిస్తున్నామన్నారు. అలాగే 45 వేల పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వానికి పంపామన్నారు. కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ బి.ప్రసన్నకుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.మాధవి ఆర్జిత సెలవుపై వెళ్లడంతో డీన్ ఆఫ్ హార్టీకల్చర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్ కు రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల ప్రవేశాలు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయన్నారు. అలాట్మెంట్ లేఖలు అందిన డిగ్రీ విద్యార్థులు ఈనెల 3లోపు కాలేజీల్లో చేరాలన్నారు. పీజీ, పీహెచ్డీ ప్రవేశాల కోసం శుక్రవారంలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వారికి ఈనెల 5న అలాట్మెంట్ లేఖలు వెళతాయన్నారు. తణుకు అర్బన్: ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి చిత్ర కళా పోటీల్లో తణుకుకు చెందిన చి త్రకారుడు డాక్టర్ వెంపటాపు ప్రథమ బ హుమతి అందుకున్నారు. గతనెల 30న ఒంగోలు జరిగిన ఒంగోలు 150 వసంతాల ఉత్స వ కార్యక్రమంలో ఒంగోలు వైభవ ప్రకాశం–ప్రభంజనం శీర్షికతో రూపొందించిన కళాఖండానికి బహుమతి లభించింది. రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపిక అందుకున్నట్టు వెంపటాపు తెలిపారు. -
కొల్లేరు సమస్యలు కొలిక్కి వచ్చేనా..?
కై కలూరు: కొల్లేరు అభయారణ్య సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది. పర్యావరణ ప్రేమికుల ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ (సీఈసీ) ఇటీవల కొల్లేరులో ఆక్రమిత చెరువులు, హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అటవీ, రెవెన్యూ, డ్రెయినేజీ శాఖల నుంచి వివరాలు సేకరించినప్పటికీ, పూర్తి స్థాయి సమాచారం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 27న ఏలూరు కలెక్టరేట్లో పర్యావరణ, అటవీశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతిలాల్ దండే జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాలతో ప్రస్తుతం దస్త్రాల సేకరణ ప్రక్రియ వేగవంతమైంది. భూముల విస్తీర్ణం – ప్రభుత్వ ప్రతిపాదనలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి, ఏలూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 122 గ్రామాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అభయారణ్యంలో 14,932 ఎకరాల జిరాయితీ భూములు, 5,510 ఎకరాల డీ–పట్టా భూములు కలిపి మొత్తం 20,442 ఎకరాలు ఉన్నాయి. వీటిని అభయారణ్య పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇప్పటికే సీఈసీకి నివేదిక సమర్పించింది. అయితే, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో ఆ నివేదికను సీఈసీ తిరిగి పంపింది. అక్టోబర్ 5వ తేదీలోపు సమగ్ర నివేదికను అందజేయాలని స్పష్టం చేయడంతో, అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తుది నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. చిత్తడి నేలల చట్టం నీడలో స్థానికులు కొల్లేరు అభయారణ్య సరిహద్దులకు సమీపంలో 10 కిలోమీటర్ల మేర రక్షణ వలయంగా గుర్తించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 13 మండలాలు, 6 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల పరిధిలో లక్షలాది ఎకరాల భూముల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ‘వాయిస్ ఆఫ్ కొల్లేరు’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి సిద్ధమవుతుండటం గమనార్హం. కొల్లేరు నివేదికపై ఏలూరు కలెక్టరేట్లో సీఎస్ కాంతిలాల్ దండే సమావేశం (పైల్) కొల్లేరు ప్రాంతం ఎన్నికల సమయంలో కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అక్రమ చెరువుల తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా ఉండటం, అధికారుల నివేదికలపై పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం సాధికారిత కమిటీ(సీఈసీ)కి కొల్లేరు అంశంపై ఇప్పటికే నివేదిక చేరింది. ఇందులో 10 శాతం కొన్ని సమస్యల వల్ల తిరిగి మార్పులతో నివేదిక పంపుతున్నాం. అటవీ, రెవెన్యూశాఖల సమన్వయంతో తుది నివేదిక తయారవుతోంది. ఉన్నతాధికారులు నివేదికపై ప్రత్యేక దృష్టి సారించాలి. – కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, కై కలూరు ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. గ్రామాల్లో అనేక మంది ఉపాధి పనులు లభించక వలసబాట పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా అటవీ చట్టాలలో మార్పు రావాలి. – జయమంగళ కాసులు, మాజీ సర్పంచ్, పెంచికలమర్రు సీఈసీ నివేదిక నిమిత్తం ఈ నెల 5న డెడ్‌లైన్ అటవీ, రెవెన్యూ శాఖలకు పీఎస్ కాంతిలాల్ దండే సూచనలు సానుకూల నిర్ణయంపై కొల్లేరు ప్రజల ఎదురుచూపులు -
గళమెత్తిన వీఆర్ఏలు
బైక్‌లపైకి దూసుకెళ్లిన కారు పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో రెండు బైక్‌లపైకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. 8లో uభీమవరం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు వీరికి మద్దతు ప్రకటించి మాట్లాడుతూ 16 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్సీ సమావేశానికి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జకరయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ పి.గోపాలకృష్ణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3న అండర్ 14, 17 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నెట్‌బాల్ సెలెక్షన్స్ పాలకోడేరు మండలం గొరగనమూడి హైస్కూల్లో, ఫెన్సింగ్ సెలెక్షన్స్ వీరవాసరం హైస్కూల్లో నిర్వహించనున్నట్టు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు జి.నర్మద, మహమ్మద్ కుద్దూస్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంలో హాజరుకావానలి, మరిన్ని వివరాలకు సెల్ 9885158366లో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో జిల్లాకు చెందిన విద్యార్థిని మూడో స్థానంలో నిలిచింది. 27 జిల్లాల నుంచి 54 మంది విద్యార్థులు హాజరుకాగా మహా త్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని బి.ఆశా ప్రతిభ కనబర్చింది. ఆమెను, గైడ్ టీచర్‌ను డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ, జిల్లా సైన్స్ అధికారి ఎస్వీఎస్ సోమయాజులు అభినందించారు. -
పుర ఎన్నికలు షురూ
సాక్షి, భీమవరం: జిల్లాలో ప్రత్యేక పాలనలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఓటర్లు, వార్డుల విభజనకు దాదాపు నెలన్నర రోజులు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో నరసాపురం, ఆకివీడులో తొలి విడతలోను, మిగిలిన వాటికి మలి విడతలో ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలో.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీ ఉన్నాయి. 2014లో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా 2019తో పదవీ కాలం ముగిసింది. కోవిడ్ నేపధ్యంలో రెండేళ్లు ప్రత్యేక పాలన సాగింది. భీమవరం సమీపంలోని తాడేరు, రాయలం, చినఅమిరం, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం గ్రామాలు, తణుకులో వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం గ్రామాలు, పాలకొల్లులో దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం గ్రామాలు, తాడేపల్లిగూడెంలో పడాల, కుంచనపల్లి, ఎల్ అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు కోర్టులను ఆశ్రయించారు. విలీన సమస్యలు లేకపోవడంతో నరసాపురం, ఆకివీడులో 2021లో ఎన్నికలు జరగ్గా, మిగిలిన నాలుగు మున్సిపాల్టీలు ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఉండిపోయాయి. రెండో విడతలోనేనా? విలీన పంచాయతీలకు సంబంధించిన మున్సిపాల్టీల్లో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో నరసాపురం, ఆకివీడులో మాత్రమే వార్డులు, సామాజికవర్గాల వారీగా ఓటర్లు విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో ఎలాంటి కసరత్తు మొదలు కాలేదు. కోర్టు తీర్పు ఉత్తర్వులు ప్రభుత్వానికి చేరి, వాటిపై ప్రభుత్వం కసరత్తు చేసి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు వారం పది రోజుల సమయం పడుతుంది. వార్డులు పునర్విభజన, ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల, అదే తరహాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లు విభజన, పోలింగ్ కేంద్రాలు తదితర వాటికోసం దాదాపు నెలన్నర రోజుల సమయం పడుతుంది. అయితే ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల కసరత్తు పూర్తిచేసిన నరసాపురం, ఆకివీడులో తొలి విడతలోను మిగిలిన నాలుగు మున్సిపాల్టీలకు రెండో విడతలోను ఎన్నికలు జరుగవచ్చునంటున్నారు. పెరగనున్న వార్డులు నాలుగు పట్టణాల్లో వార్డుల సంఖ్య పెరుగనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు భీమవరంలో 39 వార్డులు 52కు, తణుకులో 34 నుంచి 48 వార్డులకు, తాడేపల్లిగూడెంలో 32 నుంచి 48 వార్డులకు, పాలకొల్లులో 31 నుంచి 48 వార్డులకు పెరగవచ్చునని అంచనా. కొత్త వార్డులకు హద్దులు నిర్ణయించాక ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలు చేయాల్సి ఉంది. జనాభా ఆధారంగా ఎన్ని వార్డులు పెరుగుతాయి?, ఏ ప్రాంతం ఏ వార్డులోకి వస్తుంది? రిజర్వేషన్లు ?, గెలుపు అవకాశాలపై ఆశావాహులు ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు. హైకోర్టు తీర్పుతో తొలగిన విలీన అడ్డంకులు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో లైన్ క్లియర్ ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఆయా పట్టణాలు ఓటర్లు, వార్డుల విభజనకు నెలన్నర సమయం -
సహస్ర గళం.. పారాయణ వైభవం
ప్రవచనం చెపుతున్న మణిప్రసన్నమ్మ, సహస్రగళ లలితా పారాయణంలో పాల్గొన్న మహిళలు పాలకొల్లు సెంట్రల్: మహిళా సాధికారత, యువజన సాధికారత, సంతోషకరమైన కుటుంబాల నిర్మాణం, ఆనందదాయకమైన వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రేమతో కూడిన ప్రపంచం ఏర్పడుతుందని కామాఖ్యామృత పీఠం హైదరాబాద్ శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ (మణిప్రసన్నమ్మ) అన్నారు. గురువారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్. కన్వెన్షన్ హాలులో సనాతన భక్తిమండలి, శ్రీ విద్యా ఉపాసకురాలు డాక్టర్ నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సహస్రగళ లలితా పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు 2,500 మంది మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణ విశిష్టతను వేణుశ్యామ వివరించారు. భక్తులకు ఉచ్చరణ దోషాలు లేకుండా సరైన పద విభజనతో మూడు పర్యాయాలు పారాయణం చేయించారు. ఎస్. కన్వెన్షన్ హాలు భక్తులతో కిటకిటలాడింది. పట్టణంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నసమారాధన నిర్వహించారు. -
రెండు బైకుల పైకి దూసుకెళ్లిన కారు
పెనుమంట్ర: రాష్ట్రీయ రహదారిపై పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన జోగి నరేష్ (38) తన మోటార్‌సైకిల్‌పై బ్రాహ్మణచెరువు నుంచి అత్తిలి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అత్తిలి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు.. నరేష్ బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి కుడివైపు స్కూటీపై ఆరవల్లి వెళ్తున్న అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన వెలగల బాపిరెడ్డి (60), రామలక్ష్మి (55) దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది, రెండు బైకులు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద ఉధృతికి కారులోని ఎయిర్బెలూన్లు కూడా తెరుచుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో జోగి నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, బాపిరెడ్డి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలించారు; ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ టనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు ఇటీవలే గల్ఫ్ దేశం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన నరేష్‌కు భార్య, తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన కుటుంబంలో ఈ పెను విషాదం చోటుచేసుకోవడంతో నరేష్ మరణ వార్త విని భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. ఓ యువకుడు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
మణికుమార్రాజు మృతదేహం లభ్యం
భీమవరం: పట్టణంలోని బీవీ రాజు విగ్రహం సమీపంలో యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకిన మణికుమార్రాజు మృతదేహాన్ని గురువారం గొల్లవానితిప్ప గ్రామం సమీపంలో గుర్తించినట్లు భీమవరం వన్‌టౌన్ ఎస్సై కె. శ్రీనివాస్ తెలిపారు. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన గొల్లి మణికుమార్రాజు (30) సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి పట్టణంలోని బీవీ రాజు విగ్రహం సమీపంలోని వంతెన వద్ద మోటార్‌సైకిల్, ఫోన్ వదిలి డ్రెయిన్‌లోకి దూకాడు. మృతుడి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహం గొల్లవానితిప్ప సమీపంలోని యనమదుర్రు డ్రెయిన్‌లో లభ్యమైనట్లు ఎస్సై పేర్కొన్నారు. వివాహ విషయమై క్షణికావేశంలో మణికుమార్రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంతేరు హైస్కూల్ పీడీ రేలంగి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో నిర్వహించిన జిల్లా పీఈటీ అసోసియేషన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ మాజీ అధ్యక్షుడు, రీజనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ బి.జాన్సన్, ఏలూరు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి రాంబాబు, ఏలూరు పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి ఇందుకూరి రమేష్‌రాజు, పీఈటీ సంఘ తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఎంవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఎన్నికై న రామకృష్ణను డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ఎల్. సాయి శ్రీనివాస్, ఎంఈఓ–1 గుమ్మళ్ల వీరాస్వామి, ఎంఈఓ–2 ములుగుర్తి వెంకట సత్యనారాయణ తదితరులు అభినందించారు. -
కొండ చిలువ కలకలం
దెందులూరు: నాగులదేవునిపాడు బీసీ కాలనీలో గురువారం రాత్రి పది అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఏరియాలో భారీ కొండచిలువను చూసి స్థానికులు బెంబేలెత్తి, భయాందోళనతో పరుగులు తీస్తూ కేకలు వేశారు. ఆ సమయంలో మోర్ల చిట్టిబాబు ధైర్యంగా ముందుకు వచ్చి, ఆ కొండచిలువను హతమార్చారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ పెంటాథ్లాన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మోడ్రన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత జూలై 10 నుంచి 12వ తేదీ వరకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో లేజర్ రన్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిలో సీనియర్ విభాగంలో జిల్లాకు చెందిన కే అప్పారావు, డీ నాగ మోహనరెడ్డి, కే వాట్సన్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని సత్యనారాయణ పేర్కొన్నారు. -
సమగ్ర పోషక యాజమాన్యంపై శిక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏలూరు ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు సమగ్ర పోషక యాజమాన్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం సమన్వయకర్త కే ఫణికుమార్ తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త ఎన్. నాగేంద్రబాబు సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషాదేవి, ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కే సాజానాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫణికుమార్ మాట్లాడుతూ.. సభ్యులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటల ఉత్పాదకతను స్థిరంగా కొనసాగించేందుకు సేంద్రియ, రసాయన ఎరువులను సమతుల్యంగా వినియోగించడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం అవసరమని వివరించారు. రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్, కోఆర్డినేటర్ ఎం. శ్రీనివాస్ నేల సారవంతత భావన, నేల ఆరోగ్యంలో సేంద్రియ ఎరువుల పాత్ర, అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగం వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు, సేంద్రియ ఎరువుల వనరులపై అవగాహన కల్పించారు. -
మందుబాబులకు చెక్
కైకలూరు : పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (165) విస్తరణ పనుల్లో గోపవరం–అగ్రహారం బైపాస్ రోడ్డులో తాగుబోతులకు కై కలూరు టౌన్ పోలీసులు బుధవారం చెక్ పెట్టారు. ఇక్కడ సమస్యపై ‘ప్రారంభానికి ముందే తాగుబోతుల రహదారి’ శీర్షికన గతనెల 22న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించారు. సీఐ ఏవీఎస్ రామకృష్ణ ఆ దేశాలతో ఎస్సై కె.గణేష్ వర్మ నిఘాను ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి హైవే బైపాస్‌లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారితోనే ఉదయం బైపాస్ సమీపంలో తాగి పడేసిన మద్య సీసాలను సంచులతో ఎత్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని హెచ్చరించారు. -
నామాలస్వామికే ఎగనామం!
● కాంట్రాక్టర్‌కు ఉచితంగా కాటేజీ ● దేవస్థానానికి జమకాని రూ.6,574 అద్దె ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై ఓ కాటేజీని దేవస్థానం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్టర్‌కు అద్దె లేకుండా రెండు రోజులపాటు ఉచితంగా కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అందులోనూ ఆ కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ సొమ్ము ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. దేవస్థానంలో 2022 నుంచి 2025 సెప్టెంబర్ నెలాఖరు వరకు మంగళగిరికి చెందిన ‘సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పారిశుద్ధ్య పనులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన అవకతకవలు, ఆరోపణల నేపథ్యంలో రూ.60 లక్షలకు పైగా నగదును కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా దేవస్థానం ని లిపివేసింది. ఇప్పుడు ఆ నగదును ఎలాగైనా కాంట్రాక్టర్‌కు ముట్టచెప్పాలని కొందరు అధికారులు ప్ర యత్నిస్తున్నారన్న ఆరోపణలపై ‘సాక్షి’లో బుధవారం ‘స్వామీ.. ఇదేం గూడుపుఠాణి?’ శీర్షికన ప్ర చురితమైన కథనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సదరు కాంట్రాక్టర్ దేవస్థానం కాటేజీ అద్దెను ఎగవేసిన విషయం బయటకు వచ్చింది. ఆదాయానికి గండి : తన పనులు చక్కదిద్దుకునేందుకు ఈనెల 23న సాయంత్రం క్షేత్రానికి వచ్చిన సదరు కాంట్రాక్టర్‌కు దేవస్థానం అధికారులు కొండపైన శ్రీనివాస నిలయం గెస్ట్‌హౌస్‌ను ఇంజనీరింగ్ విభాగ ఏఈ ఆదిత్య రిఫరెన్స్‌తో నిబంధనలకు విరుద్ధంగా (ఉచితంగా) కేటాయించారు. కాంట్రాక్టర్ ఆ కాటేజీలో ఈనెల 25 ఉదయం వరకు ఉ న్నారు. అయితే ఈ రెండు రోజుల అద్దె సొమ్ము రూ.6,574 దేవస్థానానికి జమ కాలేదు. దేవస్థానం కాటేజీలను ఎవరికీ ఉచితంగా ఇవ్వరని, కాంట్రాక్టర్‌కు ఎలా కేటాయించారని స్థానికులు ప్రశ్నిస్తున్నా రు. అందులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పా త కాంట్రాక్టర్‌కు ఈ సౌకర్యం కల్పించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జమ చేస్తారా.. ఎగ్గొడతారా? : కాటేజీ అద్దె సొమ్ము ను దేవస్థానానికి కాంట్రాక్టర్ కడతాడా.. లేక ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెల్లిస్తారా అన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి. -
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
భీమవరం: సమగ్ర శిక్ష పరిధిలోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్ట్, క్రాఫ్ట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు, సెలవులు, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ ను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే పీటీఐ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలుచేసి ఎస్జీటీ స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేసి నిర్దేశిత విధి సమయాలకే పరిమితంగా విధు లు కేటాయించాలన్నారు. జిల్లా కార్యదర్శి పి. సుబ్బారావు మాట్లాడుతూ తమకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, హెల్త్‌కార్డు, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీవీ నాగబ్రహ్మం, కోశాధికారి టీవీఎన్‌ఎస్ మూర్తి, ఉపాధ్యక్షుడు టి.చినబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో రెన్యువల్ కాని మద్యం దుకాణాలకు లైసెన్స్ కేటాయింపునకు సంబంధించి ఒక్కో షాపునకు 10 దరఖాస్తులు తగ్గకుండా కృషి చేయాలని ఎకై ్సజ్ శాఖ నోడల్ అధికారి బి.అరుణ్‌రావు అన్నారు. భీమవరం ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉందన్నారు. స్టేషన్ల వారీగా భీమవరం పరిధిలో 9, ఆకివీడులో 6, తణుకులో 5, నరసాపురంలో 3, తాడేపల్లిగూడెంలో రెండు షాపులకు లాటరీ తీయాల్సి ఉందన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎన్.ప్రభుకుమార్, జిల్లా అధికారి బి.సుబ్బారావు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను గురువారం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 2,19,185 మంది లబ్ధిదారులకు రూ.95.38 కోట్లను పంపిణీ చేస్తామన్నారు. పాలకొల్లు సెంట్రల్: జిల్లాలో విలీన గ్రామాల ప్రక్రియతో పలువురు కోర్టును ఆశ్రయించడంతో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, తణుకు పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ జరగలేదు. ఈ ప్రక్రియపై గురువారం కోర్టులో భవితవ్యం తేలనున్నట్టు సమాచారం. రాజకీయ నాయకులు ముఖ్యంగా పట్టణ ప్రజ లు ఎన్నికల నిర్ణయంపై తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆశావహులు తీర్పు కోసం పడిగాపులు కాస్తున్నారు. భీమవరం: కొవ్వాడకి చెందిన ఇందుకూరి శశి కుమార్‌వర్మ కుమారుడు చరణ్‌వర్మ ఫెన్సింగ్ లో ప్రతిభ చూపుతున్నాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అలాగే 2025 స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్, 2026 డిస్ట్రిక్ట్ లెవెల్ బ్రాంజ్ మెడల్, 2026 స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్ పొందాడు. ఈ సందర్భంగా భీమవరం క్యాంపు కార్యాలయంలో బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చరణ్వర్మను అభినందించారు. అంతర్జాతీయ స్థాయి లో రాణించాలని ఆకాంక్షించారు. -
ఆంక్షలు పెంచేసి.. అర్హులని తగ్గించి..!
భీమవరం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఎట్టకేలకు సామాజిక పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించింది. పలురకాల కొర్రీలు, ఆంక్షలతో లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టింది. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత వేలాది మందిని అనర్హులుగా తేల్చింది. దీంతో పింఛన్ మంజూరు చేయించుకోవడం కోసం పేదలు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే అదనుగా కొందరు దళారులు పింఛన్లు ఇప్పిస్తామంటూ కౌంటర్లు తెరిచి ముడుపులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ పరిధిలో 49,901 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 6,112 మందిని అధికారులను అనర్హులుగా గుర్తించారు. ముడుపుల దందా : ప్రభుత్వం విడతల వారీగా పింఛన్లు ఇస్తామని ప్రకటించడంతో మొదటి విడతలో మంజూరు చేయించాలంటూ పేదలు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు కూట మి నాయకులు ముడుపుల దందాకు తెరదీసినట్టు సమాచారం. పింఛన్ మంజూరుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పలువురు ఈ సొమ్ములను వారికి మట్టుజెబుతున్నారు. పింఛన్ల మంజూరు పేరుతో సొమ్ములు వెనకేసుకోవాలనే ప్రయత్నంలో కూట మి నాయకులు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నా యి. అలాగే గ్రామాల్లో పింఛన్ల మంజూరు విషయంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య విభేదాలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ సృష్టించిన చిత్రం పింఛన్ దరఖాస్తుల్లో కోత జిల్లాలో 6,112 దరఖాస్తుల తిరస్కరణ ఇదే అదనుగా మంజూరు కోసం మామూళ్ల వసూళ్లు కౌంటర్లు తెరిచిన కూటమి నేతలు ! -
ఇసుక అక్రమాలు నిల్వరించేదెలా..?
ఇసుక స్టాక్ పాయింట్ అడ్డాగా నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. అడ్డగోలుగా ధరలు వసూలు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. రూ.4 వేల లోపు ఖర్చయ్యే లోడింగ్‌కు రూ.7 వేలు వసూలు చేస్తున్నారని టిప్పర్ అసోసియేషన్ నాయకులు అంటున్నారు. దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. సాక్షి, భీమవరం: జిల్లాలో వశిష్ట గోదావరి తీరం వెంబడి సిద్దాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్ రీచ్‌లు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలి లంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోస్టల్ రెగ్యులర్ జోన్ (సీఆర్‌జెడ్)గా ప్రకటించింది. ఉప్పునీటి సాంద్రత వలన ఇక్కడి ఇసుక నిర్మాణాలకు పనికిరాదని ర్యాంపులు మూసివేశారు. జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని ర్యాంపుల నుంచి ఇసుకను తెస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ స్టాక్ పాయింట్లలో ఇసుక లేక జిల్లా అవసరాల నిమిత్తం పక్క జిల్లాలోని స్టాక్ పాయింట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని జిల్లాకు చెందిన టిప్పర్ లారీ అసోసియేషన్ నేతలు అంటున్నారు. ఉచిత ఇసుక పాలసీ మేరకు కేవలం లోడింగ్ చార్జీలు మాత్రమే వసూలు చేయాలి. ర్యాంపు వద్ద ఈ ధర 20 టన్నుల లారీకి రూ.2 వేల వరకు ఉంటుంది. స్టాక్ పాయింట్ వద్ద అయితే ర్యాంపు నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుక రవాణా, నిర్వహణ చార్జీలతో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. అయితే డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని స్టాక్ పాయింట్లో ప్రభుత్వం టన్నుకు రూ.310లు చొప్పున అధిక ధరను నిర్ణయించిందని, దీనికి అదనంగా నిర్వాహకులు లారీకి రూ.800లు కలిపి రూ.7 వేలు వసూ లు చేస్తున్నారంటున్నారు. దీంతో లారీకి రూ.3 వేలకు పైగా భారం పడుతోందని తెలిపారు. జిల్లాకు రోజుకు వందకు పైగా లారీలు వస్తుండగా ఈ మేరకు వినియోగదారులపై భారం పడుతోంది. స్టాక్ పాయింట్లలో దోపిడీతో జిల్లాలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయని, లారీ ఇసుక పాలకొల్లుకు రూ. 13,200, నరసాపురానికి రూ.14,200, భీమవరానికి రూ.16,200, తాడేపల్లిగూడేనికి రూ.13 వేలు, తణుకుకు రూ.11 వేలు వరకు ధరలు ఉన్నాయంటున్నారు. ధరల నియంత్రణకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో స్టాక్ పాయింట్ లేకపోవడంతో కోనసీమ జిల్లా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెబుతుంటే అక్కడ లారీకి రూ.7 వేల చొప్పున అడ్డగోలుగా లోడింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ధర మరింత పెంచుతారని తెలుస్తోంది. లారీ కిరాయి కంటే ఇసుక ఖరీదు ఎక్కువగా ఉంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాం. – రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సైఖతం అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఇసుక కొరత పొరుగు జిల్లాలోని స్టాక్ పాయింట్లో లారీకి రూ.7 వేల వసూలు వినియోగదారులపై అదనపు భారం జిల్లాకు రోజుకు వంద లారీలకు పైగా ఇసుక ఉన్నతాధికారులకు టిప్పర్ లారీ అసోసియేషన్ ఫిర్యాదు -
వ్యవసాయ పాలిటెక్నిక్‌తో ఉపాధి మెండు
వీసీ సత్యనారాయణ పెనుమంట్ర: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా 2004లో 75 వసంతాల ఉత్సవం జరుపుకున్న ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో నేడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన పాలిటెక్నిక్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ పాలిటెక్నిక్ ఎందరో పేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ది నదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనతను దక్కించుకుందన్నారు. కళాశాలను మరింత అభివృద్ధి చే సేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చె ప్పారు. మరో ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే పి తాని సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. నిధుల మంజూరుకు కృషిచేస్తానన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అవార్డులతో పాటు నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానం కేటీఆర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, రిటైర్డ్ ఏడీఆర్ జహీరుద్దీన్, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఆదరిద్దాం.. అభయమిద్దాం
బుట్టాయగూడెం: వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం, వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట వేటగాళ్ల స్వార్థానికి మూగజీవాలు ఆవాసాన్నే కాదు, ప్రాణాలనూ కోల్పోతున్నాయి. ఏటా ప్రపంచ జనాభా పెరుగుతుండగా, వన్యప్రాణుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని జాతులు పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జంతువులను ప్రతిఒక్కరూ ఆదరించాలని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైల్డ్‌లైఫ్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం 1,12,500 హెక్టార్లలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని పాపికొండల అభయారణ్యం పరిధిలోకి వచ్చే బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నారు. అలాగే, జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాపికొండల అభయారణ్యంలో ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, జింకలు, కొండచిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, అడవి కుక్కలు, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, చుక్కల దుప్పులు, సాంబార్లు, ముళ్లపందులు, ముంగీసలు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ఈ ఏడాది జంతు గణన 2018లో పాపికొండల అభయారణ్యంలో వైల్డ్‌లైఫ్ అధికారులు జంతు గణన నిర్వహించి జంతువుల కదలికలను గుర్తించారు. ఆ తర్వాత 2022 జనవరిలోనూ మరోసారి జంతు గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అభయారణ్యంలోని సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో ఏనుగులు, సింహాలు మినహా మిగిలిన అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించారు. అలాగే, జంతువుల సంరక్షణపై బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారని, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత పులులు కొండగొర్రెలు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు జంతుజాతులకు ఆవాసంగా పాపికొండల అభయారణ్యం రేపటి నుంచి వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు -
ఆర్టీసీ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
భీమవరం: ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమిద్దామని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలో జిల్లా అధ్యక్షుడు కేఎస్ రాజు అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి అల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘స్రీ్త్ర శక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అందుకోసం 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలని, సుమారు 15 వేల ఉద్యోగ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే, ఆర్టీసీయే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎండీఏ అలీ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇదే వేదికపై ఉద్యోగ విరమణ చేసిన ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రావును ఘనంగా సత్కరించారు. -
పాలకొల్లులో కుక్క స్వైర విహారం
15 మందికి గాయాలు ఆగిరిపల్లి: ఆగిరిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మాదల సునీత అస్వస్థతకు గురై విజయవాడలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన అనుచరులపై పలు సంచలన ఆరోపణలు చేశారు. తన స్థలాన్ని వారు అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం సబ్ కలెక్టర్ బి. వినూత్న, తహసీల్దార్ ప్రసాద్ వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని, మాదల సునీత దగ్గరున్న పత్రాలతో పాటు ప్రభుత్వ రికార్డులను పరిశీలించారు. అయితే, ఈ పరిణామాల కారణంగా ఆమె తీవ్ర ఒత్తిడికి గురై అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ కుక్క స్వైరవిహారం చేయడంతో 15 మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక జెట్టిట్యాంకు ప్రాంతంలో ఓ పిచ్చికుక్క మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు సుమారు 15 మందిని కరవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు మొత్తం 13 మంది చికిత్స చేయించుకోగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు తెలిసింది. వీధుల్లో కుక్కలను అదుపు చేయాలని బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల్లో మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న ఒకరిని ఆ కుక్క వెనుక నుంచి వచ్చి కాలు పట్టుకుని కరిచింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ కుక్కను పట్టుకున్నట్లు సమాచారం. -
కష్టాలు తీరలేదు.. కన్నీరే మిగిలింది
పాలకొల్లు సెంట్రల్: భార్య, ఇద్దరు కుమార్తెలు... ఆ ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించి, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే కలలతో బ్రతుకు బండిని లాగుతున్న ఆ తండ్రి ఆశలు గల్ఫ్ గడ్డపైనే ఆవిరైపోయాయి. కుటుంబం కోసం విదేశాలకు వెళ్లిన నూకపెయ్యి సోమశేఖర్ (48) గుండెపోటుతో మృతి చెందడం ఆ గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పోడూరు మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన నూకపెయ్యి సోమశేఖర్ కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీసా, ఫ్లైట్ టికెట్ కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎన్నో ఆశలతో ఈ నెల 14న అబుదాబికి బయలుదేరి వెళ్లారు. అబుదాబి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ‘ఇక మన కష్టాలు తీరిపోతాయి, మన ఇంట వెలుగులు వస్తాయి’ అనుకున్న ఆ కుటుంబం ఆనందం పది రోజులు కూడా నిలవలేదు. సెప్టెంబర్ 23న ఆయన తాను వెళ్లిన పనిలో చేరారు. అయితే, విధి ఆ కుటుంబంపై పగబట్టిందో ఏమో గానీ... చేరిన తొలిరోజే ఆయనకు గుండెపోటు రావడంతో సోమశేఖర్ మృత్యువాత పడ్డారు. భర్తపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భార్య, తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలు ఆయన మరణవార్త విని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆక్రందనలు చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. విదేశాల్లో బతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్లి విగతజీవిగా మారిన సోమశేఖర్ భౌతికకాయం నేడు అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరుకోనుంది. బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి.. ఉద్యోగంలో చేరిన తొలిరోజే గుండెపోటుతో మృతి గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు -
జిల్లాలో నో స్టాక్
వరదలతో ఇసుక కొరత రాకుండా సంబంధిత యంత్రాంగం ముందుగానే స్టాక్‌లు సిద్ధం చేయా లి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో ఏడు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి ఒక్కోచోట 70 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని నిర్ణయించారు. అయితే ఆచంట స్టాక్ పాయింట్లో 20,100, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 మొత్తంగా 1.20 లక్షల టన్నులు మాత్రమే నిల్వ చేశారు. టన్ను రూ.306ల నుంచి రూ.581లు ధర నిర్ణయించారు. లోడింగ్, జీఎస్టీ చార్జీలు అదనం. ఇక్కడి ధరలతో పోలిస్తే కూటమి నేతల అనధికార స్టాక్ పాయింట్లలో తక్కువకే ఇసుక లోడింగ్ చేసి రూ.కోట్లల్లో సొమ్ము చేసుకున్నారు. ఉదాహరణకు తాడేపల్లిగూడెంలోని స్టాక్ పాయింట్లో 20 టన్నులు లోడింగ్‌కు అప్పట్లో రూ.12 వే లు వసూలు చేస్తే సిద్దాంతం దగ్గర టీడీపీ నేత అ నధికార స్టాక్ పాయింట్లో రూ.8 వేలకే లోడింగ్ చేసేవారు. స్టాక్ పాయింట్లలో అధిక ధరలు నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం పరోక్షంగా కూటమి నేతలకు రూ.కోట్లల్లో మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాత స్టాకులు మిగిలిపోవడంతో ఈ ఏడాది కొత్తగా స్టాకు పెట్టని పరిస్థితి. -
అండర్ 19 బాలికల జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం అండర్–19 బాలికల జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో యోగా, ఖోఖో, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. వీరిలో 50 మంది క్రీడాకారిణులు జిల్లా జట్టుకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఎంపికై న వారిలో 8 మంది తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులే ఉండటం విశేషమని ఆమె వివరించారు. భీమవరం : గ్రీస్‌లో వచ్చే నెలలో నిర్వహించే 80 ప్లస్ విభాగం అంతర్జాతీయ టెన్నిస్ పోటీలలో పాల్గొంటున్న భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి తటవర్తి పద్మనాభరావును (పద్మాలు) బుధవారం ఆ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. 80 ప్లస్ వయస్సు విభాగంలోని అంతర్జాతీయ టెన్నిస్ పోటీలలో భారతదేశానికి పద్మనాభరావు ప్రాతినిధ్యం వహించడం జిల్లాకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షుడు వేగేశ్న రమేష్, తటవర్తి రాజు, ముదునూరి గోపాలకృష్ణంరాజు, సురేష్‌బాబు, కొత్తపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం : జాతీయస్థాయి రోప్ జంప్ పోటీలకు తమ హైస్కూల్‌కి చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు బయ్యన్నగూడెం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.రవికుమార్ బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 27, 28 తేదీలలో అన్నమయ్య జిల్లా పీలేరులో రాష్ట్రస్థాయి రోప్ జంప్ పోటీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో బయ్యన్నగూడెం నుంచి అండర్–14 విభాగంలో 12 మంది విద్యార్థులు పాల్గొనగా, 9వ తరగతి అభ్యసిస్తున్న ఎం.సంజయ్, బి.హారిక, ఎ.భార్గవి, పి.యామిని, టి.రేష్మ, డి.సంజన ప్రతిభ కనబరిచారు. వీరు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 9, 10, 11 తేదీలలో మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు బి.రవికుమార్, ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్ల వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. -
ఐదెకరాల్లో నష్టం
నేను పది ఎకరాల్లో మిర్చి పంటను వేశాను. ప్రస్తుతం గోదావరి వరద ముంచెత్తడంతో సుమారు ఐదు ఎకరాల వరకు పంట వరద నీటిలో మునిగింది. ప్రతి ఏటా వరదతో ఇబ్బంది పడుతూ పెట్టుబడులు నష్టపోతున్నాం. – ఇల్లా సురేష్, బెస్తగూడెం, కుకునూరు మండలం గోదావరి వరద కారణంగా నా పంట ఐదెకరాల్లో మునిగింది. ఏటా ఇలానే ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాస కాలనీకి తరలించాలి, లేదా పంట నష్టపరిహారం ఇప్పించాలి. – కోమల్ల బ్రహ్మచారి, బెస్తగూడెం, కుకునూరు మండలం -
రైతుల కళ్లు చె‘మిర్చి’
కుకునూరు: గోదావరి వరదలతో విలీన మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగి పొలాలు మునిగిపోవడంతో, నాటిన తొలి దశలోనే మిర్చి మొక్కలు కుళ్లిపోయాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించిన కొద్దిరోజులకే పంట నీటమునగడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఉన్నా లభించని వైనం పోలవరం ప్రాజెక్టు ముంపు భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించినప్పటికీ, ఆ గ్రామాలు 45 కాంటూర్ పరిధిలో ఉన్నాయనే కారణంతో పునరావాస (ఆర్అండ్ఆర్) పరిహారాన్ని నిలిపివేసింది. దీంతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందక, వేరే ప్రాంతాలకు తరలివెళ్లే మార్గం లేక రైతులు అదే భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భూములకు పూర్వమే పరిహారం ఇచ్చామనే కారణంతో ప్రభుత్వం ఇప్పుడు పంట నష్టపరిహారాన్ని అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు భూపరిహారం అందినా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందకపోవడం, మరోవైపు ప్రతి ఏటా వరదలతో పంటలు నష్టపోతున్నా కనీస పంట పరిహారం కూడా లభించకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఆర్అండ్ఆర్ అమలుపై అనిశ్చితి 45 కాంటూర్ పరిధిలోని రైతులకు పునరావాస ప్యాకేజీ ఎప్పుడు అమలు చేస్తారు? పరిహారం ఎప్పుడు అందుతుంది? ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు సాగు చేసే పంటలకు వరద నష్టం వాటిల్లితే పరిహారం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత కరువైంది. భూమికి గతంలో పరిహారం ఇచ్చారనే నెపంతో ఇప్పుడు పంట నష్టాన్ని విస్మరించడం సరికాదని, తమ జీవనాధారమైన వ్యవసాయానికి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం 45 కాంటూర్ పరిధిలోని ముంపు రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, దెబ్బతిన్న మిర్చి పంట నష్టాన్ని నమోదు చేసి తక్షణ సహాయం అందించాలని, అలాగే ఆర్అండ్ఆర్ ప్రక్రియ పూర్తి చేయడంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిరపను ముంచేసి‘నది’ మొక్క దశలోనే ముంపు గోదావరి వరదతో నష్టం రైతుల పరిస్థితి దయనీయం -
హత్యకు దారితీసిన అక్రమ సంబంధం
● ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్త హత్య ● ముగ్గురు నిందితుల అరెస్ట్ కొయ్యలగూడెం : ఇటీవల సంచలనం సృష్టించిన పల్లికొండ మునీంద్రబాబు హత్య ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే మునీంద్రబాబు హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త మునీంద్రబాబును భార్య తులసితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో నిందితులను అరెస్టు చేసి, హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కన్నాపురం గ్రామానికి చెందిన పల్లికొండ మునీంద్రబాబు భార్య తులసికి, వారి వద్ద కార్పెంటర్‌గా పనిచేస్తున్న గెల్లా చందుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డుతొలగించుకోవడానికి తులసి కుట్ర పన్నింది. సెప్టెంబర్ 25న చందు, అతని స్నేహితుడు అయినపర్తి సంజయ్‌లతో కలిసి పథకం ప్రకారం మునీంద్రబాబును హత్య చేయించింది. చందు, సంజయ్‌లు మునీంద్రబాబును గవరవరం తీసుకువెళ్లి, సమీపంలోని పొలాల్లో మద్యం తాగించి ఇనుప సుత్తితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట సమీపంలోని పోలవరం కుడి కాలువలో పడవేశారు. తాము చేపట్టిన విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడైనట్లు ఎస్సై తెలిపారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. -
పుట్టినరోజే కన్నీటి సంద్రం
● రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● కుటుంబ సభ్యులకు తీరని విషాదం నరసాపురం రూరల్ : కళ్ల ముందే అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు ఐదో పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రుల కల క్షణాల్లో కన్నీటి సంద్రమైంది. జన్మదిన వేడుకల సంతోషం విషాదంగా మారిన ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోళ్లపర్రు బీచ్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి చెందిన బర్రె త్రిమూర్తులు దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు నిషాంతవర్మకు ఐదేళ్లు వయసు కాగా, చిన్న కుమారుడికి మూడేళ్లు. నిషాంతవర్మ ఐదో జన్మదినాన్ని ఆనందంగా జరుపుకోవడానికి కుటుంబ సభ్యులంతా మోళ్లపర్రు బీచ్‌కి వెళ్లారు. తమ చిన్నారి కేకు కోసి, నవ్వులు చిందించిన ఆ మధుర క్షణాలను వారు జీవితంలో ఎప్పటికీ మరువలేరని భావించారు. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. బీచ్ సందర్శన ముగించుకుని కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి బయలుదేరుతున్న తరుణంలో కాలాన్ని ముందే నిర్ణయించినట్లుగా పెను ప్రమాదం ముంచుకొచ్చింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక వ్యాన్, వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పుట్టినరోజు జరుపుకున్న చిన్నారి నిషాంతవర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే తమ బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడివారందరినీ కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
గాయాలైన ఆటో డ్రైవర్ పాలకొల్లులో ఢీకొన్న ఆటో, ఆర్టీసీ బస్సు పాలకొల్లు సెంట్రల్: ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఆటోను ఢీకొట్టిన సంఘటనలో ఆటో డ్రైవర్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. బుధవారం రాత్రి పాలకొల్లు–నరసాపురం రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయం దాటిన అనంతరం పాలకొల్లు నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ నరసాపురం నుంచి భీమవరం వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు క్షతగాత్రుడిని 108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పర్యటన
పెదవేగి: ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు, వివిధ రకాల పంటలు, సాగు మోడళ్లను అధ్యయనం చేయడానికి ఇండోనేషియాకు చెందిన ‘ఆస్టుంగ్కారావే ఆర్గనైజేషన్’ నుంచి 9 మంది సభ్యులు, థాయిలాండ్‌కు చెందిన ‘బోర్డర్‌లెస్ ఫౌండేషన్’ నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించింది. బుధవారం ఈ ప్రతినిధుల బృందం మండలంలోని గోకినేపల్లి గ్రామాన్ని సందర్శించింది. అక్కడ ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి. వెంకటేష్ తన సొంత పొలంలో పండిస్తున్న ఐదు రకాల దేశీ వరి వంగడాలను చూపిస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న విధానాన్ని వివరించారు. అలాగే, కొప్పాకగూడెం గ్రామానికి చెందిన రైతు కళా చంద్రరావు పండిస్తున్న కూరగాయల సాగు మోడల్‌ను కూడా వారు పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ విధానాలు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ గురించి వివరించి వారితో చర్చించారు. తదనంతరం, పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో రైతు రంగయ్య నిర్వహిస్తున్న 5–లేయరు (ఐదు అంచెల) ఉద్యానవన పంటల నమూనా ఫీల్డ్‌ను బృందం సందర్శించింది. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి. వెంకటేష్, అడిషనల్ జిల్లా ప్రాజెక్టు మేనేజరు షేక్ మహబూబ్ వలీ, నవీన, పద్మనాభం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
స్వామీ.. ఇదేం గూడుపుఠాణి?
2022 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు మంగళగిరికి చెందిన ‘సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించింది. టెండర్ నిబంధనల ప్రకారం యూనిట్ మేనేజర్, సూపర్వైజర్లు ఆరుగురు, పురుష హౌస్‌కీపింగ్ సిబ్బంది 35 మంది, మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బంది 70 మంది, మెషీన్ ఆపరేటర్లు ఇద్దరు, స్కావెంజర్లు 18 మంది ఇలా మొత్తం 132 మంది రోజువారీగా పనిచేయాల్సి ఉంది. వీరందరితో పూర్తి పనిదినాలు పనిచేయిస్తేనే జీఎస్టీతో కలిపి నెలకు రూ.18,28,716 కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ షరతుల ప్రకారం కాంట్రాక్టర్ కార్మిక చట్టాలకు లోబడి సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి ఖాతాల్లో పీఎఫ్ సొమ్ము జమ చేసిన తర్వాతే దేవస్థానం బిల్లులు చెల్లించాలి. కానీ అప్పట్లో 132 మందికి బదులు 80 నుండి 90 మందితోనే రెండు షిఫ్టుల్లో పనులు పూర్తి చేశారు. సుమారు 50 మందికి సంబంధించిన వేతనాలు పక్కదారి పట్టాయని కార్మికులు ఆరోపించారు. ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానంలో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టర్‌కు నిలిపివేసిన పెండింగ్ సొమ్మును ఎలాగైనా చెల్లించేందుకు అధికారులు మళ్లీ ఫైల్‌ను తెరమీదకు తెచ్చారు. గతంలో టెండర్ షరతుల ప్రకారం 132 మంది సిబ్బందితో మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాల్సి ఉండగా.. 80 నుండి 90 మందితోనే రెండు షిఫ్టుల్లో పనులు చేయించి మమ అనిపించారు. నెలంతా పనిచేసిన వారికి అర్హత ఉన్నంత జీతం ఇవ్వకుండా, పీఎఫ్ సొమ్ములోనూ కోత పెట్టారు. రోజుకు 12 గంటల వరకు పనిచేయించినా ఓటీలు (ఓవర్ టైం) చెల్లించలేదు. 2022 నుండి 2025 సెప్టెంబర్ నెలాఖరు వరకు జరిగిన ఈ వ్యవహారంపై అప్పట్లో కార్మికులు సదరు కాంట్రాక్ట్ మేనేజర్‌ను పలుమార్లు నిలదీశారు. ఈ అక్రమాలపై ‘సాక్షి దినపత్రిక’లో 2024 ఆగస్టు 29 నుండి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి నివేదిక కోరగా.. 2024 అక్టోబర్‌లో దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈఎండీ 5 శాతం డిడక్షన్ నగదు కలిపి రూ.60 లక్షలకు పైగా సొమ్మును కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ నగదు చెల్లింపు విషయంలో కొందరు అధికారులు కాంట్రాక్టర్‌తో గూడుపుఠాణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీఎఫ్ సొమ్ములోనూ అక్రమాలు నెలకు ఒక్కో కార్మికుడికి సుమారు రూ.2,250 పీఎఫ్ జమ చేయాల్సి ఉండగా, ఖాతాలో రూ.1,160 మాత్రమే జమ చేశారు. దీంతో ఒక్కొక్కరు నెలకు రూ.1,090 నష్టపోయారు. మూడేళ్ల కాలంలో ఒక్కో కార్మికుడికి సుమారు రూ.75 వేల వరకు పీఎఫ్ అందాల్సి ఉండగా.. దాదాపు రూ.30 వేలు మాత్రమే లభించింది. కలెక్టర్ నివేదికతో కదలిక.. నోరు విప్పితే ఎక్కడ ఉపాధి పోతుందోనని కార్మికులు సైలెంట్ అయ్యారు. అందుకే ఇప్పటికీ అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదు చేయలేకపోయారు. ‘సాక్షి’ కథనాల ఆధారంగా జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో 2024 అక్టోబర్‌లో అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు చెందిన ఈఎండీ, 5 శాతం డిడక్షన్ మొత్తంగా రూ.60 లక్షలకు పైగా సొమ్ము ఏడాది పాటు నిలిచిపోయింది. మళ్లీ తెరపైకి పెండింగ్ బిల్లులు : విషయం శాంతించిందని భావించిన కొందరు ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని మళ్లీ కదిపి కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆరోపణలు, నోటీసులను పక్కనబెట్టి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్మికులకు, దేవుడి సొమ్ముకు దిక్కెవరు? లీగల్ ఒపీనియన్ పేరుతో కాంట్రాక్టర్‌కు సొమ్ము చెల్లిస్తే.. పీఎఫ్, ఓటీలు నష్టపోయిన పారిశుద్ధ్య కార్మికులకు, స్వాహా అయిన దేవుడి సొమ్ముకు బాధ్యులెవరు? అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. నాలుగు రోజుల క్రితం కాంట్రాక్టర్ వచ్చి పెండింగ్ సొమ్ము కోసం వినతిపత్రంఇచ్చారు. లీగల్ ఒపీనియన్ కోసం ఫైలును పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి నగదు చెల్లింపులు జరపలేదు. వేండ్ర త్రినాథరావును, ఈఓ, ద్వారకాతిరుమల దేవస్థానం కాంట్రాక్టర్ ఈనెల 23న వచ్చి మూడు రోజులపాటు స్థానికంగా ఉండి ఇంజనీరింగ్ విభాగ అధికారులతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఆ తర్వాతే ఫైలులో కదలిక రావడం అనుమానాలకు తావిస్తోంది. చెల్లింపుల కోసం లీగల్ ఒపీనియన్ కోరారని, అధికారులు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఒపీనియన్ తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి చేసిన చెల్లింపులపై లీగల్ ఒపీనియన్ తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. దేవస్థానం పరిధిలో 1,17,165 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 132 మందితో పారిశుద్ధ్య పనులు చేయించాలనేది నిబంధన. అయితే, తక్కువ మందితో పనులు చేయించినప్పుడు ‘సిబ్బంది సంఖ్యతో మాకు సంబంధం లేదు, నిర్ణీత విస్తీర్ణంలో పని జరిగిందో లేదో చూస్తాం’ అని ఇంజనీరింగ్ అధికారులు దాటవేశారు. అలాంటప్పుడు మ్యాన్‌పవర్‌ను టెండర్లో ఎందుకు పేర్కొన్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. కార్మిక చట్టాల అమలును టెండర్లో పొందుపరిచినప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ ఫైల్‌కు మళ్లీ పచ్చజెండా చినవెంకన్న దేవస్థానంలో వివాదాస్పదంగా అధికారుల తీరు గతంలో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలకు పైగా చెల్లింపుల నిలిపివేత మళ్లీ తెరపైకి వ్యవహారం -
సేవకు ఉరి.. పబ్లిసిటీకి సిరి
‘‘చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వలంటీర్లకు ఇచ్చే రూ.5 వేలు దేనికీ సరిపోవు. మన ప్రభుత్వం రాగానే రూ.10 వేల జీతం ఇస్తాం. రేపొద్దున్న ‘అన్నయ్యా.. ఇదిగో రూ. 10 వేలు అందుకున్నాం’ అని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి.’’ – పాలకొల్లు ఎన్నికల ప్రచారంలో నిమ్మల రామానాయుడు ‘‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేము అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగం నుంచి తీయం. వ్యవస్థను కొనసాగించడమే కాకుండా, ఇచ్చే జీతాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతాం. ఆ బాధ్యత నాది.’’ – ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ చేరాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న వలంటీర్ వ్యవస్థపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని అట్టహాసంగా ప్రకటించిన కూటమి నేతలు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా పక్కనబెట్టేశారు. కష్టకాలంలో బాసటగా నిలిచిన వ్యవస్థ జిల్లాలో 8,820 మంది వలంటీర్లు నిస్వార్థంగా సేవలందించారు. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించడం, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపుల్లో సహాయం చేయడం వంటి పనులతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారు. ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిత్యవసరాలు, మందులు పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణలో వీరు అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వరదల సమయంలోనూ లంక గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బాధితులను ఆదుకున్నారు. నెలకు కేవలం రూ. 5 వేల గౌరవ వేతనంతో పనిచేసిన వలంటీర్లపై ఆ నాడు విషం చిమ్మిన కూటమి నేతలు, ఎన్నికల సమయంలో ప్రేమ ఒలకబోసి, అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టడంతో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోంది. సెల్ఫ్ డబ్బాకు రూ.లక్షల పరితోషకం వలంటీర్లకు రూ. 5 వేల వేతనం ఇస్తే ప్రజాధనం దుబారా అని విమర్శించిన చంద్రబాబు ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల’ పేరిట కొత్త పాలసీ తీసుకొస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు రూ. 2,500 నుంచి రూ. 15,000 వరకు, నెలకు గరిష్టంగా ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 1.50 లక్షల వరకు చెల్లించేందుకు నిర్ణయించడం గమనార్హం. ఇది కేవలం అధికార పార్టీ శ్రేణులకు ప్రజాధనాన్ని దోచిపెట్టే ఎత్తుగడ అని ప్రజలు మండిపడుతున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల అమలుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, సొంత ప్రచారం కోసం లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తుందని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. వలంటీర్ల కడుపు కొట్టి.. సొంత డప్పు కొట్టేవారికి రూ.లక్షల్లో జీతం ఎన్నికల సమయంలో వలంటీర్లకు రూ.పదివేలు ఇస్తామని చంద్రబాబు హామీ పూతరేకులు కానుకగా ఇవ్వాలని నిమ్మల ప్రచారం అధికారంలోకి వచ్చాక వ్యవస్థకే మంగళం కష్టపడ్డవారికి మోసం, సొంత ప్రచారానికి లక్షల నజరానా ఐటీడీపీ కార్యకర్తలకు జనం సొమ్ము దోచిపెట్టే ఎత్తుగడ -
కై కరం ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత
● జెడ్పీ హైస్కూల్లో ముగ్గురు సభ్యుల ఎన్నిక ● అనంతరం నిలిచిన ఎన్నికల ప్రక్రియ ● బహిర్గతమైన కూటమి పార్టీల మధ్య విబేధాలు ఉంగుటూరు: మండలంలోని కై కరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ ముగ్గురు సభ్యుల ఎంపిక తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో కూటమి పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. తాయిలాల పంపిణీ! అంతర్గతంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని ఆంజనేయులు అనుంగు శిష్యుడు, మాజీ జెడ్పీటీసి చింతలవాసు వర్గం ఒకవైపు, స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అనుచరుడు, జనసేన నాయకుడు వెజ్జు సుబ్బారావు వర్గం మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ వర్గం రూ. 500 నగదు ఇస్తే, జనసేన వర్గం రూ. 500 నగదుతో పాటు చీరలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. వర్గ విబేధాలతో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు హైస్కూల్ రోడ్డు ప్రాంతంలో భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇరువర్గాల నాయకులు తెరవెనుక లాబీయింగ్ నడిపించడంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే ప్రధానోపాధ్యాయుడు చేబ్రోలు శ్రీనివాసరావు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. నిలిచిన ఎన్నికల ప్రక్రియ అంగవైకల్యం, ఎస్సీ, బీసీ కేటగిరీల నుంచి ముగ్గురు కమిటీ సభ్యులుగా సుభాష్ చంద్రబోస్, కొమరపు రాము, వెలగ కాశీ విశ్వనాథం ఎన్నికయ్యారు. ఎన్నికై న ఈ ముగ్గురూ టీడీపీ (చింతలవాసు) వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. నాలుగో కమిటీ సభ్యుడి ఎన్నిక కూడా టీడీపీకి అనుకూలంగా మారుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఎన్నికను నిలిపివేశారంటూ బహిరంగంగా చర్చించుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం 1:30 గంటలు కావడంతో సహనం కోల్పోయిన తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. సమీపంలోని నాగమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన భోజనాల వైపు వారు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం 7:30 గంటలకే ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకోగా, 9:30 గంటల నుంచి తల్లిదండ్రులు రావడం మొదలుపెట్టారు. మొత్తం 360 మంది ఓటర్లకు గాను సుమారు 190 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు.. 1:30 గంటల ప్రాంతంలో ముగ్గురు సభ్యుల ఎన్నిక తర్వాత నిలిచిపోయినట్లు హెచ్ఎం ప్రకటించారు. జనసేన నాయకుడి ప్రోద్బలంతోనే ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు ఆపేశారని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై ఏలూరు డీవైఈవో రవీంద్ర భారతిని వివరణ కోరగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా కొన్ని చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయని, ప్రభుత్వం మరో తేదీని ప్రకటిస్తుందని తెలిపారు. గణపవరం, భీమడోలు సీఐలు రజనీకుమార్, కృష్ణ, చేబ్రోలు, గణపవరం ఎస్సైలు సూర్యభగవాన్, మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. డీఎస్పీ శ్రావణ్‌రెడ్డి హైస్కూల్ ప్రాంతాన్ని పరిశీలించారు. -
వలస పక్షులతో కొల్లేరు కళకళ
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామమైన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త అందాలను సంతరించుకుంది. ప్రతిఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు విదేశీ వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి జరుపుకుంటాయి. ప్రస్తుతం ఈ కేంద్రానికి పక్షుల రాక మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు విహార చెరువు నిండుకుండలా మారింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ ఇనుప స్టాండ్లపై అరుదైన పెలికాన్లు, పెయింటెడ్ స్టార్క్ పక్షుల రెక్కల చప్పుళ్లు కనువిందు చేస్తున్నాయి. మూడు నెలల విరామం తర్వాత పర్యాటకుల కోసం బోటు షికారును తిరిగి ప్రారంభించారు. విస్తీర్ణం ఆటపాక విహార కేంద్రంలో 280 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల చెరువు ఉంది. పక్షుల కోసం అటవీశాఖ 152 కృత్రిమ ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేయగా, పాడైన 32 స్టాండ్ల స్థానంలో కొత్తవి అమర్చారు. పక్షుల అందాలను దగ్గర నుంచి వీక్షించడానికి మూడు బోట్లు అందుబాటులో ఉన్నాయి. పక్షుల అత్తారిల్లు కొల్లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్సర్ సదస్సు గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. ఇది 2,22,300 ఎకరాల్లో విస్తరించి ఉంది. జిల్లాల్లో ఆటపాక, మాదవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. కై కలూరు మండలం ఆటపాకలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనిని ’పెలికాన్ ప్యారడైజ్’ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం పెలికాన్‌ను అటవీశాఖ అంబాసిడర్‌గా గుర్తించింది. విదేశీ అతిథులు కొల్లేరులో మొత్తం 210 పక్షి జాతులు సంచరిస్తుండగా, వీటిలో రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల నుంచి 71 జాతులకు చెందిన సుమారు 1.20 లక్షల వలస పక్షులు వస్తాయని అంచనా. ప్రధాన వలస పక్షులు కామన్ శాండ్ పైపర్ (ఉల్లంకి పిట్ట), బ్లాక్ కింగ్‌ఫిషర్ (నల్లతల బుచ్చిగాడు), నార్తరన్ ఫిన్టైల్(సూది తోక బాతు), రెడ్ క్రిస్టడ్ ఫోచర్డ్ (ఎర్రతల చిలుక), కామన్ రెండ్ షాంక్ (ఎర్రకాళ్ళ ఉల్లంకి), కాస్నియడ్ టర్న్ (సముద్రపు కాకి), గ్రేటర్ శాండ్ ప్లోవర్ (పెద్ద ఇసుక ఉల్లంకి), డూప్ (ఈల వేసే పెద్ద చిలువ), గుల్ బిల్ టర్న్ (గౌరి కాకి ముక్కు రేవు పిట్ట), బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), మార్స్ శాండ్‌పైపర్ (చిత్తండి ఉల్లంకి), గ్రేట్ వైట్ పెలికాన్ (తెల్ల చిలువ బాతు) వంటివి ఇక్కడకు విచ్చేస్తాయి. నిండుకుండలా ఆటపాక పక్షుల విహార కేంద్రం మూడు నెలల తర్వాత బోటు షికారు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల కేరింతలు -
మోసం చేశారు
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వస్తే మా జీతాలు పెంచి, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని నమ్మబలికారు. తీరా గెలిచాక మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. జగనన్న ప్రభుత్వంలో ఎంతోమందికి సేవ చేశాం. ప్రస్తుత ప్రభుత్వం మా ఆవేదనను గుర్తించాలి. – గొల్లపల్లి దుర్గాప్రసాద్ మోదుగ్గుంట, తాడేపల్లిగూడెం మండలం రూ. 5 వేల జీతంతో సేవా దృక్పథంతో పనిచేశాం. రూ. 10 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. మాకు ఇచ్చే వేతనం దండగ అన్నవారు, ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారానికి లక్షలు ఇవ్వడం దారుణం. కరోనా సమయంలో మేము అందించిన సేవలను ఏ డబ్బుతోనూ కొలవలేరు. – కుడిపూడి కుమారస్వామి, చిట్టవరం కరోనా, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. నేను నిండు గర్భిణీగా ఉన్నప్పుడే వరద నీటిలో దిగి బాధితులకు సహాయం అందించాను. అటువంటి మాకు జీతాలు ఇవ్వడానికి మనస్కరించని ప్రభుత్వానికి, సెల్ ఫోన్లలో పోస్టులు పెట్టే ఇన్ఫ్లుయెన్సర్లకు వేలకు వేలు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి. – గొల్లమందుల రోఖ్యా పెదలంక, యలమంచిలి మండలం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాను. కానీ కూటమి ప్రభుత్వం పింఛన్ దరఖాస్తు పూర్తి చేయించే వారు లేక అవ్వా, తాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ కూటమికి చీమకుట్టినట్లు లేదు. వలంటీర్లను తీయకుండా వేతనం రెట్టింపు చేస్తానని మాట ఇచ్చి తప్పారు. – ఎం.ప్రసాద్, పడమరవిప్పర్రు, పెంటపాడు మండలం -
టీటీడీకి రూ.2.5 కోట్ల విలువైన భూమి విరాళం
ఆకివీడు: మండలంలోని అయిభీమవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు కనుమూరు కమలమ్మ తిరుమల తిరుపతి దేవస్థానానికి తమకున్న 54 సెంట్ల భూమిని విరాళంగా అందజేశారు. కమలమ్మ భర్త సూర్యనారాయణరాజు గతంలో మరణించారు. సంతానం లేకపోవడంతో ఒకరిని దత్తతు తీసుకోగా, ఆయన ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. దీంతో కమలమ్మ ఒక్కరే గ్రామంలో నివాసముంటున్నారు. తన తదనంతరం ఈ భూమిని స్వాధీనం చేసుకునేలా టీటీడీకి రాసిచ్చారు.సుమారు రూ.2.5 కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన కమలమ్మను మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు–అన్నపూర్ణమ్మ దంపతులు మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: మున్సిపాలిటీలో ప్రత్తిపాడు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, పడాల, కొండ్రుపోలు గ్రామాల విలీనానికి సంబంధించిన కేసు మంగళవారం హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. ఉదయం వేళ ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం తదుపరి వాదనలు జరగలేదు. దీంతో ఈ కేసులో బుధ లేదా గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని, కోర్టు వాయిదా వేస్తుందా? లేదా తుది తీర్పు వెలువరిస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. భీమవరం: శాంతిభద్రతల పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ, పారదర్శకమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రేవ్, నాన్–గ్రేవ్ కేసులతో పాటు ఎన్డీపీఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, మహిళలపై జరుగుతున్న నేరాల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, సమన్లు, ఎన్‌బీడబ్ల్యూల అమలులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డి.విశ్వనాథ్, డీఎస్పీలు రఘువీర్‌విష్ణు, ఎం.సుధాకర్, యు.రవిచంద్ర, పాల్గొన్నారు. భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు 1,378 పాఠశాలల్లో ప్రశాంతంగా పూర్తయినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం జెడ్పీ స్కూల్, పోడూరు మండలం గుమ్ములూరు జెడ్పీ స్కూళ్లలో తల్లిదండ్రుల హాజరు కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఆ రెండు స్కూళ్లలో బుధ, గురువారాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దెందులూరు: కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ (బాలురు, బాలికలు) ఖో–ఖో పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్ల ఎంపికలు అక్టోబర్ 1న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖో–ఖో సంఘం చైర్మన్ ఈ.సాంబశివరావు తెలిపారు. తాళ్లపూడి మండలం మలకపల్లి ఎస్ఎంవీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 2008 డిసెంబర్ 1 తర్వాత జన్మించి, 18 ఏళ్ల లోపు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9491172325 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు సెయింట్ థెరిస్సా విద్యార్థినులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–19 పోటీలకు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్ జట్లకు ఎంపికయ్యారు. స్థానికంగా జరిగిన జిల్లా జట్ల ఎంపికలో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ లూర్థుమేరీ తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులను ఆమెతో పాటు వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ శిరీష, ఇతర అతిథులు అభినందించారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విభాగ అధిపతి ఐ. ఆండాళ్ళు, అండర్–19 స్పోర్ట్స్ సెక్రటరీ కె.జయరాజు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
ఉండి: వచ్చేనెల 10 నుండి 12 వరకు తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–17 హ్యాండ్‌బాల్ పోటీలకు ఎన్నార్పీ అగ్రహారం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పి. చంద్రశేఖర్‌నాయుడు, డి. మనోజ్ ఎంపికై నట్లు హెచ్ఎం ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఏలూరులో జరిగిన ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన పీఈటీ కె. వెంకటేశ్వరరావును పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా మంచి భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు రెండింటిలోనూ రాణించాలని హెచ్ఎం సూచించారు. చింతూరు: ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో ఆదివారం గల్లంతైన బుంగా బాల వందన్ (18) మృతదేహం మంగళవారం నదిలో లభ్యమైంది. భీమవరానికి చెందిన బాల వందన్ విహారయాత్రకు కుటుంబ సభ్యులతో వ్యూ పాయింట్ వద్దకు వచ్చి సోకిలేరు వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా అతడి ఆచూకీ కోసం సీఐ గోపాలకృష్ణ, ఎస్సై నాసిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. -
రేచర్లలో బొగ్గు తవ్వకాలపై నిరసన
చింతలపూడి: చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాలే నిబంధనలను తుంగలో తొక్కితే సామాన్య ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థలను ఎవరు రక్షిస్తారని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ ప్రశ్నించారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలోని ఎస్టీ కాలనీ పరిధిలో బొగ్గు వెలికితీత కోసం రైతుల అనుమతి లేకుండా అధికారులు భూ పరిశీలనకు రావడంపై మంగళవారం స్థానికులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దొంతా కృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా గ్రామసభలు నిర్వహించి ప్రజామోదం పొందాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను గుడ్డిగా అమలు చేస్తున్న అధికారులు తమ బాధ్యతలను పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ డాక్టర్ బి.రాంబాబు నాయక్ మాట్లాడుతూ రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల జీవించే హక్కును కాలరాయడం దారుణమన్నారు. ప్రాణాలను బలితీసుకుని సాధించే అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. రిలయన్స్ సంస్థకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, బొగ్గు తవ్వకాల ప్రతిపాదనలను శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎస్ఎంసీ ఎన్నికల్లో తమ్ముళ్ల దౌర్జన్యం
ముదినేపల్లి రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలను సైతం తెలుగు తమ్ముళ్లు రాజకీయమయం చేసేశారు. పెద్దగా ప్రాధాన్యత లేని ఈ ఎన్నికల్లో సైతం ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు అక్రమ పద్ధతుల్లో ఎన్నిక వాయిదా పడేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సింగరాయపాలెం జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఈ సభ్యులు అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక ప్రారంభం కాగానే తొలుత నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో టీడీపీకి ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోకి ప్రవేశించి, ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవోను డిమాండ్ చేశారు. ఇది సాధ్యపడదని చెప్పడంతో ఎన్నిక వాయిదాకు మరో ఎత్తుగడ వేశారు. ఓటు వేసేందుకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రుల్లో టీడీపీ మద్దతుదారులను ఎన్నికలు బహిష్కరించాలని కోరడంతో పాటు, తటస్థులను సైతం బెదిరించి బయటకు తీసుకువచ్చారు. దీంతో కోరం లేక విధిలేని పరిస్థితుల్లో అధికారులు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. పోలీసుల ప్రేక్షక పాత్ర ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోకి ఓటు హక్కు ఉన్న తల్లిదండ్రులు తప్ప ఇతరులు ప్రవేశించకూడదని, అయినప్పటికీ టీడీపీ వర్గీయులు లోపలికి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించేందుకు వచ్చిన ఎస్సై సమక్షంలోనే టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎస్సై ప్రేక్షక పాత్ర వహించడంలోని ఆంతర్యం ఏమిటని నిలదీశారు. తక్షణమే తెలుగు తమ్ముళ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సింగరాయపాలెం జెడ్పీ హైస్కూల్లో కోరం లేక ఎన్నిక వాయిదా -
దర్భగూడెంలో వ్యక్తి హత్య
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం బాపూజీ కాలనీలో పి.వెంకయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామ సమీపంలోని గుడి వద్ద నిద్రిస్తున్న ఆయనపై దుండగులు దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న వెంకయ్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలవరం డీఎస్పీ జయకృష్ణ, సీఐ యాదగిరి, ఎస్సై క్రాంతికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను రప్పించి క్లూస్ సేకరిస్తూ, హత్యకుగల అసలు కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు వారు తెలిపారు. పెంటపాడు: మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెంటపాడు ఏఎస్సై రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. వెలంపేటకు చెందిన అగ్గల సింహాద్రి (26) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, భార్యతో పాటు కుమారుడు అంకిత్ ఉన్నారు. పూర్తిగా మద్యానికి బానిసైన సింహాద్రి ఆ మత్తులో తరచూ భార్యను, కన్న తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టేవాడు. భర్త ప్రవర్తనను భరించలేక కొంతకాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, కుమారుడు పెంటపాడులోని సింహాద్రి సోదరి వద్ద ఉంటున్నాడు. అయినప్పటికీ సింహాద్రి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ఇంటివద్ద తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మను కూడా దుర్భాషలాడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కుటుంబంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో తన తల్లిని భయపెట్టాలనే ఉద్దేశంతో సింహాద్రి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని, టవల్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేకలు, రోదనలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి మృతుడిని కిందకు దించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. ఈ ఘటనపై నిడదవోలులో ఉంటున్న మృతుడి మేనమామ కాయల గణేష్ పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రాజేంద్ర కేసు నమోదు చేసి, ఎస్సై కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు నగర శివారు శనివారపుపేట ప్రాంతంలో దస్తావేజు లేఖరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంతానికి చెందిన వల్లి శివరామకృష్ణ (44)కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన ఏలూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శివరామకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ నొప్పి అధికం కావడంతో, దానిని తగ్గించే మందును ఆయన అధిక మోతాదులో తాగారని, ఆ తర్వాత నిద్రలోకి జారుకుని మంచంపై నుంచి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన మృతిచెందారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
వినూత్న ఆలోచనలకు ఉద్యానరంగం వేదిక
తాడేపల్లిగూడెం: వినూత్న ఆలోచనలకు ఉద్యానరంగం వేదికగా మారిందని ఇండస్ట్రీయల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డాక్టర్ పద్మలత అన్నారు. స్థానిక ఉద్యాన కళాశాలలోని హార్టీబిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లో రాజమహేంద్రవరం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 1.0 లో భాగంగా నిర్వహించిన హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మలత మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి హ్యాకథాన్లు ఎంతో దోహదపడతాయన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్.బి.వి. చలపతిరావు మాట్లాడుతూ త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయల్లో కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతలు, శీతలీకరణ, సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు అవసరమని చెప్పారు. హ్యాకథాన్‌లో విద్యార్థులు పంటల ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వనరుల సమర్థ వినియోగంపై రూపొందించిన స్టార్టప్ ప్రతిపాదనలు, సాంకేతిక పరిష్కారాలను నిపుణుల ముందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐహెచ్ సీఈఓ షేక్ యాసీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
మునీంద్రబాబు మృతిపై కన్నాపురంలో ఉద్రిక్తత
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన పల్లికొండ మునీంద్రబాబు (35) మృతి ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన గెల్లా చందు పిలవడంతో మునీంద్రబాబు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా, 26న రాత్రి గోపాలపురం మండలం నందిగూడెం శివారులో ఆయన బైక్ లభ్యమైంది. దీనిపై బాధితుడి సోదరుడు మధుశేఖర్ కొయ్యలగూడెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, 27వ తేదీ రాత్రి దేవరపల్లి గ్రామం వద్ద పోలవరం కాలువలో ఒక పురుషుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి పరిశీలించగా, అది మునీంద్రబాబు మృతదేహమని గుర్తించారు. మృతుడి తలపై గాయాలు ఉండటం, చివరిసారిగా గెల్లా చందు, ఆయునపర్తి సంజయ్‌లతో కలిసి కనిపించడంతో వారిపై అనుమానం ఉందని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో మొదట అదృశ్యంగా నమోదైన కేసును, హత్య అనుమానాస్పద కేసుగా మార్చి ఎస్సై దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడి ఇల్లు కూల్చివేత మునీంద్రబాబు మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలంటూ స్థానికులు, బంధువులు ఆందోళనకు దిగడంతో కన్నాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునీంద్రబాబు వద్ద కార్పెంటర్‌గా పనిచేసే వ్యక్తినే కావాలనే ఈ హత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఈ నిందితుడు గతంలో గవరవరం నుంచి కన్నాపురం వచ్చి భార్యాపిల్లలతో కలిసి స్థిరపడినట్లు తెలిసింది. హత్యోదంతానికి కారణమైన వ్యక్తిపై ఆగ్రహించిన మృతుడి బంధువులు, మిత్రులు సోమవారం గ్రామంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటిని జేసీబీతో నేలమట్టం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యోదంతం, ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. -
కొల్లేరు సమాచారాన్ని అక్టోబర్ 5లోగా సమర్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి కేంద్ర సాధికార కమిటీ కోరిన పూర్తి సమాచారాన్ని అక్టోబర్ 5వ తేదీలోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ, కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డీ–ఫారం భూమిదారుల పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కమిటీకి సమర్పించామన్నారు. ఈ నివేదికను పరిశీలించిన కమిటీ మరికొంత సమాచారం కోరిందని తెలిపారు. సంరక్షణ కేంద్రం ప్రస్తుత విస్తీర్ణం, సరిహద్దుల హేతుబద్ధీకరణ తర్వాత భూముల వివరాలు, జిరాయితీదారుల తరలింపునకు మండలాల వారీగా ప్రతిపాదిత భూములు, జిల్లా, మండలాల సరిహద్దులు, ప్రభుత్వ, జిరాయితీ, డీ–పట్టా భూములు, ఉప్పెటేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పక్షుల ప్రాంతాలు, నోటిఫైడ్, నాన్–నోటిఫైడ్ డ్రైన్ల వంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు ఈ వివరాలను అక్టోబర్ 5లోగా కలెక్టర్‌కు ఇవ్వాలని, ఏలూరు జిల్లా కలెక్టర్ అక్టోబర్ 6 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎంజే అభిషేక్ గౌడ, కేఆర్ కల్పశ్రీ, డీఎఫ్ఓలు సందీప్ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


