ప్రజలకు నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు నిరాశే..

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

ప్రజల

ప్రజలకు నిరాశే..

ప్రజలకు నిరాశే.. వ్యవసాయ బడ్జెట్‌లో సుద్ధ అబద్ధాలు ●

కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. ముఖ్యంగా సూపర్‌ సిక్స్‌లోని నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి ఈ ఏడాదైనా అమలు చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుందని ఆరోపించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అప్పులు చేసి రాష్ట్ర ద్రవ్యలోటు రూ.75,868 కోట్లకు తీసుకెళ్లడం రాష్ట ఆర్థిక పరిస్థితికి ఆందోళన కల్గించే విషయం. రాష్ట్రంలోని రెవెన్యూలో రూ.34,998 కోట్లు కేవలం వడ్డీలకు చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ లోటు రూ.21,935 కోట్లు ఉండటంతో నెలవారీ ఖర్చులకు కూడా తప్పకుండా అప్పులు చేయాలి. ఈ భారం ప్రజలపై పడుతుంది. ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేయకుండా, పొదుపు చర్యలు చేపట్టాలి.

– వంక రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ సుద్ధ అబద్ధాలు. రైతు వెన్ను విరిచేలా వ్యవసాయ బడ్జెట్‌ ఉంది. పురుగు మందులు, ఎరువులు లేకుండా పంటలు పండిస్తారనడం విడ్డూరం. గతేడాది మాదిరిగానే అరకొరగా కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవలో రైతుల సంఖ్యను కుదించడం అన్యాయం. రూ.10 వేల కోట్లకు రూ.6,600 కోట్లే ఇస్తామంటున్నారు. కౌలు రైతుల గురించి ప్రస్తావన లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. చిత్తూరు రైతులకు మామిడి సాయం ఇప్పటివరకు అందలేదు. ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీపైనా అబద్ధాలు చెప్పారు. ప్రధాన బడ్జెట్‌ ప్రసంగంలో రూ.890 కోట్లు ఇచ్చామన్నారు. అయితే వ్యవసాయ బడ్జెట్‌లో రూ.627 కోట్లు అని చెప్పారు.

– వడ్డి రఘురాం, వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్‌,

ఏపీ రైతు విభాగం ఆక్వాకల్చర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు

ప్రజలకు నిరాశే.. 
1
1/1

ప్రజలకు నిరాశే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement