సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఉంగుటూరు మండలంలో ఎర్ర కంకర కూటమి నేతలకు కాసులు పంటగా కురిపిస్తోంది. ఉంగుటూరు మండలం మెట్ట ప్రాంతంలో కంకర క్వారీలు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నల్లమాడు ఉప కేంద్రం పక్కన పెద్ద ఎత్తున కంకరను పొక్లెయినర్ల సాయంతో తవ్వి పట్టుకుపోతున్నారు. పోలవరం కుడి కాలువ గుట్లను దోచేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి లారీల్లో కంకర, మట్టి తరలిపోతోంది. ఎ.గోకవరం ఆయకట్టులో ప్రభుత్వ పోరంబోకులో కంకర తవ్వేసి తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలు తగ్గకుండా కంకర తరలిపోతోంది. వీటి వెనక కూటమి నేతలు ఉన్నారనేది బహిరంగ రహస్యం . దాంతో మండలంలోని రెవెన్యూ అధికారులు చేతులేత్తేశారు. మండలంలోని ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.


