మేకా శేషుబాబుపై సస్పెన్షన్‌ ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

మేకా శేషుబాబుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

మేకా శేషుబాబుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

మేకా శేషుబాబుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

మేకా శేషుబాబుపై సస్పెన్షన్‌ ఎత్తివేత విద్యార్థిని పట్ల అసభ్యకర ప్రవర్తన

పాలకొల్లు సెంట్రల్‌: మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌ ఎత్తివేసింది. గతంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

పాలకోడేరు: శృంగవృక్షం హైస్కూల్‌లో 7 వ తరగతి చదువుతున్న తన కుమార్తె పట్ల లైబ్రరీ టీచర్‌ డేవిడ్‌ రాజు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె స్కూల్‌కు వెళ్ళటానికి భయపడుతుంటే గట్టిగా అడిగామని, డేవిడ్‌ రాజు సెల్‌ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని తమ కూతురు తెలిపిందన్నారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్ళినా ఎలాంటి చర్య తీసుకోకుండా, టీచర్‌కు సపోర్ట్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement