ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాకు మరో షాక్‌! | Raghav Chadha Z plus Security Withdrawn By Punjab Amid Row With AAP Sources | Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాకు మరో షాక్‌!

Apr 15 2026 3:31 PM | Updated on Apr 15 2026 3:41 PM

Raghav Chadha Z plus Security Withdrawn By Punjab Amid Row With AAP Sources

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP),  పంజాబ్‌కు చెందిన ఎంపీ రాఘవ్ చద్దాకు మరో  ఎదురుదెబ్బ  తగిలింది.  రాజ్యసభలో తమ పార్టీ ఉప నాయకుడి పదవి నుండి తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం  ఆయనకు కల్పిస్తున్న 'Z+' శ్రేణి భద్రతను ఉపసంహరించుకోవడం వార్తల్లో నిలిచింది. 

ఎన్‌డీటీవీ రిపోర్ట్‌ ప్రకారం  రాఘవ్‌ చద్దాకు, ఆప్‌తో   పెరుగుతున్న, తీవ్రమైన విభేదాల పరంపరలో ఈ తాజా చర్య చోటుచేసుకుంది. 37 ఏళ్ల చద్దా భద్రత కోసం నియమించిన పంజాబ్ పోలీసు అధికారులు, సిబ్బందిని వెంటనే ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

 ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్‌ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా?

కాగా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి చద్దా వెనుకంజ వేస్తున్నారని, అవసరమైన సమయాల్లో పార్టీకి అండగా  మాట్లాడటం లేదనే ఆరోపణలతో ఏప్రిల్ 2న ఆయన్ను రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుండి తొలగించింది. అయితే పార్టీ ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా  కొట్టిపారేసిన చద్దా, తాను పార్లమెంటుకు వెళ్ళింది ప్రజల సమస్యలను లేవనెత్తడానికే తప్ప, గొడవలు సృష్టించడానికి కాదని, పార్టీకి ప్రతీ సందర్భంలోనూ మద్దతుగా  నిలిచానని వివరణ ఇచ్చారు. 

ఇదీ చదవండి: సముద్రంలో ఘోర ప్రమాదం : 250 మంది గల్లంతు

Advertisement
 
Advertisement
Advertisement