వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(ఏప్రిల్ 15, బుధవారం) జువ్వలదిన్నెలో పర్యటించారు. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్ జగన్ అన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశామని వైఎస్ జగన్ తెలిపారు.


