juvvaladinne
-
కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్
-
ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
నెల్లూరు తీరంలో దేవర... జువ్వలదిన్నె మత్స్యకారులకు భరోసా
-
పోలీసులు సీజ్ చేసిన బోట్లు దొంగతనమా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబునాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీజ్ చేసిన ఆ బోట్లను బీద సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీద సోదరులు, ఆయన అనుచరుడు కొండూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్ డేటానే సాక్ష్యం. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు వస్తే, మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంతో మంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీస్ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?’ అంటూ మండిపడ్డారు.ఫిషింగ్‌హార్బర్ మీకే.. ఇదే నా భరోసామీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కు. ఈ ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగేలా ఒక్కో బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తాం. ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం. ఇక్కడ పాళెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడిగారు. నాడు మన ప్రభుత్వంలో అడిగిన వారికి కాదనకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.ఈ ప్రభుత్వం మా కడుపు కొడుతోంది అన్నా..అన్నా.. ఇక్కడ హార్బర్‌కు 79 ఎకరాల స్థలం ఉందన్నా. ఆరు జిల్లాల్లో సుమారు 150 మరపడవలు ఉన్నాయి. కావలి నియోజకవర్గంలోని ఆరు తీర ప్రాంత పంచాయతీల్లో మరో వెయ్యి వరకు సంప్రదాయ పడవలు ఉన్నాయి. హార్బర్ అందుబాటులోకి వస్తే నిత్యం నాలుగు వేల మంది వరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. చేపలు ఆరబెట్టుకోవడం, ఐస్ ఫ్యాక్టరీలు, వలల రిపేర్లు, తదితర పనులకు ఉన్న స్థలం సరిపోదనుకుంటుంటే కూటమి ప్రభుత్వం హార్బర్ స్థలంలో సగం ప్రైవేట్ సంస్థకు కేటాయించడం అంటే హార్బర్‌ను పూర్తిగా మూసివేయడంతో సమానం. మీ హయాంలో 95 శాతం పూర్తయిన హార్బర్లో మిగిలిన ఐదు శాతం పూర్తి చేసి, అందుబాటులోకి తేకపోవడం మా కడుపులు కొట్టడమే. మీరే మాకు అండగా నిలబడి న్యాయం చేయాలన్నా. మావాళ్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయిన తర్వాత, ప్రాణాలకు తెగించి అక్రమంగా వేట సాగిస్తున్న కడలూరుకు చెందిన పడవలను పట్టుకుని నాలుగు జిల్లాల్లోని 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులు వంతుల వారీగా కాపలా ఉంటే పోలీసుల సాయంతో పడవలు తప్పించేశారు. ఈ విషయంలో కూడా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా. – రామచంద్రయ్య, మత్స్యకారుడు, అన్నగారిపాళెం, కావలి రూరల్ మండలం ఇలాగైతే మేము బతకలేం జగనన్నా..అన్నా.. మీ హయాంలో హార్బర్ వచ్చింది. త్వరత్వరగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మాకు చాలా సంతోషం కలిగిందన్నా. హార్బర్ రాక ముందు మేము తెప్పల్లో వెళ్లి పది కిలోలు, 20 కిలోలు చేపలు తెచ్చుకునే వాళ్లం. వాటిని ఇక్కడ అమ్ముకునే వీలు లేక పల్లెలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. హార్బర్ వచ్చిన తర్వాత మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం అన్నా. వలసలు ఆగిపోతాయని, ఇక్కడే పని దొరుకుతుందని సంబర పడ్డాం. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం హార్బర్లో మిగిలిన కొద్దిపాటి పనులు నిలిపేసి, ప్రైవేట్ సంస్థకు భూములు ఇచ్చిందన్నా. మాకు ఆస్తిగా మీరు ఇచ్చిన హార్బర్‌ను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడితే ఎలా అన్నా? మీరే మా మత్స్యకారులకు న్యాయం చేయాలన్నా. హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మా పరిస్థితి ఏమిటన్నా.. ఇలాగైతే మేము బతకలేం జగనన్నా.– రంగయ్య, మత్స్యకారుడు, అలిచెర్ల బంగారుపాళెం, జువ్వలదిన్నె -
మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు: వైఎస్ జగన్
చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. కళ్లు మూసి తెరిచే లోపు మూడేళ్లు పూర్తవుతాయి. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. వాటిని చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా లాక్కోలేరు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పనులు ప్రారంభించాం. దాదాపు 95 శాతం ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. ఇది జరిగి రెండేళ్లయినా మత్స్యకారులకు అందుబాటులోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియాలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకూడదు. కఠిన నిబంధనలు ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు వచ్చి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారే స్వయంగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బోట్లను సీజ్ చేశారు. దీంతో బీద సోదరులు కుట్ర పన్నడం.. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు రావడం.. మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోవడం చూస్తున్నాం. ఇందుకు బీద అనుచరుడు, బోట్ యజమాని మధ్య జరిగిన కాల్‌డేటానే సాక్ష్యం.మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏకమవ్వడం దుర్మార్గం. ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనా? చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి కడుపుపై తంతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.20 వేల కోట్లతో ఆ పనులన్నింటికీ శ్రీకారం చుట్టాం. అవే కాకుండా అదనంగా మరో రూ.6 వేల కోట్లతో మొత్తంగా రూ.26 వేల కోట్లతో పోర్టులకు సంబంధించి విస్తరణ ప్రణాళిక కూడా సిద్ధమైంది. మా హయాంలోనే దాదాపు 95 శాతం ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. 2024 మార్చి 12న ఎన్నికల కోడ్ రావడంతో ప్రత్యక్ష ప్రారంభానికి వీలుపడలేదు. అదే ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే జాతికి అంకితమైన ఈ ఫిషింగ్ హార్బర్‌ను దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అప్పగించకుండా కుట్రలతో వ్యవహరిస్తోంది’ అని నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మమేకమయ్యారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. రెండేళ్లయినా ఇంత వరకు దీనిని గంగపుత్రులకు అప్పగించకుండా వారి పొట్ట కొట్టేందుకు చంద్రబాబు సర్కారు హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ‘జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర చేస్తోంది. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మేము రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని అక్కడి నుంచి తరిమేస్తాం. రాష్ట్రంలోని 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు, ఆస్తి. వాటిని ఎవరూ సొంతం చేసుకోలేరు. మత్స్యకారులందరినీ పక్కాగా మ్యాపింగ్ చేసి, ఆర్థిక తోడ్పాటు అందించి.. ఆ హార్బర్ల పరిధిలోనే మెకనైజ్డ్ బోట్లకు యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జువ్వలదిన్నె హార్బర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మత్స్యకారులు, అశేష జనవాహినిలో ఒక భాగం రూ.26 వేల కోట్లతో పనులు ⇒ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయనడానికి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉదాహరణ. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ⇒ ఇప్పటికే మూలపేట, మచిలీపట్నం పనులు 35 శాతం పూర్తి కాగా, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫిషింగ్ హార్బర్లలో జువ్వలదిన్నెను కూడా పూర్తి చేశాం. రాష్ట్రంలో అంతకు ముందు 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే, కొత్తగా మరో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టాం. వాటి ద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని రాష్ట్రవ్యాప్తంగా ఒక మ్యాప్ గీసి పనులు చేపట్టాం. ఎక్కడెక్కడైతే మత్స్యకారులున్నారో వాళ్లందరికీ హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి.⇒ దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే వీట న్నింటికీ వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి. పోర్టులకు సంబంధించి కీలకమైన భూ సేకరణలు కూడా పూర్తి చేసి, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చాం. ఈ పోర్టులన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకు రుణాలను సైతం దీనికి టై అప్ చేశాం. ఫైనాన్సియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి, మారిటైమ్ బోర్డు క్రియేట్ చేశాం. అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయాం. ⇒ రామాయపట్నం పోర్టులో దాదాపు 95 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేశాం. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో కీలకమైన భూసేకరణతో పాటు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్ కూడా పూర్తి చేసి, ఆ ప్రాజెక్టులో కూడా దాదాపు 35 శాతం పనులు వేగంగా పరుగెత్తించగలిగాం. అప్పటికే పనులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్లు పనులు చేసుకుంటూ పోతే చాలు ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. ఆ స్టేజ్‌లోకి వాటిని తీసుకొచ్చాం. ⇒ మచిలీపట్నంలో కూడా భూ సేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులూ తీసుకొచ్చి బ్యాంకులతో టై అప్ చేసి, లోన్లన్నీ శాంక్షన్ చేయించాం. మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు చేసి, దాంట్లో కూడా దాదాపు 35 శాతం పనులు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కాకినాడ వద్ద ఇంకో ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ పోర్టు పక్కన పెడితే ప్రభుత్వ రంగంలో ఉన్న 3 పోర్టుల పనులు రెండేళ్లవుతున్నా ఎందుకు జరగడం లేదు? దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. ఇవి కాకుండా దాదాపు రూ.3,800 కోట్లతో మొదలు పెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు. ఇందులో జువ్వలదిన్నె ప్రాజెక్టు ఒకటి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులుచంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం ⇒ చంద్రబాబును రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అని, బాండ్లు అని ఇంటింటికీ తిరిగి అందరినీ మోసం చేశాడు. ఎన్నికలైపోయిన తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేశాడు. చివరికి పలావు పోయింది. బిర్యానీ పోయింది. ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. మరో వైపు చూస్తే గవర్నమెంట్ బడులు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతున్న దుస్థితి. మనం గోరు ముద్ద పథకం అమలు చేస్తే, ఈ రోజు చిన్నారులకు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనపడాల్సిన చోట, ఇంగ్లిష్ మీడియం బోధన జరగాల్సిన చోట.. ఈ రోజు నాసిరకం చదువులు అందుతున్నాయి. పడకేసిన ఆరోగ్యశ్రీ.. మెడికల్ కళాశాలలు నిర్వీర్యం ⇒ ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. రూ.లక్షలు కడితే తప్ప పేదవాడికి వైద్యం అందని పరిస్థితి. ఈ రోజు కూడా ఇక్కడికి ఒకరు బోర్డు పట్టుకుని వచ్చారు. నా పరిస్థితి ఇలా ఉందన్నా.. మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉందన్నా.. అని బోర్డు పట్టుకుని నన్ను కలిసి గోడు చెప్పుకున్నాడు. అదే మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. 3,300 ప్రొసీజర్లతో ఏ పేద వాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా చిక్కని చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితి ఉండింది. ఈ రోజు పేదవాడికి వైద్యం అందించడానికి నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేస్తున్న పరిస్థితి. వైద్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పాల్సిన పని లేదు. ⇒ ఉచిత పంటల బీమా గాలికెగిరి పోయింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఆ రోజు అక్కచెల్లెమ్మలకు అన్ని పథకాలు అందిస్తూ.. సున్నా వడ్డీ పథకం సైతం అందించాం. ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకమూ అందక.. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రజలు చంద్రబాబును తిడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రభుత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే వస్తాయి. మత్స్యకారుల అభివృద్ధి గురించి ఒక్క రోజైనా ఆలోచించారా? ⇒ తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్టులతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్.. వీటన్నింటి ద్వారా మత్స్యకారులకు మేలు జరిగేలా బ్లూ ఎకానమీని బిల్డ్ చేసేలా అడుగులు ముందుకు వేశాం. అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఏ రోజూ కూడా మత్స్యకారుల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని ఏ రోజూ ఆలోచించ లేదు. ఏ రోజూ వాళ్లకు మంచి జరిగేలా కార్యక్రమం చేయలేదు. ⇒ నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్ చేసిన పని.. జువ్వలదిన్నెలో ఇక్కడే కనిపిస్తోంది. ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టు తయారై రెండేళ్లు అవుతోంది. నేను 2024 మార్చి 12న ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తే, ప్రధాని మోదీ అదే ఏడాది ఆగస్టులో జాతికి అంకితం చేశారు. అలాంటి దీనిని కూడా మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? చంద్రబాబు గారూ సమాధానం చెప్పండి.జువ్వలదిన్నె హార్బర్లో నిలిపి ఉన్న బోట్లను పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రెండేళ్ల నుంచి ఎందుకంత తాత్సారం?⇒ కాసేపటి క్రితం ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను రాష్ట్రం మొత్తానికి చూపించాం. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయినా కూడా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాక పోవడం దారుణం. ⇒ బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్‌కు సంబంధించి 62 శాతం పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ పనులు కూడా దాదాపు 57 శాతం పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే 56 శాతం పూర్తయ్యాయి. ⇒ మరో వైపు రెండో దశ కింద శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాళెం, మంచినీళ్లపేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, బాపట్ల జిల్లా వాడరేవు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. ఇవి కాకుండా దాదాపు రూ.150 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. విశాఖపట్నం జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చింతపల్లి, అనకాపల్లి జిల్లా రాజులపేట, దొండవాక, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పల్లంకలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసే వాళ్లం⇒ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, చిల్ రూమ్స్, ఐస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్స్.. ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ మెషీన్లు, గేర్ షెడ్ల వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఫిషింగ్ హార్బర్లో ఈ వసతులన్నీ ఉంటాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏడాదికి దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుంది. మత్స్యకార అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగేలా వారికి ప్యాకింగ్, మార్కెటింగ్, వేల్యూ ఎడిషన్‌లో, ఫుడ్ స్టాల్స్‌లో పని దొరుకుతుంది. ఈ రకంగా పెద్ద ప్రణాళిక చేశాం. ⇒ ఇక్కడ ఏకంగా 1,250 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారులు హక్కుగా పొందాలని ఆరాటపడ్డాం. ఒక్కో బోటుకు 12–15 మంది వరకు గ్రూపు చేసి వారిని ఓనర్లుగా చేయాలని భావించాం. వారు 10 శాతం చెల్లిస్తే, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 40 శాతం లోనుగా ఇప్పిస్తామని చెప్పాం. ఈ ఆదాయమంతా ప్రతి మత్స్యకారుడికి చెందాలని, వారి కుటుంబాలు బాగుండాలని కలలు కన్నాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మత్స్యకారులందరికీ బోట్లు అంది ఉండేవి. 1,250 మెకనైజ్డ్ బోట్లకు దాదాపు 20 వేల మంది మత్స్యకారులు ఓనర్లు అయ్యేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. అయితే మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా మత్స్యకారుల నుంచి లాక్కోలేరని హెచ్చరిస్తున్నా.⇒ ఇక్కడ హార్బర్ కోసం సేకరించిన భూములను ప్రైవేట్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టి మత్స్యకారులను తరిమేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడు. 79 ఎకరాల్లో సగం భూములు ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి కేటాయించి, దోపిడీ కార్యక్రమం చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కావాల్సినన్ని భూములున్నాయి. అక్కడ ప్రైవేట్ సంస్థకు కేటాయించకుండా హార్బర్ భూములనే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం గ్రహించాలి. ఇదంతా మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసే కార్యక్రమం. మత్స్యకారుల కోసం జగన్ భూములు సేకరించి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే, చంద్రబాబు వారిని తరిమేసి ప్రైవేట్ వారికిచ్చి దోచుకునే కార్యక్రమానికి తెర లేపాడు. -
మత్స్యకారులతో వైఎస్ జగన్ మమేకం (ఫొటోలు)
-
ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తావా ఇచ్చుకో... మా ప్రభుత్వం వచ్చాక మాత్రం
-
ఎవడికి ఇస్తావో ఇచ్చుకో.. నువ్వు కాదు నీ తాత దిగి వచ్చినా.... మాస్ వార్నింగ్
-
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్‌గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్‌కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్‌ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మత్సకారులతో YS జగన్ భేటీ
-
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
-
Watch Live: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
-
జువ్వెలదిన్నెకు బయల్దేరిన జగన్.. హెలికాప్టర్ లో మిథున్ రెడ్డి
-
జగన్ పర్యటన.. జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు రూరల్: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: జువ్వలదిన్నెకు జగనన్న.. కూటమిలో ఉలిక్కిపాటు -
జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటనకు సంబంధించిన అప్డేట్స్.. -
బీద వెన్నుబోట్లకు సాక్ష్యం ఇదిగో
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే... స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రే మాయం చేసిన ఘనులు కూటమి నేతలేనని తేలిపోయింది. ముఖ్యంగా ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లూ బుకాయించిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అసలు సూత్రధారి అని స్పష్టమైంది. బోట్ల మాయం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు.ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో బీద అనుచరులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్లు వదిలేశారనే విషయం ఫోన్ ‘కాల్ రికార్డ్స్ డేటా’ ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పొట్టగొడుతున్నారని, న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే, వారిని ఏమార్చి, వారి నాయకులను కొనేసి, ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన బాగోతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది. బీదా... ఇప్పుడేమంటారు? బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కు రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలను వెల్లడించింది. బీద మస్తాన్‌రావుతోపాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయం వ్యవహారంలో నిందితులతోనూ, బోట్ల యజమానులతోనూ మాట్లాడినట్లు కాల్ డేటా బయటపెట్టింది. ⇒ ఎంపీ బీద మస్తాన్ అనుచరుడు, బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పోలిశెట్టి అనే పాతపాళెంకు చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకువెళ్లిన బోట్ల యజమాని అశోక్‌తో ఫోన్లో గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పోలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. ఇలా ఇద్దరూ మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ⇒ అదే విధంగా బోట్ల మాయం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి తోటయ్య అనే వ్యక్తితో బీద మస్తాన్ అనుచరుడైన పోలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 9 వరకూ 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్‌తో మాట్లాడారు. అది కూడా గతేడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీరిద్దరూ ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. ⇒ అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీద మస్తాన్రావుతోనూ ఫోన్లో మాట్లాడినట్లు బయటపడింది. గతేడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఈ ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీల్లో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలనూ అప్ డేట్ చేస్తూ వచ్చారు. -
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. -
నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం
-
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్‌ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. -
నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధపడడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా గంగపుత్రుల కోసం నిరి్మంచిన హార్బర్లో ప్రైవేటు పెత్తనానికి అనుమతించడం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జువ్వలదిన్నెతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇందులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో పూర్తయింది, మిగతావి అనేక దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. మత్స్యకార కుటుంబాలు సుసంపన్నం అయ్యేవి. అయితే చంద్రబాబు కూటమి సర్కారు మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్వీర్యం చేస్తూ.. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా, ఏకకాలంలో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా సిద్ధం చేశారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనాతో హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు.వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా.. మిగిలిన మూడేళ్ల అవకాశాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయాలని భావించారు. 2024 మార్చి 12న వర్చువల్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను నేరుగా మత్స్యకారుల సమక్షంలోనే ప్రారంభించాలని భావించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే ఏడాది ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. మత్స్యకారుల భవితవ్యం.. వైఎస్ జగన్ సంకల్పం మత్స్యకారుల జీవనోపాధి మెరుగుకూ వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించేందుకు 1250 బోట్లను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి దశలో జిల్లాలోని వైఎస్సార్ మత్స్యకార భరోసా అందుకుంటున్న లబ్ధిదారులకు.. ఆ తర్వాత మిగతా వారికి బోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి బోటుకు 12 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. బోటు విలువలో 10 శాతం లబ్ధిదారుల వాటాగా చెల్లిస్తే.. మిగతా 90 శాతం బ్యాంకు రుణం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను మిగతా 40 శాతం అప్పును మత్స్యకారులే చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. వైఎస్ జగనే ఇప్పటికీ సీఎంగా ఉండి ఉంటే.. ఇప్పటికే ప్రతి మత్స్యకారుడూ మెకనైజ్డ్ బోటుకు యజమానై ఉండేవాడు. ఫిషింగ్ హార్బర్‌కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా సమృద్ధిగా ఉపాధి లభించేది. అభివృద్ధిని బుగ్గి చేసేందుకు బాబు సిద్ధం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధిని బుగ్గిచేసే కార్యక్రమాలు చేపట్టింది. ఫిషింగ్ హార్బర్లను నిర్వీర్యం చేసి అక్కడి భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి వారి భవిష్యత్‌ను నాశనం చేసేందుకు ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నెతోనే సాగర్ డిఫెన్స్ పేరిట కుట్రలకు తెరతీశారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుంటే.. దశల వారీగా రాష్ట్రంలోని తీరం వెంబడి నిర్మాణంలో ఉన్న మిగతా ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేయడానికి బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్‌పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్‌పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్‌పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్‌పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
బీదతోపాటు ఉన్నదెవరు?
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి తమిళనాడు బోట్లు వదిలేయడం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు హస్తం ఉందని మత్స్యకారులు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే బీద మస్తాన్‌రావు ముగ్గురు మత్స్యకారులకు రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పి, ఆ డబ్బులు తెచ్చి ఇచ్చిన వారి పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం గమనార్హం. మత్స్యకారులకు సుపరిచితమైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలే తెరవెనుక ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత నెల 14న హార్బర్ నుంచి తమిళనాడులోని కరైక్కల్కు చెందిన నాలుగు సోనా బోట్లు వదిలేయడం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన దాదాపు ఐదు వేల మంది మత్స్యకారులు సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మంగళవారం ఉదయం 7 గంటల వరకూ అంటే 14 గంటల పాటు పెద్దలు పంచాయితీ నడిపారు. తొలుత బోట్లను వదిలేసిన నెల్లూరు జిల్లా కొత్తబంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, ఇస్కపల్లికి చెందిన తోటయ్య, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో అందరిముందూ హాజరుపరిచారు. గత నెల 14న ఏం జరిగిందో చెప్పాలని మత్స్యకార పెద్దలు నిలదీశారు. బోట్లు వదిలేసింది తామేనని వారు అంగీకరించారు. అయితే తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు వెల్లడించలేదు. పేర్లు చెప్పి తీరాల్సిందేనని మత్స్యకారులు పట్టుపట్టడంతో ఆరుగంటల తర్వాత అంటే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య వాస్తవాలను సభ ముందుంచారు. బోట్లు వదిలేయాలని అధికార టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు డబ్బులు ఇచ్చారని వెల్లడించాడు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. కావలి సీఐ పాత్ర కూడా ఉందని మరో సభ్యుడు శెట్టి వెల్లడించాడు. అయితే అసలు డబ్బులు తెచ్చి ఇచి్చన వారి పేర్లు మాత్రం వారు వెల్లడించలేదు.రూ.5 కోట్లు చెల్లించాలిబోట్ల వదిలివేతకు నాలుగు గ్రామాల మత్స్యకారులు బాధ్యత వహించాలని పెద్దలు ఆదేశించారు. దీనికి ఆయా గ్రామాల కాపులు సమ్మతించటంతో రూ.5 కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే మత్స్యకారులు రూ.1.50 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి మత్స్యకార పెద్దకాపులు అంగీకరించలేదు. దీంతో కొద్దిసేపు సందిగ్ధం నెలకొంది. ఈలోగా మత్స్యకారులు డబ్బులు అయినా ఇస్తాము లేదా మూడు బోట్లను తెచ్చి పెడతామని చెప్పారు. కానీ పెద్ద కాపులు ససేమిరా అన్నారు. ఒక దశలో వదిలేసిన బోట్లను తెచ్చి పెట్టాలని పెద్ద కాపులు చెప్పారు. రెండు కొత్త బోట్లు కొనిస్తామని ఇస్కపాలెం కాపులు చెప్పడంతో ఒక దశలో చెన్నాయపాలెం, ఇస్కపల్లి మత్స్యకారుల మధ్య వాగ్వాదం రేగింది. దీంతో పెద్ద కాపులు సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మత్స్యకార పెద్ద కాపులు స్పష్టం చేశారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో పెద్దలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సమావేశానికి పోలీసులు మఫ్టీలో బందోబస్తు నిర్వహించారు. -
పెద్దల 'కుట్ర'..!
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాదీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సింగరాయకొండ: తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో మన తీర ప్రాంతంలో చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంత వరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ప్రయోజనం లేదు. సోనాబోట్ల ఆగడాలతో విసిగిపోయిన మత్స్యకారులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంత మత్స్యకారులు ఏకమై ఒక సైన్యంలా ఏర్పడ్డారు. ప్రాణాలకు తెగించి తీరానికి వచ్చిన సోనాబోట్లను వెంబడించారు. తమిళనాడు జాలర్లను తరమికొట్టారు. నాలుగు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. ఎనిమిది నెలల కిందట జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్లను తమ భద్రతలో ఉంచుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా వదిలేందుకు మత్స్యకారులు ససేమిరా అన్నారు. మీ అంతుచూస్తామంటూ బెదిరింపులు ‘‘మా బోట్లను నిర్బంధించి, 8 నెలల పాటు ఇబ్బందులకు గురిచేస్తారా మీ అంతుచూస్తాం’’ అంటూ కరైకల్ మత్స్యకారులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తీరానికి దగ్గరగా చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన వలలు తెంచేస్తూ స్థానికులు కనబడితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. చివరకు వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది.. ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాదీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్‌కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెర వెనకున్నదెవరు..? జువ్వలదిన్నె హార్బర్లో మెరైన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ పని జరిగే అవకాశం ఉందా అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక కుట్రలు చేసి బోట్లను వదిలేసి నేడు దానిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేయడం సరికాదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తుŠాన్నరు. 15 వేల లీటర్ల డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందో బహిర్గతం చేయాలని నిలదీస్తున్నారు.మెరైన్ పోలీసుల రక్షణలో ఉన్న నాలుగు బోట్లు ఎలా వెళ్లాయో ప్రకటించాలని వారు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. త్వరలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం కరైకల్ బోట్ల వ్యవహారంపై శ్రీకాకుళం నుంచి తడ వరకు ఉన్న 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సమావేశమై తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నారు. వీరు త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్‌లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని స్థానిక మత్స్యకారుడు వివరించారు.ఐదు నెలలుగా ఎటువంటి భయం లేకుండా చేపల వేట సాగించామని, ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా మరింత సమస్యను సృష్టించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బోట్ల చోరీ వెనుక టీడీపీ హస్తం!
-
జువ్వలదిన్నె బోట్ల వివాదంలో కొత్త మలుపు
సాక్షి, నెల్లూరు జిల్లా: జువ్వలదిన్నె బోట్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదంలో ఎంపీ బీద మస్తాన్‌రావు తీరుపై నెల్లూరు సముద్ర తీర మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు ప్రస్తావనకు రాకుండా ఉండటం కోసం పోలీసులు యాక్షన్ ప్లాన్ చేశారు. నారా లోకేష్ ఆదేశాలతో మత్స్యకార గ్రామాల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ టీం ఆపరేషన్ చేపట్టింది.సర్వేపల్లి నియోజకవర్గం, వెంకన్నపాలెం గ్రామ మత్స్యకారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవహారంతో బీదాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు.. మత్స్యకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల యత్నాలను మత్స్యకారులు తీవ్రంగా ప్రతిఘటించారు.‘‘ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ముందుగా మాకు నిజం చెప్పి వుండాలి. నిజాన్ని ఎందుకు దాచాడు? మేమే సమస్యను పరిష్కరించుకునే వాళ్లం. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఎవరు తప్పు చేశారో మాకు తెలుసు. మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఆపండి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మా ప్రతిష్ట మాకు ముఖ్యం. మీ ప్రభుత్వ, పోలీస్ బెదిరింపులకు తలొగ్గేది లేదు’’ అంటూ పోలీసులతో మత్స్యకారులు తేల్చి చెప్పారు. -
మీరు ఎంత అడ్డుకున్నా.. అది జరగినివ్వం బాబుపై నిప్పులు చెరిగిన కాకాణి
-
నెల్లూరు: చలో ‘జువ్వలదిన్నె’ను అడ్డుకున్న పోలీసులు
కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేసే కుట్ర: వైఎస్సార్సీపీ నేతలుమత్య్సకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమత్స్సకారులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారుజువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌కు కట్టబెట్డడం దుర్మార్గంమత్స్యకారులకు చెందాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారుపోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళనవైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్వైఎస్సార్సీపీ చలో జువ్వెలదిన్నెను అడ్డుకున్న పోలీసులుఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా వైఎస్సార్సీపీ నిరసనలుకావలి నుంచి వైఎస్సార్సీపీ నేతల భారీ ర్యాలీమాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీకేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులుపోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన👉కావలి నుంచి భారీగా బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలుకాకాణి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీజువ్వలదిన్నె సమీపంలో వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులువైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్పరంచేసే కుట్రజువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవాళ(మార్చి 20, శుక్రవారం) వైఎస్సార్సీపీ చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని చేపట్టింది. చలో జువ్వలదిన్నెకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్‌పరం కాకుండా నిరసనలు చేపట్టనుంది. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. -
హార్బర్‌లోనూ ప్రైవేట్ పాగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులు వేట కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్‌లోనూ ప్రైవేట్ సంస్థ పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరిట ప్రైవేట్‌కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు షిప్‌యార్డ్ నిర్మాణం పేరిట ఫిషింగ్ హార్బర్లోకి సైతం ప్రైవేట్ సంస్థకు రెడ్‌కార్పెట్ వేసింది. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు 29.58 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలవేట కోసం నిర్దేశించిన ఫిషింగ్ హార్బర్ల వద్ద షిప్‌యార్డు నిర్మిస్తే మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జగన్ నిర్మించారు.. చంద్రబాబు ప్రైవేట్‌కు ఇస్తున్నారురాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్‌గా ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అక్కడ షిప్‌యార్డ్ నిర్మించేందుకు సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు 29.58 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సాగర్ డిఫెన్స్ సంస్థ ఆటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మార్కెట్ విలువలో 6 శాతం అద్దె చెల్లించే విధంగా ఈ భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 5 శాతం చొప్పున లీజు ధరను పెంచుతామని తెలిపారు. అదే 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్‌పై 50 శాతం అదనపు ప్రీమియం విధిస్తామని, ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మత్య్సకారుల సంక్షేమానికి గత YSRCP ప్రభుత్వం కృషి
-
‘జువ్వలదిన్నె’ ప్రారంభం.. జగన్ కల సాకారం
సాక్షి, అమరావతి/నెల్లూరు (దర్గామిట్ట)/తుమ్మపాల(అనకాపల్లి) : రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.8 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సుమారు రూ.3,500 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జువ్వలదిన్నె హార్బర్ మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చిం ది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పాలఘర్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో.. ఇప్పటివరకూ పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ హార్బర్ ప్రారంభంతోపాటు అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.392.58 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఫిషింగ్ హార్బరుకూ ప్రధాని వర్చువల్‌గానే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ నెల్లూరు కలెక్టరేట్ నుంచి.. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులూ అనకాపల్లి నుంచి పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌తో వాయిదా..రాష్ట్రంలో మొత్తం పది ఫిషింగ్ హార్బర్లలో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో తొలుత జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తికాగా గత ప్రభుత్వ హయాంలో దీన్ని వర్చువల్‌గా అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ, ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నేరుగా మత్స్యకారులతో కలిసి ప్రారంభిస్తానంటూ ఆయన వాయిదా వేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు ప్రధాని 13 రాష్ట్రాలకు చెందిన రూ.1,200 కోట్ల విలువైన 217 మత్స్యకార ప్రాజెక్టులను శుక్రవారం ప్రారంభించగా ఇందులో ‘జువ్వలదిన్నె’ ఒకటి. 25వేల కుటుంబాలకు లబ్ది.. ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నె ప్రాజెక్టు ద్వారా 25,000మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా ఈ హార్బరును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హర్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి రానుంది. హార్బర్‌లోనే కోల్డ్‌చైన్, ఐస్‌ప్లాంటు, చిల్రూం వంటి మౌలిక వసతులతో పాటు బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్òÙడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, నిర్మాణ పనులు ప్రారంభించిన పూడిమడక హార్బరు ద్వారా 980 బోట్లు నిలుపుకునే వెసులుబాటుతో పాటు 4,870 మంది మత్స్యకార కుటుంబాలు లబ్దిపొందనున్నాయి. మరోవైపు.. రాష్ట్రంలో తలపెట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం 6.8 లక్షల మంది మత్స్యకారులు లబి్ధపొందనున్నారు. వీటి ద్వారా 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద సమకూరనుంది. తద్వారా రాష్ట్ర జీడీపీకి రూ.9,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.ఎక్కడ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెపనులు ప్రారంభం : 2021 మార్చి 19నఖర్చు : 288.8 కోట్లుపనులు పూర్తి : 2024 ఎన్నికలకు ముందు.. ఎన్నికల కోడ్‌తో ప్రారంభం వాయిదాఈ హార్బర్‌తో ఉపయోగం : ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదతో పాటు 25,000మత్స్యకార కుటుంబాలకు లబ్ధిప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగామత్స్యకారుల కష్టాలు స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీరంపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రణాళిక రూపొందించారు.మొత్తంప్రణాళిక లక్ష్యం 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుఎంత మందికి లబ్ధి : 555 తీరప్రాంత మత్య్సకార గ్రామాల్లో దాదాపు 6.8 లక్షల మంది మత్స్యకారులకు మేలు మొత్తం అంచనా వ్యయం రూ.3,500 కోట్లుతొలివిడతలో పనులుప్రారంభమైనవి: జువ్వలదిన్నె, నిజాంపట్నం,మచిలీపట్నం, ఉప్పాడవీటి అంచనా విలువరూ.1,204.56 కోట్లు -
ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
ఐదేళ్ల జగన్ పాలనలో 4 పోర్టులకు పునాది... ⇒ ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు... ⇒మిగిలినవీ శరవేగంగా నిర్మాణం... ⇒10 ఫిషింగ్ హార్బర్లు... 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ⇒ వీటన్నిటికీ రూ.25,000 కోట్ల వ్యయం... ⇒పోర్టుల పక్కనే పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు ⇒ 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది జాలరులకు లబ్ధి ⇒రూ.9000 కోట్ల మేర పెరగనున్న జీడీపీ -
మత్స్యకారుల 20 ఏళ్ల కల సాకారం..
-
మన తీరం.. మత్స్య హారం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తీరం వెంట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. మనకున్న 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటన్నిటివల్ల మత్స్యకారులు ఎక్కడెక్కడికో వలస వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున ఆర్నెళ్లకు రూ.69,000 మేర పరిహారం చెల్లిస్తూ మొత్తం రూ.161.86 కోట్లను మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రూ.20 వేల కోట్లతో తీరంలో సదుపాయాలు మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు నాలుగు పోర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పోర్టులను దాదాపు రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్ హార్బర్లను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తుండగా మరో రూ.200 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల పైచిలుకు సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ మంచి మనసుతో ముందుకొచ్చింది. మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి సాయం అందిస్తూ ఆదుకుంటున్నాం. క్రమం తప్పకుండా డబ్బుల విడుదల కోసం గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ ను అభినందించాలి. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు ఇచ్చాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో 7,050 కుటుంబాలకు మంచి చేస్తున్నాం. బాబు సర్కారు ఆలకించలేదు.. 2012కు సంబంధించి జీఎస్పీసీ రూ.78 కోట్లు పరిహారంగా 16,554 కుటుంబాలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్నెళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మేలు చేస్తూ ఆ రూ.78 కోట్లను 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు అందచేశాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలుగా భావించి వారికి తోడుగా నిలుస్తూ గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్జీసీ టేకోవర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్జీసీ దృష్టికి తేవడంతో రెండు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. అయితే ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తున్నాం. 1.07 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ.538 కోట్లు సాయంగా అందించాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికీ సాయాన్ని ఏటా అందించాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చి పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4 వేలుగా ఉన్న సాయాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు. రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ గతంలో డీజిల్‌పై లీటరుకు రూ.6 మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9కి పెంచాం. నాడు ఆ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి ప్రతి మత్స్యకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చాం. డీజిల్ పోయించుకున్నప్పుడే రూ.9 సబ్సిడీ ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చాం. రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా వేటకు వెళ్లే మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్Šగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే రూ.5 లక్షలు పరిహారంగా చెల్లిస్తూ మిగిలిన అమౌంట్‌ను ఆర్నెళ్లలోగా అందజేసే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 175 కుటుంబాలకు మంచి చేస్తూ మరో రూ.17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. జీఎస్పీతో మొదట రూ.78 కోట్లు, ఓఎన్జీసీతో ఐదు దఫాల్లో రూ.647 కోట్లు అందచేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. 40,850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ దాదాపు రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఆరు కార్యక్రమాలతో రూ.4,913 కోట్లు అందించాం. ఇవికాకుండా నవరత్నాల ద్వారా అదనంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం. కార్యక్రమంలో ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జువ్వలదిన్నెకు స్వయంగా వస్తా ‘‘ఇవాళే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించాలని తొలుత అనుకున్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేనే నేరుగా అక్కడకు వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించా. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మత్స్యకారులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలియచేసేందుకు నేనే స్వయంగా వెళ్లి ఆ హార్బర్‌ను ప్రారంభిస్తా. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాలు మారతాయి. ఒక్కో ఫిషింగ్ హార్బర్లో ఎన్ని బోట్లు ఉంటాయి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయాలు అందరికీ తెలియాలి. అందుకే అక్కడ ఇవాళ తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ చేతి నుంచే ఆరో విడత కూడా.. రాష్ట్రంలో మత్స్యకార సోదరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మత్స్యకారుల బతుకుదెరువు, ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా మీరు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందడం మీ వల్లే సాధ్యమైంది. మళ్లీ మీ చేతుల మీదుగా ఆరో విడత కూడా తీసుకుంటాం. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరువలేనిది. – పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే, ముమ్మిడివరం ఆశ వదిలేసుకున్న డబ్బులు అందుకుంటున్నాం.. గత ప్రభుత్వంలో రావనుకున్న డబ్బులు మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.2,07,000 తీసుకున్నాం. ఇప్పుడు ఐదో విడతలో రూ. 69,000 అందుకుంటున్నాం. వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వంలో అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మత్స్యకార భరోసా, సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. గతంలో మాకు బీమా వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు. నాకు అమ్మ ఒడి సాయం అందింది. మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5,32,000 మేర లబ్ధి చేకూరింది. ఆసరా సాయం కింద అందిన రూ.42 వేలతో కుట్టుమిషన్లు కొనుక్కున్నా. మా అమ్మకు చేయూత సాయం అందింది. –నారాయణమ్మ, లబ్ధిదారు, కోనసీమ జిల్లా అన్నీ ఇస్తున్నారు.. గతంలో మా గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా మత్స్యకారులందరికీ మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ గతంలో కొందరికే అందగా ఇప్పుడు అర్హత ఉంటే చాలు అందరికీ ఇస్తున్నారు. గతంలో బీమా సాయం అందేది కాదు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. గతంలో ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామన్నా. – భైరవమూర్తి, వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, కాకినాడ జిల్లా -
సీఎం జగన్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలోనే..
ఏపీలో అభివృద్దే లేనట్లు విషం చిమ్ముతున్న వారికి ఇది సమాధానం. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా ఒక్కసారి వీటిని తిలకిస్తే ఏపీలో ప్రగతి జరుగుతుంది, లేనిది తెలుస్తుంది. కావలి సమీపంలోని రామాయపట్నం, జువ్వలదిన్నె గ్రామాల వద్దకు వెళ్లి వీరు చూస్తే కుళ్లు కుంటారేమో! లేకపోతే అందులోనూ ఏదో ఒకటి వక్రీకరించి పెడబొబ్బలు పెడతారేమో తెలియదు. రామాయపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణం వేగంగా సాగుతోంది. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఐదు పోర్టులు ఉండగా, కొత్తగా నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. కేవలం ఓడరేవులకే పదహారువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. గత 70ఏళ్లలో ఏపీ చరిత్రలో ఇన్ని ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఒకేసారి ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తీర ప్రాంతంపై దృష్టి పెట్టారు. తీరం వెంబడి కార్యకలాపాలు చేపడితే ఏపీలో గ్రోత్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇన్నేళ్లుగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, తగు అభివృద్ది జరగడం లేదని రాసేవారం. ఇప్పుడు మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలతో ఆ పరిస్థితి మారుతోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం చేపట్టారు. కాకినాడ పోర్టు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు రంగంలో సిద్దం చేస్తున్నారు. వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నట్లు కనిపించింది. బందరు పోర్టు నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది. కాకినాడ పోర్టు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టారు. కొత్త ఓడరేవులకు అనుసంధానంగా పరిశ్రమలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటివల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కొద్ది రోజుల క్రితం రామాయపట్నం ఓడరేవు నిర్మాణాన్ని, అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడానికి నేను వెళ్లాను. ఫిషింగ్ హార్బర్ 95 శాతం పూర్తి అయిందని అధికారవర్గాలు తెలిపాయి. చివరి దశలో కొంత ఆర్దిక సమస్యలు ఎదురైనట్లు చెబుతున్నారు. అవి లేకుంటే ఈ పాటికి ఆపరేషన్లోకి వచ్చేది. వేలాది బోట్లు అక్కడ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళుతుండేవి. ఇప్పటికే పలు బోట్లు అక్కడ తవ్విన బారీ చానల్ ద్వారా సముద్రంలోకి తేలికగా వెళుతున్నాయి. వారు మత్స్య సంపదను తెచ్చి అమ్మకానికి పెడుతున్నారు. మత్స్యకారులు, వ్యాపారుల సదుపాయార్దం పలు భవనాలు, స్టాక్ యార్డులు, ఇతర సదుపాయాల నిర్మాణం పూర్తి అయిపోయింది. దీనిని బహుశా కొద్ది నెలల్లోనే ఆరంభించే అవకాశం ఉంది. రామాయపట్నంలో నాన్ మేజర్ ఓడరేవు నిర్మాణం సాగుతున్న తీరును అక్కడ ఉన్న నిర్మాణ సంస్థ అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్మిస్తోంది. దీని తరపున నవయుగ, అరవిందో సంస్థలు సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టాయి. అరవిందో సంస్థ జనరల్ మేనేజర్ పెరుమాళ్, టెక్నికల్ హెడ్ సుధాకర్ రావు తదితరులు ఒక ప్రజెంటేషన్ ద్వారా పోర్టు ప్రగతిని వివరించారు. రామాయపట్నం పోర్టుకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే అది జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో, ప్రధాన రైల్వే మార్గంలో తెట్టు రైల్వే స్టేషన్ నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దగ్గరగా రవాణా సదుపాయాలు ఉన్న అతి కొద్ది పోర్టులలో ఇది ఒకటి అవుతుంది. జాతీయ రహదారిని కలపడానికి పోర్టు నుంచి ఆరు లైన్ల రోడ్డును వేస్తున్నారు. అలాగే రైల్వే లైన్ నిర్మాణం కూడా చేస్తారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమలు, ఎగుమతి వ్యాపారం నిమిత్తం సుమారు నాలుగువేల ఎకరాల భూమి కూడా గుర్తించారు. పోర్టుకోసం 850 ఎకరాల భూమి సేకరించారు. ఈ పోర్టు పనులు వేగంగా జరుగుతుండటంతో అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఒక్కసారిగా తమ భూముల విలువలు పెరిగాయని వారు చెబుతున్నారు. కొన్ని పరిశ్రమలు తమకు అవసరమైన భూమిని కొనుగోలు చేస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ,హైదరాబాద్‌లకు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఈ ఓడరేవు సదుపాయాలను వాడుకోగలుగుతారు. మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ రేవు ఉపయోగపడుతుంది. మొదటి దశలో 34 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణాకు ప్లాన్ చేశారు. తుది దశలో 138 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. మొత్తం నాలుగు బెర్తులు నిర్మాణం చేస్తున్నారు. వీటిలో ఒకటి ఈ డిసెంబర్లో పూర్తి అవుతుందని, తొలి సరుకుల నౌక వస్తుందని నిర్మాణ సంస్థలవారు తెలిపారు. ఈ పోర్టు మొదటి దశ నిర్మాణానికి రూ.3,736 కోట్లకు పాలన అనుమతి మంజూరు కాగా, అంతర్గత బెంచ్ మార్క్ అంచనా రూ.2,647 కోట్లుగా ఉంది. ఈ బెర్తులలో రెంటిని ఇప్పటికే జేఎస్‌డబ్ల్యు, ఇండోసోల్ కంపెనీలకే ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఓడరేవులో కీలకమైన ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు చాలావరకు జరిగాయి. సముద్రంలోకి దక్షిణ బ్రేక్ వాటర్ 3700 మీటర్లు, ఉత్తర బ్రేక్ వాటర్ 1350 మీటర్లు ఉంటుంది. ఓడలు రావడానికి అనువుగా చానల్ తవ్వకం జోరుగా సాగుతోంది. అక్కడ నుంచి డ్రెడ్జర్ ద్వారా తీసిన మెటీరియల్‌ను పర్యావరణం దెబ్బతినకుండా సముద్రంలో నిర్ణీత దూరంలో పడవేస్తున్నారు. దక్షిణ బ్రేక్ వాటర్ వైపు 60 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీయాల్సి ఉండగా, ఇప్పటికే 43 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీశారు. నార్త్ బ్రేక్ వాటర్ వైపు 83 శాతం మెటీరియల్ తొలగింపు పూర్తి అయింది. అప్రోచ్ ఛానల్, ఓడలు తిరగడానికి వీలుగా 500 మీటర్ల టర్నింగ్ సర్కిల్ తయారు చేస్తున్నారు. ఒకసారి ఈ ఓడరేవు ఆపరేషన్లోకి వచ్చిందంటే దక్షిణ కోస్తాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే అక్కడ కృష్ణపట్నం పోర్టు ఉండగా, ఇప్పుడు రామాయపట్నం రేవు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ముఖ చిత్రం మారిపోతుంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఈ అభివృద్దిని ప్రొజెక్టు చేయలేవు కనుక వారి నుంచి ప్రత్యేకంగా ఆశించలేం. పైగా అసలు ఏమీ అభివృద్ది జరగడం లేదని ప్రచారం చేస్తుంటాయి. వారి భయాలను అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రస్తుతం తెలుగుదేశం కోసమే పనిచేస్తూ, ఈ అభివృద్దిని చూడడానికి ససేమిరా అంటున్నాయి. అవి కళ్లున్న కబోదులుగా మారాయి. అయినా ఇవి పూర్తి అయిన రోజున వీరు ఎంత మభ్యపెట్టాలనుకున్నా, వాస్తవ ప్రగతి ప్రజలకు అర్ధం అవుతుంది. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, వ్యతిరేక ప్రచారం చేసినా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి అభివృద్దిని మరింత చేయాలని ఆకాంక్షిద్దాం. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సీఎం వైఎస్ జగన్ చొరవతో నెరవేరబోతున్న దశాబ్దాల కల
-
జగనన్న సంకల్పం.. ప్రారంభానికి జువ్వలదిన్నె రెడీ! వారికి మంచి రోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైనవి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వీటి రాకతో ఇక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని వేలాది మంది మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లి, ఎప్పటికప్పుడు ఇంటికొస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే రోజులు అతి త్వరలోనే రానున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారికి ఆ కష్టాలను దూరం చేయాలని భావించి, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ప్రధానంగా డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, ప్రీకాస్ట్ వంటి పనులు దాదాపు పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మిగతా ఐదు శాతం పనులు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పట్టిన చేపలు వేలం వేసుకోవడానికి హాలు, కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.288.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ హార్బర్లో 1,250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 6,100 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 9 హార్బర్లతో 60,858 మందికి ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూ.3,520.56 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి. రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుందని అంచనా. మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా హార్బర్ల వద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద జువ్వలదిన్నె వద్ద 50 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మత్స్య ఉత్పత్తులే కాకుండా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రాసెస్ చేసేలా ఈ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే ఉపాధి లభిస్తుంది చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ హర్బర్ వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందొచ్చు. ఇక్కడ అరుదైన మత్స్య సంపద ఉన్నా, హర్బర్ లేకపోవడంతో తమిళనాడు మత్స్యకారులు దొంగతనంగా వచ్చి వేటాడుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఆ సమస్య ఉండదు. ఈ హార్బర్ వద్ద ఇతరత్రా మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటం సంతోషం. ► బుచ్చింగారి చిట్టిబాబు, మత్యకారుడు, ఆదినారాయణపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా త్వరలో ప్రారంభం తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నాం. రెండో దశ హర్బర్లకు సంబంధించి డిజైన్లు ఖరారు దశలో ఉన్నాయి. అవి ఖరారు కాగానే పనులు మొదలు పెడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హర్బర్ లేదా ఓడరేవు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ► షాన్ మోహన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు జువ్వలదిన్నెలో పనుల పురోగతి ఇలా.. ► 2021 మార్చి 19న పనులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ► భారీ మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఆగడానికి వీలుగా కాలువను తవ్వడం కోసం ఏకంగా 10.5 లక్షల టన్నుల ఇసుకను తవ్వి పక్కన పోశారు. ఈ బ్రేక్‌వాటర్ ఛానల్ తిరిగి పూడిపోకుండా ఉండటం కోసం 3.20 లక్షల టన్నుల రాతిని వినియోగించారు. ఉత్తరం వైపు బేక్ వాటర్ 835 మీటర్లు, దక్షిణం వైపు 620 బ్రేక్ ఛానల్స్‌ను రాతితో నింపే ప్రక్రియ పూర్తయింది. ► అలల ఉధృతిని తట్టుకునే విధంగా సిమెంట్‌తో నిర్మించిన 9,176 ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉండే సిమెంట్ దిమ్మెలు–టెట్రాపాడ్స్ అని కూడా అంటారు) పేరుస్తున్నారు. ఇందులో ఇప్పటికే 6,919 ట్రైపాడ్స్ను అమర్చారు. 1,250 బోట్లు నిలుపుకోవడానికి 909 మీటర్ల జెట్టీ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందుకోసం 312 ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ (సముద్రం లోపలికి సిమెంట్‌తో కూడిన ఇనుప దిమ్మెలు) ఏర్పాటు చేశారు. ► వీటిని ఒడ్డుతో అనుసంధానం చేసే సిమెంట్ జెట్టీ నిర్మాణం 672 మీటర్లు ఇప్పటికే పూర్తయింది. మిగిలింది పది రోజుల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే బోట్లు ఇక్కడికి వచ్చి ఆపుకోవచ్చు. చేపల వేటను ప్రారంభించవచ్చు. ► ఇక కేవలం ఉపరితలం మీద నిర్మించే అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా భవనాలు శ్లాబు దశ దాటాయి. మిగిలినవి శ్లాబు దశకు చేరుకున్నాయి. ఇంతకాలం ఉపాధి కోసం కుటుంబాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి వస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల మా కల ఇప్పుడు నిజమవుతోంది. బుచ్చింగారి చిట్టిబాబు, మత్స్యకారుడు, ఆదినారాయణపురం, నెల్లూరు జిల్లా -
కృష్ణపట్నంలో మినీ హార్బర్
ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితమే సర్వే కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే.. కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్ హార్బర్ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు. మరింత వెసులుబాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మినీ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్ వంటి వసతులు చెంతకు వస్తాయి. – పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్ మత్స్యకారులకు ఎంతో మేలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు -
జువ్వలదిన్నెలో ఢిల్లీ బృందం
మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఆరా బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మించే ప్రాంతాన్ని ఢిల్లీకి చెందిన వ్యాప్కోస్ అధికారులు మంగళవారం పరిశీలించారు. వ్యాప్కోస్ చీఫ్ ఇంజనీర్ రమణతో కూడిన అధికారుల బృందం మినీ ఫిషింగ్‌హార్బర్ నిర్మించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, తీరంలోని వృక్ష సంపద, పర్యావరణ పరిస్థితులపై ఆరా తీసింది. సుమారు రూ.300 కోట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 550 పడవల సామర్ధ్యంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జువ్వలదిన్నెలో ఏడాదిన్నర నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మట్టి పరీక్షలతో పాటు హైడ్రోగ్రాఫికల్, ఆర్థిక, సామాజిక సర్వేలు కూడా పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరికరాలు కూడా ఏర్పాటు చేసి విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కారణంగా పర్యావర ణ సంబంధిత అంశాలను అధికారులు పరిశీలించారు. మరో పది రోజుల్లో మరో బృందం పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఈసందర్భంగా వ్యాప్కోస్ అధికారులు తెలిపారు. వారి వెంట కావలి మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఉన్నారు.


