కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేసే కుట్ర: వైఎస్సార్‌సీపీ నేతలు
- మత్య్సకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- మత్స్సకారులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు
- జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌కు కట్టబెట్డడం దుర్మార్గం
- మత్స్యకారులకు చెందాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు

పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆందోళన
- వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
- వైఎస్సార్‌సీపీ చలో జువ్వెలదిన్నెను అడ్డుకున్న పోలీసులు
- ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా వైఎస్సార్‌సీపీ నిరసనలు
- కావలి నుంచి వైఎస్సార్‌సీపీ నేతల భారీ ర్యాలీ
- మాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులు
- పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆందోళన

👉కావలి నుంచి భారీగా బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నేతలు
కాకాణి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
జువ్వలదిన్నె సమీపంలో వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్‌పరంచేసే కుట్ర

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవాళ(మార్చి 20, శుక్రవారం) వైఎస్సార్‌సీపీ చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని చేపట్టింది. చలో జువ్వలదిన్నెకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్‌పరం కాకుండా నిరసనలు చేపట్టనుంది. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొననున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.


