జువ్వలదిన్నెకు వైఎస్‌ జగన్‌.. కూటమిలో ఉలిక్కిపాటు | Jagan to Juvvaladinne Shockwaves in the Kutami Prabhutvam | Sakshi
Sakshi News home page

జువ్వలదిన్నెకు వైఎస్‌ జగన్‌.. కూటమిలో ఉలిక్కిపాటు

Apr 14 2026 12:06 PM | Updated on Apr 14 2026 1:17 PM

Jagan to Juvvaladinne Shockwaves in the Kutami Prabhutvam

సాక్షి, నెల్లూరు రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్‌ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. 

మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్‌ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. 

జగన్‌ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్‌ హర్బర్‌ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  అదే అదనుగా జగన్‌ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. 

తమ భవిష్యత్‌ బతుకులకు వెన్నుపోటు పొడిచి  ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్‌ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. 

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

జగన్‌ రాకతో  ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్‌ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement