నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం | juvvaladinne harbour Privatization in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

Apr 14 2026 6:01 AM | Updated on Apr 14 2026 6:01 AM

juvvaladinne harbour Privatization in Chandrababu Govt

మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసమే నాడు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం 

గంగపుత్రుల కోసం కట్టిన హార్బర్‌పై చంద్రబాబు ప్రైవేటు పడగ

మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తే దానిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధపడడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా గంగపుత్రుల కోసం నిరి్మంచిన హార్బర్‌లో ప్రైవేటు పెత్తనానికి అనుమతించడం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జువ్వలదిన్నెతోపాటు పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో పూర్తయింది, మిగతావి అనేక దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. మత్స్యకార కుటుంబాలు సుసంపన్నం అయ్యేవి. అయితే చంద్రబాబు కూటమి సర్కారు మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్వీర్యం చేస్తూ.. సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ పేరుతో ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.    

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా, ఏకకాలంలో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్‌ బోట్లు నిలిపేలా సిద్ధం చేశారు. ఈ హార్బర్‌ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనాతో హార్బర్‌లోనే కోల్డ్‌ చైన్, ఐస్‌ ప్లాంటు, చిల్‌ రూమ్‌ వంటి మౌలిక వసతులు, బోట్‌ రిపేర్‌ వర్క్‌ షాపులు, నెట్‌ మెండింగ్‌ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా.. మిగిలిన మూడేళ్ల అవకాశాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయాలని భావించారు. 2024 మార్చి 12న వర్చువల్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను నేరుగా మత్స్యకారుల సమక్షంలోనే ప్రారంభించాలని భావించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే ఏడాది ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. 

మత్స్యకారుల భవితవ్యం.. వైఎస్‌ జగన్‌ సంకల్పం 
మత్స్యకారుల జీవనోపాధి మెరుగుకూ వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించేందుకు 1250 బోట్లను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి దశలో జిల్లాలోని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా అందుకుంటున్న లబ్ధిదారులకు.. ఆ తర్వాత మిగతా వారికి బోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి బోటుకు 12 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. బోటు విలువలో 10 శాతం లబ్ధిదారుల వాటాగా చెల్లిస్తే.. మిగతా 90 శాతం బ్యాంకు రుణం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను మిగతా 40 శాతం అప్పును మత్స్యకారులే చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. వైఎస్‌ జగనే ఇప్పటికీ సీఎంగా ఉండి ఉంటే.. ఇప్పటికే ప్రతి మత్స్యకారుడూ మెకనైజ్డ్‌ బోటుకు యజమానై ఉండేవాడు. ఫిషింగ్‌ హార్బర్‌కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్‌ కోర్టుల ద్వారా సమృద్ధిగా ఉపాధి లభించేది.  

అభివృద్ధిని బుగ్గి చేసేందుకు బాబు సిద్ధం 
చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధిని బుగ్గిచేసే కార్యక్రమాలు చేపట్టింది. ఫిషింగ్‌ హార్బర్లను నిర్వీర్యం చేసి అక్కడి భూములను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టి వారి భవిష్యత్‌ను నాశనం చేసేందుకు ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నెతోనే సాగర్‌ డిఫెన్స్‌ పేరిట కుట్రలకు తెరతీశారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుంటే.. దశల వారీగా రాష్ట్రంలోని తీరం వెంబడి నిర్మాణంలో ఉన్న మిగతా ఫిషింగ్‌ హార్బర్లను ప్రైవేట్‌ పరం చేయడానికి బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి 
వైఎస్‌ జగన్‌ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19  మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు  చొప్పున అందించారు. ఇక డీజిల్‌పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు.  

దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ 
వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చా­రు. అయితే టీడీపీ ప్రభు­త్వం వచ్చి సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ సంస్థకు హార్బర్‌ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్‌లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్‌ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి.  – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి  

హార్బర్‌ భూమిని ప్రైవేట్‌పరం కానివ్వం 
జువ్వలదిన్నె హార్బర్‌ భూ­మి­­ని ఎట్టిపరిస్థితు­ల్లో ప్రైవేటుపరం కాని­వ్వబోం. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక  సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీకి అప్పనంగా భూమి అప్ప­జెప్పేందుకు యత్నించడం దారుణం. 
 – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే  

Advertisement
 
Advertisement
Advertisement