ఏడు వారాలకే జూనియర్‌ ఎన్టీఆర్‌ 9 కిలోలు..! | Weight loss: Jr NTR Lost 9.5 Kg Of Muscle Mass In 50 Days | Sakshi
Sakshi News home page

weight loss Tips: ఏడు వారాలకే జూనియర్‌ ఎన్టీఆర్‌ 9 కిలోలు..!

Apr 15 2026 1:17 PM | Updated on Apr 15 2026 2:01 PM

Weight loss: Jr NTR Lost 9.5 Kg Of Muscle Mass In 50 Days

టాలీవుడ్‌ నటుడు జూనియర్‌  ఎన్టీఆర్‌ తన రాబోయే చిత్రం డ్రాగన్‌ కోసం తన ఫిజిక్‌ని ఎలా మార్చుకున్నారో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్‌ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ఆయన శరీర ఆకృతిని చూసి..వావ్‌! ఎంత స్మార్ట్‌గా ఫిట్‌గా ఉన్నారు అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అది కూడా తక్కవ వ్యవధిలోనే ఏకంగా 9.5 కిలోలు తగ్గారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయనకు జస్ట్‌ ఏడు వారాలే పట్టిందట. మరి అదెలా సాధ్యమైందో, బరువు తగ్గాలనుకునేవారికి ఆయన అనుసరించి టిప్స్‌ హెల్ప్‌ అవుతాయేమో చూద్దామా..!.

జూనియర్‌ ఎన్టీఆర్‌ జిమ్‌ సెటప్‌ ముందు క్లాసిక్ డబుల్ బైసెప్స్ భంగిమలో ఉన్న ఫోటోని షేర్‌ చేశారు. మంచి ఫిట్‌గా స్మార్ట్‌గా మారిన తన రూపాన్ని షేర్‌ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలకు ఇది కొని తెచ్చుకున్న కండలు కాదు, స్వయం నిర్మితం అని క్యాప్షన్‌ జోడించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. అదెలా సాధ్యమైందో ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుమార్‌ మన్నవ సవివరంగా వెల్లడించారు. 

తాను కేవలం ఎన్టీఆర్‌ వెయిట్‌లాస్‌ జర్నీని బరువు తగ్గడమే లక్ష్యంగా ప్రారంభించలేదని, సన్నని చురుకైన శరీరాకృతిని సాధించడంపై ఫోకస్‌ పెడుతూ మొదలు పెట్టామన్నారు. దీని కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఫిట్‌నెస్‌ దినచర్యను గణనీయంగా మార్చారట. భారీ కండరాల నిర్మాణ వ్యాయమాలకే పరిమితం కాకుండా, తన శిక్షణను ఫంక్షనల్‌ కదలికలు, కార్డియో కేంద్రీకృత వ్యాయామాల తోపాటుగా, మోస్తారు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌ వంటివి కూడా చేశారని చెప్పారు. 

రోజు కార్డియో లేదా స్ట్రెంగ్త్‌ వ్యాయామాలను మాత్రం సుమారు 45 నుంచి 90 నిమిషాలు చేసేవారట. ఆఖరికి ఫుడ్‌ కూడా చాలా ప్రణాళికగా తీసుకునేవారట. సాధారణంగా కండరాల పెరుగుదలతో ముడిపడి ఉన్న ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారానికి బదులుగా తక్కువ ప్రోటీన్‌ తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారని ట్రైనర్‌ కుమార్‌ మన్నవ వెల్లడించారు. 

ఈ వ్యూహమే ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని కోల్పోవడానికి, అలాగే తన మూవీ డ్రాగన్‌లోని పాత్రకు అనుగుణంగా సన్నటి రూపాన్ని సాధించడానికి హెల్ప్‌ అ‍య్యిందని అన్నారు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలామటుకు సెలబ్రిటీల మాదిరిగా వెయిట్‌లాస్‌ జర్నీని ప్రారంభించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

 

(చదవండి: జస్ట్‌ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement