'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ తనయుడి లవ్ సాంగ్‌ రిలీజ్ | Maadhav Bhuapathiraju Maremma Movie Baava Baava Lyrical song out now | Sakshi
Sakshi News home page

Maremma Movie: రవితేజ తనయుడి రియల్ స్టోరీ.. లవ్ సాంగ్‌ రిలీజ్

Apr 13 2026 7:48 PM | Updated on Apr 13 2026 8:07 PM

Maadhav Bhuapathiraju Maremma Movie  Baava Baava Lyrical song out now

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.

కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement