మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు | - | Sakshi
Sakshi News home page

మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

మార్చ

మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు

మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు మట్టి లారీల అడ్డగింత జాతీయ స్థాయి స్కేటింగ్‌ పోటీల్లో ప్రతిభ నేడు, రేపు ముస్లింల ఆధ్యాత్మిక సదస్సు మార్చి 20 నుంచి ఆవుల అందాలు, పాల పోటీలు

పాలకొల్లు సెంట్రల్‌: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్‌ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్‌ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్‌పీఎన్‌ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి రూరల్‌ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తణుకు అర్బన్‌: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్‌ స్కేటింగ్‌ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్‌ రేంజర్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్‌–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్‌–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్‌ హర్షవర్థన్‌ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్‌–7 విభాగంలో ఖండవల్ల మయాంక్‌ కాంస్య, అండర్‌–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్‌ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

తాడేపల్లిగూడెం : కోస్తా ప్రాంత ముస్లింల ఆధ్యాత్మిక సదస్సు శని, ఆదివారాల్లో తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తబ్లీఘీ జమాత్‌ పేరిట నిర్వహించే ఈ సదస్సు దావతుల్‌ హక్‌ రెలిజియల్‌ ట్రస్టు (ఏపీ) ఆధ్వర్యంలోని పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం శాఖ పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలు హాజరుకానున్నారని వివరించారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి సదస్సు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్‌ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్‌ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు.

మార్చి 13 నుంచి  జాతీయ స్థాయి నాటికల పోటీలు 1
1/2

మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు

మార్చి 13 నుంచి  జాతీయ స్థాయి నాటికల పోటీలు 2
2/2

మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement