అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
తణుకు అర్బన్: దువ్వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురికి స్వల్పగాయాల య్యాయి. తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా దువ్వ సమీపంలోని వ్యవసాయ చెక్ పోస్టు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ విశాఖ–విజయవాడ రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. అప్పటికే కారు నుజ్జు అయినప్పటికీ కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు రూరల్ పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులకు కారుమూరి పరామర్శ
చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అదే ప్రాంతంలోని వేచి ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కారు బోల్తా పడడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్లి క్షతగాత్రులను కారులో నుంచి జాగ్రత్తగా బయటకులాగారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు.
నరసాపురం రూరల్: మోటార్ బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొగల్తూరు హెడ్ కానిస్టేబుల్ సుబానీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ చల్లా పవన్ కుమార్ (27) తన స్నేహితుడు చంద్రగిరి దుర్గారావుతో కలిసి మోటార్‌బైక్‌పై ఆదివారం పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. తిరిగి ఉండి వెళ్లే క్రమంలో మోడి గ్రామానికి చేరుకునేసరికి వారి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ కుమార్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరి బత్తుల పెద్దింట్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై గల మరో వ్యక్తి దుర్గారావుకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారన్నారు.
కై కలూరు: వరకట్న వేధింపులపై కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. కై కలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన ప్రశాంతికి ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన బలే రామారావుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొద్ది రోజులుగా అధికకట్నం తీసుకురావాలని వేధిస్తుడటంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


