ఉండి(పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. ఉండి ఎమ్మెల్యే రఘరాం కృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగురేశారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఉండి మండలం వెలివర్రు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. వెంకటేశ్వరరాజు ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై గౌరవంతో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు అరాచకపాలన నడుస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.నియోజవర్గంలో నిలువు దోపిడీ అవుతుంది. రఘురామ కృష్ణరాజు ఆటలు సాగవు, తిరుగుబాటు చేస్తాం. నిరుపేదల ఇల్లు, చర్చిలు కూల్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?, కుప్పం, ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


