●కవలలు.. కనువిందు
జాతీయ కవలల దినోత్సవాన్ని తణుకు మాంటిస్సోరీ స్కూలులో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉన్న 30 మంది కవలలతోపాటు రెండు కవల త్రయం జంటలను డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశరావు మాట్లాడుతూ ఇంత మంది కవలలు తమ పాఠశాలలోనే ఉండడం ఆనందంగా ఉందని, కవలలంతా మంచి విద్యాబుద్ధులతో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు హెడ్‌మిస్ట్రస్ ఎం.లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞానమంజరి, కాలేజ్ ఎకడమిక్ డైరెక్టర్ పి.కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– తణుకు అర్బన్


