బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు | - | Sakshi
Sakshi News home page

బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు

Feb 20 2026 7:01 PM | Updated on Feb 20 2026 7:01 PM

బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు

బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు

బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు

పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు, మోసాలను, దుష్ప్రచారాలను ప్రజ లు పసిగట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ అ డ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అప్పు లు, పథకాలపై దుష్ప్రచారం చేశారన్నారు. తాజా గా తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సైతం దుష్ప్రచారానికి వాడుకుని చివరకు బోర్లా పడ్డారన్నారు. తిరిగి చంద్రబాబు కుటుంబం పైకే లడ్డూ వ్యవహరం వెళ్లిందన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులు, కక్ష సాధింపులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. పార్టీ పటిష్టత కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకూ కమిటీలు విస్తరించాలని, ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యకర్తలకు పూర్తిస్థాయి గుర్తింపు ఉంటుందని, రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్ర మౌళీశ్వర రెడ్డి, మండల కన్వీనర్‌ నల్లిమిల్లి వెణుప్రతాపరెడ్డి (బాబీ), ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌ పలివెల శ్రీను, పంచాయతీ సభ్యులు ఆదిరెడ్డి సన్యాసిరావు, వెలగల శ్రీనివాస రెడ్డి, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు ఆసు నగరి, నాయకులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

Advertisement
 
Advertisement
Advertisement