శివోహం.. భజేహం
పెనుగొండ : ఆచంటలో రథోత్సవం
భీమవరం(ప్రకాశం చౌక్) : హరోంహర.. శంభో శంకర స్మరణలు మార్మోగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఆదివారం వేకువజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు. నిర్విరామంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ, కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజ, ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బంగార్రాజు, కార్యనిర్వహణాధికారి డి.కృష్ణంరాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మో షన్‌రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వచ్ఛంద, వ్యాపార సంస్థల ప్రతినిధులు భక్తులకు మజ్జిగ, తాగునీరు, అల్పాహారం అందజేశారు.
క్షీరారామం.. మోక్షధామం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీ రారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)కు వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేష అభి షేకాలు జరిగాయి. సర్వ దర్శనం కోసం శరవణ హోటల్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాలు కల్పించారు. ఆలయంలో వైద్య క్యాంపులు ఏర్పాటుచేశారు. ఆలయంలో రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో ఆలయం గాలిగోపురం నుంచి స్వామి ప్రధానాలయ శిఖరం వరకూ వరదా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పాగా ఏర్పాటు చేశారు.
ఆచంటలో రథోత్సవం
పెనుగొండ : ఆచంటలోని ఆచంటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూ జలు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ఆచంటేశ్వరుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుమారు 25 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా.
ముక్తిమార్గం.. నత్తారామేశ్వరం
పెనుమంట్ర: నత్తారామేశ్వరంలోని రామేశ్వరస్వా మి, జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయాలకు భ క్తులు పోటెత్తారు. నత్తారామేశ్వరంలో వేకువజా మున కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గో స్తనీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వా మివార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
లక్ష్మణేశ్వరంలో..
నరసాపురం రూరల్: లక్ష్మణేశ్వరంలోని దుర్గాలక్ష్మణేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.
హరహర మహాదేవ
శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
పంచారామాల్లో జనసందోహం
వేకువజాము నుంచి బారులు
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు


