ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం
● భీమవరంలో ఘటన
● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహం
భీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్‌లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్‌లో పెట్టకుండా..
దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్‌లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.
పెనుమంట్ర: మహాశివరాత్రి సందర్భంగా నత్తారామేశ్వరంలో జరిగిన రథోత్సవంలో ఓ భక్తుడి కాలిపై నుంచి రథం వెళ్లడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎం.జయభరత్‌రెడ్డి (తణుకు) అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ర థోత్సవాన్ని చూడటా నికి వచ్చా రు. రథం పక్క నుంచి నడిచి వెళుతుండగా రథచక్రం ఆయన ఎ డమ కాలి వేళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయమైంది. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్) : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలను ఆదివారం సుమారు 3.50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, లక్ష్మణ్యేశ్వరం లక్ష్మణ్యేశ్వరస్వామి, న త్తారామేశ్వరం రామలింగేశ్వర స్వామి, శివదే వుని చిక్కాల శివదేవుని స్వామి, వీరంపాలెం విశ్వేశ్వరస్వామి, జుత్తిగ ఉమా వాసఖి రవి సోమేశ్వర స్వామి, యనమదుర్రు శక్తిశ్వర స్వామి తదితర క్షేత్రాలకు భక్తులు పోటెత్తారన్నారు. క్యూలైన్లలో పిల్లలకు పాలు, పెద్దలకు అల్పాహారం, తాగునీరు అందించారన్నారు. అ న్నిశాఖల అధికారుల సమష్టి కృషితో ఉ త్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశామన్నారు.
భీమవరం(ప్రకాశంచౌక్) : జిల్లా కలెక్టరేట్‌తో పా టు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ జీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి


