వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌

Feb 21 2026 6:46 AM | Updated on Feb 21 2026 6:46 AM

వీల్‌

వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌

వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌ పెద్దింట్లమ్మా.. భక్తులను రక్షించమ్మా..

పాలకొల్లు సెంట్రల్‌: ఏపీ వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా పాలకొల్లు పట్టణానికి చెందిన మురపాక నళిని రాజశేఖర్‌ ఎంపికయ్యాడు. క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్న జాతీయ వీల్‌ చైర్‌ క్రికెట్‌ పోటీలకు రాజశేఖర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.

కైకలూరు : అమ్మా.. పెద్దింట్లమ్మ.. నీ భక్తులను రక్షించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. అమ్మవారి జాతర(తీర్థం) శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఉదయం జలదుర్గా పెద్దింట్లమ్మకు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఖడ్గనామార్చన, ధూపసేవ, బాలభోగం, అష్టోత్తరం, పాత్రసాధన, పంచహారతులు, నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాల పూజలు జరిగాయి. భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, శృంగవరప్పాడుకు చెందిన బలే గణేష్‌ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా వ్యవహరించారు. రాత్రి నంది అవార్డు గ్రహీత మెజీషియన్‌ రఘు ప్రదర్శించిన మ్యాజిక్‌ షో అందరినీ ఆకట్టుకుంది.

వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌ 1
1/1

వీల్‌ చైర్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా రాజశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement