పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
కై కలూరు: రోడ్డు మలుపు తప్పించే క్రమంలో ఓ కారు పంట కాలులో దూసుకెళ్లడంతో తండ్రీకూతురికి గాయాలైన ఘటన కై కలూరు మండలం పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి పల్లెవాడ మలుపు వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుల వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన ఇంజేటి సువర్ణరాజు(45) డయాలసిస్ చేయించుకునేందుకు తన కుమార్తె అర్పిత(19)తో కలసి తన కారులో కై కలూరు మీదుగా ఏలూరు వెళ్తున్నాడు. అయితే పల్లెవాడ మలుపు వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకుపోయింది. నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమీప గ్రామస్తులు గమనించి కారు అద్దాలు పగలగొట్టి అతికష్టం మీద తండ్రీకూతురిని బయటకు తీసుకొచ్చారు. సువర్ణరాజుకు స్టీరింగ్ కడపు భాగంలో గుచ్చుకుంది. కుమార్తెకు తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ 108లో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ఆస్పత్రికి పంపారు.
తండ్రీకూతుళ్లకు గాయాలు


