సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

సుబ్బ

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు కరుణించు మంగమ్మ త ల్లీ.. బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళ శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్‌ ఆర్‌.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీతోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

నరసాపురం రూరల్‌: సెలవు దినం కావడంతో సముద్ర తీరం పర్యాటకుల రాకతో కళకళలాడింది. మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాలతో పాటు నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల పొడవునా విస్తరించి ఉన్న బీచ్‌ ప్రాంతం ఆదివారం ఉదయం నుంచే సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రకృతి ప్రేమికులు, యువత ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలం నెలకొంది. ఉదయాన్నే బీచ్‌కు చేరుకున్న పర్యాటకులు ఉత్సాహంగా సముద్ర కెరటాలలో స్నానాలు చేస్తూ సేదతీరారు. ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాల మధ్య ఇసుక తిన్నెలపై చిన్నారులు ఆటలాడుకుంటూ సందడి చేశారు. తీరానికి సమీపంలో ఉన్న ఆలయాలను పర్యాటకులు దర్శించుకున్నారు. అనంతరం అక్కడి సర్వే తోటలు, కొబ్బరి తోటల నీడన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. తీరం వెంబడి వాహనాల రద్దీ పెరగడంతో పాటు, స్థానిక వ్యాపారాలు కూడా పుంజుకోవడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించింది.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు 
1
1/2

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు 
2
2/2

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement