శివరాత్రికి ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

శివరా

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

శివరాత్రికి ప్రత్యేక బస్సులు విద్యార్థినితో అసభ్య ప్రవర్తన పట్టిసంలో పటిష్ట బందోబస్తు బుట్టాయగూడెం ఎంపీపీగా రమణ బాధ్యతల స్వీకరణ

భీమవరం(ప్రకాశం చౌక్‌): మహాశివరాత్రి ఉ త్సవాలకు జిల్లాలోని నా లుగు ఆర్టీసీ డిపోల నుంచి 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్‌.గిరిధర్‌కుమార్‌ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ, వీరపాలెం, ఆచంట, శ్రీశైలం క్షేత్రా లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామ న్నారు. శ్రీశైలానికి భీమవరం నుంచి 3, నరసాపురం నుంచి 2, తాడేపల్లిగూడెం నుంచి 2, తణుకు నుంచి 2, పట్టిసీమకు తణుకు వయా నిడదవోలు, పంగిడి, కాపవరం మీదుగా 5 బస్సులు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం మీదుగా 10 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీరంపాలేనికి తాడేపల్లిగూడెం నుంచి 12, ఆచంటకు తాడేపల్లిగూడెం నుంచి పిప్పర, అత్తిలి, మార్టేరు మీదుగా 3, నరసాపురం నుంచి వయా పాలకొల్లు, మార్టేరు మీదుగా 2 బస్సులు నడుపుతామన్నారు.

కళాశాల బస్సు డ్రైవర్లు, క్లీనర్‌కు దేహశుద్ధి

ద్వారకాతిరుమల: ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సులో ఇంటర్‌ విద్యార్థినితో బస్సు డ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలంపాలెం పంచాయతీ పావులూరివారిగూడేనికి చెందిన ఓ బాలిక కామవరపుకోట మండలంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ప్రైవేట్‌ క్లాసుల కారణంగా బస్సు ఆలస్యంగా గ్రామానికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 7న రాత్రి కళాశాల బస్సులో విద్యార్థిని ఇంటికి బయలుదేరింది. ఇదిలా ఉండగా ఇదే బస్సులో గతంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి మార్గమధ్యలో ఈ బస్సు ఎక్కాడు. క్లీనర్‌తో ముచ్చటిస్తుండగా.. విద్యార్థిని దిగే స్టేజీ రాగా, బస్సును ముందుకు తీసుకువెళ్లి తిప్పుకొస్తామని చెప్పాడు. బస్సు ముందుకు వెళ్లగానే పాత డ్రైవర్‌ విద్యార్థిని పక్కన కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక బస్సులోంచి కిందకు దూకి, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పలువురు గ్రామస్తులతో కలిసి వెళ్లి బస్సును అడ్డగించారు. గొల్లగూడెం వద్ద బస్సును ఆపి బస్సుతో సహా ప్రస్తుత, పాత డ్రైవర్లను, క్లీనర్‌ను తిరుమలంపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను బస్సులోంచి దింపి దేహశుద్ధి చేశారు. విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేసినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీస్‌ కేసు పెడతామని అనగా ఎట్టకేలకు యాజమాన్యం దిగివచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఇద్దరు డ్రై వర్లు, క్లీనర్‌ను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పోలవరం రూరల్‌: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఎప్పుటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ఎంపీపీగా ఎన్నికై న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ తెల్లం రమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో కేటాయించిన ప్రత్యేక గదిలో ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కె.జ్యోతి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ బేబీ సరోజిని, జెడ్పీటీసీ మొడియం రామతులసి, వైస్‌ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

శివరాత్రికి ప్రత్యేక బస్సులు 1
1/1

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement