ముద్దాపురంలో టీడీపీ శ్రేణుల విధ్వంసం
● అర్ధరాత్రి సమయంలో శిలాఫలకం ధ్వంసం
● అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యం
తణుకు అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రేణులు సృష్టిస్తున్న విధ్వంసం, వివాదాలు, కవ్వింపుల పరంపర తణుకు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫ్లెక్సీ వివాదాలతో గొడ వలు రేకెత్తించిన టీడీపీ శ్రేణులు తాజాగా తణు కు మండలం ముద్దాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాంతంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసంతో మరోసారి కవ్వింపులకు దిగారు. బుధవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చే స్తున్న వ్యవహారాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం, వారు వెళ్లిన తర్వాత అనుకున్న విధంగానే టీడీపీ శ్రేణులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఓ సమయంలో గ్రామంలో ఉద్రిక్తంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోగైన టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తించినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించడంతో ఎటువంటి ఘర్ష ణలు జరగలేదు. అయితే అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వ్యవహారంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి మా జీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారని, నిధులు కూడా కేటాయించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గురువారం రాత్రి తణుకు రూరల్ పోలీసులకు ముద్దాపురం వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. శిలాఫలకాన్ని పడగొడుతుండగా అడిగినందుకు తమపై దౌర్జన్యానికి దిగారని, శిలాఫలకం ధ్వంసం చేసిన వారి పేర్లతో సహా 10 మందిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.


