పల్లె పోరుకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరుకు సన్నాహాలు

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

పల్లె

పల్లె పోరుకు సన్నాహాలు

న్యూస్‌రీల్‌

జిల్లాలో 393 పంచాయతీలు

శురకవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

యలమంచిలి: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 3న తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రతిపాదించి, ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి ఒక ఈఓపీఆర్డీ, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. అనంతరం ఎన్నికలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుర్తతాలు జరపని ఎన్నిక సంఘం తాజాగా (ఈనెల 6న) మార్చి 9వ తేదీ నాటికి పంచాయతీల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

డీపీఓ కార్యాలయాల్లో..

నిర్ణీత సమయంలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టినట్టు తెలిసింది. గతనెల 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు భీమవరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది? ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు ? జనాభా, సామాజిక వర్గాల వివరాల సేకరణ తదితర పనులు మొదలయ్యాయి.

ప్రభుత్వం.. సంశయం

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకానికి సంబంధించి చాలా మంది వినియోగదారులకు సొమ్ములు జమకావడం లేదు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే లేడు. అలాగే ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో బస్సులు ఆగడం లేదు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి (రూ.1,500) పథకాల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ హామీ అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.

పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీ ఉండగా.. భీమవరం మున్సిపాలిటీలో నాలుగు, పాలకొల్లు మున్సిపాలిటీలో ఏడు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు పంచాయతీలను విలీనం చేయడంతో 2021లో ఈ 16 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మిగిలిన 393 పంచాయతీలకు అప్పట్లో ఎన్నికల నిర్వహించగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈ సారి ఆ 16 గ్రామాలపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలోని 393 పంచాయతీల్లో 2021 ఏప్రిల్‌ 3న పాలన మొదలు కాగా, పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏప్రిల్‌ 2తో ముగియనుంది.

సంగ్రామానికి సై

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

ఏప్రిల్‌ 2తో ముగియనున్న పదవీ కాలం

వచ్చేనెల 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు

జిల్లాలో 393 పంచాయతీలు

పల్లె పోరుకు సన్నాహాలు 1
1/2

పల్లె పోరుకు సన్నాహాలు

పల్లె పోరుకు సన్నాహాలు 2
2/2

పల్లె పోరుకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement