వంట గ్యాస్‌ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్‌ | India to develop LPG pipeline launches Rs 12500crore for expansion | Sakshi
Sakshi News home page

LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్‌

Apr 17 2026 2:55 PM | Updated on Apr 17 2026 3:15 PM

India to develop LPG pipeline launches Rs 12500crore for expansion

ఇరాన్‌ వార్‌  నేపథ్యంలో నెలకొన్న వంట  గ్యాస్‌ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా  పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్‌లైన్‌ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. 

నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటే
చెర్లపల్లి – నాగ్‌పూర్ పైప్‌లైన్
శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్‌లైన్
పారాదీప్ – రాయ్‌పూర్ పైప్‌లైన్
ఝాన్సీ – సీతార్‌గంజ్ పైప్‌లైన్

ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం
ప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్‌లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.

 ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనా

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

Advertisement
 
Advertisement
Advertisement