ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య | Ex Virginia Lt Gov Justin Fairfax kills wife dies by suicide amid divorce | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య

Apr 17 2026 12:53 PM | Updated on Apr 17 2026 1:10 PM

Ex Virginia Lt Gov Justin Fairfax kills wife dies by suicide amid divorce

వాషింగ్టన్ : వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (Justin Fairfax) (47)హత్య, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, మితిమీరిన మద్యం, ఆర్థిక సమస్యలు, మరోవైపు భార్యతో మనస్పర్థలు,  విడాకుల కేసుతో నిరాశకు లోనైన ఫాక్స్‌ గురువారం తెల్లవారు జామున భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 

వాషింగ్టన్ శివారులోని అన్నేన్‌డేల్‌లో ఉన్న వారి నివాసంలోనే ఈ  దారుణం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటల్‌ డాక్టర్ సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హత్య-ఆత్మహత్య జరిగిన సమయంలో ఆ దంపతుల ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేలపై రక్తసిక్తమైన మృతదేహం పడి ఉండటాన్ని చూసిన వారి 16 ఏళ్ల కుమారుడు, కాల్పుల గురించి తెలియజేయడానికి 911కి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించి హృదయవిదారక ఆడియో వైరల్‌గా మారింది. ఇంట్లోని బేస్‌మెంట్‌లో తన భార్యను కాల్చి చంపి,  అనంతరం పై అంతస్తులోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు.

జస్టిన్ సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. వచ్చే వారం కోర్టు విచారణలో జైలు శిక్ష, కుటుంబ ఇంటి నుండి బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా బాధ్యతారహితమైన ప్రవర్తన ఫలితంగా, ఏప్రిల్ 30 లోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.  ఈ అవమానభారంతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి


 

జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ పతనం

2019లో జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్‌పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలు చేయడంతో ఉన్నతమైన అతని జీవితం  క్రమంగా పతనంలోకి  జారీ పోయింది.  లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉంటూ, గవర్నర్ పదవికి పోటీ చేయాలని చూస్తున్న అతని రాజకీయభవిష్యత్తును ప్రభావితం చేసింది. మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, 2022లో ఆయన పదవినుండి వైదొలగడంతో కుటుంబానికి మరింత దూరమయ్యారు. దీంతో  తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకోవడంతోపాటు, మద్యానికి బానిసయ్యారు.  ఎంతలా అంటే తనను తాను హోమ్ ఆఫీస్‌లో బంధించుకునేవాడు. అక్కడ  ఖాళీ వైన్ సీసాలు, చెత్త, మురికి బట్టల కుప్పల మధ్య దయనీయమైన స్థితిలో నివసించేవాడు. కేవలం ఆహారం, సిగరెట్ల కోసం మాత్రమే బయటకు వచ్చేవాడట.

ఇదీ చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆయన వృత్తి జీవితం చిన్నాభిన్నం చేశాయి. 2022లో తన పిల్లల గుర్రపు స్వారీ పాఠాల కోసం ఉద్దేశించిన డబ్బును దొంగిలించి ఒక హ్యాండ్‌గన్ కొన్నాడని, సంచలనాత్మక విడాకుల పత్రాల ద్వారా తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement