"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్‌ అంతే.. | Man Selling Tea In Rolls-Royce Rented For Rs 1 Lakh | Sakshi
Sakshi News home page

"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్‌ అంతే..

Apr 17 2026 10:57 AM | Updated on Apr 17 2026 12:33 PM

Man Selling Tea In Rolls-Royce Rented For Rs 1 Lakh

కార్యాలయాల్లో లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినా..కాసింతా వేడివేడి చాయ్‌ తాగితే దెబ్బకు రిలీఫ్‌గా ఉంటుంది. మళ్లీ నూతనోత్సాహంతో మన పనిలో పడిపోతాం. అందుకే చాయ్‌ప్రియులకు ఇదంటే అంత మక్కువ. అలాంటి చాయ్‌ని అత్యంత లగ్జరీయస్‌ అందించే ప్రయత్నం చేశాడు. ఆ ఆలోచనే కనీవినీ ఎరుగని అద్భుతం. మరి ఆ వెరైటీ సర్వింగ్‌ స్టైల్‌ ప్రజలకు నచ్చిందా అంటే..

ఎన్నో టీ స్టాల్స్‌ చూశారు గానీ ఇలాంటి వినూత్న చాయ్‌ స్టాల్‌ని మాత్రం చూసే ఛాన్సేలేదు. తన టీ స్టాల్‌ కోసం లక్ష రూపాయల రోల్స్‌రాయ్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. చిన్నిచాయ్‌ స్టాల్‌కి అంత లగ్జరీ కారు దేనికి అనుకోకండి మనోడు ఆలోచన ఏ రేంజ్‌లో చూద్దాం రండి. అతడు తాను విలావంతమైన కారులో టీ సర్వీస్‌ని అందివ్వాలనుకున్నాడట.  అందుకు రోల్స్‌రాయ్స్‌ కారుని అద్దెకు తీసుకున్నారు. 

ఈ ఆలోచను టీ స్టాల్‌ యజమానితో పంచుకోగా వాళ్లు కూడా అంగీకరించారు. అందుకోసం వాళ్లు బోర్డును ప్రింట్‌ చేసి కస్టమర్ల కోసం రెడ్‌కార్పెట్‌ పరిచాడు. 'టీ' తోపాటు కుకీలు, బిస్కెట్లు ఏర్పాటు చేసి..అమ్మకాలు ప్రారంభించాడు. ఇది చూసిన అక్కడున్న జనాలకు భలే ఆసక్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ అనుభవం పొందాలనే ఉద్దేశ్యంతో అందరు ఆ లగ్జరీ కారులో జర్నీ చేస్తూ టీ తాగే అనుభవాన్ని పొందారు. ఈ లగ్జరీ చాయ్‌ స్టాల్‌కి అయిన ఖర్చు రూ. 1,08,000 అయితే అతను సంపాదించింది రూ. 88,400. 

పాపం అతనికి నష్టమే అయినా..చాలామంది జీవితంలో ఇలాంటి కారు కొనగలమో లేదో తెలియకపోయినా..తమ కుటుంబాలతో టీ తాగుతూ ఆనందించారు అదే చాలు అని అంటున్నాడు. ఏ వ్యాపారమైన మొదట్లోనే లాభాలు వచ్చేయవు కదా..రాను రాను ఊపందుకోవచ్చు కూడా. ఏదీఏమైనా ఈ ఐడియా అదుర్స్‌ కదూ..!. అతడి ఆలోచన అలా ఇలా లేదు బ్రో..ఇలా మరెవ్వరకీ సాధ్యం కాదేమో అని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: చూయింగ్‌ గమ్‌ నమలడం నుంచి 3-2-1 రూల్‌..! ఏకంగా 80 కిలోలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement