బడ్జెట్‌లో దళితులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో దళితులకు అన్యాయం

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

బడ్జెట్‌లో దళితులకు అన్యాయం

బడ్జెట్‌లో దళితులకు అన్యాయం

బడ్జెట్‌లో దళితులకు అన్యాయం మహాయజ్ఞానికి శ్రీకారం

కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు

భీమవరం : రాష్ట్ర బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 9 వేల కోట్లతో దళితులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. లక్షలాది మంది దళిత నిరుద్యోగులు, యువత ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇవి కాకుండా దళిత పేటల అభివృద్ధికి ఇవి ఎలా సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌ గత సంవత్సరం బడ్జెట్‌ కంటే సుమారు 10 శాతం పెంచినట్లు ప్రభుత్వం చెబుతుందని గతంలో రూ.18,497 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం రూ.16,830 కోట్లు అని మిగిలిన నిధులు 1,667 కోట్లు కూడా ఈ బడ్జెట్‌ లో కలపాలని అవి కలిపితే కేవలం రూ.480 కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం 2013 ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 17 శాతం అంటే సుమారు 55 వేల కోట్ల పైనే బడ్జెట్‌ నిధులు కేటాయించాలని కేవలం 6 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగం అంతా కేవలం కార్పొరేట్లు, పెట్టుబడి దారులు, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడానికే సరిపోయిందన్నారు.

ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్‌ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్‌ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement