కేంద్ర పథకాల నిధులు వినియోగించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం సర్వే, వైద్యం, వ్యవసాయం, విద్య, పంచాయ తీరాజ్, ఐసీడీఎస్, ఉద్యాన శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. శాఖల వారీగా నిధుల మంజూరు, ఖర్చు, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధుల వినియోగానికి నెల మాత్రమే గడువు ఉందని, ఈలోపు నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్రం నుంచి 60:40, 90:10 నిష్పత్తులో నిధులు మంజూరు చేస్తారన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాం సుందర్, డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, జిల్లా సర్వే అధికారి జాషువా, పంచాయతీరాజు ఎస్‌ఈ శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రాజేష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశంచౌక్): నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన క్యాంపు కార్యా లయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, ఆర్ అండ్‌బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విజయవాడ రీజనల్ ఆఫీసర్ హరికృష్ణ, కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌అండ్ బీ ఎస్‌ఈ విజయరత్న తదితరులు హాజర య్యారు. నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరగా పనులు చేపట్టాలన్నారు.
ద్వారకాతిరుమల: గోవిందా హరి గోవిందా.. అంటూ వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వే లాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో కోలాట భజన మండలి సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనివేటి మండపాలు, ఆలయ పరిసరాల్లో వివాహాలు జోరుగా జరిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న కొత్త జంటలు, వారి కుటుంబసభ్యులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది.
ఏలూరు (టూటౌన్): స్థానిక ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్ లెవల్ కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ (సీఆర్‌ఈ) శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ కె.పంకజ్‌కుమార్ హాజరయ్యారు. పంకజ్‌కుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనే విషయాలను వివరించారు. రామ్‌కుమార్ మాట్లా డుతూ స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్, స్పీచ్–టు–టెక్ట్స్ సాఫ్ట్‌వేర్లు, ఏఐ యాప్‌ల ద్వారా దివ్యాంగులు స్వయంగా పనులు చేసుకునేలా తీర్చిదిద్దవచ్చన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేటర్లు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమి తం కాకుండా విజువల్ లెర్నింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్‌లను బోధనలో భాగం చే యాలని సూచించారు. అనంతరం శిక్షణలో పా ల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు.
కేంద్ర పథకాల నిధులు వినియోగించాలి


