అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Feb 20 2026 7:01 PM | Updated on Feb 20 2026 7:01 PM

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

కామవరపుకోట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన గురువారం మంకెనపల్లి శివారులో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై పి.చెన్నా రావు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట యానాదుల కాలనీకి చెందిన చేవూరి జ్యోతి (35), భర్త నాగయ్యతో కలిసి మంకెనపల్లి సమీపంలో ఆయిల్‌పామ్‌ తోటలో కాపలాగా ఉంటున్నారు. బుధవారం భార్యాభర్తలిద్దరూ తోటలో నుంచి కామవరపుకోట ఇంటికి వెళ్లారు. తిరిగి తోటకు వస్తుండగా ఇద్దరూ మద్యం సేవించి ఉండగా వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నాగయ్య భార్యను స్థానిక పశువుల ఆస్పత్రి వద్ద వదిలేసి తోటలోకి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో వెతికాడు. అన్నదేవర చెరువు సమీపంలో మంకెనపల్లి బస్సు స్టేజీ వెనుక జ్యోతి మృతి చెందినట్టు తెలిసింది. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమైపె గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement