మహాశివరాత్రికి బలివే సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి బలివే సిద్ధం

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

మహాశి

మహాశివరాత్రికి బలివే సిద్ధం

ముసునూరు: దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న బలే శ్రీరామ లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాగా ఏర్పడిన తర్వాత నాలుగో ఏడాది ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక అధికారిగా, సర్పంచ్‌ రావు ప్రవీణ సుధాకర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిండ ప్రదానాలకు, అమావాస్య స్నానాల కోసం బలివే క్షేత్రంలో ఈ ఏడాది శాశ్వత జల్లు స్నానాలు, మహిళలకు ప్రత్యేక స్నాన ఘట్టాలు, రహదారుల వెడల్పుతో వన్‌ వే తరహా రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా మొత్తం 5 విభాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.

మహాశివరాత్రికి బలివే సిద్ధం 1
1/1

మహాశివరాత్రికి బలివే సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement