ఉగాదికైనా..అనుగృహం కలిగేనా?
న్యూస్‌రీల్
ఇళ్ల మంజూరు ఎప్పుడో ?
సమస్యలు పరిష్కరించాలి
సమస్యల పరిష్కారం కోసం సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆందోళన ఆరో రోజుకు చేరింది. 8లో u
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఉగాది నాటికి 9,135 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 200 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోక ఇళ్ల నిర్మాణానికి పేద వర్గాలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం అందించే సాయం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. సొంతంగా స్థలం ఉన్న పేదలు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను గత ప్ర భుత్వం మంజూరు చేసింది. రూ.1.80 లక్షలు గృహనిర్మాణ సాయంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అడుగడుగునా అండగా నిలిచింది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్, ఇసుకను ఉచితంగా అందజేసింది. లబ్ధిదారులపై రవాణా చార్జీల భారం పడకుండా లేఅవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణసదుపా యం కల్పించారు. పనుల వేగవంతానికి కో ట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. పదేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్ అందజేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.
సాక్షి, భీమవరం: ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు సెంటు స్థలం కూడా పంపిణీ చేయలేదు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు సాయం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించినా ఇప్పుడు ఆ ఊసేలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న వాటినే పూర్తిచేసి తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా గత మే నెలాఖరు నాటికి జిల్లాలో పునాది, లింటల్ దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణ సాయం రూ.1.80 లక్షలు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేల సాయాన్ని ప్రకటించింది. ని ర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఇది ఏమాత్రం సరిపోక లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
నిర్మాణం.. బహుభారం
రానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 ఇళ్లను పూర్తిచేయాలని నవంబరు 15న లక్ష్యంగా నిర్ణయించా రు. కాగా సిమెంట్, ఐరన్, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.6 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరో పక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదలు దగ్గర డబ్బులు లేక ఇ బ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సాయం పెంచాలని కోరు తున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా మంది లబ్ధిదారులు ముందుకురాక గత మూడు నెలల కాలంలో కేవలం 200 ఇళ్లు మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఉగాదికి మరో మూడు వారాలు గడువు మాత్రమే ఉండటంతో లక్ష్యం చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గూడు.. గోడు
పెరిగిన వ్యయం.. చాలని సాయం
ముందుకు సాగని గృహ నిర్మాణ పనులు
ఉగాది నాటికి 9,135 ఇళ్లు పూర్తిచేయాలని టార్గెట్
ఇప్పటికి పూర్తయినవి కేవలం 200 గృహాలే
గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో స్థలాల పంపిణీ
జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేదలు ఎందరో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తికానుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఒక్క ఇళ్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. పీఎం ఆవాస్ యోజన కింద ఇటీవల పట్టణ ప్రాంతాలో 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్‌లో భాగంగా జిల్లాలో 16,773 ఇళ్లను సర్వే చేసిన అధికారులు 10,789 మంది అర్హులుగా గుర్తించారు. వీరంతా కొత్త మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.
ఉగాదికైనా..అనుగృహం కలిగేనా?
ఉగాదికైనా..అనుగృహం కలిగేనా?


