కియోస్క్‌ సేవలు నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

కియోస

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం

కియోస్క్‌లను పునరుద్ధరించాలి

పెనుగొండ: నిరంతరం సాంకేతిక జపం చేసే చంద్రబాబు ప్రభుత్వం సాగులో సాంకేతికతకు మాత్రం తిలోదకాలిచ్చింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతన్నలకు సేవలన్నీ ఒకే చోట అందించడానికి ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రాధాన్యతను కనిపించకుండా ఉంచేందుకు, రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి గాలి కొదిలేశారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన కియోస్క్‌లను సైతం మూలకు చేర్చి వదిలేసింది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మారుమూల గ్రామాల్లో సైతం రైతులకు సేవలందించాలని జిల్లాలో ప్రతి 600 హెక్టార్లకు ఒక ఆర్‌బీకేను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 409 కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి గాను అత్యాధునిక కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, పంట కొనుగోలు వంటి సేవలను అందించాలన్నా ఉన్నత లక్ష్యంతో కియోస్కాలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా పంటలకు సంబంధించి రక్షణ చర్యలు, వాతావరణ వివరాలు, పంటలకు సమయం ప్రకారం తీసుకొనే జాగ్రత్తలను రైతులు కియోస్క్‌లు ద్వారా తెలుసుకొనేవారు.

గత ప్రభుత్వంపై ద్వేషంతో నిర్లక్ష్యం

గత ప్రభుత్వంలో ప్రపంచ వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రశంసలు అందుకోవడంతో చంద్రబాబు సర్కార్‌కు కంటగింపుగా మారింది. ఇది కాస్తా ద్వేషంగా మారడంతో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే జిల్లాలో ఉన్న 409 కేంద్రాల్లో 100 కేంద్రాలను మూసివేసి, ఇతర కార్యాలయాలకు మార్పు చేశారు. అదేవిధంగా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న కియోస్క్‌లను మూలన చేర్చారు. దీంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందకుండా పోతున్నాయన్న విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రైతులకు సేవలందించడానికి ఏర్పాటు చేసిన కియోస్క్‌లు మూలకు చేర్చడం దారుణమంటూ విమర్శిస్తున్నారు. కియోస్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

పలు చోట్ల మూలకు చేరిన కియోస్క్‌ యంత్రాలు

రైతులకు సాంకేతిక సేవలు అందని వైనం

కియోస్క్‌ యంత్రాలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం

వైఎస్‌ జగన్‌పై ద్వేషమే కారణమా!

నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియోస్క్‌ సేవలను పునరుద్ధరించాలి. విత్తనాలు, వాతావరణ వివరాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాల వివరాల కోసం వ్యవసాయాధికారులపై ఆధారపడకుండా కియోస్క్‌లు సేవలు అందించేవి. వాటిని మూలకు చేర్చడం దారుణం. కియోస్క్‌లను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి.

– చిన్నం రామిరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం1
1/2

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం2
2/2

కియోస్క్‌ సేవలు నిర్వీర్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement